ఇమేజ్‌ను పక్కనబెట్టి సల్మాన్‌ కొత్త ప్రయోగం? | Salman Khan to do defferent role in Bharat | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 10 2018 8:07 PM | Last Updated on Wed, Jan 10 2018 8:07 PM

Salman Khan to do defferent role in Bharat - Sakshi

సాక్షి, ముంబై : తాజా సినిమా ‘టైగర్‌ జిందా హై’   సూపర్‌హిట్‌తో సల్మాన్‌ ఖాన్‌ మంచి జోష్‌లో ఉన్నాడు. 2017లో బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'టైగర్‌' రికార్డులకెక్కింది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో జాఫర్‌తో మరో సినిమాకు సల్మాన్‌ రంగం సిద్ధం చేశాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సుల్తాన్’‌, ‘టైగర్‌ జిందా హై’ సినిమాలు సూపర్‌హిట్‌ అయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి ఈ ఇద్దరు కలిసి ‘భరత్‌’ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది రంజాన్‌ పండుగకు ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. 2014లో కొరియాలో వచ్చిన ‘అడ్‌ టు మై ఫాదర్‌’ సినిమా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. సల్మాన్‌ తన ఇమేజ్‌ను పూర్తిగా పక్కనపెట్టి ఈ సినిమాలో డిఫరెంట్‌ రోల్‌లో నటించబోతున్నట్లు తెలుస్తోంది, సల్మాన్‌ తరహా యాక్షన్‌, కామెడీ కాకుండా కొత్త తరహాలో ఈ పాత్ర ఉండబోతందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement