31నుంచి వైఎస్సార్‌సీపీ సమీక్షలు | ysrcp reviews on 31st august | Sakshi
Sakshi News home page

31నుంచి వైఎస్సార్‌సీపీ సమీక్షలు

Published Tue, Jul 29 2014 2:36 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM

31నుంచి వైఎస్సార్‌సీపీ సమీక్షలు - Sakshi

31నుంచి వైఎస్సార్‌సీపీ సమీక్షలు

జిల్లాకు రానున్న వైఎస్సార్‌సీపీ అదినేత జగన్
►పార్టీ పరిస్థితులపై కార్యకర్తలతో చర్చ
►నియోజకవర్గాల వారీగా మూడు రోజులపాటు సమీక్షలు
► పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ వెల్లడి
 సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 31వ తేదీనుంచి మూడు రోజులపాటు మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పార్టీ పరిస్థితిపై సమీక్షించనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. సోమవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. నియోజకవర్గాలవారీగా అమరావతి రోడ్‌లోని బండ్లమూడి గార్డెన్స్‌లో జరిగే సమీక్షలకు పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు, శాసనసభ్యులు, మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పోటీ చేసిన ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. వీరితోపాటు జిల్లా, నియోజకవర్గాల పరిధిలోని అన్ని విభాగాల నాయకులు హాజరు కావాల్సి ఉంటుదన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు, కేంద్ర పాలక మండలి సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు సైతం హాజరుకావాలన్నారు. అధినేత జగన్‌మోహన్‌రెడ్డి 31వ తేదీ ఉదయం 9గంటలకు నగరానికి చేరుకుంటారన్నారు. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, నగర పార్టీ అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 సమీక్షల షెడ్యూల్
 తేదీ                               సమయం             నియోజకవర్గాలు
 31-07-14                  10గం.లకు            గుంటూరు తూర్పు, పశ్చిమ
                                    12గం.లకు             ప్రత్తిపాడు, తాడికొండ
                                    2.30గం.లకు         పొన్నూరు, తెనాలి
                                    5గం.లకు              వేమూరు, రేపల్లె
 01-08-14                  9 గం.లకు             నరసరావుపేట,చిలకలూరిపేట,
                                   1.00గం.లకు          గురజాల, మాచర్ల,
                                   4.00గం.లకు           వినుకొండ, సత్తెనపల్లి
                                    6.00గం.లకు           పెదకూరపాడు, బాపట్ల
 02-08-14                  9గం.లకు                చీరాల, పరుచూరు
                                 11గం.లకు                సంతనూతలపాడు, అద్దంకి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement