రూ . 300 కోట్ల దిశగా టైగర్‌ | Salman Khan's movie, earning on the threshold of 300 crores | Sakshi
Sakshi News home page

రూ . 300 కోట్ల దిశగా టైగర్‌

Published Sun, Dec 31 2017 9:40 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Salman Khan's movie, earning on the threshold of 300 crores - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా అలరించిన టైగర్‌ జిందా హై బాక్సాఫీస్‌ వద్ద గర్జిస్తోంది. 2012లో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచిన ఏక్‌ థా టైగర్‌కు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన టైగర్‌ జిందా హై వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్‌ 22న విడుదలైన ఈ మూవీ ఇప్పటికే రూ 285 కోట్లు పైగా వసూలు చేసి రూ 300 కోట్ల క్లబ్‌లో చేరేందుకు ఉరకలేస్తోంది.

సల్మాన్‌ గత చిత్రాలు భజరంగిభాయ్‌జాన్‌ (రూ 320 కోట్లు) సుల్తాన్‌ (రూ 300 కోట్లు) వసూళ్లను టైగర్‌ సులభంగా అధిగమిస్తుందని బాలీవుడ్‌ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు సినిమాకు వసూళ్లు భారీగా దక్కినా ఈ మూవీ ఏక్‌ థా టైగర్‌లా ఆకట్టుకోదని, కేవలం ఫ్యాన్స్‌ను అలరించేలా ఉందని సినీ విమర్శకులు పేర్కొంటున్నారు. ఇక టైగర్‌ సక్సెస్‌తో ఊపుమీదున్న సల్మాన్‌ రేస్‌ 3 షూటింగ్‌కు సిద్ధమవుతున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement