Tubelight
-
‘పండగను నాశనం చేశాడు’
‘ట్యూబ్‌లైట్’ సినిమా విడుదలైన తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను అంటున్నారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ట్యూబ్‌లైట్ సినిమాను 2017లో రంజాన్ సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది. సినిమాలో చాలా సన్నివేశాల్లో సల్మాన్ బాధపడుతూనే ఉండటం ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది. తాజాగా సల్మాన్ ఈ చిత్రం గురించి మాట్లాడారు. ‘‘బజరంగీ భాయ్‌జాన్’ (2015) సినిమా హిట్ అయిన నేపథ్యంలో.. అదే తరహాలో ఉండే ‘ట్యూబ్‌లైట్’ కూడా ఓ అందమైన సినిమా అవుతుందని భావించాం. కానీ పండగ రోజున సంతోషాన్ని ఇచ్చే సినిమా చూడాలని అభిమానులు అనుకున్నారు. ‘ట్యూబ్‌లైట్’ చూసి.. వాళ్లంతా ఏడ్చారు. ‘అసలు ఇది ఏం సినిమా.. పండగను నాశనం చేసేశాడు’ అన్నారు. పాపం కొంతమంది అభిమానులు డిప్రెషన్లోకి కూడా వెళ్లిపోయారు’ అని తెలిపాడు. ‘ఇవాళ ‘ట్యూబ్‌లైట్’ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫాంపైకి వచ్చింది. టీవీలో సినిమాను చూస్తూ ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజలకు ఈ సినిమా బాగా నచ్చింది.. మంచి రేటింగ్ వస్తోంది. సినిమా దేశవ్యాప్తంగా రూ.110 కోట్లు రాబట్టింది. అంటే.. నా ఫ్లాప్ సినిమాలు కూడా వందకోట్లు కలెక్ట్ చేస్తాయి కదా. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. చాలా సినిమాలు ఇంత మాత్రం కూడా రాబట్టలేకపోతున్నాయి. అలా చూసుకుంటే నా సినిమా హిట్ అయినట్లే కదా. కానీ జనాలు ఈ సినిమాను ఫ్లాప్ అనడం విచిత్రంగా ఉంది’ అన్నారు. -
షారూఖ్‌కి సల్మాన్ కాస్ట్లీ గిఫ్ట్..!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కి గిఫ్ట్ ఇవ్వటం అలవాటు. తన తోటి నటీనటులతో పాటు తనకు ఏ మాత్రం సాయం చేసిన వారిని గుర్తుపెట్టుకొని మరి ఏదో ఒక బహుమతి ఇవ్వటం సల్లూభాయ్‌కి అలవాటు. అదే బాటలో ఈ సీనియర్ బ్యాచిలర్ తన తోటి హీరో షారూఖ్‌కు ఓ కాస్ట్లీ కారు గిఫ్ట్ ఇచ్చాడట. ఇటీవల విడుదలైన సల్మాన్ సినిమా ట్యూబ్ లైట్లో షారూఖ్ అతిథి పాత్రలో కనిపించాడు. చిన్న పాత్రే కావటంతో షారూఖ్ ఎలాంటి పారితోషికం తీసుకోకుండానే నటించాడట. ఆ సినిమా ఫ్లాప్ టాక్ వచ్చిన సల్మాన్ మాత్రం షారూఖ్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వటం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. షారూఖ్ సెట్స్‌లో ఉండగా షూటింగ్ స్పాట్‌కు వెళ్లి మరి తన గిఫ్ట్ అందించాడు సల్మాన్. అంతేకాదు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న షారూఖ్ సినిమాలో సల్మాన్ గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నాడు. మరి సల్మాన్ కోసం షారూఖ్ ఎలాంటి గిఫ్ట్ ప్లాన్ చేస్తాడో చూడాలి. -
కష్టాల్లో సల్మాన్ కొత్త సినిమా..!
ప్రస్తుతం సినీరంగం బిజినెస్‌గా మారిపోయింది. అంతా సక్సెస్ వెంటే పరిగెడుతున్నారు. ముఖ్యంగా మంచి ఫాంలో ఉన్న హీరోలతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుంటున్న సంస్థలు తరువాత ఆ తారలకు ఫ్లాప్స్ రావటంతో ఆ ఒప్పందాలను సవరించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. సల్మాన్ తాజా చిత్రం ట్యూబ్‌లైట్ నిరాశపరచటంతో ఆ ప్రభావం తదుపరి చిత్రాలపై పడింది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న టైగర్ జిందాహై సినిమా బిజినెస్ ట్యూబ్‌లైట్ రిలీజ్‌కు ముందే పూర్తయ్యింది. కానీ ట్యూబ్‌లైట్ రిజల్ట్ తరువాత డిస్ట్రిబ్యూటర్లు ఆలోచనలో పడ్డారు. పాత అగ్రిమెంట్లను సవరించాలను సల్మాన్‌పై వత్తిడి తెస్తున్నారు. సల్మాన్ సినిమాల శాటిలైట్స్ రైట్స్‌ను ఒకేసారి భారీ మొత్తానికి తీసుకున్న టీవీ చానల్ కూడా అగ్రిమెంట్లో మార్పులు చేయాలని కోరుతుందన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ సమస్యల నుంచి బయట పడాలంటే సల్మాన్ ఓ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాల్సిందే. ఏక్తా టైగర్‌కు సీక్వల్గా తెరకెక్కుతున్న టైగర్ జిందాహై సల్మాన్‌ను తిరిగి నిలబెడుతుందేమో చూడాలి. -
డిస్ట్రిబ్యూటర్లకు దిగ్భ్రాంతే మిగిలింది!!
సల్మాన్ ఖాన్ 'ట్యూబ్‌లైట్' బాక్సాఫీస్ వద్ద వెలుగలేదు. కనాకష్టంగా రూ. 100 కోట్ల మార్క్‌ను దాటిన ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర దిగ్భ్రాంతే మిగిలింది. సల్మాన్ ఖాన్ కెరీర్లో 'వాంటెడ్' చిత్రం తర్వాత అతిపెద్ద అట్టర్ ప్లాప్ సినిమా 'ట్యూబ్లైటే'నని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. గతంలో ఈద్ సందర్భంగా వచ్చిన సల్మాన్ సినిమాలు భారీ ఎత్తున బిజినెస్ చేశాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని డిస్ట్రిబ్యూటర్లు 'ట్యూబ్‌లైట్' సినిమా థియేట్రికల్ హక్కులను కళ్లుచెదిరే ధరకు కొనుగోలు చేశారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా కూడా ఆడకపోవడం డిస్ట్రిబ్యూటర్లను తీవ్ర నష్టాలు మిగిల్చినట్టు తెలుస్తోంది. బాక్సాఫీస్ లెక్కల ప్రకారం మొదటి తొమ్మిదిరోజుల్లో ట్యూబ్‌లైట్ 107.32 కోట్లు వసూలు చేసింది. కానీ ఈ సినిమా కనీసం రూ. 300-350 కోట్లు వసూలుచేస్తేనే డిస్ట్రిబ్యూటర్లు లాభం వచ్చే పరిస్థితి ఉందని సినీ విశ్లేషకుడు గిరీష్ జోహార్ తెలిపారు. సల్మాన్ ఈద్ రిలీజ్ కావడంతో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరకు కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. ట్యూబ్‌లైట్ థియేట్రికల్ హక్కులు రూ. 132 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా శాటిలైట్, మ్యూజిక్ హక్కులు వరుసగా రూ. 55 కోట్లు, రూ. 38 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. అయితే, సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా ఆడకపోవడంతో ఈ ధరలను సవరించే అవకాశం ఉందని చెప్తున్నారు. సినిమా బాక్సాఫీస్ లెక్కల ఆధారంగానే ఈ హక్కుల ఒప్పందాలు కుదురుతుండటంతో సినిమాలు ప్లాప్ అయితే.. ధర తగ్గించుకునే వెసులుబాటును ఆయా వర్గాలు కోరుతున్నట్టు చెప్తున్నారు. మొత్తానికి ట్యూబ్‌లైట్ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 125 కోట్లు వసూలు చేస్తే గొప్ప అని భావిస్తున్నారు. -
థియేటర్లో టపాసుల మోత
ముంబై : మన దేశంలో మూవీ స్టార్స్‌కు ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేనిది. ముఖ్యంగా వారి చిత్రాలు రీలీజైతే ఫ్యాన్స్ చేసే హడావిడీ అంతా ఇంతా కాదు. థియేటర్లో హీరో మంచి డైలాగ్స్ చెబితే విజిల్స్ వేయడం, హీరో అధిరిపోయే స్టెప్పులు వేస్తే అభిమానులు కూడా స్క్రీన్ దగ్గరికెళ్లి డ్యాన్స్‌లు చేయడం, మరీ అయితే పేపర్లు చింపి విసరడం మనం సర్వసాధారణంగా థియేటర్లలో చూసే దృశ్యాలు. అయితే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ అభిమానుల పిచ్చి మాత్రం పీక్స్‌కు చేరింది. ఏకంగా థియేటర్లో టపాసులు పేల్చి సినిమా చూడటానికి వచ్చిన మిగతా వారిని బెంబేలెత్తించారు. మహారాష్ట్రలోని మాలేగావ్ లోని ఓ థియేటర్లో సల్మాన్ ఖాన్ మూవీ ట్యూబ్ లైట్ సినిమా నడుస్తోంది. చిత్రంలో హీరో సల్మాన్ ఎంట్రీ సీన్ రాగానే ఫ్యాన్స్ ఒక్కసారిగా రెచ్చిపోయారు. బాంబులతో థియేటర్‌ను అదరగొట్టేశారు. ఒక్కసారిగా బాంబులు పేలుస్తూ, చిచ్చుబుడ్డీలతో హంగామా చేశారు. సల్మాన్ సల్మాన్ అంటూ అరుస్తూ టపాసుల మోత మోగించారు. కాగా, టపాసులు పేల్చినవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. థియేటర్లలో అభిమానులు టపాసులు పేల్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. థియేటర్లలో అగ్ని ప్రమాదం సంభవిస్తే ప్రాణనష్టం జరిగే అవాకాశాలు చాలా ఎక్కువని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. -
థియేటర్లో టపాసుల మోత
-
ట్యూబ్‌లైట్: మూడో రోజు వసూళ్లు ఎంతో తెలుసా!
కబీర్‌ఖాన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించిన తాజా సినిమా ‘ట్యూబ్‌లైట్’ అంచనాలను అందుకోవడంలో విఫలమైనట్టే కనిపిస్తోంది. ఈద్ సందర్భంగా భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా తొలి మూడురోజుల్లో మిశ్రమ వసూళ్లు మాత్రమే రాబట్టింది. తొలిరోజు కేవలం రూ. 21.15 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు, మూడో రోజు కూడా పుంజుకోలేదు. రెండో రోజు శనివారం 21.17 కోట్లు, మూడో రోజు ఆదివారం దాదాపు రూ. 22 కోట్లు సాధించింది. మొత్తంగా మొదటి మూడు రోజుల్లో ఈ సినిమాకు రూ. 60 కోట్లకు వసూళ్లు దక్కాయి. రంజాన్ పర్వదినం కావడంతో నాలుగోరోజు వసూళ్లు పెరగవచ్చునని భావిస్తున్నారు. నాలుగో రోజు వసూళ్లు గణనీయంగా పెరిగితే మొదటి వీకెండ్లోనే ఈ సినిమా వందకోట్ల మార్క్‌ను చేరుకొనే అవకాశముందని భావిస్తున్నారు. అదే నెగిటివ్ రివ్యూలు, డివైడ్ మౌత్‌టాక్ ఈ సినిమాను బాగా దెబ్బతీస్తున్నట్టు కనిపిస్తోంది. సోమవారం, మంగళవారం కూడా ‘ట్యూబ్‌లైట్’ కలెక్షన్లు పుంజుకోకుంటే.. ఇది బాక్సాఫీస్ వద్ద సరిగ్గా వెలుగనట్టేనని వినిపిస్తోంది. -
ఫస్ట్‌డే కలెక్షన్లు ఎంతో తెలుసా?
ముంబై: బాక్సాఫీస్ దగ్గర భాయిజాన్ ఈసారి మెరవలేదు. గత ‘ఈద్’ సినిమాల కంటే దారుణంగా వెనకబడ్డాడు. కబీర్‌ఖాన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించిన ‘ట్యూబ్‌లైట్’ సినిమా తొలిరోజు వసూళ్లు ఉసూరుమనిపించాయి. స్వయంగా సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లే ఈ విషయాన్ని పేర్కొన్నారు. ‘బాహుబలి-2’ను మించిపోతుందనే అంచనాల నడుమ శుక్రవారం(జూన్ 23న) విడుదలైన ‘ట్యూబ్‌లైట్’.. తొలిరోజు కేవలం రూ.21.15 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. 2016 ఈద్‌కు వచ్చిన ‘సుల్తాన్’ మొదటిరోజు వసూళ్లు రూ.36.54కోట్లు. అదే 2015లో విడుదలైన బజరంగీ భాయిజాన్ ఫస్ట్‌డే కలెక్షన్లు రూ.36.50కోట్లు. ఇప్పటివరకు ఫస్ట్‌డే హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన హీరోల్లో షారూఖ్(హ్యాపీ న్యూఇయర్ - రూ.44.97కోట్లు) మొదటిస్థానంకాగా, ప్రభాస్ (బాహుబలి-2 - రూ.41.00కోట్లు) ది రెండోస్థానం. ట్యూబ్‌లైట్ కదా.. లేటుగా వెలుగుతుందేమో! గడిచిన కొన్నేళ్లలో మొదటిరోజు అతితక్కువ వసూళ్లను రాబట్టిన సల్మాన్ సినిమా ట్యూబ్లైటే కావడం గమనార్హం. ఎన్నో అంచనాలతో ‘ట్యూబ్‌లైట్’ కొని నిరాశచెందామని, సినిమాలోని కంటెంట్ జనానికి నచ్చకపోవడం వల్లే ఇలా జరిగిందని రాజేశ్ తదానీ, అక్షయ్ రాఠీ అనే డిస్ట్రిబ్యూటర్లు మీడియాతో అన్నారు. రంజాన్‌కు మూడు రోజుల ముందే దేశవ్యాప్తంగా 4,400 స్క్రీన్లపై‘ట్యూబ్‌లైట్’ విడుదలైంది. అయితే తొలిరోజు కలెక్షన్లు చూసి నిరాశచెందాల్సిన పనిలేదని, పండుగ నాడు, ఆ తర్వాతిరోజుల్లో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. వీకెండ్లో కనీసం రూ.60 కోట్ల బిజినెస్ చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. వార్‌డ్రామా నేపథ్యంలో హాలీవుడ్లో(2015లో) వచ్చిన ‘లిటిల్ బాయ్’ సినిమాకు అఫీషియల్ రీమేకే ‘ట్యూబ్‌లైట్’! ఇండో-చైనా వార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ట్యూబ్లైట్లో సల్మాన్ బుద్ధిమాద్యం గల లక్ష్మణ్ సింగ్ బిష్త్ పాత్రను పోషించాడు. చైనీస్ నటి జుజు, బాలనటుడు మార్టిన్ రే టాంగు, ఓంపురి తదితరులు ప్రధాన తారాగణం. -
ట్యూబ్‌లైట్ రిజల్ట్‌పై సల్మాన్ స్పందన
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. వరుస సక్సెస్‌లతో ఫుల్ ఫాంలో ఉన్న సల్మాన్ జోరుకు ట్యూబ్ లైట్ బ్రేక్ వేసింది. బలమైన కథ లేకపోవుటంతో సల్మాన్ స్టార్ ఇమేజ్, భారీ గ్రాఫిక్స్ కూడా సినిమాను కాపాడలేకపోయాయి. సోషల్ మీడియాలో ట్యూబ్లైట్పై పెద్ద ఎత్తున సెటైర్లు పడుతుంటే.. రివ్యూలు కూడా దారుణంగా వచ్చాయి. అయితే ఈ రివ్యూల పై స్పందించిన సల్మాన్' నేను ఇంకా దారుణమైన రేటింగ్స్ వస్తాయనుకున్నా.. విశ్లేషకులు -3, -4 రేటింగ్స్ ఇస్తారని భావించా.. కానీ 1, 1.5 రేటింగ్స్ వచ్చాయి' అంటూ కామెంట్ చేశాడు. బియింగ్ హ్యూమన్ ఆర్గనైజేషన్‌తో పీవీఆర్ సంస్థతో ఒప్పందం చేసుకుంటున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్, ఈ కామెంట్స్ చేశాడు. సినిమా రిలీజ్‌కు ముందుకు కూడా రివ్యూలు రాసే వాళ్లపై సల్మాన్ ఖాన్ ఫైర్ అయ్యాడు. -
ప్చ్.. సినిమా నిరాశ పరిచేలా ఉంది!
'బజరంగీ భాయ్‌జాన్', 'సుల్తాన్' వంటి భారీ విజయాల తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్ నటించిన తాజాచిత్రం 'ట్యూబ్‌లైట్'. శుక్రవారం విడుదలైన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టు లేదనే టాక్ వినిపిస్తోంది. విమర్శకులు ఈ సినిమాపై పెదవి విరుస్తుండగా.. పెద్దగా ఆకట్టుకునేవిధంగా లేకపోవడం మైనస్ పాయింట్ అని సినీ జనాలు అంటున్నారు. మొత్తానికి ఎన్నో అంచనాలతో వచ్చిన 'ట్యూబ్‌లైట్' సినిమాపై సోషల్ మీడియాలో, ఆన్లైన్లో మిశ్రమ స్పందన వస్తోంది. 'ట్యూబ్‌లైట్' నిరాశపరిచేవిధంగా ఉందని ప్రముఖ బాలీవుడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. సల్మాన్ ఖాన్‌లాంటి సాలిడ్ స్టార్ పవర్, స్టన్నింగ్ విజువల్స్ ఈ సినిమాలో ఉన్నాయని, ఈ సినిమా నిర్మాణం అందంగా ఉన్నా.. ఆత్మ లోపించిందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్‌తో 'ఏక్ థా టైగర్', 'బజరంగీ భాయ్‌జాన్' వంటి భారీ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు కబీర్ ఖాన్ తాజా చిత్రం 'ట్యూబ్‌లైట్' యుద్ధనేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. హాలీవుడ్ సినిమా 'లిటిల్ బాయ్' ప్రేరణతో తెరకెక్కిన ఈ సినిమాలో బుద్ధిమాంద్యం కలిగిన లక్ష్మణ్ సింగ్ బిష్త్ పాత్రలో సల్మాన్ నటించాడు. ఈశాన్య భారతంలోని జగత్పూర్ కేంద్రంగా సాగే ఈ సినిమాలో వయస్సు పెరిగినా బాలుడిలా వ్యవహరించే సల్మాన్‌ను చుట్టుపక్కల వారు 'ట్యూబ్‌లైట్' అంటూ ఆటపటిస్తుంటారు. ఏడిపిస్తుంటారు. ఈ క్రమంలోనే చైనీయులైన లిలింగ్, పెర్కీ గౌ అక్కడికి జీవించడానికి వలసరావడం.. అనంతరం భారత్-చైనా యుద్ధం జరగడం కథలో భాగంగా వస్తాయి. యుద్ధం కన్నా మానవ సంబంధాలు, కుటుంబబాంధవ్యాలు గొప్పవని చాటుతూ సాగే ఈ సినిమాలో సందేశం బాగానే ఉన్నా.. బలమైన స్కిప్ట్ లేకపోవడంతో సినిమా తేలిపోయిందనే భావనను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. సుల్తాన్ వంటి భారీ యాక్షన్ మాస్ మసాల తర్వాత పిల్లాడి మనస్తత్వమున్న పాత్రలో సల్మాన్ నటించడం అభిమానులకు రుచించకపోవచ్చునని వినిపిస్తోంది. #OneWordReview...#Tubelight: Disappointing. Solid star power [Salman Khan]. Stunning visuals. But #Tubelight is body beautiful, minus soul. — taran adarsh (@taran_adarsh) 23 June 2017 -
విడుదలకు ముందే కీలక సీన్ లీక్.. వైరల్!
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ హీరోగా వస్తున్న తాజా సినిమా 'ట్యూబ్‌లైట్'.. ఈ శుక్రవారం విడుదల అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో దూసుకుపోతున్న సల్మాన్ 'సుల్తాన్' తర్వాత.. 'బజరంగీ భాయ్‌జాన్' దర్శకుడు కబీర్ ఖాన్ దర్శకత్వంలో 'ట్యూబ్‌లైట్' తెరకెక్కించడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి సల్మాన్ నుంచి భారీ హిట్ ఖాయమని భావిస్తున్న నేపథ్యంలో విడుదలకు ముందే ఈ చిత్ర యూనిట్ షాక్ తగిలింది. ఈ సినిమాకు సంబంధించిన కీలక సీను ఆన్లైన్లో లీకవ్వడమే కాదు.. అది క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 'ట్యూబ్‌లైట్' సినిమాలో అతిథి పాత్ర పోషిస్తున్నాడు. ఆయన ఇందజాలికుడిగా కనిపించి పిల్లలను అలరించే కీలక సీన్ ఆన్లైన్లో లీక్ అయింది. ఈ సీన్ అభిమానులను అలరిస్తుండటంతో వెంటనే వైరల్‌గా మారింది. Exclusive :- Shah Rukh Khan Cameo Video From The #TubeLight Movie -
ట్యూబ్‌లైట్ ప్రమోషన్లో సల్మాన్
-
సల్మాన్ సినిమాలో షారూఖ్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ట్యూబ్ లైట్. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా నిర్మాత, నటుడు సోహైల్ ఖాన్, సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు. తన అభిమాన దర్శకుడైన కబీర్ ఖాన్‌తో కలిసి పనిచేయటం చాలా ఆనందంగా ఉందన్నాడు. అదే సమయంలో ఆసక్తికరమైన విషయమొకటి వెల్లడించాడు. సల్మాన్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కీలకమైన అతిథి పాత్రలో కనిపిస్తున్నాడట. కథను మలుపు తిప్పే ఇంపార్టెంట్ క్యారెక్టర్లో షారూఖ్ కనిపించబోతున్నట్టుగా వెల్లడించాడు సోహైల్. అంతేకాదు ఆ పాత్రకు షారూఖ్ ఇమేజ్ చాలా హెల్ప్ అవుతుందని అందుకే షారూఖ్‌ను ఆ పాత్రకు ఒప్పించినట్టుగా తెలిపాడు. ఈద్ సీజన్లో సూపర్ హిట్ రికార్డ్ ఉన్న సల్మాన్ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడని భావిస్తున్నారు. -
యుద్ధం ఒక్కటే పరిష్కారం కాదు: సల్మాన్
న్యూఢిల్లీ: ‘భారత్-పాక్’ యుద్ధంపై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించారు. యుద్ధం ఒకటే సమస్యకు పరిష్కారం కాదని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా సల్మాన్ తాజా చిత్రం ‘ట్యూబ్‌లైట్’ ప్రమోషన్లో భాగంగా భావోగ్వేదానికి గురయ్యారు. యుద్ధం వల్ల ఇరు పక్షాల సైన్యాలు తమ జీవితాలను కోల్పోతారని, దాంతో వారి కుటుంబాలు... కుమారులు లేదా వారి తండ్రులు లేకుండానే తమ జీవితాలను గడపాల్సి ఉంటుందని అన్నారు. అలాగే యుద్ధం చేయాలని చెప్పేవారికి తుపాకులు ఇచ్చి యుద్ధం చేయమని చెప్పాలని సల్మాన్ వ్యాఖ్యానించారు. కాగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, ఆయన సోహైల్ ఖాన్ ప్రధాన పాత్రల్లో ట్యూబ్‌లైట్ చిత్రం తెరకెక్కింది. చైనాతో యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో సల్మాన్ అమాయకుడిగా, సోహైల్ చైనాతో యుద్ధంలో పాల్గొనే ఓ సైనికుడి పాత్ర పోషించాడు. ఈ చిత్రంలో చైనా నటి ఝు ఝు హీరోయిన్గా నటించింది. అలాగే 'ట్యూబ్‌లైట్' ద్వారా సల్మాన్ ఖాన్ తల్లి సల్మా ఖాన్ తొలిసారిగా నిర్మాతగా మారారు. -
సూసైడ్ డిసీజ్‌తో బాధపడుతున్న సల్మాన్..!
కండల తిరిగిన దేహంలో 50 ఏళ్లు దాటిన ఇప్పటికీ యూత్ హీరోలా కనిపించే సల్మాన్ ఖాన్, అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఆనందంగా కనిపించే ఈ సీనియర్ బ్యాచిలర్ హీరో, దాదాపు ఏడున్నరేళ్లుగా భయకరమైన వ్యాధితో బాధపడుతున్నట్టుగా తెలిపాడు. ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే వ్యాది సల్మాన్ ను కొంతకాలంగా తీవ్రంగా బాదిస్తుంది. నరాలకు సంబంధించిన ఈ వ్యాది కారణంగా తలలో నరాలు ఉబ్బి విపరీతమైన తలనొప్పి వస్తుందని తెలిపాడు. ప్రస్తుతం ట్యూబ్ లైట్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న సల్మాన్, దుబాయ్ లో పాల్గొన్న ఓ ప్రమోషన్ ఈవెంట్ లో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఎంతో బాధాకరమైన ఈ వ్యాదిని వైద్యులు సూసైడ్ డిసీజ్ గా వ్యవహరిస్తారని తెలిపాడు. అయితే ట్రీట్మెంట్ కు అవకాశం ఉన్నా.. 8 నెలల పాటు హాస్పిటల్ లో ఉండాల్సి వస్తుందని అందుకే ప్రస్తుతానికి ట్రీట్మెంట్ ను వాయిదా వేసినట్టుగా తెలిపాడు. -
బాహుబలి కన్నా.. నా కలెక్షన్లే ఎక్కువ : సల్మాన్
ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న బాహుబలి సినిమాపై బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. బాహుబలి 2 రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన తరువాత కూడా చాలా కాలం పాటు బాలీవుడ్ హీరోలు ఈ సినిమాపై స్పందించలేదు. అయితే ఇండియన్ సినిమా అంటే బాహుబలే అనే స్థాయి కలెక్షన్లు నమోదు కావటంతో తప్పనిసరి పరిస్థితుల్లో షారూఖ్, ఆమిర్ లాంటి స్టార్స్ సినిమా చూడలేదు గానీ.. బాహుబలి గొప్ప సినిమా అంటూ కామెంట్ చేశారు. తాజాగా ఈ లిస్ట్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా చేరిపోయాడు. ఈద్ కానుకగా రిలీజ్ అవుతున్న ట్యూబ్‌లైట్ సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సల్మాన్.. బాహుబలి కలెక్షన్లపై స్పందించాడు. అయితే బాహుబలి గొప్ప సినిమానే అన్న సల్మాన్, బాహుబలి కలెక్షన్ల కన్నా.. నా కలెక్షన్లే ఎక్కువంటూ మెలికపెట్టాడు. బాహుబలి సినిమాను నాలుగేళ్ల పాటు తెరకెక్కించారు. నేను ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ వస్తున్నా.. అవన్ని కలుపుకుంటే బాహుబలి వసూళ్ల కన్నా నా కలెక్షన్లే ఎక్కువ కదా..! అంటూ మీడియాకు ఎదురు ప్రశ్న వేశాడు. -
బన్నీపై ట్యూబ్‌లైట్ ఎఫెక్ట్..!
సరైనోడు సినిమాతో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాను జూన్ 23న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అదే సమయంలో సౌత్‌లో భారీ చిత్రాలేవి లేకపోవటంతో బన్నీ భారీ బిజినెస్ చేయటం కాయం అని భావించారు. కానీ డీజే ఆశలపై నీళ్లు చల్లుతున్నాడు బాలీవుడ్ కండలవీరుడు. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ట్యూబ్‌లైట్ సినిమాను ఈద్ కానుకగా జూన్ 23న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. బాహుబలి సినిమాతో సౌత్ సినిమా నార్త్ లోనూ సత్తా చాటగలదని ప్రూవ్ కావటంతో.. ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలు సౌత్ మార్కెట్ మీద దృష్టి పెట్టారు. అందుకే ట్యూబ్‌లైట్ సినిమాను ఇక్కడ కూడా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో అదే రోజు రిలీజ్ అవుతున్న డీజే కలెక్షన్లపై ఎఫెక్ట్ పడుతుందని భావిస్తున్నారట. డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. బన్నీ బ్రాహ్మణుడిగా, కాంట్రక్ట్ కిల్లర్‌గా రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. మరి బన్నీ బిజినెస్ మీద బాలీవుడ్ ఖాన్ ఎంత వరకు ఎఫెక్ట్ చూపిస్తాడో చూడాలి. -
సల్మాన్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ: ఫస్ట్ లుక్ ఇదే!
వరుస బ్లాక్ బస్టర్లతో బాలీవుడ్ బాక్సాఫీస్‌కు దడ పుట్టిస్తున్న సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. భజరంగీ భాయ్‌జాన్, సుల్తాన్ వంటి భారీ సూపర్హిట్ల తర్వాత ఆయన నటిస్తున్న తాజా సినిమా ’ట్యూబ్‌లైట్’... సల్మాన్‌తో ’ఏక్ థా టైగర్’, ’బజరంగీ భాయ్‌జాన్’ వంటి హిట్ సినిమాలు తెరకెక్కించిన కబీర్ ఖాన్ ఈ సినిమాకు దర్శకుడు. అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను తాజాగా చిత్రయూనిట్ విడుదల చేసింది. రానున్న దీపావళి పండుగ సీజన్లో ‘ట్యూబ్‌లైట్’ సినిమా విడుదల కాబోతున్నదంటూ ప్రకటించింది. ‘ట్యూబ్‌లైట్’ సినిమాలో సల్మాన్ ఫస్ట్‌లుక్ విభిన్నంగా ఉండి.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కబీర్ ఖాన్ శైలి, సల్మాన్ అమాయకత్వం ఈ పోస్టర్లో దర్శనమిస్తోంది. ‘శాంతి, గౌరవం, ప్రేమ, కాంతి మీ జీవితాల్లో వెల్లివిరియాలని ట్యూబ్‌లైట్ టీమ్ ఆశిస్తోంది’ అంటూ ఫస్ట్‌లుక్‌ను సల్మాన్ ట్వీట్ చేశారు. Peace, Respect, Love and Light in your life from the Tubelight team . pic.twitter.com/BXjkn0Xc9m — Salman Khan (@BeingSalmanKhan) 20 April 2017 -
21 ఏళ్ల తరువాత కలిసి నటిస్తున్న ఖాన్లు
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానం కోసం షారూఖ్, సల్మాన్‌లు తెగ పోటిపడుతున్నారు. ప్రస్తుతం కత్తులు దూసుకుంటున్న సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్లు గతంలో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు కూడా చేశారు. చివరగా 1995లో రిలీజ్ అయిన కరణ్ అర్జున్ సినిమాలో అన్నదమ్ములుగా నటించారు ఈ సూపర్ స్టార్స్. ఆ తరువాత వివాదాలతో దూరమైన ఈ ఇద్దరు, ఈ మధ్య అన్ని మర్చిపోయి ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేస్తున్నారు. దీంతో మరోసారి ఈ టాప్ స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తారన్న టాక్ వినిపించింది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూసల్మాన్, షారూఖ్‌లు కలిసి నటించేందుకు అంగీకరించారు. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న ట్యూబ్ లైట్ సినిమాలో షారూఖ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడట. అయితే అది కూడా సినిమాను మలుపు తిప్పే కీలక పాత్ర కావటంతో ప్రేక్షకులకు ఈ సినిమా మల్టీ స్టారర్ సినిమానే అనిపిస్తుందంటున్నారు మేకర్స్. -
ట్యూబ్‌లైట్ సరిచేస్తూ వ్యక్తి మృతి
రేగుల్లంక (అవనిగడ్డ) : ఇంట్లో ట్యూబ్‌లైట్ సరిచేస్తూ ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన రేగుల్లంకలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రేగుల్లంకకు చెందిన ఆరిగ మారయ్య (44) బుధవారం తన ఇంట్లో ట్యూబ్‌లైట్ వెలగకపోవటంతో సరిచేస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్థానికులు వెంటనే అతడిని అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మారయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మారయ్య మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. -
సల్మాన్ సినిమాలో చైనా హీరోయిన్
వరుస సూపర్ హిట్స్‌తో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సల్మాన్ ఖాన్ మరో ఇంట్రస్టింగ్ సినిమాను మొదలు పెట్టాడు. సుల్తాన్ సక్సెస్ జోష్‌ను ఎంజాయ్ చేస్తూనే కొత్త సినిమా పనుల్లో బిజీగా అవుతున్నాడు. తనతో ఏక్తాటైగర్, భజరంగీ బాయిజాన్ లాంటి వరుస హిట్స్ అందించిన కబీర్ ఖాన్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ట్యూబ్ లైట్ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను నిర్ణయించారు చిత్రయూనిట్. టైటిల్ విషయంలోనే కాదు నటీనటుల ఎంపికలోనూ అదే కొత్త దనాన్ని చూపించడానికి ట్రై చేస్తున్నారు ట్యూబ్‌లైట్ యూనిట్. ఈ సినిమాలో సల్మాన్ సరసన ఝూ ఝూ అనే చైనా అమ్మాయి హీరోయిన్గా నటించనుంది. చైనాలో ఎంటివి యాంకర్‌గా పరిచయం అయి తరువాత పలు అంతర్జాతీయ సినిమాల్లో నటించిన ఝూ ఝూను హీరోయిన్గా తీసుకోవటం బాలీవుడ్ సర్కిల్స్‌లో కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇండియాలో భారీ చిత్రాలను తెరకెక్కిస్తున్న నిర్మాతలు చైనా మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నారు. అమీర్ ఖాన్ పికెతో పాటు, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి కూడా చైనాలో భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. అదే బాటలో సల్మాన్ కూడా చైనా మార్కెట్ మీద కన్నేశాడు. అందుకే చైనీస్ భామ హీరోయిన్ అయితే చైనా మార్కెట్లో సినిమాకు మరింత క్రేజ్ వస్తుంది ఈ ప్లాన్ చేశాడట. సల్మాన్ ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. -
'ట్యూబ్ లైట్' షూటింగ్ షురూ
సినిమా టైటిల్ ఎంత ఆకట్టుకునేలా ఉంటే సినిమా మీద అంత హైప్ క్రియేట్ అవుతుంది. స్టార్ హీరోల సినిమాల విషయంలో అయితే టైటిల్స్ చేసే హంగామా కాస్త ఎక్కువే అని చెప్పాలి. తాజాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ 'ట్యూబ్ లైట్' అనే విభిన్నమైన టైటిల్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేయనున్నారు. సుల్తాన్ సినిమా బంపర్ హిట్ అయిన తర్వాత.. సల్మాన్ తదుపరి చిత్రం 'ట్యూబ్ లైట్' షూటింగ్ గురువారం మొదలయ్యింది. డైరెక్టర్ కబీర్ ఖాన్ ఈ సినిమాతో సల్మాన్‌తో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఏక్ థా టైగర్, గత ఏడాది బజరంగీ భాయ్ జాన్ సినిమాలు బాక్సాఫీసుని బద్దలుకొట్టగా.. 'ట్యూబ్ లైట్' పేరుతో మరోసారి అలాంటి మ్యాజిక్కే చేసేందుకు కబీర్ ఖాన్ సిద్ధమయ్యారు. 'ట్యూబ్ లైట్' లో భావోద్వేగాలు, హాస్యంతో పాటు కాస్త పొలిటికల్ టచ్ కూడా ఉంటుందని కబీర్ చెప్పారు. లఢక్ ప్రాంతంలో తొలి రోజు షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాలో సల్మాన్ ఓ విభిన్నమైన పాత్రలో కనిపిస్తారట. సల్మాన్ సరసన దీపికా పదుకొనే నటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది రంజాన్‌కి ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం.