ట్యూబ్లైట్ రిజల్ట్పై సల్మాన్ స్పందన
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. వరుస సక్సెస్లతో ఫుల్ ఫాంలో ఉన్న సల్మాన్ జోరుకు ట్యూబ్ లైట్ బ్రేక్ వేసింది. బలమైన కథ లేకపోవుటంతో సల్మాన్ స్టార్ ఇమేజ్, భారీ గ్రాఫిక్స్ కూడా సినిమాను కాపాడలేకపోయాయి. సోషల్ మీడియాలో ట్యూబ్లైట్పై పెద్ద ఎత్తున సెటైర్లు పడుతుంటే.. రివ్యూలు కూడా దారుణంగా వచ్చాయి.
అయితే ఈ రివ్యూల పై స్పందించిన సల్మాన్' నేను ఇంకా దారుణమైన రేటింగ్స్ వస్తాయనుకున్నా.. విశ్లేషకులు -3, -4 రేటింగ్స్ ఇస్తారని భావించా.. కానీ 1, 1.5 రేటింగ్స్ వచ్చాయి' అంటూ కామెంట్ చేశాడు. బియింగ్ హ్యూమన్ ఆర్గనైజేషన్తో పీవీఆర్ సంస్థతో ఒప్పందం చేసుకుంటున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్, ఈ కామెంట్స్ చేశాడు. సినిమా రిలీజ్కు ముందుకు కూడా రివ్యూలు రాసే వాళ్లపై సల్మాన్ ఖాన్ ఫైర్ అయ్యాడు.