కష్టాల్లో సల్మాన్ కొత్త సినిమా..! | salman new movie tiger zinda hai in trouble | Sakshi
Sakshi News home page

కష్టాల్లో సల్మాన్ కొత్త సినిమా..!

Published Tue, Jul 4 2017 12:00 PM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

కష్టాల్లో సల్మాన్ కొత్త సినిమా..!

కష్టాల్లో సల్మాన్ కొత్త సినిమా..!

ప్రస్తుతం సినీరంగం బిజినెస్గా మారిపోయింది. అంతా సక్సెస్ వెంటే పరిగెడుతున్నారు. ముఖ్యంగా మంచి ఫాంలో ఉన్న హీరోలతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుంటున్న సంస్థలు తరువాత ఆ తారలకు ఫ్లాప్స్ రావటంతో ఆ ఒప్పందాలను సవరించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.

సల్మాన్ తాజా చిత్రం ట్యూబ్లైట్ నిరాశపరచటంతో ఆ ప్రభావం తదుపరి చిత్రాలపై పడింది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న టైగర్ జిందాహై సినిమా బిజినెస్ ట్యూబ్లైట్ రిలీజ్కు ముందే పూర్తయ్యింది. కానీ ట్యూబ్లైట్ రిజల్ట్ తరువాత డిస్ట్రిబ్యూటర్లు ఆలోచనలో పడ్డారు. పాత అగ్రిమెంట్లను సవరించాలను సల్మాన్పై వత్తిడి తెస్తున్నారు.

సల్మాన్ సినిమాల శాటిలైట్స్ రైట్స్ను ఒకేసారి భారీ మొత్తానికి తీసుకున్న టీవీ చానల్ కూడా అగ్రిమెంట్లో మార్పులు చేయాలని కోరుతుందన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ సమస్యల నుంచి బయట పడాలంటే సల్మాన్ ఓ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాల్సిందే. ఏక్తా టైగర్కు సీక్వల్గా తెరకెక్కుతున్న టైగర్ జిందాహై సల్మాన్ను తిరిగి నిలబెడుతుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement