
సాక్షి, హైదరాబాద్: నూతన జోనల్ వ్యవస్థ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన చేపట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ, నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బదిలీల్లో భార్యభర్తలకు ఒకే చోట పోస్టింగ్‌లు ఇవ్వాలన్నారు. వెనుకబడిన మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
చదవండి: మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలకపాత్ర: సీజేఐ ఎన్వీ రమణ
యాసంగిలో ఒక కిలో వడ్లను కూడా కొనం..
‘‘యాసంగిలో ఒక కిలో వడ్లను కూడా కొనం. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయం. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకరమైన విధానాలు వివరించాలి. వానకాలం పంటలపై ముందస్తుగా ప్రణాళికలు రూపొందించాలని’’ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment