kakinada tour
-
కాకినాడను చిత్తశుద్ధితో అభివృద్ది చేస్తాం
-
మంత్రి లోకేశ్ మరోసారి అభాసుపాలు
కాకినాడ: సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ మరోసారి తడబడ్డారు. ఇటీవల అంబేడ్కర్ జయంతిని వర్థంతిగా పేర్కొనడమే కాకుండా, శుభాకాంక్షలు కూడా చెప్పి నవ్వులపాలైన లోకేశ్, తాజాగా మరోసారి ప్రజలు అవాక్కయ్యేలా మాట్లాడారు. నిన్న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన లోకేశ్.. పెద్దాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో పలు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కరపలో ఏర్పాటుచేసిన సభలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో ప్రతి పల్లెటూరుకు తాగునీరు లేని ఇబ్బందిని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమనడంతో సభలో జనం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. లోకేశ్ ఈ సమ యంలో ‘ఇబ్బంది.. కాదు.. కాదు’ అంటూ తడబడుతూ చివరివరకు ఒక్కో మాట వత్తి పల కడంతో సభకు హాజరైనవారు ఘొల్లున నవ్వారు. సహజంగా ఏ మంత్రయినా తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెబుతుంటారు. స్వయానా పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి అయిన సీఎం తనయుడు లోకేశ్ మాత్రం.. అసలు తాగునీరే లేకుండా ఇబ్బందులు కలుగజేస్తాననడంతో సభలో నవ్వులు విరిశాయి. అలాగే డ్వాక్రా గ్రూపులోని ఒక్కో మహిళకు రూ.7 వేలు చొప్పున ఇచ్చామని లోకేశ్ చెబుతుండగా, పక్కనే ఉన్న ఒక నాయకుడు కలుగజేసుకొని రూ.6 వేలే ఇచ్చామని చెవిలో చెప్పారు. దీంతో గొంతు సవరించుకున్న లోకేశ్ త్వరలోనే మిగిలిన రూ.4 వేలు ఇస్తామని ముక్తాయించారు. కాగా, ఇదే సభలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మరో అడుగు ముందుకేసి లోకేశ్‌ను కాబోయే ముఖ్యమంత్రి అంటూ తన స్వామిభక్తిని చాటుకునే ప్రయత్నం చేశారు. దండ వేస్తాను.. మీరంతా అక్కడే ఉండండి ఇదిలాఉండగా, కరపలో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన లోకేశ్.. అక్కడే ఉన్న డా.బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించకపోవడంపై అంబేడ్కర్ యువజన సేవా సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయాలని కోరగా.. మీరంతా అక్కడే ఉండండి, నేనొచ్చి దండ వేస్తానని లోకేశ్ వారికి బదులిచ్చాడు. దీంతో వారంతా అంబేడ్కర్ విగ్రహం వద్ద పూలదండలతో వేచిచూస్తుండగా.. లోకేశ్ మాత్రం అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆగకుండానే వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన యువజన సంఘ నాయకులు అంబేడ్కర్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నిరసనకు దిగారు. -
వెంకటరమణ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
కాకినాడ : కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ నిన్న కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆత్మహత్య చేసుకున్న కాపు ఉద్యమకారుడు వెంకట రమణమూర్తి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. కాకినాడ డైయిరీ ఫామ్ సమీపంలోని వెంకట రమణమూర్తి నివాసానికి వెళ్లిన ఆయన... కుటుంబ సభ్యుల్ని పరామర్శించి, ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అధైర్యపడొద్దని, వారి కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఏ కష్టం ఎదురైనా తాము ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎవరూ భావోద్వేగాలకు లోనై ప్రాణాలు తీసుకోవద్దని వైఎస్ జగన్ కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని అన్నారు. కాగా శ్రీకాకుళం జిల్లాలో యువభేరి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్ అక్కడ నుంచి నేరుగా కాకినాడ చేరుకున్నారు. -
ఖరారైన సీఎం చంద్రబాబు పర్యటన కార్యక్రమం
కాకినాడ సిటీ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 8న కాకినాడలో జరిపే పర్యటనకు సంబంధించిన కార్యక్రమం ఖరారైంది. ఆయన హెలికాప్టర్లో ఆ రోజు మధ్యాహ్నం 3.05 గంటలకు కాకినాడలోని పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి కారులో 3.15 గంటలకు స్థానిక పర్లోపేటకు చేరుకుని ‘అందరికీ ఇళ్లు’ పథకానికి, అనంతరం నగరంలోని పార్కుల అభివృద్ధి పనులకు, నూతన పార్కుల నిర్మాణానికి, వర్షపునీటి డ్రైనేజీల నిర్మాణానికి, సమీకృత రహదారుల అభివృద్ధి పనులకు, ఎస్సీ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులకు శంకుస్థాపనలు చేస్తారు. 3.55 గంటలకు సాంబమూర్తినగర్లోని ఏఎంజీ స్కూల్ ఆవరణకు చేరుకుని సాయంత్రం 6.45 గంటల వరకు జన్మభూమి, మా ఊరు కార్యక్రమంలో పాల్గొంటారు. 6.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు ఎన్టీఆర్ బీచ్‌కు చేరుకుని ‘సాగర సంబరాల’ను ప్రారంభిస్తారు. 8.30 గంటల వరకూ అక్కడే ఉంటారు. 8.45 గంటలకు ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకుని బస చేస్తారు. -
2న జగన్ రాక
సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. ఆయన వచ్చే నెల 2, 3 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం ఏజెన్సీలో పర్యటించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూతో పాటు రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ఆ నియోజకవర్గంలో పార్టీ కో ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ విలేకరులకు చెప్పారు. ఈనెల 4న రంపచోడవరం వద్ద పెళ్లి వ్యాన్ బోల్తా పడ్డ ప్రమాదంలో గంగవరం మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది, కొత్తాడకు చెందిన ఒకరు మొత్తం 9 మంది గిరిజనులు మృతి చెందగా, సుమారు 80మంది క్షతగాత్రులయ్యారు. కాగా ఆ ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే జగన్ మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వస్తానన్నారని అప్పట్లో నేతలు చెప్పారు. ఆ క్రమంలోనే జగన్ ఇప్పుడు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను, కోలుకుంటున్న క్షతగాత్రులను ఓదార్చనున్నారన్నారు. రెండో తేదీ ఉదయం రాజమండ్రికి చేరుకునే జగన్ అక్కడి నుంచి రంపచోడవరం నియోజకవర్గానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని, అనంతరం రంపచోడవరం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారని తెలిపారు. అక్కడి నుంచి కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారని చెప్పారు. సముద్రంలో వేటకు వెళ్లి వాయుగుండం కారణంగా మృతి చెందిన, గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను జగన్ ఓదారుస్తారని చెప్పారు. ఆ రోజు రాత్రి కాకినాడలో బస చే స్తారని, 3న ఉదయం కాకినాడ నుంచి బయలుదేరి తుని నియోజకవర్గంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు. అనంతరం విశాఖ జిల్లా అచ్యుతాపురం వెళతారన్నారు. ఇటీవల ధవళేశ్వరం బ్యారేజ్‌పై నుంచి తుపాన్ వాహనం బోల్తాపడ్డ ఘటనలో ఆ గ్రామానికి చెందిన 22 మంది మరణించారని, జగన్ వారి కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు. పర్యటన పూర్తి వివరాలను సోమవారం తెలియచేస్తామని నెహ్రూ చెప్పారు. -
రేపు జగన్ రాక
సాక్షి ప్రతినిధి, కాకినాడ : సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఓటములపై సమీక్షించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే, పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ సోమవారం ‘సాక్షి’కి ఈ విషయం తెలిపారు. జగన్మోహన్రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి బుధవారం రాజమండ్రి చేరుకుం టారు. బుధ, గురు, శుక్రవారాల్లో శ్రీకా కుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని ప ది లోక్‌సభ, వాటి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు, ఓటములపై ఆయన సమీక్షిస్తారు. తాజా ఎన్నికల్లో గెలిచిన, ఓడిన అభ్యర్థులు, జిల్లాల్లోని ముఖ్యనేతలను ఈ సమీక్షలకు ఆహ్వానిస్తున్నట్టు జ్యోతుల తెలిపా రు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ఓటములపై కూడా జగన్మోహన్రెడ్డి సమీక్షిస్తారని చెప్పారు. -
2న వెంకయ్యనాయుడు రాక
బోట్‌క్లబ్ (కాకినాడ), న్యూస్‌లైన్ : బీజేపీ జాతీయ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు మార్చి 2న జిల్లాకు వస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణ రాజు తెలిపారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. స్థానిక సూర్యకళామందిరంలో 2వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటకు మోడీ ఫర్ పీఎం కార్యక్రమాన్ని జిల్లాలో వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారన్నారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమై జిల్లాలో పార్టీ పరిస్థితులపై సమీక్షిస్తారన్నారు. సీమాంధ్ర సమస్యలపై ఏపార్టీ స్పందించలేదని, ఒక్క బీజేపీ మాత్రమే సీమాంధ్ర సమస్యలు రాజ్యసభలో ప్రస్తావించిందన్నారు. మాలకొండయ్య, రమేష్, కె. వేణుగోపాల్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.