దూసుకెళ్తున్న ‘టైగర్‌’ | salman Khan Tiger Zinda hai Collections | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 30 2017 3:48 PM | Last Updated on Sat, Dec 30 2017 3:48 PM

salman Khan Tiger Zinda hai Collections - Sakshi

సల్మాన్‌ఖాన్‌ సినిమా అంటే చాలు కథతో సంబంధం అవసరం లేకుండా హిట్‌ అవుతుంటాయి. ఇప్పుడు బాలీవుడ్‌లో టైగర్‌ జిందా హై హవా కొనసాగుతోంది. రెండో వారంలోకి అడుగు పెట్టినా..కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడంలేదు. వీకెండ్‌లో ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ఈ సినిమా కలెక్షన్లపై సినిమా ట్రేడ్‌ అనలిస్ట్‌ తరుణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్‌లో స్పందించారు.  భజరంగీ భాయిజాన్‌ (రూ.320కోట్లు), సుల్తాన్‌(రూ.300కోట్లు) రికార్డును ఈ సినిమా ఛేజ్‌ చేస్తోందని ఆయన ట్వీట్‌ చేశారు.

ఇప్పటికే ఈ సినిమా 200కోట్లు దాటిపోయింది. వీకెండ్‌ , న్యూ ఇయర్‌ వల్ల ఈ సినిమా కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఏక్తా టైగర్‌కు స్వీకెల్‌గా వచ్చిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి నెగెటివ్‌ కామెంట్స్‌ వస్తున్నాయి. సల్మాన్‌ అభిమానులను మాత్రమే అలరించేలా ఉందని అంటున్నారు. సల్మాన్‌.. తర్వాత రెమో డిసౌజా దర్శకత్వంలో ‘రేస్‌-3’, ముచ్చటగా మూడోసారి అలీ అబ్బాస్‌ డైరెక్షన్‌లో ‘భరత్‌’ సినిమాలో నటిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement