ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నది మొదలు సమీక్షలతో అధికారులను పరుగుపెట్టిస్తున్న కేసీఆర్...
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నది మొదలు సమీక్షలతో అధికారులను పరుగుపెట్టిస్తున్న కేసీఆర్... కొత్త రాష్ట్ర అభివృద్ధిలో తన లక్ష్యాలేంటో వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే పలువిభాగాల సమీక్షల్లో కీలక నిర్ణయాలు వెల్లడించిన ఆయన కొన్నింటి విషయంలో ప్రక్షాళనదిశగా ఆదేశాలు జారీచేశారు. ఈ తరుణంలో ఈనెల 24న అత్యంత కీలకమైన కలెక్టర్ల సద స్సు నిర్వహించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పాలనలో తానుకోరుకున్న మార్పు ప్రస్ఫుటమయ్యేలా కలెక్టర్లను సిద్ధం చేసేందుకు ఆయన యత్నిస్తున్నారు. ముఖ్య విభాగాల వారీ సమీక్షలు ఒక ఎత్తయితే నేరుగా ప్రజల బాగోగులను సమీక్షించే కలెక్టర్లకు మార్గనిర్దేశనం చేయడం మరో ఎత్తు. దీంతో ప్రభుత్వం కలెక్టర్ల సదస్సును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. జిల్లాల వారీగా నెలకొన్న పరిస్థితులపై కలెక్టర్లు పూర్తిస్థాయి నివేదికలతో ఈ సదస్సుకు హాజరవుతున్నారు.