మళ్లీ జంటగా మాజీ ప్రేమికులు! | Salman Khan, Katrina Kaif re-team for 'Tiger Zinda Hai' | Sakshi
Sakshi News home page

మళ్లీ జంటగా మాజీ ప్రేమికులు!

Published Tue, Sep 13 2016 5:53 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

మళ్లీ జంటగా మాజీ ప్రేమికులు!

మళ్లీ జంటగా మాజీ ప్రేమికులు!

సుల్తాన్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న సల్మాన్ ఖాన్.. మరోసారి తన మాజీ ప్రేయసి కత్రినా కైఫ్‌తో కలిసి సినిమా చేస్తున్నాడు. వీళ్లిద్దరూ జంటగా 2012లో వచ్చిన యాక్షన్ రొమాంటిక్ సినిమా 'ఏక్ థా టైగర్'. ఆ సినిమాకు సీక్వెల్ గానే ఇప్పుడు 'టైగర్ జిందా హై' అనే సినిమా తీస్తున్నారు. పాత సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా.. ఈసారి మాత్రం సుల్తాన్ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ మెగాఫోన్ పడుతున్నారు. యశ్‌రాజ్ ఫిలింస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. బక్రీద్ సందర్భంగా దర్శకుడు జాఫర్ ట్విట్టర్‌లో ఈ కొత్త సినిమా పోస్టర్ విడుదల చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించాడు.

ఈ సినిమా అంటే కాస్త భయంగాను, మరోవైపు ఉత్సాహంగాను కూడా ఉందని తెలిపాడు. ఒక ఇండియన్ ఏజెంటు, పాకిస్థానీ గూఢచారి.. ఇద్దరూ ఒకే శత్రువుపై పోరాటం చేస్తారన్న విషయం పోస్టర్‌లో టైటిల్ కింద ఉంది. ఏక్‌థా టైగర్‌ సినిమాలో కూడా భారతీయ గూఢచారి టైగర్.. పాకిస్థానీ గూఢచారి కత్రినాతో ప్రేమలో పడతాడు. ఈ సినిమా వచ్చే ఏడాది క్రిస్మస్ నాటికి విడుదల అవుతుందట. సల్మాన్, కత్రినా కలిసి ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేశారు. 'మైనే ప్యార్ క్యోం కియా', 'పార్ట్‌నర్', 'యువరాజ్', 'ఏక్ థా టైగర్'. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఇది ఐదో సినిమా కానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement