రేపు జగన్ రాక
సాక్షి ప్రతినిధి, కాకినాడ : సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఓటములపై సమీక్షించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే, పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ సోమవారం ‘సాక్షి’కి ఈ విషయం తెలిపారు. జగన్మోహన్రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి గౌతమి ఎక్స్ప్రెస్లో బయలుదేరి బుధవారం రాజమండ్రి చేరుకుం టారు. బుధ, గురు, శుక్రవారాల్లో శ్రీకా కుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని ప ది లోక్సభ, వాటి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు, ఓటములపై ఆయన సమీక్షిస్తారు. తాజా ఎన్నికల్లో గెలిచిన, ఓడిన అభ్యర్థులు, జిల్లాల్లోని ముఖ్యనేతలను ఈ సమీక్షలకు ఆహ్వానిస్తున్నట్టు జ్యోతుల తెలిపా రు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ఓటములపై కూడా జగన్మోహన్రెడ్డి సమీక్షిస్తారని చెప్పారు.