2న వెంకయ్యనాయుడు రాక | venkaiah naidu 2th march Kakinada tour | Sakshi
Sakshi News home page

2న వెంకయ్యనాయుడు రాక

Published Fri, Feb 28 2014 2:40 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

venkaiah naidu 2th march Kakinada tour

బోట్‌క్లబ్ (కాకినాడ), న్యూస్‌లైన్ : బీజేపీ జాతీయ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు మార్చి 2న జిల్లాకు వస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణ రాజు తెలిపారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. స్థానిక సూర్యకళామందిరంలో 2వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటకు మోడీ ఫర్ పీఎం కార్యక్రమాన్ని జిల్లాలో వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారన్నారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమై జిల్లాలో పార్టీ పరిస్థితులపై సమీక్షిస్తారన్నారు. సీమాంధ్ర సమస్యలపై ఏపార్టీ స్పందించలేదని, ఒక్క బీజేపీ మాత్రమే సీమాంధ్ర సమస్యలు రాజ్యసభలో ప్రస్తావించిందన్నారు. మాలకొండయ్య,  రమేష్, కె. వేణుగోపాల్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement