10న జిల్లా కలెక్టర్లతో సీఎం సదస్సు | Kcr to hold meeting with district collectors | Sakshi
Sakshi News home page

10న జిల్లా కలెక్టర్లతో సీఎం సదస్సు

Published Fri, Apr 7 2017 2:28 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

Kcr to hold meeting with district collectors

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పథకాల పురోగతి, కొత్త పథకాల అమలును సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 10న జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జరిగే ఈ సదస్సుకు హాజరు కావాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లకు సమాచారం అందించారు. ఈనెల 14న అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దళితులకు మూడెకరాల భూపంపిణీలో భాగంగా పది వేల ఎకరాల భూమిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంతో పాటు సాదా బైనమాల పురోగతి, గొర్రెల పంపిణీ, గర్భిణులకు ప్రోత్సాహకం, కేసీఆర్‌ కిట్ల పంపిణీకి సంబంధించిన కార్యాచరణపై ఈ సదస్సులో చర్చించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement