Reviews
-
పండగ సినిమాల రివ్యూ.. ఏది ఎలా ఉందంటే?
తెలుగు రాష్ట్రాల్లో దసరా జోష్ కనిపిస్తుంది. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్లని ఎంటర్టైన్ చేయడానికా అన్నట్లు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ కాస్త ఎక్కువగానే రిలీజయ్యాయి. వీటిలో రజినీకాంత్ 'వేట్టయన్', గోపీచంద్ 'విశ్వం', సుహాస్ 'జనక అయితే గనక', సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో' ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటికే థియేటర్లలోకి వచ్చేశాయి. ఇంతకీ ఇవి ఎలా ఉన్నాయంటే?వేట్టయన్రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్.. ఇలా బోలెడంత మంది స్టార్స్ నటించిన ఈ సినిమాని.. పోలీసులు- ఫేక్ ఎన్ కౌంటర్ చేయడం అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కించారు. తమిళనాడులో హిట్ టాక్ వచ్చింది గానీ తెలుగులో మిక్స్డ్ టాక్ వచ్చింది. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టుండాల్సిందని అంటున్నారు. ఓవరాల్ రివ్యూ కోసం ఈ లింక్ క్లిక్ చేసేయండి. (రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ)మా నాన్న సూపర్ హీరోసుధీర్ బాబు హీరోగా నటించిన ఈ మూవీని తండ్రి సెంటిమెంట్ స్టోరీతో తీశారు. చిన్నప్పుడే కన్న తండ్రి నుంచి దూరమైన పిల్లాడు.. మరొకరి దగ్గర పెరిగి పెద్దవుతాడు. సవతి తండ్రికి ఇతడంటే అస్సలు ఇష్టముండదు. మరి సొంత తండ్రి-కొడుకు చివరకు ఎలా కలుసుకున్నారనేది తెలియాలంటే సినిమా చూడాలి. మంచి ఎమోషనల్ కంటెంట్‌తో తీసిన ఈ చిత్రం ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది చూడాలి. పూర్తి రివ్యూ ఇదిగో ('మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ)(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)విశ్వంగోపీచంద్ లేటెస్ట్ మూవీ ఇది. దాదాపు ఆరేళ్ల తర్వాత శ్రీనువైట్ల ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే రెగ్యులర్ రొటీన్ స్టోరీ కావడంతో తొలి ఆట నుంచే మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. కమర్షియల్ మూవీకి కావాల్సిన అన్ని అంశాలు ఉన్నప్పటికీ రెగ్యులర్ ఫార్మాట్లో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓవరాల్ రివ్యూ కోసం ఈ లింక్ క్లిక్ చేసేయండి. (‘విశ్వం’ మూవీ రివ్యూ)జనక అయితే గనకసుహాస్ లీడ్ రోల్ చేసిన మూవీ ఇది. ఓ వ్యక్తి పిల్లల్ని వద్దనుకుంటాడు. సేఫ్టీ కూడా వాడుతుంటాడు. అయినా సరే భార్య గర్భవతి అవుతుంది. దీంతో కండోమ్ కంపెనీపై కేసు వేస్తాడు. తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ. ప్రస్తుత కాలంలో పిల్లల్ని కనడం, పెంచడం ఖరీదైన వ్యవహారం. ఇదే పాయింట్ తీసుకుని, ఎంటర్టైనింగ్ చెప్పారు. ప్రీమియర్లు వేస్తే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పూర్తి రివ్యూ కూడా చదివేయండి. (‘జనక అయితే గనక’మూవీ రివ్యూ)(ఇదీ చదవండి: ఓటీటీలోనే ది బెస్ట్... సలార్, కేజీఎఫ్‌కి బాబు లాంటి సినిమా) -
ఇంగ్లండ్ కెప్టెన్ చెత్త రికార్డు.. పదికి పది వేస్ట్ చేశాడు..!
బెన్ స్టోక్స్ గైర్హాజరీలో ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఓలీ పోప్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్ను మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పోప్ ఇప్పటివరకు 10 రివ్యూలు తీసుకోగా.. పదికి పది విఫలమయ్యాయి. ఒక్కటంటే ఒక్క రివ్యూలోనూ పోప్ సక్సెస్ కాలేదు. టెస్ట్‌ల్లో ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. రివ్యూల విషయంలో పోప్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లంకతో సిరీస్‌లో వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా సక్సెస్ అయినప్పటికీ రివ్యూల విషయంలో పోప్ దారుణంగా విఫలమయ్యాడని ఇంగ్లిష్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఇదిలా ఉంటే, కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో శ్రీలంక జట్టు గెలుపు దిశగా సాగుతుంది. ఆ జట్టు మరో 99 పరుగులు చేస్తే మ్యాచ్‌ను గెలవడంతో పాటు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది. నాలుగో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. ఓలీ పోప్ భారీ శతకంతో (154) కదంతొక్కాడు. బెన్ డకెట్ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. నిస్సంక (64), ధనంజయ డిసిల్వ (69),కమిందు మెండిస్ (64) అర్ద సెంచరీలతో రాణించారు.ఆతర్వాత లంక బౌలర్లు చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది. లహీరు కుమార 4, విశ్వ ఫెర్నాండో 3, అశిత ఫెర్నాండో 2, మిలన్ రత్నాయకే ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ జేమీ స్మిత్ (67) ఒక్కడే అర్ద సెంచరీ చేశాడు. 219 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక గెలుపు దిశగా సాగుతుంది. నిస్సంక (67), ఏంజెలో మాథ్యూస్ (6) క్రీజ్‌లో ఉన్నారు. -
అలా ఇచ్చేందుకు మీకు ఒక్క సినిమా కనిపించలేదా?: సాయి రాజేశ్
బేబీ మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ సాయి రాజేశ్. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిన్న సినిమాగా వచ్చిన బేబీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. హృదయకాలేయం, కొబ్బరి మట్ట చిత్రాల తర్వాత బేబీ మూవీకి దర్శకత్వం వహించారు. అయితే బేబీ హిట్‌తో జోష్‌లో ఉన్న సాయి రాజేశ్ మరో సినిమాను ఇటీవలే ప్రకటించారు. సంతోష్ శోభన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. సుమన్ పాతూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ సినిమాతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యకు హిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరో తెలుగమ్మాయి.. 'బిగ్ బాస్' ఫేమ్ అలేఖ్య హారికను కథానాయకిగా పరిచయం చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన సాయి రాజేశ్ సినిమా రివ్యూయర్స్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. గత ఐదేళ్లుగా ఒక్క తెలుగు సినిమాకైనా 4 లేదా 4.5 రేటింగ్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి సినిమాలకు ఎంత రేటింగ్ ఇచ్చారని అడిగారు. మీరు 4 రేటింగ్ ఇచ్చేందుకు ఒక్క సినిమా కూడా మీ వెబ్సైట్లకు కనిపించలేదా? అన్నారు. ఈ విషయంలో మీకు మీరే ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు? అన్నారు. మన సినిమాల విషయంలో కేవలం 2.75 నుంచి 3.5, 3.75 మధ్య రివ్యూలు ఇస్తూ ఎందుకిలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు? గత పదేళ్లుగా 3.75 పైనా రేటింగ్ ఇచ్చినా ఒక్క సినిమా పేరు చెప్పండి చాలు? అంటూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. మీరంతా కలిసి రివ్యూల విషయంలో ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అసలు మీ మనసుకు ఒక్కసారి కూడా 4 రేటింగ్ ఇవ్వాలని అనిపించలేదా? అని అడిగారు. సాయి రాజేశ్ అడిగిన ప్రశ్నకు ఓ మీడియా ప్రతినిధి సమాధానమిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. 'మేము ఇచ్చే రివ్యూస్ మాత్రమే సినిమా ఫలితాన్ని డిసైడ్ చేయలేవు. లక్కీగా చాలా సందర్భాల్లో మేము ఇచ్చే రివ్యూలు కూడా మ్యాచ్ అవుతాయి. ఎండ్ ఆఫ్ ది డే ఇది వ్యక్తిగత అభిప్రాయం. రాజమౌళి సినిమా కూడా ఫెయిల్ కావొచ్చు. అది మనం డిసైడ్ చేయలేం కదా.' అని చెప్పారు. -
నాచుతో కాలుష్యాన్ని మాయం గాడ్జెట్.. ధర ఎంతంటే?
సముద్రపు నాచుతో పనిచేసే మొట్టమొదటి ఎయిర్ ప్యూరిఫైయర్ ఇది. పనిచేసే చోట టేబుల్‌పై పెట్టుకుని ఉపయోగించుకోవడానికి అనువుగా దీనిని రూపొందించారు. సాధారణ ఎయిర్ ప్యూరిఫైయర్ల మాదిరిగానే ఇది గాలిలోని కాలుష్యానికి కారణమయ్యే సూక్ష్మకణాలను తొలగిస్తుంది. ఇందులోని సజీవమైన సముద్రపు నాచు పరిసరాల్లోని ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. గాలిలోని తేమను పీల్చుకుని, గదిని చల్లబరుస్తుంది. అమెరికన్ కంపెనీ ‘మోస్ ఎయిర్’ దీనిని రూపొందించింది. ఇందులో హెపా ఫిల్టర్లతో పాటు ఒక చదరపు మీటరు నాచు ఫిల్టర్ కూడా ఉంటుంది. ఇందులోని నాచును రెండేళ్లకు ఒకసారి మార్చుకోవచ్చు. ఇందులోని డ్రిప్ నాజిల్స్ నాచును సజీవంగా ఉంచేందుకు సన్నని నీటి తుంపర్లను నిరంతరం విడుదల చేస్తుంటాయి. దీని ధర 198 డాలర్లు (రూ16,481) మాత్రమే! -
ఒకే బంతికి రెండు రివ్యూలు ధోనిని మించిపోయిన అశ్విన్..!
-
'అరంగేట్రం' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: అరంగేట్రం నటీనటులు: శ్రీనివాస్ ప్రభన్, ముస్తఫా ఆస్కారీ, రోషన్ షేక్, పూజా బోరా, శ్రీలం శ్రీవల్లి, సాయిశ్రీ వల్లపాటి, కీర్తన, ఇందు, అనిరుధ్ తదితరులు నిర్మాణసంస్థ: మహీ మీడియా వర్క్స్ దర్శకత్వం: శ్రీనివాస్ ప్రభన్ నిర్మాత: మహేశ్వరి సంగీతం: గిడియన్ కట్టా సినిమాటోగ్రఫీ: బురాన్ షేక్ ప్రొడక్షన్ డిజైనర్, కో డైరెక్టర్: రమేశ్ బాబు చిన్నం (గోపి) అరంగేట్రం కథేంటంటే.. సిటీలో జనవరి 13న ఓ అమ్మాయిని సైకో హత్య చేస్తాడు. మళ్లీ ఫిబ్రవరి 13న ఇంకో అమ్మాయిని హత్య చేస్తాడు. ఇలా సిటీలో వరుసగా ప్రతీ నెలా పదమూడో తేదీన ఓ అమ్మాయిని సైకో చంపేస్తుంటాడు. సైకోని ఆపేందుకు పోలీసు యంత్రాంగం ఎంతగానో ప్రయత్నిస్తుంటుంది. కానీ ఆ సైకో జాడ దొరకదు. తర్వాత వైష్ణవి అనే అమ్మాయిని చంపేందుకు అతడు సిద్దపడతాడు. ఈ క్రమంలో హీరో శ్రీనివాస్ ప్రభన్ (శ్రీనివాస్ ప్రభన్) వైష్ణవి ఇంట్లోనే ప్రత్యక్షం అవుతాడు. అసలు వైష్ణవికి శ్రీనివాస్‌కు ఉన్న లింక్ ఏంటి? ఆ సైకో ఎందుకు ఇలా వరుసగా అమ్మాయిలను చంపుతూ వెళ్తున్నాడు? సైకో జీవితంలోని ఫ్లాష్ బ్యాక్ ఏంటి? సైకోకి, శ్రీనివాస్‌కు ఉన్న మధ్య ఉన్న లింక్ ఏంటి? చివరకు సైకో ఏమయ్యాడు? శ్రీనివాస్ ప్రభన్ ఏం చేశాడు? అనేది కథ. ఎలా ఉందంటే.. సస్పెన్స్ థ్రిల్లర్లు, సైకో డ్రామాలు ఓ వర్గానికి ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే వాటిని నడిపించే ట్రాక్ మాత్రం ఒకేలా ఉంటుంది. సైకో థ్రిల్లర్ జానర్ల కథలు కొత్తగా ఏమీ ఉండవు. కానీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కథను రాసుకుంటే మాత్రం అందరినీ ఆకట్టుకోవచ్చు. ఈ అరంగేట్రం సినిమాకు దర్శకుడు కూడా అదే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో సఫలమయ్యాడు. ఇక్కడ హీరోనే దర్శకుడు అయినప్పటికీ రెండుచోట్లా రాణించాడు. (ఇది చదవండి: ఆయన పరిస్థితిని చూస్తే భయమేసింది: మహేశ్) ప్రథమార్థంలో వచ్చే ప్రశ్నలకు ద్వితీయార్థంలో సమాధానం ఇచ్చినట్టుగా ఉంటుంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మెరుగ్గా ఉంది. సైకో చేత కూడా కామెడీ చేయించే ప్రయత్నం వినూత్నంగా ఉంటుంది. చివరకు ముగింపు కాస్త భారంగా అనిపిస్తుంది. ఎమోషనల్ క్లైమాక్స్‌తో ముగించడం కూడా ఓ సాహసమే. ఎవరెలా చేశారంటే.. అరంగేట్రం మూవీలో ప్రధానంగా కనిపించేది హీరో, విలన్ పాత్రలే. హీరోగా శ్రీనివాస్ ప్రభన్ నటన ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ సీన్స్ ఇలా అన్ని రకాల సీన్లలో మెప్పించాడు. కొన్ని సీన్లలో నవ్వించే ప్రయత్నం చేశాడు. విలన్‌గా సైకో పాత్రలో ముస్తఫా అస్కరి భయపెట్టించాడు. అనిరుధ్, పూజా, లయ, రోషన్ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో ఓకే అనిపిస్తారు. జబర్దస్త్ సత్తిపండు కామెడీ ఆకట్టుకుంటుంది. సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు పెద్ద అసెట్ బ్యాగ్రౌండ్ స్కోర్. గిడియన్ కట్టా నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. ఓ పాటను రొమాంటిక్‌గా తెరపై చక్కగా తెరకెక్కించారు. బురాన్ షా కెమెరాపనితనం పర్వాలేదనిపిస్తుంది. మధు తన ఎడిటింగ్‌తో ఓకే అనిపిస్తాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. (ఇది చదవండి: ఈ సినిమాలో ఆ సీన్స్ కూడా ఉంటాయి: బిచ్చగాడు హీరో) -
డీఆర్ఎస్ కాస్త వీఆర్ఎస్ అయ్యింది.. గురువును మించిన శిష్యుడు
-
షాపర్‌టైన్‌మెంట్‌కు స్వాగతం
తాము ఇష్టపడే వస్తువును కొనడానికి వెబ్సైట్లలోకి వెళ్లే యువతరం... అక్కడ కనిపించే సుదీర్ఘమైన సమాచారాన్ని చదవడం బోర్‌గా ఫీలవుతున్నారు.అలా అని వస్తువుగురించి పూర్తిగా తెలుసుకోకుండా కొనుగోలు చేయడానికి ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో లైవ్ ‘షాపర్‌టైన్‌మెంట్’ను ఇష్టపడుతున్నారు.వెబ్సైట్లలో వన్‌సైడ్ కమ్యూనికేషన్ ఇష్టపడని వారికి లైవ్ కామర్స్ యాప్‌లు దగ్గరయ్యాయి. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన 25 సంవత్సరాల కనిక షిండే యాక్టివ్ ఆన్లైన్ షాపర్. రియల్ టైమ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్కు ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు ఆమె నోట పదేపదే వినిపిస్తున్నమాట షాపర్‌టైన్‌మెంట్. ‘షాపర్టైన్మెంట్లో షాప్‌కు వెళ్లి సరదాగా షాపింగ్ చేసిన అనుభూతి కలుగుతుంది. లిప్‌స్టిక్ నుంచి ఐ షాడోస్ వరకు మనం ఎంపిక చేసుకునే వస్తువుల విషయంలో స్పష్టత వస్తుంది. ఆ వస్తువులకు సంబంధించి సందేహాలకు వెంటనే సమాధానాలు దొరుకుతాయి’ అంటుంది కనిక. నాసిక్‌లోని కనిక షిండే మాత్రమే కాదు మన దేశంలో చిన్న, పెద్ద పట్టణాలు అనే తేడా లేకుండా జెన్–జెడ్, మిలీనియల్స్ రియల్ టైమ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ‘షాపర్‌టైన్‌మెంట్’కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడది వారికి ఫ్యాషన్‌గా కూడా మారింది. చైనీస్ డిజిటల్ మార్కెట్లో పుట్టిన ‘షాపర్‌టైన్‌మెంట్’ (కాంబినేషన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఇ– కామర్స్, వీడియో కంటెంట్) ట్రెండ్ ఇప్పుడు మన దేశంలోనూ హల్చల్ చేస్తోంది.చైనాలో ‘షాపర్‌టైన్‌మెంట్’ అనేది పాపులర్ ట్రెండ్‌గా ఉంది. చైనాకు చెందిన దిగ్గజ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ‘టవ్భావ్’ షాపర్‌టైన్‌మెంట్‌కు ఊపు ఇచ్చింది. అమ్మకాల్లో కొత్త చరిత్ర సృష్టించింది. ‘ఇది కేవలం మరో మార్కెటింగ్ ట్రెండ్ కాదు. రిటైల్ ఇండస్ట్రీ ముఖచిత్రాన్ని మార్చే పరిణామం’ అంటున్నారు విశ్లేషకులు.చైనాలోని షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్స్ దౌయిన్, క్లైష్ ‘షాపర్‌టైన్‌మెంట్’ ట్రెండ్ దూసుకుపోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్నసంస్థల నుంచి పెద్ద సంస్థల వరకు ‘షాపర్‌టైన్‌మెంట్’కు పెద్ద పీట వేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ ప్లాట్‌ఫాం ‘మింత్రా’ లైవ్ వీడియో స్ట్రీమింగ్ యాప్ లాంచ్ చేసింది. 2026 కల్లా ‘షాపర్‌టైన్‌మెంట్’ అమ్మకాలు గణనీయంగా పెరగనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇ–కామర్స్ ప్రపంచంలో కస్టమర్ రివ్యూలు కొనుగోలు ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తాయి. అయితే ఇవి కొన్నిసార్లు గందరగోళంగా మారి ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలోకి నెడతాయి. ఇలాంటి సమయంలోనే షాపర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యత పెరుగుతుంది. – హరిత, కోజికోడ్ (కేరళ) వెబ్సైట్లలో కనిపించే సుదీర్ఘమైన సమాచారం చదవాలంటే బోర్‌గా ఉంటుంది. మనం కావాలనుకున్న వస్తువును కంటితో చూసి కొనుగోలు చేయడంలోనే మానసిక తృప్తి ఉంటుంది. – శాంతిస్వర, చెన్నై -
AP: ఈహెచ్ఎస్పై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష
సాక్షి, అమరావతి: ఉద్యోగులు ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్)పై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా కెఎస్ జవహార్ రెడ్డి సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం, మెడికల్ రీ ఇంబర్స్మెంట్ అంశాల తోపాటు వైఎస్సాఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలు గురించి కూడా చర్చించారు. ముఖ్యంగా ఈహెచ్ఎస్లో మరిన్నీ అంశాలు చేర్చడం గురించి కూడా మాట్లాడారు. ఈమేరకు ఈహెచ్ఎస్లో ప్రస్తుతం ఉన్న కొన్ని ప్యాకేజీల ధరల పెంపు, ఉద్యోగుల నెలవారీ కంట్రీబ్యూషన్ పెంపు, మెడికల్ రీ ఇంబర్స్మెంట్ పరిమితి పెంచాల్సిన ఆవశ్యకత, కేన్సర్ వంటి రోగాలకు పరిమితి లేకుండా అందించే అంశం, అలాగే 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులుకు వన్‌టైం మాస్టర్ హెల్త్ చెకప్ తదితర అంశాల గురించి సీఎస్ జవహార్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. అంతేగాదు ఇందుకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేస్తే ఉద్యోగ సంఘాలతో మాట్లాడి రాష్ట్రస్థాయిలో ఒక నిర్ణయం తీసుకుందామని అధికారులుకు చెప్పారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంతృప్తికర స్థాయిలో ఆరోగ్య పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎస్ జవహార్ రెడ్డి. కాగా, ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి యం.టీ.కృష్ణబాబు,ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి (హెచ్ ఆర్)చిరంజీవి చౌదరి, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్, ప్రత్యేక కార్యదర్శి (సియంఆర్ఎఫ్) డా.హరికృష్ణ, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్ర ప్రసాద్,ఆరోగ్యశ్రీ ఎగ్జిక్యూటివ్ అధికారి టిఎస్ఆర్ మూర్తి, తదితర అధికారులు పాల్గొన్నారు. (చదవండి: అపోహలొద్దు.. మూడు రాజధానులపై సజ్జల క్లారిటీ) -
లాభాల్ని తెచ్చిపెట్టే ఈ మ్యూచువల్ ఫండ్ గురించి మీకు తెలుసా?
వడ్డీ రేట్లు దాదాపు గరిష్ట స్థాయిలకు చేరుకుంటున్నాయి. కనుక ఇన్వెస్టర్లు పదేళ్లకు మించిన లక్ష్యాల కోసం లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చన్నది నిపుణుల సూచన. మన దగ్గర దీర్ఘకాలంతో కూడిన పెట్టుబడుల సాధనాలు పరిమితం. పీపీఎఫ్, ఎన్పీఎస్ పథకాలు ఉన్నా, వీటిల్లో లాకిన్ ఉంటుంది. ముందస్తు ఉపసంహరణకు వీలు కాదు. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ ప్లాట్‌ఫామ్‌పై ప్రభుత్వ సెక్యూరిటీలను (జీసెక్‌లు) నేరుగా కొనుగోలు చేసుకోవచ్చు. వీటిపై రెగ్యులర్ ఆదాయం వస్తుంటుంది. వడ్డీపై వ్యక్తిగత పన్ను శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. ఒకవేళ గడువు కంటే ముందే వైదొలగాలని అనుకుంటే లిక్విడిటీ పెద్దగా ఉండదు. కానీ, లాంగ్ డ్యురేషన్ మ్యూచువల్ ఫండ్స్‌లో కోరుకున్నప్పుడు ఎగ్జిట్ తీసుకోవచ్చు. ఈ విభాగంలో నిప్పన్ ఇండియా నివేష్ లక్ష్య ఫండ్ పదేళ్లకు మించిన లక్ష్యాలకు అనుకూలం. కోరుకున్నప్పుడు పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. పెట్టుబడుల విధానం.. నిప్పన్ ఇండియా నివేష్ లక్ష్య అనేది ఓపెన్ ఎండెడ్ డెట్ పథకం. కనుక ఎప్పుడైనా పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చు. దీర్ఘకాలంతో కూడిన జీసెక్‌లలో ఇన్వెస్ట్ చేస్తుంది. సగటున 20–25 ఏళ్లకు మెచ్యూరిటీ తీరే (గడువు ముగిసే) సాధనాల్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంటుంది. పైగా వ్యయాలు చాలా తక్కువ. డైరెక్ట్ ప్లాన్‌లో కేవలం 0.16 శాతమే ఎక్స్పెన్స్ రేషియో వసూలు చేస్తోంది. పెట్టుబడులు పెట్టిన మొదటి మూడేళ్లలో కేవలం 20 శాతం యూనిట్లనే విక్రయించుకోగలరు. ఈ మొత్తంపై ఎగ్జిట్ లోడ్ పడదు. ఇంతకుమించిన మొత్తం ఉపసంహరించుకుంటే ఒక శాతం ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి వస్తుంది. మూడేళ్లు నిండిన తర్వాత ఎలాంటి పరిమితులు, చార్జీలు లేకుండా ఉపసంహరించుకోవచ్చు. ఈ పథకం దీర్ఘకాల పెట్టుబడులకు ఉద్దేశించినది. కనుక స్వల్పకాలంలో పెట్టుబడుల ఉపసంహరణను నిరుత్సాహపరిచేందుకు ఈ నిబంధన విధించడం జరిగింది. దీర్ఘకాల జిసెక్లకు సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ తక్కువ. పరిమితి విధించడానికి ఇది కూడా ఒక కారణం. కనుక కనీసం 8–10 ఏళ్లకు మించిన కాలానికే ఈ పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. సరైన సమయమే.. గతంలో వడ్డీ రేట్ల సైకిల్ 8–8.5 శాతం వద్ద గరిష్టానికి చేరి, 5–5.5 శాతం వద్ద కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం ఈల్డ్స్ 7.4 శాతానికి చేరాయి. గరిష్టానికి ఒక శాతం తక్కువ. సాధారణంగా వడ్డీ రేట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడే లాంగ్ డ్యురేషన్ ఫండ్స్/సెక్యూరిటీలను పెట్టుబడులకు ఎంపిక చేసుకోవడం సరైనది అవుతుంది. దీనివల్ల దీర్ఘకాలం పాటు అధిక రాబడులు పొందొచ్చు. ఏ సైకిల్లో అయినా గరిష్ట రేటును అంచనా వేయడం కష్టం. కనుక ఇక్కడి నుంచి ఈల్డ్స్ ఇంకా పెరుగుతాయా? అన్నది చెప్పలేం. కనుక ఇక్కడి నుంచి లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఆరంభించుకోవచ్చు. వడ్డీ రేట్ల క్షీణత ఆరంభమైన తర్వాత తాజా పెట్టుబడులు నిలిపివేసుకోవచ్చు. రాబడులు.. డెట్ పథకాల్లో మూడేళ్లు పూర్తయ్యే వరకు ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి, మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. నివేష్ లక్ష్య తదితర లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌లో గడిచిన ఏడాది, మూడేళ్ల కాల రాబడులు అంత ఆకర్షణీయంగా అనిపించవు. ఎందుకంటే ఈ కాలంలో వడ్డీ రేట్లు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. వీటిల్లో రాబడులను సైకిల్ ఆధారంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు ఇంకా పెరిగితే లాంగ్ డ్యురేషన్ పథకాల్లోని పెట్టుబడుల ఎన్ఏవీ సైతం తగ్గుతుంది. గడిచని ఏడాదిలో 5 శాతం, మూడేళ్లలో వార్షికంగా 6 శాతం రాబడులు ఈ పథకంలో ఉన్నాయి. కానీ, ఎనిమిదేళ్లు అంతకుమించిన కాలానికి ఈ పథకాలు ద్రవ్యోల్బణంతో పోలిస్తే మెరుగైన రాబడులను ఇస్తాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. -
కేంద్రం కీలక నిర్ణయం.. వాటికి చెక్, ఈ–కామర్స్ కంపెనీలు ఇలా చేయాల్సిందే!
న్యూఢిల్లీ: ఉత్పత్తులు, సర్వీసులపై వినియోగదారులను తప్పుదోవ పట్టించే నకిలీ ఆన్లైన్ సమీక్షలకు చెక్ చెప్పే దిశగా కేంద్రం కొత్త పాలసీని రూపొందించింది. ఇది నవంబర్ 25 నుండి అమల్లోకి రానుంది. ఆయా ఆన్లైన్ పోర్టల్స్ ముందుగా వీటిని స్వచ్ఛందంగా అమలు చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ తప్పుడు రివ్యూల సమస్య కొనసాగిన పక్షంలో నిబంధనలను కేంద్రం తప్పనిసరి చేయనుంది. దీని ప్రకారం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ–కామర్స్ కంపెనీలు స్వచ్ఛందంగా అన్ని పెయిడ్ రివ్యూల వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఇతరుల నుండి కొనుగోలు చేసిన సమీక్షలు, అలాగే సరఫరాదారు లేదా థర్డ్ పార్టీ తమ ఉత్పత్తులు/సర్వీసుల రివ్యూ కోసం నియమించుకున్న ఉద్యోగులు రాసే సమీక్షలను ప్రచురించకూడదు. ఆన్లైన్ వినియోగదారుల రివ్యూలపై భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) ‘ఐఎస్ 19000:2022’ పేరిట కొత్త ప్రమాణాన్ని రూపొందించినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ సోమవారం తెలిపారు. ఉత్పత్తులు .. సర్వీసుల సరఫరాదారులు, తమ సొంత కస్టమర్ల నుండి రివ్యూలను సేకరించే సంస్థలు, సరఫరాదారు నియమించుకున్న థర్డ్ పార్టీ కాంట్రాక్టరు సహా కన్జూమర్ రివ్యూలను ఆన్లైన్లో ప్రచురించే అన్ని సంస్థలకు ఇవి వర్తిస్తాయని వివరించారు. 15 రోజుల్లో సర్టిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం.. ఆన్లైన్ పోర్టల్స్ ఈ ప్రమాణాలను పాటిస్తున్నాయో లేదో పరిశీలించేందుకు సంబంధించిన సర్టిఫికేషన్ ప్రక్రియను వచ్చే 15 రోజుల్లోగా ప్రారంభించనున్నట్లు సింగ్ చెప్పారు. ఈ–కామర్స్ సంస్థలు ఈ సర్టిఫికేషన్ కోసం బీఐఎస్‌కి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. చాలా దేశాలు తప్పుడు రివ్యూలకు అడ్డుకట్ట వేసేందుకు చాలా తంటాలు పడుతున్న తరుణంలో ఈ తరహా ప్రమాణాలను ప్రవేశపెట్టిన తొలి దేశం బహుశా భారతేనని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా టూర్..ట్రావెల్, రెస్టారెంట్లు .. హోటళ్లు, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో రివ్యూలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సింగ్ తెలిపారు. జొమాటో, స్విగ్గీ, రిలయన్స్ రిటైల్, టాటా సన్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర సంస్థలు కొత్త ప్రమాణాలపై సంప్రదింపుల ప్రక్రియలో పాల్గొన్నట్లు సింగ్ చెప్పారు. అలాగే ప్రమాణాల రూపకల్పనలో సీఐఐ, ఫిక్కీ తదితర పరిశ్రమ సమాఖ్యలను కూడా సంప్రదించినట్లు వివరించారు. నిబంధనల ప్రకారం .. ఏ సంస్థలోనైనా రివ్యూలను హ్యాండిల్ చేసే బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగిని రివ్యూ అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరిస్తారు. సమీక్షలు చట్టబద్ధమైనవిగా, కచ్చితమైనవిగా, తప్పుదోవ పట్టించని విధంగా ఉండాలి. రివ్యూ చేసే వ్యక్తుల అనుమతి లేకుండా వారి పేర్లను వెల్లడించకూడదు. సమీక్షలసేకరణ పక్షపాతరహితంగా ఉండాలి. చదవండి: మూన్‌లైటింగ్: 81 శాతం ఉద్యోగులు స్పందన ఇదే.. సర్వేలో షాకింగ్ విషయాలు! -
రివ్యూయర్లూ.. బహుపరాక్, తప్పుడు రివ్యూ రాస్తే మరణమే..!
సినిమా రిలీజైతే సమీక్షకులు స్టార్లు ఇస్తారు. కాని ఒక సీరియల్ కిల్లర్ బయల్దేరి ఆ రివ్యూలు రాసే వారిని హత్య చేసి వారి నుదుటిన స్టార్లు ఇస్తుంటే? మనం నమ్మినా నమ్మకపోయినా ‘రివ్యూల మాఫియా’ ఒకటి ఉంది.మంచి సినిమాలు చెత్త రివ్యూలను పొందితే ఆ దర్శకుడికి ఎంత బాధ? అలాంటి వాడు సీరియల్ కిల్లర్‌గా మారితే? ఊహ కొంచెం అతిగా ఉన్నా దర్శకుడు బాల్కి ఈ సినిమా తీశాడు.సన్నిడియోల్, పూజా భట్, దుల్కర్ సల్మాన్ నటించారు.వచ్చే వారమే ‘చుప్’ విడుదల.రివ్యూయర్లూ... బహుపరాక్! అన్నట్టు నాడు ‘కాగజ్ కే ఫూల్’ సినిమా మీద చెత్త రివ్యూలు రాయడం వల్ల సినిమాలే మానుకున్న గురుదత్‌కు ఈ సినిమా నివాళి. బహుశా ఈ సినిమా రివ్యూయర్ల బాధితులందరి ఒక సృజనాత్మక ప్రతీకారం. కష్టపడి నెలల తరబడి సినిమా తీస్తే, రెండు గంటల పాటు హాల్లో చూసి ఆ వెంటనే తీర్పులు చెప్పేసి ‘సినిమా చూద్దామనుకునేవాళ్లను’ ఇన్ఫ్లూయెన్స్ చేసే రివ్యూయర్ల మీద బదులు తీర్చుకుందామని ఎవరైనా అనుకుని ఉంటే, కనీసం ఊహల వరకు వారిని సంతృప్తిపరిచే పని దర్శకుడు బాల్కి నెత్తికెత్తుకున్నాడు. బాల్కి అంటే ‘చీనీ కమ్’, ‘పా’, ‘పాడ్మేన్’ వంటి సినిమాల దర్శకుడు. ఇప్పుడు ‘చుప్’ సినిమా తీశాడు. సెప్టెంబర్ 23 విడుదల. సన్ని డియోల్, పూజా భట్ వంటి సీనియర్లు, దుల్కర్ సల్మాన్ వంటి యువ స్టార్లు ఈ సినిమాలో ఉన్నారు. ఇది ‘సైకలాజికల్ థ్రిల్లర్’. ‘రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఇక్కడ ఆర్టిస్ట్ అంటే కళాకారుడు అని అర్థం. యూట్యూబ్‌లో ఉన్న ట్రైలర్లో సీరియల్ హంతకుడు రివ్యూయర్లను చంపడం, వారి నుదుటి మీద స్టార్లు ఇవ్వడం కనిపిస్తుంది. ఆ సీరియల్ కిల్లర్ పాత్రను పోషించిందెవరో ఇప్పటికి సస్పెన్స్. సన్ని డియోల్ మాత్రం పోలీస్ ఆఫీసర్‌గా చేశాడు. పూజా భట్ నిర్మాతగానో అలాంటి పాత్రగానో కనిపిస్తోంది. దుల్కర్ పాత్ర ఏమిటనేది తెలియడం లేదు. రివ్యూయర్‌ను చంపుతున్న సీరియల్ కిల్లర్ ‘స్టార్లు ఇవ్వడం కాదు. సినిమాను ప్రేక్షకులు అర్థం చేసుకోవడంలో సాయం చేయ్. అంతే తప్ప నోటికొచ్చినట్టు రాయడం కాదు’ అంటుంటాడు. అంటే ఇదంతా అరాకొరా జ్ఞానంతో రివ్యూలు రాసేవారి భరతం పట్టడం అన్నమాట. ఊరికే ఉండాలా? సినిమా ఎలా ఉన్నా ఊరికే (చుప్) ఉండాలా? అలా ఉండాల్సిన పని లేదు. కాని ఒక సినిమాను సరిగ్గా అర్థం చేసుకుని సరిగ్గా వ్యాఖ్యానం చేస్తున్నామా? సినిమాకు మేలు చేసేలా వ్యాఖ్యానం ఉందా... కళాకారుల కళను ఎద్దేవా చేసేలా ఉందా? అనాలోచితంగా వ్యాఖ్యలు చేస్తే అవి సినిమాను దెబ్బ తీస్తే బాధ్యులు ఎవరు? విమర్శ కూడా సినిమా తీసిన వారిని ఆలోచింప చేసేలా ఉండాలి కాని బాధ పెట్టేలా ఉండొచ్చా? మాటలు పెట్టే బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో ఎవరైనా అంచనా కట్టగలరా? మాటలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి. అందుకే ‘తెలిస్తే మాట్లాడండి. లేకుంటే నోర్మూసుకొని ఉండండి’ అనే అర్థంలో బాల్కి ఈ సినిమా తీశాడు. ట్రైలర్‌కి ఒక రివ్యూయర్ (లంచం తీసుకుని) చెత్త సినిమాకు నాలుగు స్టార్లు ఇస్తే అలాంటి వాణ్ణి కూడా సీరియల్ కిల్లర్ చంపుతూ కనపడతాడు. అంటే బాగున్న సినిమాను చెత్త అన్నా, చెత్త సినిమాను బాగుంది అన్నా ఈ సీరియల్ కిల్లర్ బయలుదేరుతాడన్నమాట. సోషల్ మీడియా చేతిలోకి వచ్చాక ప్రతి ఒక్కరూ రివ్యూయర్ అవతారం ఎత్తుతున్నారు. సినిమా వాళ్లు చికాకు పడుతున్నారు. ‘చుప్’ చూశాక వీరంతా ఏమంటారో... ప్రేక్షకులు ఏ తీర్పు ఇస్తారో చూడాలి. గురుదత్ బాధకు జవాబు దర్శకుడు బాల్కి నాటి గొప్ప దర్శకుడు గురుదత్‌కు అభిమాని కావచ్చు. గురుదత్ తీసిన ‘కాగజ్ కే ఫూల్’ (1959) బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. అది మన దేశంలో తొలి సినిమాస్కోప్ చిత్రం. అంతే కాదు గురుదత్ తన మేధను, డబ్బును, గొప్ప సంగీతాన్ని, కళాత్మక విలువలను పెట్టి తీసిన చిత్రం. కాని రిలీజైనప్పుడు విమర్శకులు ఘోరంగా చీల్చి చెండాడారు ఆ సినిమాను. దాంతో ప్రేక్షకులు కూడా సినిమాను అర్థం చేసుకోలేక రిజెక్ట్ చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న గురుదత్ను ఈ ఫలితం చావుదెబ్బ తీసింది. ఆ తర్వాత అతను జడిసి మరే సినిమాకూ దర్శకత్వం వహించలేదు. కుంగిపోయాడు కూడా. కాని ఆశ్చర్యం ఏమిటంటే కాలం గడిచే కొద్దీ ‘కాగజ్ కే ఫూల్’ క్లాసిక్‌గా నిలిచింది. దేశంలో తయారైన గొప్ప సినిమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. తన కాలం కంటే ముందు తీసిన సినిమాగా సినిమా పండితులు వ్యాఖ్యానిస్తారు. ప్రపంచ దేశాల్లో సినిమా విద్య అభ్యసించేవారికి అది సిలబస్‌గా ఉంది. బాల్కీ అభ్యంతరం అంతా ఇక్కడే ఉంది. ‘కాగజ్ కే ఫూల్ రిలీజైనప్పుడు విమర్శకులు కొంచెం ఓర్పు, సహనం వహించి అర్థం చేసుకుని ఉంటే గురుదత్‌కు ఆ బాధ, సినిమాకు ఆ ఫలితం తప్పేవి’ అంటాడు. ఆ సినిమాను చంపిన రివ్యూయర్లపై ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికన్నట్టుగా ‘చుప్’ తీశాడు. గురుదత్ సినిమాల్లోని పాటలే ఈ సినిమాలో వాడాడు. -
రీల్స్‌తో 3 కోట్లు గెలవాలనుకుని చివరికీ ఏమయ్యారు.. 'ఎస్కేప్ లైవ్' రివ్యూ
టైటిల్: ఎస్కేప్ లైవ్ (హిందీ వెబ్ సిరీస్) నటీనటులు: సిద్ధార్థ్, ఆకాంక్ష సింగ్, సుమేధ్ ముద్గాల్కర్, రిత్విక్ సాహోర్, ఆద్య శర్మ, ప్లబితా, రోహిత్ చందేల్, జావేద్ జాఫెరి తదితరులు దర్శకత్వం: సిద్ధార్థ్ కుమార్ తవారీ విడుదల తేది: మే 20 (7 ఎపిసోడ్స్) & మే 27 (2 ఎపిసోడ్స్) ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ టాలీవుడ్లో లవర్ బాయ్‌గా ముద్ర వేసుకున్నాడు సిద్ధార్థ్. 'బొమ్మరిల్లు'తో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ చాలా గ్యాప్ తర్వాత 'మహాసముద్రం' సినిమాతో అలరించాడు. ఈ యంగ్ హీరో తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఓటీటీ డెబ్యుగా వచ్చిన వెబ్ సిరీస్ ఎస్కేప్ లైవ్. సిద్ధార్థ్ కుమార్ తివారి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్పెషల్స్ నిర్మించింది. మే 20న విడుదలైంది. రీల్స్, సోషల్ మీడియాతో వచ్చే డబ్బు కోసం యువత ఏం చేస్తుందనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ 'ఎస్కేప్ లైవ్' వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కృష్ణ స్వామి తల్లి, చెల్లితో కలిసి నివసిస్తాడు. తండ్రి లేకపోవడంతో కుటుంబ బాధ్యతలను తీసుకుంటాడు. తన అర్హతకు తగిన ఉద్యోగం దొరక్కపోవడంతో 'ఎస్కేప్ లైవ్' అనే వీడియో షేరింగ్ యాప్‌లో మోడరేటర్‌గా జాయిన్ అవుతాడు. ఎస్కేప్ లైవ్ యాప్ తన పాపులారిటీ పెంచుకునేందుకు ఒక కాంటెస్ట్ నిర్వహిస్తుంది. యాప్ యూజర్స్ వివిధ రకాల వీడియోలు చేసి అప్లోడ్ చేస్తే వారికి డైమండ్స్ వస్తాయి. అవి క్యాష్ రూపంలో వారి అకౌంట్‌కు చేరతాయి. ఈ క్రమంలోనే ఒక డేట్ వరకు ఎక్కువ డైమండ్స్ గెలుచుకున్న వారికి రూ. 3 కోట్లు ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటిస్తారు ఎస్కేప్ లైవ్ నిర్వాహకులు. ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్న యాజర్స్ ఆ డబ్బు కోసం ఎంతకు తెగించారు ? యాప్ కాన్సెప్ట్ నచ్చని కృష్ణ ఏం చేశాడు ? ఆ సమయంలో కృష్ణ ఎదుర్కున్న పరిస్థితులు ఎంటీ ? అందులో పాల్గొన్న ఐదుగురు కంటెస్టెంట్లు చివరికి ఏమయ్యారు ? ఆ రూ. 3 కోట్లను ఎవరు గెలుచుకున్నారు ? అనేది తెలియాలంటే కచ్చితంగా ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: ప్రస్తుతం యూత్ ఫాలో అవుతున్న రీల్స్, టకా టక్, జోష్, మోజో, చింగారీ వంటితదితర యాప్స్ యూత్‌ను, పిల్లలను ఎలా ప్రభావితం చేస్తాయో కళ్లకు కట్టినట్లు చూపించారు డైరెక్టర్ సిద్ధార్థ్ కుమార్ తివారీ. నిత్యం సమాజంలో చూసే అనేక విషయాలను సిరీస్ ద్వారా చూపించారు. సోషల్ మీడియాతో మనీ, ఫేమ్ సంపాదించుకోవాలనుకున్న యువత ఎలాంటి చర్యలకు పాల్పడుతుంది ? చివరికీ ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లాల్సి వస్తుందనే డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు డైరెక్టర్. ఆయన అనుకున్నది ప్రేక్షకులకు చూపించడంలో కూడా సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా ఇందులో ఒక పాత్రలో కూడా నటించారు సిద్ధార్థ్ కుమార్ తివారీ. సిరీస్‌లోని 5 ప్రధాన పాత్రలు, వారి నేపథ్యాన్ని చూపిస్తూ ప్రారంభించారు. అది కొంచెం సాగదీతగా అనిపిస్తుంది. కానీ కథ పరంగా అలా చూపించడం తప్పదు. ఇక ఎస్కేప్ లైవ్ యాప్ కాంటెస్ట్ కోసం ఐదుగురు చేసే ప్రయత్నాలు, వారి జీవిత కథలు ఆకట్టుకుంటాయి. యాప్ ఎదుగుదల కోసం కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తాయనే విషయాలు బాగా చూపించారు. సిరీస్‌లో అక్కడక్కడా వచ్చే అశ్లీల సన్నివేశాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ అవి రియల్ లైఫ్‌లో జరిగే సంఘటనలని ఒప్పుకోక తప్పదు. నైతికత విలువలతోపాటు జెండర్ వివక్షతను చూపించారు. మంచి థ్రిల్లింగ్‌గా సాగుతున్న స్టోరీలో అక్కడక్కడా కుటుంబంతో ఉన్న ప్రధాన పాత్రల సన్నివేశాలు (ఎపిసోడ్ 5) కొద్దిగా బోర్ కొట్టిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోపాటు అప్పుడప్పుడు వచ్చే పాటలు ఆకట్టుకున్నాయి. ఎవరెలా చేశారంటే? సిద్ధార్థ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సాంప్రదాయ కుటుంబంలో పెరిగిన యువకుడిగా, యాప్ నిర్వాహకులు చేస్తున్న పని నచ్చని, దాన్ని ఆపాలనే సిటిజన్‌గా బాగా నటించాడు. అయితే మిగతా ఐదు ప్రధాన పాత్రలతో పోల్చుకుంటే సిద్ధార్థ్ క్యారెక్టర్ డెప్త్ తక్కువగా అనిపిస్తుంది. తన సిస్టర్ బాయ్‌ఫ్రెండ్ విషయంలో సిద్ధార్థ్ చేసే పని కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇక మిగతా క్యారెక్టర్లైనా డ్యాన్స్ రాణి (బేబీ ఆద్య శర్మ), ఫెటీష్ గర్ల్ (ప్లబితా), ఆమ్చా స్పైడర్ (రిత్విక్ సాహోర్), రాజ్ కుమార్ రోహిత్ చందేల్ నటన సూపర్బ్‌గా ఉంది. ముఖ్యంగా ఆద్య శర్మ డ్యాన్స్‌లు బాగా ఆకట్టుకుంటాయి. ఇక సైకో వ్యక్తిగా డార్క్ ఏంజిల్ పాత్రలో సుమేధ్ ముద్గాల్కర్ అదరగొట్టాడు. సిరీస్‌కు అతడి యాక్టింగ్ హైలెట్ అని చెప్పవచ్చు. రాధా క్రిష్ణ సీరియల్లో కృష్ణుడిగా సుమేధ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇందులో రాధగా నటించిన మల్లికా సింగ్ కూడా సిద్ధార్థ్ చెల్లెలుగా శ్రీని పాత్రలో అలరించింది. పోలీస్ ఆఫిసర్‌గా ఆకాంక్ష సింగ్ పర్వాలేదనిపించింది. మిగతా నటీనటులు కూడా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారనే చెప్పవచ్చు. ఫైనల్‌గా సిరీస్ గురించి చెప్పాలంటే కొంచెం ఓపిక తెచ్చుకోనైన సరే కచ్చితంగా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. చివరి ఎపిసోడ్లో కొన్ని విషయాలకు క్లారిటీ ఇవ్వకుండా రెండో సీజన్ కూడా వస్తుందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
ఈ-కామర్స్ సంస్థలకు షాక్: ఫేక్ రివ్యూస్‌కు చెక్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఉత్పత్తులు, సర్వీసులను కొనుగోలు చేసేలా వినియోగదారులను తప్పుదోవ పట్టించేటువంటి రివ్యూలను... ఈ-కామర్స్ సైట్లలో కట్టడి చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అడ్వర్టైజింగ్ ప్రమాణాల మండలితో (ఏఎస్సీఐ) కలిసి ఈ-కామర్స్ కంపెనీలు, సంబంధిత వర్గాలతో వినియోగదారుల వ్యవహారాల శాఖ శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించనుంది. నకిలీ, తప్పుదోవ పట్టించే రివ్యూల ప్రభావాలు, అలాంటి వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇందులో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనాలంటూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈ–కామర్స్ దిగ్గజాలతో పాటు వినియోగదారుల ఫోరమ్‌లు, లాయర్లు, ఫిక్కీ, సీఐఐ వంటి పరిశ్రమ వర్గాలకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ లేఖలు రాశారు. యూరోపియన్ యూనియన్‌లో 223 బడా వెబ్సైట్లలో ఆన్లైన్ రివ్యూలపై జరిగిన సమీక్ష వివరాలను వాటిలో ప్రస్తావించారు. స్క్రీనింగ్ ఫలితాల ప్రకారం దాదాపు 55 శాతం వెబ్సైట్లు ఈయూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తేలింది. దేశీయంగా ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగే కొద్దీ ఆన్లైన్ కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయని సింగ్ తెలిపారు. అయితే, ఈ-కామర్స్ సైట్లలో కనిపించే నకిలీ రివ్యూల వల్ల వినియోగదారులు పలు సందర్భాల్లో నష్టపోవాల్సి వస్తోందని సింగ్ వివరించారు. -
నకిలీ రివ్యూల కట్టడిపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఉత్పత్తులు, సర్వీసులను కొనుగోలు చేసేలా వినియోగదారులను తప్పుదోవ పట్టించేటువంటి రివ్యూలను.. ఈ–కామర్స్ సైట్లలో కట్టడి చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అడ్వర్టైజింగ్ ప్రమాణాల మండలితో (ఏఎస్సీఐ) కలిసి ఈ–కామర్స్ కంపెనీలు, సంబంధిత వర్గాలతో వినియోగదారుల వ్యవహారాల శాఖ శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించనుంది. నకిలీ, తప్పుదోవ పట్టించే రివ్యూల ప్రభావాలు, అలాంటి వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇందులో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనాలంటూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈ–కామర్స్ దిగ్గజాలతో పాటు వినియోగదారుల ఫోరమ్‌లు, లాయర్లు, ఫిక్కీ, సీఐఐ వంటి పరిశ్రమ వర్గాలకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ లేఖలు రాశారు. యూరోపియన్ యూనియన్‌లో 223 బడా వెబ్సైట్లలో ఆన్లైన్ రివ్యూలపై జరిగిన సమీక్ష వివరాలను వాటిలో ప్రస్తావించారు. స్క్రీనింగ్ ఫలితాల ప్రకారం దాదాపు 55 శాతం వెబ్సైట్లు ఈయూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తేలింది. దేశీయంగా ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగే కొద్దీ ఆన్లైన్ కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయని సింగ్ తెలిపారు. అయితే, ఈ–కామర్స్ సైట్లలో కనిపించే నకిలీ రివ్యూల వల్ల వినియోగదారులు పలు సందర్భాల్లో నష్టపోవాల్సి వస్తోందని సింగ్ వివరించారు. -
చైనాకు అమెజాన్ భారీ షాక్
ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్.. చైనాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. తన ప్లాట్‌ఫామ్ నుంచి చైనాకు చెందిన 3,000 ఆన్లైన్ స్టోర్లను మూసేస్తున్నట్లు(తొలగిస్తున్నట్లు) ప్రకటించింది. అంతేకాదు ఇవి ప్రమోట్ చేసిన 600 చైనా బ్రాండ్లను సైతం ప్రొడక్ట్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్, చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకుంటోందా?.. అంటే అవుననే అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఫేక్ రివ్యూలతో ప్రొడక్టులను ప్రమోట్ చేస్తున్న ఆన్లైన్ స్టోర్లను మూసేస్తున్నట్లు(యాప్ నుంచి తొలగిస్తున్నట్లు), 600 బ్రాండ్లను తీసేస్తున్నట్లు ప్రకటించి చైనాకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ హఠాత్ నిర్ణయంతో సుమారు 130 మిలియన్ల రెన్మింబి (చైనీస్ యువాన్) నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఫేక్ రివ్యూలతో పాటు ఇతరత్రా నిబంధనలను ఉల్లంఘించినందుకు తొలగించినట్లు తెలిపింది. ‘మేడ్ ఇన్ చైనా.. సోల్డ్ ఇన్ అమెజాన్’ పేరుతో ఏర్పాటైన మర్చంట్ కమ్యూనిటీ ఈ తతంగాన్ని ఇంతకాలం నడిపిస్తూ వస్తోంది. ఇదంతా వినియోగదారుల సమీక్ష ఉల్లంఘన కిందకు వస్తుందని అమెజాన్ పేర్కొంది. నిజానికి చైనా యాప్‌ల విషయంలో అమెజాన్ ఇలా కఠినంగా వ్యవహరించడం ఇదేం కొత్త కాదు. న్యాయపరమైన చర్యలు కూడా.. ప్రోత్సాహక రివ్యూలను 2016 నుంచి అమెజాన్ సంస్థ బ్యాన్ చేసింది. అంతేకాదు అలాంటి ఉల్లంఘనలను నిరంతరం పర్యవేక్షిస్తోంది కూడా. అయినప్పటికీ చైనా మార్కెట్లో ఇలాంటి వ్యవహారాలు సర్వసాధారణం అయ్యాయి. అయితే అమెజాన్ మాత్రం ఇలాంటి చర్యల్ని ఉపేక్షించకూడదని నిర్ణయించుకుంది. ఈ ఏడాది మే నుంచి రంగంలోకి దిగి.. చర్యలను మొదలుపెట్టింది. దీనివల్ల వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడిందని ట్రేడ్ గ్రూప్ షెంజెన్ క్రాస్ బార్డర్ ఈ-కామర్స్ అసోషియేషన్ వెల్లడించింది. అయితే ప్రస్తుతం తీసుకున్న చర్యలు.. మునుపటి కంటే తీవ్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. సస్పెండ్, బ్యాన్‌తో పాటు న్యాయపరమైన చర్యలకు సిద్ధపడుతోంది అమెజాన్. అమెజాన్ కాకుంటే ఇంకొకటి.. అయితే అమెజాన్ చర్యలు.. చైనా ఈ-కామర్స్ మార్కెట్‌పై ప్రభావం చూపెట్టకపోవచ్చని చైనా మీడియా హౌజ్ వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. చైనా తొలగించిన ఆన్లైన్ స్టోర్లు, బ్రాండ్లు.. ఈబే, అలీఎక్స్‌ప్రెస్ వైపు మళ్లుతున్నట్లు చెబుతోంది. ఇక అమెజాన్ సైతం ఈ వివాదంపై స్పందించింది. అమెజాన్ కేవలం చైనాను మాత్రమే టార్గెట్ చేయలేదని.. మిగతా దేశాల్లోనూ ఈ తరహా చర్యలు చేపట్టినట్లు అమెజాన్ ఆసియా గ్లోబల్ సెల్లింగ్ వైస్ ప్రెసిడెంట్ సిండీ థాయ్ వెల్లడించారు. తమ నిర్ణయం చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందన్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ చెప్తున్నారామె. ఈ పోటాపోటీ స్టేట్మెంట్ల నడుమ మిలియన్ల విలువ చేసే చైనీస్ ఆన్లైన్ స్టోర్ల ఫండ్స్‌ను అమెజాన్ నిలిపివేయడం ఆసక్తికర పరిణామం అనే చెప్పొచ్చు. చదవండి: ఈ ఏడాది ఎక్కువ నష్టపోయింది చైనావోడే! -
గాడ్జెట్ మహిమ, వంటకం ఏదైనా చిటికెలో చేయెచ్చు...!
చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్స్‌కి చాలా చక్కగా, అనువుగా ఉండే ఈ ఫ్యామిలీ సైజ్ ఓవెన్.. ఎయిర్ ఫ్రైయర్లా కూడా పనిచేస్తుంది. డిజిటల్ టచ్‌స్క్రీన్ తో ఆయిల్‌లెస్ రుచులని అందిస్తుంది. చికెన్, ఫిష్, పిజ్జా, కేక్, స్టిక్స్, వింగ్స్, కుకీస్, ఫ్రెంచ్‌ఫ్రైస్ ఇలా చాలానే చేసుకోవచ్చు. 1700గి సామర్థ్యం కలిగిన ఈ మేకర్‌కి ముందు భాగంలో దానికి ఆనుకునే గుండ్రటి మూత ఉంటుంది. దాన్ని పైనుంచి కిందకు ఓపెన్ చేసుకోవచ్చు. లోపల ట్రాన్స్పరెంట్ బౌల్ పెట్టుకుని.. మూడు సొరుగులుగా గ్రిల్ ప్లేట్స్ అమర్చి, వాటిపై ఆహారాన్ని బేక్ చేసుకోవచ్చు. ఇందులో 3600ఊ వద్ద పిజ్జా 10 నిమిషాలు, కూరగాయలు 12 నిమిషాలు, ఫిష్ 15 నిమిషాలు, కేక్ 30 నిమిషాలు సమయం పడుతుంది. 4300ఊ వద్ద.. పాప్‌కార్న్ 8 నిమిషాలు, చికెన్ వింగ్స్ 10 నిమిషాలు, ఫ్రెంచ్‌ఫ్రైస్ 20 నిమిషాలు, హోల్ చికెన్ 30 నిమిషాలు సమయం తీసుకుంటాయి. అధిక–నాణ్యత గల మెటీరియల్‌తో రూపొందిన చికెన్ ఫోర్క్, డిప్ ట్రే, రొటేటింగ్ బాస్కెట్, ఎయిర్ ఫ్లో రాక్స్, మెస్ బాస్కెట్ వంటివన్నీ మేకర్‌తో పాటు లభిస్తాయి. ఈ గాడ్జెట్ 80 శాతం నూనె వాడకాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఆప్షన్స్ అన్నీ మేకర్ ముందువైపు డిస్ప్లేలో బొమ్మలతో సహా వివరంగా కనిపిస్తుంటాయి. దాంతో దీన్ని ఆపరేట్ చెయ్యడం ఎవరికైనా సులభమే. -
కష్టం వృథా కాలేదు – తమ్మారెడ్డి భరద్వాజ
‘‘నా నలభైఏళ్ల కెరీర్లో నాకు గుర్తుండిపోయే చిత్రం ‘పలాస’. ఈ సినిమాలో నటీనటుల అద్భుతమైన హావభావాలకు ప్రేక్షకులు మైమరచిపోతున్నారు. అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. మా కష్టం వృథా కాలేదని భావిస్తున్నాను’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ నెల 6న విడుదలైంది. తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రక్షిత్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకు మంచి రివ్యూస్ రావడం హ్యాపీ. సినిమాలోని ప్రతి సన్నివేశం గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడం చూస్తుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా విజయం మరిన్ని మంచి సినిమాలు చేయడానికి ధైర్యాన్నిచ్చింది’’ అన్నారు కరుణకుమార్. ‘‘దర్శకుడి ఆలోచన, నిర్మాత ప్రయత్నం సినిమాను నిలబెట్టాయి. నటీనటుల పాత్రలతో పాటు నా పాత్రకూ మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు సంగీత దర్శకుడు–నటుడు రఘుకుంచె. ‘‘పలాస’లాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు హీరోయిన్ నక్షత్ర. -
పకడ్బందీగా ఇంటర్ పరీక్షల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి తెలిపారు. పరీక్షలను సమర్ధవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మెరుగైన పద్ధతులను అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 8:45 గంటల నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా వెంటనే పరిష్కరించేందుకు వీలుగా ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, దానికి నోడల్ ఆఫీసర్‌ను నియమిస్తామన్నారు. ఏ సమస్య వచ్చినా 040–24601010, 040–24732369, 040–24655027 నెంబర్లలో సంప్రదించాలని, నోడల్ అధికారి పరిష్కరిస్తారన్నారు. పరీక్షల నిర్వహణ సజావుగా సాగేందుకు జిల్లా కలెక్టర్లు తగిన శ్రద్ధ వహించాలని ఆదేశించారు. çపరీక్షా కేంద్రాలన్నింటిలోనూ కనీస సౌకర్యాలు కల్పించాలని మంత్రి స్పష్టం చేశారు. 20లోగా నివేదిక ఇవ్వండి జిల్లాల్లో ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై చెక్ లిస్టు ప్రకారం ఈనెల 20లోగా నివేదికలు అందజేయాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ కోరారు. ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలకు సరైన భద్రత కల్పించే విషయంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎస్పీలు పర్యవేక్షించాలన్నారు. 9,65,840 మంది విద్యార్థులు హాజరయ్యే ఈ ప రీక్షలకు 1,339 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో 50 ప్లయింగ్ స్క్వాడ్లు, 200 సిట్టింగ్ స్క్వాడ్లు, 24,750 మం ది ఇన్విజిలేటర్లు పాల్గొంటారన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇంటర్మీడియెట్ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు. -
‘మత్తు వదలరా’ మూవీ రివ్యూ
చిత్రం: మత్తు వదలరా జానర్: సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ నటీనటులు: శ్రీసింహా, వెన్నెల కిశోర్, సత్య, అగస్త్య, బ్రహ్మాజీ సంగీతం: కాలభైరవ దర్శకత్వం: రితేష్ రానా బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత డైరెక్టర్, సంగీత దర్శకుడు, సింగర్, రచయిత, నిర్మాత, లైన్ ప్రొడ్యూసర్, కాస్టూమ్ డిజైనర్ ఇలా ఆ కుటుంబంలో ఓ సినిమాకు ప్రధానమైన టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు. కానీ ఒక్క హీరో తప్ప. ఇక ఇప్పుడు ఈ లోటు కూడా తీరబోతుంది. హీరో లేడనే లోటును భర్తీ చేయడానికి ఆకాశమంత ఆ కుటుంబం నుంచి కూడా ఓ వారసుడు వచ్చేశాడు. దిగ్గజ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి చిన్న తనయుడు శ్రీసింహా హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా బుధవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లతో చిత్రంపై భారీ అంచనాలే నమోదయ్యాయి. ఇక దాదాపు అందరు కొత్తవాళ్లతో ప్రయోగాత్మకంగా నిర్మించిన చిత్రం ఆడియన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుంది? అందరి అంచనాలను ఈ చిత్రం అందుకుందా? రాజమౌళి కుటుంబం నుంచి వచ్చిన నయా హీరో, మ్యూజిక్ డైరెక్టర్‌ను ప్రేక్షకులు ఆదరించారా? అనేది రివ్యూలో చూద్దాం. కథ: బాబు మోహన్ (శ్రీసింహా), ఏసుదాస్ (సత్య), అభి (అగస్త్య)లు రూమ్మేట్స్. బాబు, ఏసుదాస్‌లు డెలీవరీ బాయ్స్‌గా పనిచేస్తూ చాలిచాలని జీతంతో కాలం వెల్లదీస్తుంటారు. అయితే జీతం, జీవితంపై అసహనం చెందిన బాబుకు ఏసుదాస్ ఓ ఉచిత సలహా ఇస్తాడు. ఆ సలహా పాటించిన బాబు అనుకోని చిక్కుల్లో పడతాడు. ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఈ కేసు నుంచి బయటపడటానికి, హత్యచేసింది ఎవరో తెలుసుకోవడానికి బాబు చేసిన ప్రయత్నమే సినిమా కథ. అయితే ఈ కథలో రాజు (వెన్నెల కిశోర్), కానిస్టేబుల్ బెనర్జీ (బ్రహ్మాజీ), మైరా, తేజస్వి (అజయ్)లు ఎందుకు ఎంటర్ అవుతారు? అసలు ఆ హత్య ఎవరు చేశారు? ఏసుదాస్ ఇచ్చిన ఆ ఉచిత సలహా ఏంటి? మూవీ టైటిల్‌తో కథకు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నటీనటులు: రాజమౌళి కుటుంబం నుంచి వచ్చిన వారసుడు శ్రీసింహా తన తొలి సినిమాతోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. భయం, కోపం, ప్రస్టేషన్స్, ఆనందం ఇలా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో హీరో పలికించాల్సిన అన్ని భావాలను అవలీలగా పలకించాడు. ఇక ఈ సినిమాతో టాలీవుడ్‌కు నటనపరంగా మరో హీరో దొరికినట్లే. ఇక సత్య కామెడీ టైమింగ్ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. ఏ సమయంలో కూడా సత్య కామెడీ చికాకు తెప్పించదు. సినిమాకు సత్య కామెడీ మరింత బూస్టప్‌గా నిలిచింది. వెన్నెల కిశోర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో ఎవరూ ఊహించని వినూత్న పాత్ర పోషించిన వెన్నెల కిశోర్ తన అనుభవంతో అవలీలగా నటించాడు. అగస్త్య, తదితర నటులు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కలుగదు జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! ప్రస్తుతం ఈ పద్య భావాన్ని మ్యూజిక్డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒకే చిత్రంతో తన ఇద్దరు కుమారులు టాలీవుడ్ అరంగేట్రం చేసి ఆకట్టుకున్నారు. మెప్పించారు. ప్రశంసలు అందుకుంటున్నారు. దీంతో కీరవాణి కుటుంబం డబుల్ హ్యాపీ అని చెప్పవచ్చు. నటుడిగా శ్రీసింహా, మ్యూజిక్ డైరెక్టర్‌గా కాల భైరవలు తమ తొలి సినిమాతో రాజమౌళి కుటుంబానికి ఎలాంటి మచ్చ తీసుకరాలేదు. వీరిద్దరితో ఆ కుటంబం కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం కథ, కథనం. ఈ రెండు విషయాల్లో చిత్ర యూనిట్ ముఖ్యంగా దర్శకుడు ఎక్కడా తడబడలేదు. తెర మీద ఆట ప్రారంభమైన 15 నిమిషాల్లోనే సినిమా నేరుగా అసలు కథలోకి ప్రవేశిస్తుంది. సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ ఈ మూడు అంశాలను ప్రధానంగా తీసుకుని కథ ఎక్కడా డీవియేట్ కాకుండా డైరెక్టర్ జాగ్రత్తలు తీసుకున్నాడు. నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే ఉత్సాహం, ఆసక్తి సగటు ప్రేక్షకుడికి కలిగించడంతో పాటు ఆరోగ్యకరమైన కామెడీ అందించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. కమర్షియల్ హంగుల జోలికి పోకుండా కథానుగుణంగా సినిమాను ముందుకు నడింపించాడుదర్శకుడు రితేష్ రానా. క్లైమాక్స్ వరకు కూడా సస్పెన్స్‌ను రివీల్ కాదు. అంతేకాకుండా ఎవరి ఊహకందని కామెడీ క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది. సంగీతదర్శకుడిగా మరో అవతారం ఎత్తిన సింగర్ కాల భైరవ తన తొలి సినిమాలోనే తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడు. ఈ మూవీకి మరో మేజర్ ప్లస్ పాయింట్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్. సినిమాలో వచ్చే ప్రతీ సిచ్యూవేషన్‌కు తగ్గట్టు వినూత్న రీతిలో కొత్త బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు ఈ యువ సంగీత దర్శకుడు. ముఖ్యంగా కామెడీగా వచ్చే కొన్ని సౌండ్స్ కేక అని చెప్పాలి. ఇక దర్శకుడు ఆలోచనలను తెరమీద దృశ్యరూపంలో ఎలాంటి గందరగోళం లేకుండా చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు సినిమాటోగ్రఫర్. విజువలైషన్స్ కూడా చాలా కొత్తగా వండర్‌గా అనిపిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణవిలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే కొత్తదనం కోరుకునే వారికి ఈ సినిమా సూపర్బ్‌గా నచ్చుతుంది. వినూత్న కథలను, కొత్త కాన్సెప్ట్‌లను ఎల్లప్పుడూ ఎంకరేజ్ చేసే తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి. ఫైనల్‌గా కొత్త వాళ్లు.. కొత్త ప్రయత్నం.. కొత్తగా, గ‘మ్మత్తు’గా ఉంది. ప్లస్ పాయింట్స్: శ్రీసింహా నటన సత్య కామెడీ కాల భైరవ మ్యూజిక్ కథనం సినిమాలో కొత్తదనం మైనస్ పాయింట్స్: కమర్షియల్, మాస్ ఎలిమెంట్స్ లేకపోవడం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
ఏపీ బడ్జెట్‌పై అర్థిక మంత్రి బుగ్గన రాజేండ్రనాథ్ సమీక్షలు
-
రేపటి నుంచి వైఎస్ జగన్ సమీక్షలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనపై దృష్టి పెట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్న భోజన పథకంపై అక్షయపాత్ర ఫౌండేషన్, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తేవాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. ప్రతీ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మొగ్గు చూపేలా పాఠశాలలు తీర్చిదిద్దాలని.. స్కూల్స్‌లో అవసరం అయిన అన్ని మౌలిక సదుపాయాలు, వసతులు వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భోజనం, తాగునీరు, వసతులు అన్ని పకడ్బందీగా ఉండాలన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీపడద్దు, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు సౌకర్యవంతమైన వంటశాలలు నిర్మించాలన్నారు. ఇది ప్రాథమిక సమావేశమని, మళ్లీ సమావేశం లోపు పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని రావాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. రేపటి నుంచి శాఖల వారీగా ముఖ్యమంత్రి జగన్ సమీక్షలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం ఆర్థిక, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరపనున్నారు. జూన్ 3న విద్యా, జలవనరుల శాఖలపై సమీక్ష జరుపుతారు. 4న వ్యవసాయం, గృహనిర్మాణ శాఖలపై సమీక్ష ఉంటుంది. 6న సీఆర్డీఏపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. జూన్ 8న సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అడుగుపెట్టనున్నారు. ఆ రోజు ఉదయం 8.39 గంటలకు ముఖ్యమంత్రి చాంబర్లోకి ప్రవేశించనున్నారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది తొలగింపు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఔట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించారు. 42 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం కార్యాలయ అధికారులనూ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. -
పిడకలపై రివ్యూలు.. నవ్వులే నవ్వులు
ఈ-కామర్స్ వెబ్సైట్ల రాకతో మనకు కావాల్సిన వస్తువులను కాలు కదపకుండా ఇంటికి తెప్పించుకునే సౌలభ్యం దొరికింది. ఆన్లైన్ ఆర్డరిస్తే చాలు కోరుకున్న వస్తువు చెంతకు వచ్చి చేరుతోంది. అయితే మనం కొనాల్సిన వస్తువు పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు రివ్యూల మీద ఆధారపడుతుంటాం. ఇలాంటి రివ్యూలే ఇప్పుడు మనకు హాస్యం పండిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లలో పిడకల మీద పెట్టిన రివ్యూలు చూస్తే కడుపు చెక్కలవాల్సిందే. హిందువులు వివిధ క్రతువుల్లో ఆవు పేడ పిడకలను వినియోగిస్తుంటారు. స్వచ్ఛమైన ఆవు పేడతో చేసిన పిడకలను ‘కౌ డంగ్ కేక్’ పేరుతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లు అమ్మకానికి ఉంచాయి. వీటి గురించి తెలియని కొంత మంది రాసిన రివ్యూలు నవ్వు తెప్పిస్తున్నాయి. ‘ఇవి చాలా బాగున్నాయి. వీటి వాసన గులాబి పూల మాదిగా ఉందని’ పేర్కొంటూ ఐదు స్టార్ల రేటింగ్ ఇచ్చారు. ‘వీటి సైజు చాలా పెద్దగా ఉంది. నోటితో కొరకడానికి వీలు కాదంటూ’ మరొకరు పేర్కొన్నారు. దీని రుచి అమోఘం అంటూ మరొకరు పొడిగారు. ‘దీన్ని కొనకండి. క్వాలిటీ, క్వాంటిటీ రెండూ బాలేదంటూ’ ఇంకొరు ఒక స్టార్ మాత్రమే రేటింగ్ ఇచ్చారు. ఈ రివ్యూలు చూసిన తర్వాత మనోళ్లంతా పగలబడి నవ్వుతున్నారు. ఇంట్లో డెకరేషన్ కోసం పిడకలు వాడతారని సదరు వెబ్సైట్లు పేర్కొనడం కొసమెరుపు. -
రివ్యూలు తారుమారు : దిగ్గజ హోటల్‌కు భారీ ఫైన్
ఏదైనా ఒక వస్తువు గురించి కానీ, ప్రాంతం గురించి కానీ, సినిమాల గురించి కానీ తెలుసుకోవాలంటే... ముందస్తుగా రివ్యూల బాట పడతాం. వాటి గురించి రివ్యూల్లో ఏం చెప్పారా? అని వెతుకులాట మీద వెతుకులాట చేపడతాం. అసలకే ఖర్చు పెట్టి వెళ్తాం. అది బాగోపోతే ఆ ఖర్చంతా వృథా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పటికే వాటి అనుభవాలను పొందిన వారు, సందర్శకులు వాటి గురించి ప్రముఖ వెబ్సైట్లలో తమ తమ రివ్యూలు ఇస్తూ ఉంటారు. వీటిని చదివే చాలా మంది నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఈ రివ్యూల్లో తమ గురించి ఎలాంటి తప్పుడు రివ్యూలు రాకుండా.. మంచిగా మాత్రమే స్పందించేలా కొన్ని యజమాన సంస్థలు జాగ్రత్త పడుతూ ఉంటాయి. తాజాగా ఆస్ట్రేలియాలో ఓ దిగ్గజం హోటల్ ఇదే పని చేసి, భారీ జరిమానాను ఎదుర్కొంది. ఎక్కువ మంది సందర్శించే పాపులర్ ట్రిప్అడ్వయిజర్ వెబ్సైట్లో తమ గురించి తప్పుడు రివ్యూలు రాకుండా.. ఆస్ట్రేలియా అతిపెద్ద హోటల్ మెరిటన్ ప్రాపర్టీ సర్వీసులు అక్రమాలకు పాల్పడింది. దీంతో వినియోగదారులు ఇచ్చే ఫిర్యాదులేమీ రివ్యూల్లో నమోదు కాలేదు. ఇలా మోసపూరితంగా.. ట్రిప్అడ్వయిజరీలో మెరిటన్ రివ్యూలను తారుమారు చేస్తుందని తేల్చిన ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు.. 2.2 మిలియన్ డాలర్లు అంటే 15 కోట్ల రూపాయల జరిమానా విధించింది. 2014 నవంబర్ నుంచి 2015 అక్టోబర్ మధ్యకాలంలో మెరిటన్ ఈ తప్పుడు కార్యకలాపాలకు పాల్పడిందని కోర్టు తెలిపింది. ఈ కంపెనీ ఆస్ట్రేలియా వినియోగదారుల చట్టంలో మొత్తం 13 ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొంది. సౌత్ వేల్స్, క్వీన్‌ల్యాండ్‌లో మొత్తం 13 ప్రాపర్టీలను ఈ హోటల్ కలిగి ఉంది. ఇలా ఉల్లంఘనలకు పాల్పడి, కేవలం మంచి రివ్యూలే సంపాదించి.. ట్రిప్అడ్వయిజర్ వెబ్సైట్లో ప్రాపర్టీ ర్యాంకును మెరుగుపరుచుకుంది. ఈ విషయం గురించి తమకు 2015 అక్టోబర్‌లో తెలిసిందని, ఈ విషయం తెలియడంతోనే వెంటనే దీనిపై విచారణకు, స్వతంత్ర నియంత్రణకు ఆదేశించినట్టు ట్రిప్అడ్వయిజర్ తెలిపింది. ఈ జరిమానాతో పాటు ట్రిప్అడ్వయిజర్కు ఇచ్చే గెస్ట్ ఈ-మెయిల్ అడ్రస్‌లను మెరిటన్ ఫిల్టర్ చేయడం, ఎంపిక చేయడంపై కోర్టు నిషేధం విధించింది. -
ఎమోషన్స్ చూడకుండా రొమాన్స్‌పై విమర్శలా?
ఆర్ఎక్స్ 100 సినిమా విజయోత్సవం నగరంలోని వుడా చిల్డ్రన్ ఎరినాలో ఆదివారం రాత్రి ఉత్సాహంగా సాగింది. హీరో హీరోయిన్లు కార్తీకేయరెడ్డి, పాయల్ రాజ్‌పుత్ డ్యాన్స్‌లు చేస్తూ, ఫొటోలకు ఫోజులు ఇస్తూ సందడి చేశారు. బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): సినిమా సమీక్ష రాసే వారికి తమ సినిమాలోని 140 నిమిషాల ఎమోషన్స్ కనిపించటం లేదు.. కేవలం 6 నిమిషలా రొమాన్స్ మాత్రమే కనిపిస్తోందంటే వాళ్ల్ల ఆలోచన ఎంత తప్పుగా ఉందో అర్థం అవుతోందని ఆర్ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మైండ్‌లో అలాంటివి లేవు కాబట్టి 140 నిమిషాల ఎమోషన్స్‌కు కనెక్ట్ అయ్యారని ఆయన అన్నారు. ఆదివారం వుడా చిల్డ్రన్ ఏరినాలో గౌరీ బాయి అసోసియేట్స్, మూన్ పవర్ ఈవెంట్స్ సంయుక్తంగా ఆర్ఎక్స్ 100 చిత్రం విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అజయ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో పాటలకు యూ ట్యూబ్‌లో కోట్ల వ్యూస్ వస్తున్నాయన్నారు. సినిమాలో రొమాన్స్ ఎందుకు అనేది సినిమా పూర్తిగా చూస్తే అర్థం అవుతుందని అలా కాకుండా నచ్చినట్లు రివ్యూలు రాసి సినిమా పరిశ్రమకు అన్యాయం చేస్తున్నారన్నారు. సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు రివ్యూలను బ్యాన్ చేయాలని మంత్రి గంటాను కోరారు. మెగాస్టార్ చిరంజీవికి మా సినిమా క్యూబ్‌ను పంపించామని ఈ రోజు మా చిత్రాన్ని ఆయన చూడటం చాలా ఆనందంగా ఉందన్నారు. మంత్రి గంటా మాట్లాడుతూ రివ్యూలను బ్యాన్ చేయాలనే ఆలోచన మంచిదని ముఖ్యమంత్రి తో చర్చించి దాన్ని అమలు చేయటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వంద శాతం సినిమా షూటింగ్ చేసే చిత్రాలకు సబ్సిడీ ఇచ్చే అంశాన్ని చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రం నిర్మాత అశోక్ రెడ్డి, కో–ప్రొడ్యూసర్లు సురేష్ రెడ్డి, రవి కుమార్‌రెడ్డి, వెంకటరెడ్డి మ్యూజిక్ డెరెక్టర్ చైతన్య భరధ్వజ్, కెమెరామెన్ రామిరెడ్డి, గౌరీబాయి అసోసియేట్స్ అధినేత శివకుమార్, మూన్ పవర్ ఈవెంట్స్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామ్‌చరణ్ నుంచి సునీల్ వరకు అందరూ మెచ్చుకున్నారు ఆర్ఎక్స్ 100 చిత్రం చూసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి హీరో సునీల్ వరకు అందరూ సినిమా బాగుందని మెచ్చుకున్నారని హీరో కార్తీకేయ రెడ్డి అన్నారు. సినిమా పరిశ్రమలో ఎవరిని ఎదగనివ్వరనే ఒక అపోహ ఉంది. కానీ అది నిజం కాదు మాకు ఎవరు అండ లేరు.. మా కథలో దమ్ము ఉంది. మేము కష్టపడి చేశాం మా చిత్రాన్ని చూసి పంపిణీదారులు ముందుకు వచ్చి విడుదల చేశారు. ఇప్పుడు ప్రేక్షకులను అదరిస్తున్నారు. ఇకనైనా రివ్యూలు రాసేవారు కచ్చితంగా రాయాలని లేకుంటే మనివేయటమే మంచిందన్నారు. వైజాగ్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని ఇక్కడ తన సినిమా విజయోత్సవం జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆర్ఎక్స్ 100 విజయోత్సవ వేదికపై మాట్లాడుతున్న మంత్రి గంటా తెలుగు సినిమాలే చేయాలని ఉంది ఇప్పటికే పంజాబీ, హిందీ సినిమాలు చేస్తున్నా అక్కడ ప్రేక్షకుల కంటే తెలుగు ప్రేక్షకులు మంచి కథలను ఆదరిస్తున్నారని అందుకే తెలుగు సినిమాలే చేయాలని తనకు ఉందని హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ అన్నారు. మొదటిసారి కథ విన్నప్పుడు ఈ రోల్ నేను చేయగలనా అనిపించింది. ఈ చిత్రంలో తన రోల్ ఛాలెజింగ్ ఉందన్నారు. జిగేలు రాణి పాటకుహీరో హీరోయిన్ల స్టెప్పులు విజయోత్సవంలో మునిగి తేలుతున్న ఆర్ఎక్స్ 100 హీరో కార్తీక్, హీరోయిన్ రాజ్‌పుత్ రంగస్థలంలోని జిగేలు రాణి పాటకు స్టేజ్‌పై డ్యాన్స్ చేసి వేదికను హోరెత్తించారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి