ప్రతి సోమ, మంగళవారాల్లో విజయవాడలో! | Every monday, tuesday meetings at vijayawada to all departments plans by APCS! | Sakshi
Sakshi News home page

ప్రతి సోమ, మంగళవారాల్లో విజయవాడలో!

Published Thu, Feb 18 2016 9:46 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

ప్రతి సోమ, మంగళవారాల్లో విజయవాడలో!

ప్రతి సోమ, మంగళవారాల్లో విజయవాడలో!

► అన్ని శాఖల అధికారులకు జారీ కానున్న ఆదేశాలు
► ఆ రెండు రోజులు సీఎం సమీక్షలకు అందుబాటు కోసమే

హైదరాబాద్: ఇకపై అన్ని శాఖల ఉన్నతాధికారులు ప్రతి సోమ, మంగళవారాల్లో విజయవాడలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ ఆదేశాలు జారీ చేయడానికి నిర్ణయించారు. ప్రస్తుతం తరచూ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ శాఖలు సమీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ సమీక్షలు ఎప్పుడు ఏ శాఖపై నిర్వహిస్తారో తెలియక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఉన్న ఫళంగా ‘సీఎం సమీక్ష నిర్వహిస్తారట, విజయవాడ రావాలంటూ’ సీఎం కార్యాలయం నుంచి హడావిడిగా ఫోన్‌లు రావడం, ఆదేశాలు అందుతుండడంతో సకాలంలో చేరుకోలేక అవస్థలకు గురవుతున్నారు. ఒకవేళ సమయానికి చేరుకున్నా ఒక్కోసారి సమీక్షలు గంటల తరబడి ప్రారంభం కావడం లేదు. దీంతో అధికారులకు నిరీక్షణ తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే వారంలో రెండు రోజులు సీఎం సమీక్షల కోసం అధికారులు విజయవాడలో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement