సమగ్ర భూసర్వే: కలెక్టర్లకు కేసీఆర్‌ ఆదేశాలు | CM KCR directions on complete land survey | Sakshi
Sakshi News home page

సమగ్ర భూసర్వే: కలెక్టర్లకు కేసీఆర్‌ ఆదేశాలు

Published Thu, Aug 31 2017 2:21 PM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

సమగ్ర భూసర్వే: కలెక్టర్లకు కేసీఆర్‌ ఆదేశాలు - Sakshi

సమగ్ర భూసర్వే: కలెక్టర్లకు కేసీఆర్‌ ఆదేశాలు

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సమగ్ర భూసర్వేపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం కలెక్టర్లతో సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో భూసర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.

రెండు దశల్లో భూసర్వే నిర్వహించాలని, మొదటి దశలో వివాదం లేని భూములపై స్పష్టత ఇవ్వాలని, రెండోదశలో కోర్టు వివాదంలో ఉన్న భూములను గుర్తించాలని సూచించారు. కోర్టు తీర్పులకు లోబడి ఈ భూవివాదాలను పరిష్కరించాలన్నారు. భూ రికార్డుల సరళీకరణకు రూ. 15 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. హైదరాబాద్‌ మినహా ఒక్కో జిల్లాకు రూ. 50 లక్షల చొప్పున కేటాయించామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement