బెన్ స్టోక్స్ గైర్హాజరీలో ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఓలీ పోప్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్ను మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పోప్ ఇప్పటివరకు 10 రివ్యూలు తీసుకోగా.. పదికి పది విఫలమయ్యాయి. ఒక్కటంటే ఒక్క రివ్యూలోనూ పోప్ సక్సెస్ కాలేదు. టెస్ట్‌ల్లో ఇలా చాలా అరుదుగా జరుగుతుంది.
రివ్యూల విషయంలో పోప్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లంకతో సిరీస్‌లో వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా సక్సెస్ అయినప్పటికీ రివ్యూల విషయంలో పోప్ దారుణంగా విఫలమయ్యాడని ఇంగ్లిష్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
ఇదిలా ఉంటే, కెన్నింగ్‌స్టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో శ్రీలంక జట్టు గెలుపు దిశగా సాగుతుంది. ఆ జట్టు మరో 99 పరుగులు చేస్తే మ్యాచ్‌ను గెలవడంతో పాటు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది. నాలుగో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. ఓలీ పోప్ భారీ శతకంతో (154) కదంతొక్కాడు. బెన్ డకెట్ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. నిస్సంక (64), ధనంజయ డిసిల్వ (69),కమిందు మెండిస్ (64) అర్ద సెంచరీలతో రాణించారు.
ఆతర్వాత లంక బౌలర్లు చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది. లహీరు కుమార 4, విశ్వ ఫెర్నాండో 3, అశిత ఫెర్నాండో 2, మిలన్ రత్నాయకే ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ జేమీ స్మిత్ (67) ఒక్కడే అర్ద సెంచరీ చేశాడు. 219 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక గెలుపు దిశగా సాగుతుంది. నిస్సంక (67), ఏంజెలో మాథ్యూస్ (6) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment