marri rajasekhar
-
ఆయన రాష్ట్ర మంత్రి.. భార్య స్థానిక మంత్రి!
సాక్షి, గుంటూరు: ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హత్యా రాజకీయాలు చేస్తున్నారని, అన్యాయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే హత్యలకు సైతం వెనుకాడటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలుకలూరిపేట సమన్వయకర్త మర్రి రాజశేఖర్ మండిపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిలకలూరిపేటలో నిర్వహించిన బహిరంగసభలో మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. మంత్రి పుల్లారావు అక్రమాలను ఎండగట్టారు. పుల్లారావు హత్యా రాజకీయాలు చేసే వ్యక్తి అని, తనను ప్రశ్నించిన వారిని హత్య చేయించేందుకు వెనుకాడటం లేదన్నారు. మంత్రి అవినీతి, అక్రమాలపై వార్తలు రాస్తే శంకర్ అనే విలేకరిని హత్యచేయించారని ఆరోపించారు. మరో విలేకరి సురేంద్రపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారని చెప్పారు. పుల్లారావు భార్య స్థానికంగా మంత్రిగా చెలామణి అవుతున్నారని తెలిపారు. చిలుకలూరిపేటలో మంత్రి పుల్లారావు అరాచకాలకు అంతే లేదన్నారు. పుల్లారావుతో పాటు ఆయన భార్య కూడా తానేం మంత్రి హోదాకు తక్కువ కాదన్నట్లుగా వ్యవహరించడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. చివరకు ఇక్కడ టపాసులు అమ్మాలన్నా పుల్లారావుకు కప్పం కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మంత్రి పుల్లారావుకు రోజులు దగ్గర పడ్డాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్థానికల ప్రజలనుద్దేశించి వైఎస్ఆర్ సీపీ నేత మర్రి రాజశేఖర్ ప్రసంగించారు. -
కేసీఆర్‌కు లొంగిపోయిన చంద్రబాబు
* అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా ప్రశ్నించే ధైర్యం లేదు * కేసుల భయంతో బీజేపీతో టీడీపీ పొత్తులు * దీక్ష విరమణ సభలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట రూరల్ : కేసీఆర్‌కు లొంగిపోయిన చంద్రబాబు తెలంగాణలో చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులపై ప్రశ్నించలేకపోతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ విమర్శించారు. కర్నూలులో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న జలదీక్షకు మద్దతుగా పట్టణంలోని కళామందిర్ సెంటర్లో మంగళవారం జరిగిన నిరాహారా దీక్ష ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పాలమూరు, డిండీ పథకాలకు అనుమతులు లేకుండా తెలంగాణలో నిర్మిస్తుంటే పాలకులు అడ్డుకోవాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తుంటే ప్రజలను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు అక్కడ ఉంటే జైల్లో పెడతారని భయపడి విజయవాడకు పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లొంగిపోయి అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా ప్రశ్నించే ధైర్యం చంద్రబాబు చేయటం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో విభేదించి బయటకు వస్తే కేసులు పైన పడతాయని పొత్తు కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోని పక్షంలో భవిష్యత్‌లో సాగు భూములు బీడుగా మారే ప్రమాదం ఉందన్నారు. వాస్తవాలు గమనించి నీటి కోసం వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటానికి రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలపాలని కోరారు. అంతకుముందు రాజశేఖర్‌కు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా నిమ్మరసం అందించి నిరాహార దీక్షను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు అడుసుమల్లి ప్రతాప్‌కుమార్, న్యాయవాది చిట్టిబాబు, కౌన్సిలర్లు అబ్దుల్ రౌఫ్, నాయుడు శ్రీనివాసరావు, సాపా సైదావలి, మాజీ కౌన్సిలర్లు గాలిబ్‌షా, నిడమానూరు హనుమంతరావు, వైఎస్సార్ సీపీ యువజన నాయకులు వేజెర్ల కోటేశ్వరరావు, సాతులూరు కోటి, మైనార్టీ నాయకులు అబ్దుల్లా బాషా, బేరింగ్ మౌలాలి, బాలకోటి నాయక్, కుప్పాల శంకర్, నాంపల్లి రాము, యిర్రి రాఘవ, రఫానీ, చిన్నా, హిదయతుల్లా, తదితరులు పాల్గొన్నారు. జగన్ వెంటే జనం... అధికార పార్టీ ప్రలోభాలకు ఎంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళినా ప్రజలు జగన్ వెంటే ఉన్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా అన్నారు. దీక్ష విరమణ అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. -
విలేకరులపై దాడి దుర్మార్గం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ గుంటూరు రూరల్ : ప్రాణాలకు సైతం తెగించి ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు నిత్యం కృషి చేసే విలేకరులపై ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తన అనుచరులతో దాడి చేయటం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. సోమవారం అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విప్ జారీ చేసేందుకు పార్టీ నాయకులు, సమాచారం మేరకు విలేకరులు అక్కడికి వచ్చారని, విప్ ఇవ్వలేదని అబద్ధం ఆడేందుకు తన మనుషులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఇటువంటి హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విప్‌ను అందుకోవాల్సి వస్తుందనే భయంతో జలీల్‌ఖాన్ ఈ విధంగా మతిస్థిమితం లేని పనులు చేస్తున్నాడన్నారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి ఇటువంటి వికృత చర్యలకు పాల్పడుతున్న జలీల్‌ఖాన్, అతని అనుచరులపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా విలేకరులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విప్‌ను జారీ చేసేందుకు వచ్చిన వారిపై దాడి చేయటం, ఆపై వారిపై కేసులు పెట్టి నమోదు చేయించటం విప్‌ను అందుకున్నానని జలీల్ ఖాన్ చెప్పకనే చెప్పినట్టని తెలిపారు. విప్‌ను అందుకున్నారని చెప్పటానికి జలీల్‌ఖాన్ పెట్టిన కేసు ప్రధాన ఆధారమన్నారు. నిజాన్ని రాసేందుకు ప్రజలకోసం పోరాడే విలేకరులపై దాడి జరిగిందంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంటగలిసినట్టేనని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పాలకుల నిర్లక్ష్యంతోనే పల్నాడులో నీటి ఎద్దడి
► ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ ఎప్పుడూ స్పందిస్తుంది ► ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిడుగురాళ్ళ: ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పల్నాడులో నీటి ఎద్దడి తలెత్తిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అన్నారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన తాగునీటి వాటర్ ట్యాంకు వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంచినీటి కోసం ఈ ప్రాంతానికి కొన్ని కోట్ల రూపాయలను మంజూరు చేస్తే ఆ పథకాలను ప్రస్తుత అధికార పార్టీ వారు పూర్తి చేయకుండా నిరుపయోగంగా ఉంచడంతో నీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తల్లిదండ్రులు ఆళ్ల దశరథ రామిరెడ్డి, వీరరాఘవమ్మల సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఈ వాటర్‌ట్యాంకులను ప్రారంభించడం సంతోషకరమన్నారు. తాగునీటి సమస్యను తీర్చేందుకే అయోధ్యరామిరెడ్డి వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారన్నారు. గురజాల నియోజకవర్గంలో నీటి ఎద్దడి ఉందని జంగా కృష్ణమూర్తి తెలపడంతో తక్షణమే సమస్యను పరిష్కరించేందుకు వాటర్ ట్యాంకులను సిద్ధం చేశారని అన్నారు. పట్టణానికి చెందిన అల్లు పిచ్చిరెడ్డి, కొక్కెర వాసుదేవరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు తాటికొండ చిన ఆంజనేయులురెడ్డిలు కూడా వాటర్‌ట్యాంకులను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, పలువురు జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
తాయిలాల కోసమే పార్టీ ఫిరాయింపులు
వలస వె ళ్లిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ బెల్లంకొండ: అధికార తెలుగుదేశం పార్టీ ఇచ్చే తాయిలాల కోసమే వైఎస్సార్ సీపీ తరపున గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆరోపించారు. ఆదివారం మాచాయపాలెం పునరావాస కేంద్రంలో జరిగిన శుభకార్యానికి హాజరైన ఆయన అక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను ఎదుర్కొనే దమ్ము లేకే ముఖ్యమంత్రి అవినీతి సొమ్మును ఎరగా వేసి ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెప్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ మారితేనే అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి మీకేమైనా చెప్పారా... అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ఆయన తెలిపారు. గ్రామాల్లో రెండేళ్లు గడుస్తున్నా ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని ఆయన విమర్శించారు. జననేత వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు తమకు గర్వంగా ఉందన్నారు.వైఎస్సార్ సీపీ వినుకొండ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నీచ రాజకీయాలకు పాల్పతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో సాధ్యం కానీ హామీలిచ్చి ప్రజలను మోసంచేసి అధికారంలోకి వచ్చారని తెలిపారు. ప్రస్తుతం కోటానుకోట్లు డబ్బులిచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలను కరివేపాకులా వాడుకుని చంద్రబాబు వదిలేస్తాడన్నారు. సమావేశంలో పార్టీ నేతలు బాసు లింగారెడ్డి, గజ్జల నాగభూషణ్‌రెడ్డి, బెల్లంకొండ ఎంపీపీ చెన్నపురెడ్డి పద్మావెంకటేశ్వరరెడ్డి, రాజు పాలెం జెడ్పీటీసీ మర్రి వెంకట్రామిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి పాల్గొన్నారు. -
ధరలు తగ్గించాలని... నేడు ధర్నాలు
నియోజకవర్గ కేంద్ర తహశీల్దార్ కార్యాలయాల ఎదుట వైఎస్సార్ సీపీ ఆందోళనలు విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపు పట్నంబజారు (గుంటూరు): నింగినంటిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలు నిర్వహించనుంది. పేదల పక్షాన నిలిచి రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనంపై పోరాడుతూ పార్టీ చేపట్టిన ధర్నా కార్యక్రమాలకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. నానాటికి పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజల జీవితం దుర్భరంగా మారిందని ఆయన ఆందోళ న వ్యక్తంచేశారు. ధరలను నియంత్రిం చేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. పేదలు ఆకలిదప్పులతో అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నింగినంటిన ధరలను అదుపు చేయాలన్న నినాదంతో చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు ప్రజలు పూర్తిస్థాయిలో మద్దతు తెలపాలని కోరారు. పార్టీ అన్ని విభాగాల నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఆయా నియోజకవర్గాల తహశీల్దార్ కార్యాలయాల వద్ద పార్ టీ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నా కార్యక్రమాలకు ఉదయం 10 గంటలకల్లా హాజరు కావాలని సూచించారు. ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేసే దిశగా పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. -
నేటి నుంచి హోదా పోరు
21 వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలేనిరాహార దీక్షలు 18న అన్ని చోట్లా ర్యాలీలు, సమావేశాలు ప్రత్యేక హోదా వచ్చే వరకు ఆగదు ఈ పోరాటం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆనందపేట (గుంటూరు): అక్టోబరు 17 నుంచి 21వ తేదీ వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలేనిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. గుంటూరు అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ 17న రిలే నిరాహార దీక్షలు ప్రారంభమవుతాయన్నారు. 18వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, అనంతరం సమావేశాలు నిర్వహించనున్నామన్నారు. 19న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా,20న మండల కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించున్నామన్నారు. 21వ తేదీన జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల వద్ద ధర్నాలు చేపట్టనున్నామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు పోరాటం చేయాలని పార్టీ ఈ కార్యక్రమాలను చేపట్టనుందన్నారు. పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జిలు, నాయకులు, కార్యకర్తలను కలుపుకొని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. -
ప్రత్తిపాటి బుకాయింపు హాస్యాస్పదం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి ఆనందపేట (గుంటూరు): అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు డబ్బు చెల్లించకుండా అమ్మటానికి వీలులేని భూములను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేసి పైగా పరువు నష్టం దావా వేస్తానని బుకాయించడం హాస్యాస్పందంగా ఉందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అన్నారు. గుంటూరు అరండల్‌పేటలోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సంస్థపై పోలీసుల విచారణ కొనసాగుతున్నా ప్రభుత్వం అండదండలతో భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. కంచే చేను మేసిన విధంగా బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న వ్యక్తే ఇలా చేయడం తగదన్నారు. ప్రైవేటు వ్యక్తి ద్వారా భూములు కొనుగోలు చేశానని చెబుతున్న మంత్రి పుల్లారావు ఆ ప్రైవేటు వ్యక్తి ఎవరో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. 2015లో అగ్రిగోల్డ్ సంస్థల డెరైక్టర్ అయిన ఉదయదినకర్ నుంచి భూములు కొనుగోలు చేశారని ఆయన వెల్లడించారు. పరువు నష్టం దావా వేస్తే ఎదుర్కొవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం ద్వారానే దీనిపై విచారణకు ఆదేశించాలని, తాము ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నాయకులు కొత్తా చిన్నప్పరెడ్డి, సయ్యద్ మాబు, నర్సిరెడ్డి, బండారు సాయిబాబు, రాచకొండ ముత్యాలరాజు, మురళి, మధు, రత్నబాబు, కంభా నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
దమ్ముంటే చర్చకు రావాలి..
-
'దీక్షలను అడ్డుకోవడం సిగ్గుచేటు'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేస్తే అధికార తెలుగుదేశం పార్టీ నేతలు అభద్రతా భావంలో ఉన్నారని వైఎస్సార్సీపీ నేత మర్రి రాజశేఖర్ విమర్శించారు. శుక్రవారం ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా చేసే దీక్షలను అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షం గొంతు నొక్కాలనుకోవటం మంచిది కాదని సూచించారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను పోలీసులను అడ్డం పెట్టుకుని అణచివేయాలని చూస్తున్నారని మర్రిరాజశేఖర్ ఈ సందర్భంగా మండిపడ్డారు. -
పనికిమాలిన ఆర్డినెన్స్‌తో భూ సేకరణా?
- వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజం మంగళగిరి : పనికిమాలిన ఆర్డినెన్స్‌తో చంద్రబాబు ప్రభుత్వం భూ సేకరణకు దిగడం సిగ్గుమాలిన చర్య అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అన్నారు. మండలంలోని నిడమర్రులో సోమవారం సీఆర్డీఏ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, అతని అనుచరులు వ్యాపారం చేసుకునేందుకే రాజధాని నిర్మాణం చేపట్టారని విమర్శించారు. వారి ఇష్టానుసారం భూసేకరణకు దిగితే రైతులు చూస్తూ ఊరుకోరని, వెంటనే భూ సేకరణ ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తొలుత గ్రామంలోని రామాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. భూ సేకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని, అర్హులైన పేదలందరికీ పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్ సీపీ రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, గ్రామ సర్పంచ్ మండెపూడి మణెమ్మ, ఉప సర్పంచ్ గాదె సాగరరెడ్డి, సీపీఎం నాయకులు బాబూరావు, ఎం రవి, రాధాకృష్ణ, వైఎస్సార్ సీపీ పట్టణ, మండల కన్వీనర్లు మునగాల మల్లేశ్వరరావు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడేపల్లి పట్టణ కన్వీనర్ బుర్రముక్కు వేణుగోపాలరెడ్డి, ప్రజా సంఘాల నాయకులు ఎన్ బ్రహ్మయ్య, టి.బాబూరావు, కొండారెడ్డి, కృష్ణ, కుమారస్వామి, ఎన్ విష్ణు, ఎన్ రాజు, బి శంకర్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నవులూరులో.... మండలంలోని నవులూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఉడా కాలనీ, ఎమ్మెస్సెస్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీలను గ్రామ కంఠాల నుంచి తొలగించి తమకు న్యాయం చేయాని కోరుతూ గ్రామస్తులు సోమవారం సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇళ్లు తొలగిస్తే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. సీఆర్డీఏ కార్యాలయం లోపలికి చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేయగా డిప్యూటీ కలెక్టర్ రఘునాథరెడ్డి బయటకు వచ్చి మహిళలకు సర్ధి చెప్పారు. నివాసాలను తొలగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మహిళలు ధర్నా విరమించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాణావత్ బాలాజీనాయక్, ఉప సర్పంచ్ కూచిపూడి రమేష్, వైఎస్సార్ సీపీ నాయకులు మేకల సాంబశివరావు, షఫీ, మాజీ సర్పంచ్ కొల్లి లక్ష్మయ్యచౌదరి తదితరులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన రైతులు
నూతన మద్యం విధానంపై మర్రి రాజశేఖర్ ఆగ్రహం ‘ఇంటికో బీరు-ఊరికో బారు’ అనే చందంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకు వచ్చిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాదని, ఆయన బెల్టుషాపుల అధ్యక్షుడని విమర్శించారు. రైతు సమస్యలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న సర్కార్‌కు పుట్టగతులుండవని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచ్‌లకు చెక్కుపవర్ ఇవ్వకపోవటం సిగ్గుచేటన్నారు. పట్నంబజారు : రాష్ట్ర సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో రైతులు కదం తొక్కారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రాయితీపై విత్తనాలు, ఎరువుల పంపిణీ చేపట్టకపోవడంపై మండి పడ్డారు. వేరుశెనగ, పత్తి, మొక్కజొన్నకు కనీస మద్దతు ధర పెంపునకు ప్రభుత్వం కృషి చేయకపోవడాన్ని తప్పుపట్టారు. గత ఎన్నికల సమయంలో ప్రకటించిన రైతు రుణమాఫీ విషయాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించడం, కృష్ణా జలాల పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోకపోవడం ఇలా ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపుతూ వైఎస్సార్ సీపీ నిర్వహించిన ధర్నాలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన గుంటూరులోని కలెక్టరేట్ ఎదుట గురువారం చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి జిల్లాలోని 17 నియోజకవర్గాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. ధర్నా కార్యక్రమం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 3 గంటల వరకు జరింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై వైఎస్సార్ సీపీ నేతలు తమ మాటల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఉద్యమించాలని నినదించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు, యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా, స్వచ్ఛందంగా పాల్గొనటం విశేషం. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. ధర్నా చేపట్టిన ప్రాంగణం రైతులు, పార్టీ కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు మార్మోగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, షేక్ మొహమ్మద్ముస్తఫాలతో పాటు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, కేంద్ర పాలకమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, కేంద్ర కార్య నిర్వాహకమండలి సభ్యులు రావి వెంకటరమణ, నగారాధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, తెనాలి, వేమూరు, వినుకొండ, సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, మేరుగ నాగార్జున, బొల్లా బ్రహ్మనాయుడుల ఆధ్వర్యంలో కార్యకర్తలు, రైతులు, నేతలు తరలివచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్‌వ్వో కె. నాగబాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు విభాగాల నేతలు రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), ఆతుకూరి ఆంజనేయులు, పోలూరి వెంకటరెడ్డి, ఎండీ నసీర్‌అహ్మద్, మామిడి రాము, షేక్ ఖాజావలి, శిఖాబెనర్జీ, కొత్తా చిన్నపరెడ్డి, బండారు సాయిబాబు, మొగిలి మధు, సయ్యద్‌మాబు, కోవూరి సు నీల్‌కుమార్, ఉత్తమ్ రెడ్డి, కొలకలూరి కోటేశ్వరరావు, కేసర వెంకటసుబ్బారెడ్డి, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, మ ర్‌రెడ్డి శివరామకృష్ణారెడ్డి, పానుగంటి చైతన్య, ఏలికా శ్రీకాంత్‌యాదవ్, షేక్ జానీ, ఆవుల సుందర్‌రెడ్డి, మండే పూడి పురుషోత్తం, ఝాన్సీరాణి విజయసారథి, చింకా శ్రీనివాసరావు, చందోలో విజయ్‌కుమార్, బడాగిరి నాగరాజు, అత్తోట జోసఫ్, సుజతాపాల్, శారదాలక్ష్మీ, ఆనం రఘురామిరెడ్డి, ఆరుబండ్ల కొండారెడ్డి, డి. ప్రభా కర్రావు, పెరికల కాంతారావు, మెహమూద్, కడియాల శ్రీనివాసరావు, యేరువ నర్సిరెడ్డి, బోడపాటి కిషోర్, రాచకొండ ముత్యాలరాజు, సుద్దపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో ఎవరేమన్నారంటే.. ► ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతు సమస్యలు పట్టకుండా నిద్రపోతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేసి లేపాల్సిన అవసరం ఉందన్నారు. గత సంవత్సరం రూ. 76లక్షల కోట్లు రుణాలు ఉంటే ప్రస్తుతం అవి రూ .లక్ష కోట్లు అయ్యాయని తెలిపారు. ► నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరావురెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో బీజీపీ సీనియర్ నేత అద్వానీ దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చే ప్రమాదం లేకపోలేదన్నారని, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం కచ్చితంగా వచ్చాయని చెప్పారు. ► బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ రాష్ట్రంలో 70 శాతం ప్రజలు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ఇప్పటి వరకు ఎరువులు, విత్తనాలు ఇవ్వకపోవటం సిగ్గుచేటన్నారు. ► గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులు సువర్ణయుగాన్ని అనుభవిస్తే, ప్రస్తుత ప్రభుత్వంలో నరకంలో ఉన్నట్లు భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ► రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభం అయినప్పటికీ రైతుల ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ధ్వజమెత్తారు. ఎస్ఎల్బీసీ సమావేశం నిర్వహించకుండా బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేరని చెప్పటం చంద్రబాబు వైఫల్యానికి నిదర్శనమన్నారు. ► పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వానికి మద్దతునిస్తూ అధికారులు సైతం పచ్చచొక్కాలు వేసుకున్న కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ► పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, ప్రజా, రైతు, కార్మిక సమస్యలను పక్కనబెట్టి ఓటుకు కోట్లు కేసులో ఎలా బయటపడాలనే ఆలోచనల్లో చంద్రబాబు తలమునకలవుతున్నారని ఎద్దేవా చేశారు. ► కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు రావి వెంకటరమణ మాట్లాడుతూ రైతుకు బిచ్చం వేసిన విధంగా మద్దతు ధర కల్పించటం సిగ్గుచేటన్నారు. ► గుంటూరు నగర అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కనీసం ఖరీఫ్ సీజన్‌పై అధికారులతో సమీక్షించకుండా రేవంత్‌రెడ్డి కేసులో బయట పడాలనే ధ్యాసలోనే టీడీపీ నేతలంతా బతుకుతున్నారని మండిపడ్డారు. ► తెనాలి, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, బొల్లా బ్రహ్మనాయుడులు మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడే రైతులు సుభిక్షంగా ఉంటారన్నారు. ► జెడ్పీ ఫ్లోర్‌లీడర్ దేవళ్ల రేవతి మాట్లాడుతూ రైతు, మహిళలను చంద్రబాబు పూర్తిగా వంచించారని ఆందోళన వ్యక్తం చేశారు. ► యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ హయాంలో రూ. 72వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. -
బాబు పాలనలో రైతుల పరిస్థితి దయనీయం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పట్నంబజారు(గుంటూరు) : రాష్ట్ర ప్రభుత్వ పాలనలో రైతుల పరిస్ధితి మరింత దయనీయంగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర పరిస్ధితులను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. అరండల్‌పేటలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా నీటి ప్రాజెక్టుల విషయంలో ముందుకు వెళుతుంటే చట్టపరంగా చర్యలు చేపట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పేరిట ఏకంగా 90 టీఎంసీల కృష్ణాజలాలను అటు రాయలసీమ, ఇటు నాగార్జున సాగర్ ఆయుకట్టను ఎండగట్టే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదా అని ప్రశ్నించారు. ప్రాజెక్టు కట్టడాన్ని అడ్డుకుంటే తెలంగాణలో మీ ఓట్లు పోతాయని భయపడుతున్నారా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు కోసం చంద్రబాబు కేంద్రం నుంచి ఎంత నిధులు తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ అనుమతి లేకుండా శ్రీశైలం నుంచి 90 టీఎంసీల నీటి తోడుకుంటామని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంటే అదీ అక్రమమని చెప్పలేకపోవడం సిగ్గుచేటన్నారు. ఇష్టానుసారంగా ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు పెంచి రాజకీయ పబ్బం గడుపుకోవడమేనని స్పష్టం చేశారు. ఇప్పటికే కర్ణాటక నుంచి కిందకు రావాల్సిన జలాలు రావడం లేదని, దీని వలన ైరె తులు అనేక రకాలుగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు లాభసాటి ధరలపై స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముష్టి వేసిన విధంగా రూ.50 మద్దతు ధర కల్పించడం రైతులను అపహాస్యం చేయడమేన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించే విషయంలో ఎంతటి పోరాటాలకైనా వెనుకాడమని హెచ్చరించారు. -
జైలుకెళ్లబోతున్న చంద్రబాబు
జగన్ నామస్మరణలో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెనాలి : ఎమ్మెల్యేల ఓట్ల కొనుగోలుకు ప్రయత్నించి దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే, ఫోనులో హామీనిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేసుల్లో ఇరుక్కుని జైలుకు వె ళ్లబోతుంటే, ఆ పార్టీ మంత్రులు, నాయకులు సిగ్గులేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిపై నిందలు వేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మండిపడ్డారు. ఆదివారం ఇక్కడి ఎన్జీవో కళ్యాణమండపంలో పార్టీ పట్టణ మైనారిటీ విభాగం కార్యవర్గ ప్రమాణస్వీకార సభ లో ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలు కొద్దిరోజులుగా జగన్ నామస్మరణ చేస్తున్నారని, ఎక్కడ ఏది జరిగినా జగన్‌కు ఆపాదిస్తున్నారని అన్నారు. రూ.150 కోట్ల లంచాల డబ్బును పోగేసి రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు పక్కా ప్లాను వేసిన టీడీపీ నేతలు అడ్డంగా దొరికారని చెప్పారు. దీన్నుంచి దృష్టి మరల్చేందుకు తన ఫోను ట్యాపింగ్ చేశారంటూ ఢిల్లీ వెళ్లి అందరి కాళ్లూ పట్టుకున్నారన్నారు. మరోవైపు కేసీఆర్ తిట్ల దండకంతో ఏపీ ప్రజలను అవమానించారనీ, ఆయనను జగన్ సమర్ధిస్తున్నారని వ్యవసాయమంత్రి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నువ్వసలు మంత్రివేనా...ప్రజలను రెచ్చగొట్టొచ్చా? గాలి మాటలు మాట్లాడతావా? ’ అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆంధ్ర ప్రజలు సంతోషంగా ఉన్నారనీ, రెచ్చగొడితే వారి పరిస్థితి ఏమిటన్నారు. జైలుకు వెళ్లబోతూ జగన్‌పై నిందలేస్తే ప్రజలు నమ్మరని అన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ ముస్తఫా మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆరోపించారు. పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ఆధిపత్య పోరులో కేసీఆర్ పన్నిన ఉచ్చులో చిక్కుకున్న చంద్రబాబు కేసులోంచి తప్పుకోవటానికి ప్రజలను రెచ్చగొట్టటం క్షమార్హం కాదన్నారు. ఆనాడు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు ఫ్లెక్సీలు కట్టించిన చంద్రబాబు, ఇప్పుడు సీబీఐ దర్యాప్తుకు ఎందుకు అంగీకరించటం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ మైనారిటీసెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ మాబూ తదితరులు పాల్గొన్నారు. -
నేడు వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత సమావేశం
వేదిక : గుంటూరులోని బత్తిన శ్రీనివాసరావు కల్యాణ మండపం సమయం : మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ వెల్లడి గుంటూరు సిటీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం బుధవారం జరుగుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అమరావతి రోడ్డులోని బత్తిన శ్రీనివాసరావు కల్యాణ మండపంలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేస్తుందని వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు విధిగా హాజరు కావాలని కోరారు. జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీపీ, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జులు, జిల్లాలోని రాష్ట్ర స్థాయి నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల కన్వీనర్లు, పలు పదవుల్లో ఉన్న వారు కూడా తప్పనిసరిగా సమావేశానికి హాజరు కావాలన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యలు, రాజధాని రైతుల సమస్య, ప్రభుత్వ హామీల అమలు తదితరాలపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు మర్రి రాజశేఖర్ వెల్లడించారు. -
వాస్తవాలు వెలుగుచూస్తాయనే భయంతోనే వ్యక్తిగత దూషణలు
వినుకొండ : రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ సమావేశాల్లో దుర్భాషలాడిన అధికార పార్టీ శాసనసభ్యుడుపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో శాసనసభ స్పీకర్ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ డిమాండ్ చేశారు. శాసన సభాధిపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నార న్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడుతో కలిసి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ సభ్యులు సభలో మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయన్న భయంతోనే కుట్రపూరితంగా అధికారపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాన ప్రతి పక్షనాయకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలో మాట్లాడుతుంటే ప్రసంగం పూర్తికాకుండానే బొండా ఉమామహేశ్వరరావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు తదితరులను మధ్యలో మాట్లాడేందుకు స్పీకర్ ఎలా అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు. జగన్‌ను దూషించడం తప్ప వారు మాట్లాడిన మాటల వలన రాష్ట్ర ప్రజలకు ఏమైనా ప్రయోజనం చేకూరిందా? అని ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను సభలో ఆవిధంగా మాట్లాడించింది ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు తప్పులను గ్రహించి సభ సంప్రదాయాలను కాపాడాలని ఆయన హితవు పలికారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. బ్మహ్మనాయుడు మాట్లాడుతూ ప్రజల సమస్యలు విస్మరించిన స్థానిక నాయకులు జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పట్టణ ప్రజలు ఏళ్ల తరబడి తాగునీటి సమస్య పరిష్కారానికి నోచుకోక పోవడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. మున్సిపల్ కమిషనర్ టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మూలె వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శి చింతలచెర్వు వెంకిరెడ్డి, అమ్మిరెడ్డి అంజిరెడ్డి, పట్టణ కన్వీనర్ ఎన్ శ్రీను, శావల్యాపురం మండల కన్వీనర్ చుండూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
తణుకుకు తరలిరండి
నేటి నుంచి జగన్ రైతుదీక్ష విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపు గుంటూరు సిటీ : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను ఎండగడుతూ, ప్రజల పక్షాన ప్రశ్నించడానికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో తలపెట్టిన రైతు దీక్షను విజయవంతం చేసేందుకు తరలిరావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం గుంటూరు లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలు మాఫీ కాలేదు. కొత్త రుణాలు పుట్టే అవకాశమే లేదు. మరోవైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇక రాష్ట్రంలో రైతు బతికేదెలాగని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రధానంగా ఇచ్చిన రుణమాఫీ హామీనే మాఫీ చేసిన ఘనుడని సీఎం చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు సైతం రద్దు చేయకుండా మహిళల ఉసురుపోసుకున్నారని ధ్వజమెత్తారు. సీఆర్డీఏ చట్టాన్ని అడ్డుపెట్టుకుని రాజధాని ప్రతిపాదిత గ్రామాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే బాధ్యత గల ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శని, ఆదివారాలు రైతుదీక్ష చేస్తున్నారని వివరించారు. ఇప్పటివరకు సీఎం సాధించిందేమీ లేదని, అయినప్పటికీ ఏదో ఊడబొడిచేసినట్లుగా నాలుగు రోజుల పాటు పాలనకు బ్రేక్ వేసి మంత్రులు, అధికారులు యోగా సాధకులుగా మారిపోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ దీక్ష దేనికని మంత్రులతో ప్రశ్నింపజేస్తున్న చంద్రబాబు తన యోగా దేనికో ముందు సెలవీ యాలని మర్రి రాజశేఖర్ డిమాండ్ చేశారు. -
మేమున్నాం
రాజధాని ప్రాంత రైతుల్లో ఆత్మస్థైర్యం నింపిన వైఎస్సార్ సీపీ కమిటీ ఉండవల్లి, పెనుమాక, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాల్లో పర్యటన గుంటూరు సిటీ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటుచేసిన రాజధాని రైతులు, కౌలు రైతులు, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ గురువారం ఉండవల్లి, పెనుమాక, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాల్లో పర్యటించింది. తొలుత ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ నేతృత్వంలోని ఈ కమిటీ గుంటూరు నుంచి మధ్యాహ్నం బయలుదేరి నేరుగా ఉండవల్లి చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని అన్నదాతల్లో ఆత్మస్థైర్యం నింపింది. రైతులు, కౌలు రైతులు, కూలీల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పోలీసులు గ్రామాల్లో తిరిగినా భయపడాల్సిన పని లేదని, ఎవరినైనా అక్రమంగా నిర్బంధించాలని చూస్తే కలసికట్టుగా ప్రతిఘటించాలని కమిటీ నేతలు సూచించారు. ఇప్పటికీ కొందరిలో భయం తొలగిపోలేదని, అందుకే వారు ఈ సమావేశానికి రాలేకపోయారని పలువురు రైతులు కమిటీ దృష్టికి తీసుకురావడంతో వైఎస్సార్ సీపీ నేతలు బయలుదేరి వారి ఇళ్లకు వెళ్లారు. పోలీసుల అక్రమ కేసులు, వేధింపుల కారణంగా బయటకు రాకుండా ఇంట్లోనే ఉన్న ఉద్దండ్రాయునిపాలెం రైతు నందిగం సురేష్ ఇంటికి వెళ్లి ఆయన్ను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. హక్కులు కాపాడుకునేందుకు పిరికితనాన్ని విడనాడి ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం లింగాయపాలెం వెళ్లి పోలీసుల నిర్బంధంలోనే ఉన్న శ్రీనాథ్ చౌదరి తండ్రి సుబ్బారావును పరామర్శించారు. త్వరలోనే శ్రీనాథ్‌చౌదరికి బెయిల్ వస్తుందని తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మాజీ మంత్రి పార్థసారథి, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మొహమ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, రక్షణనిధి, జలీల్‌ఖాన్, తాడికొండ ఇన్చార్జి కత్తెర క్రిస్టీనా తదితరులు ఉన్నారు. వేధింపులు ఆపండి రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో అధికార పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, కొద్దిరోజుల కిందట జరిగిన దహనకాండకు సంబంధించి పోలీసులు విచారణ పేరుతో రైతులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు గుంటూరు అర్బన్, రూరల్ జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. -
వెంకయ్యా.. బ్లాక్మెయిల్ రాజకీయాలొద్దు
వైఎస్సార్ సీపీ పెదకూరపాడు నియోజకవర్గ ఇన్చార్జిగా పానెం హనిమిరెడ్డి నియమితులైన సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం క్రోసూరులోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో సమావేశం నిర్వహించారు. తొలుత హనిమిరెడ్డిని సమావేశానికి పరిచయం చేసిన అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ ఐదవ తేదీన గుంటూరులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని రైతులు, మహిళలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. క్రోసూరు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు రాష్ట్ర రాజధాని విషయంలో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయద్దని, ఈ విషయంలో అన్నివర్గాల ప్రజలకు న్యాయం కావాలనే కోరుతున్నామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అన్నారు. వైఎస్సార్ సీపీ పెదకూరపాడు నియోజకవర్గ ఇన్చార్జిగా పానెం హనిమిరెడ్డి నియమితులైనవిషయం విదితమే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశానికి పార్టీ మండల కన్వీనర్ షేక్ మస్తాన్ అధ్యక్షత వహించారు. సమావేశంలో మర్రి మాట్లాడుతూ రాజధాని విషయంలో గుంటూరు జిల్లా వద్దని ఏ పార్టీకూడా చెప్పలేదన్నారు. అయితే, అక్కడి రైతులు, రైతు కూలీలు, పనులు కోల్పోయే స్థానికులకు న్యాయం జరిగేలా రాజధాని నిర్మాణం ఉండాలని కోరినట్లు చెప్పారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని విషయమై పూర్తి మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు రాజధాని అక్కడ కాదంటే అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే ప్రభుత్వంపై తిరగబడతారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ ఐదున కలెక్టరేట్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని మర్రి కోరారు. నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ పర్యవేక్షకుడు ఆళ్ల పేరిరెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోది జపం చేస్తూ అవినీతి నేతల పంచెలూడగొట్టాలని ఉపన్యాసాలు ఇచ్చిన సినీనటుడు పవన్‌కల్యాణ్ ఇప్పుడేం చేస్తున్నాడని విమర్శించారు. అధికార తెలుగుదేశం పార్టీ అవినీతి, ప్రజావ్యతిరేక పనులు పవన్‌కల్యాణ్‌కు కనపడడం లేదా అని ప్రశ్నించారు. జిల్లా పరిషత్ వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ దేవళ్ల రేవతి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేయాలని నూటికి నూరుశాతం కృషిచేస్తోంది ఒక్క వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు. ప్రజాసమస్యలకు సంబంధించి జిల్లా పరిషత్ సమావేశాల్లో పార్టీ వాణిని వినిపిస్తానని చెప్పారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో విషసంస్కృతి మొదలైందన్నారు. అధికారపార్టీ నాయకులు ప్రభుత్వకార్యాలయాలు, పోలీసుస్టేషన్లలో ఒత్తిళ్లు తీసుకువస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా తప్పించుకునే ధోరణిలో ఉందని, ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటాలు చేస్తుందన్నారు. వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఎక్కడున్నా పార్టీ కోసం, తనపై నమ్మకం పెట్టుకున్న పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలకోసం ఎప్పుడు అండగా ఉంటానని, పానెం హనిమిరెడ్డికి సహాయసహకారాలు అందిస్తానని చెప్పారు. తొలుత పెదకూరపాడు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన పానెం హనిమిరెడ్డిని సమావేశంలో పరిచయం చేశారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీ విభాగం జిల్లా కన్వీనర్ బండారు సాయిబాబు, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ నర్సిరెడ్డి, అచ్చంపేట, పెదకూరపాడు, అమరావతి, బెల్లంకొండ మండలాల కన్వీనర్లు సందెపోగు సత్యం, బెల్లంకొండ మీరయ్య, మంగిసెట్టి కోటేశ్వరరావు, మర్రి ప్రసాదరెడ్డి, పార్టీ నాయకులు ఆళ్ల దశరథరామిరెడ్డి, ఈదా సాంబిరెడ్డి, ఆవుల అంకిరెడ్డి, బెల్లంకొండ ఎంపీపీ వెంకటేశ్వరరెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మీరెడ్డి, అచ్చంపేట సొసైటీ అధ్యక్షులు తులశమ్మ, షేక్ సుభాని, నాయకులు రవీంద్రబాబు, కోటిరెడ్డి, కొత్త చిన్నప్పరెడ్డి, కోట హరిబాబు, రోశిరెడ్డి, కోట మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు మర్రి కోటిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా.. జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. -
బాబు వంచనపై నిరసన భేరికి సమాయత్తం
* 5న కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ సీపీ ధర్నా * వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ * పార్టీ పటిష్టతకు కిందిస్థాయి నుంచి కమిటీల ఏర్పాటు * రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో మరో సారి పర్యటన * టీడీపీ నేతల అక్రమాలపై చర్యలకు ఒత్తిడి తీసుకువస్తాం సాక్షిప్రతినిధి, గుంటూరు: చంద్రబాబు ప్రభుత్యం చేస్తున్న వంచనలకు వ్యతిరేకంగా వచ్చే నెల ఐదవ తేదీన గుంటూరు లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహణకు వైఎస్సార్ సీపీ సమాయత్తమవు తోంది. పార్టీని పటిష్టం చేసే ప్రక్రియలో భాగంగా కింది స్థాయి నుంచి కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. రాజధాని నిర్మాణానికి భూములు సమీకరించనున్న గ్రామాల్లో మరో సారి పర్యటనకు సిద్ధమవుతోంది. * వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించి చేసిన సూచనల మేరకు పార్టీని సమాయత్తం చేస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. * అధికారంలోకి వస్తే రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చి ఆ తరువాత రుణమాఫీ చేయకపోవడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చే నెల 5న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. * పార్టీని గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పటిష్టం చేసే ప్రక్రియలో భాగంగా కమిటీల నియామకానికి నియోజకవర్గ ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలు చర్యలు తీసుకుంటున్నారు. * రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ జరగనున్న గ్రామాల్లో వైఎస్సార్ సీపీ నేతలు మరో మారు పర్యటించనున్నారు. అక్కడి రైతుల బాధలు తెలుసుకుంటూ, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అన్ని వర్గాలకు వివరించి వారిలో చైతన్యం తీసుకురానున్నారు. * గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే దిశలో చర్యలు తీసుకుంటున్నారు. దీనికి తోడు టీడీపీ నేతలు, అనుచరుల అక్రమాలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా వాటికి బాధ్యులపై చర్యలు తీసుకునే విధంగా అధికారులపై ఒత్తిడి తీసుకువస్తామని ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. * టీడీపీ నేతల అండదండలతో జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు పెరిగాయని, వీటిని వెలుగులోకి తీసుకువచ్చి బాధ్యులపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకునేలా పార్టీ ఒత్తిడి తెస్తుందన్నారు. -
‘స్థానిక' నిధులను ఊడ్చేస్తున్న చంద్రబాబు
విద్యానగర్(గుంటూరు): ప్రధాని నరేంద్ర మోడీ దేశాభివృద్ధి కోసం రోడ్లను ఊడుస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేసిన 13వ ఆర్థిక సంఘం నిధులను ఊడ్చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మండిపడ్డారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామాలు, మండలాలు, జిల్లా పరిషత్తుల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్రప్రభుత్వం ఈ నెల 3వ తేదీన 13వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని నిధులను జోడించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండగా సీఎం చంద్రబాబు వాటిని స్థానిక సంస్థలకు దక్కనీయలేదన్నారు. అంతేకాకుండా విద్యుత్ బకాయిలను స్థానిక సంస్థలే చెల్లించాలనటం దారుణమన్నారు. ఆయూ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రజలకు సౌకర్యాలు లభించకుండా చేసేందుకు తీసుకున్న దుర్మార్గపు చర్య ఇదని అన్నారు. ఎన్నికల సమయంలో బాబు ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగా మిగిలాయని విమర్శించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మైనింగ్ సెస్, ఇతర పన్నులను స్థానిక సంస్థల అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేశారు. 13వ ఆర్థిక సంఘం నిధులను మళ్ళించి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు శాయశక్తులా కృషి చేస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వకపోగా కేంద్రమిస్తున్న నిధులను దారి మళ్లించటం తగదన్నారు. దీనిపై ప్రజలతో కలిసి పోరాటం చేసి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తాడికొండ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కత్తెర సురేష్‌కుమార్ మాట్లాడుతూ స్థానిక సంస్థల విద్యుత్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సంఘం నిధులను గ్రామాలు, మండలాలు, జిల్లా పరిషత్‌ల పరిధిలో పారిశుద్ధ్య పనులు, సౌకర్యాల కల్పనకు వినియోగించాలన్నారు. చంద్రబాబు తీరు వల్ల స్థానిక సంస్థల ప్రతినిధులు ఆటబొమ్మలుగా మిగలనున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారకుంటే ప్రజా ఉద్యమం తప్పదన్నారు. సమావేశంలో పార్టీ సేవాదళ్ జిల్లా కన్వీనర్ కొత్తా చిన్నపరెడ్డి, గుంటూరు రూరల్ మండల జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు, మండేపూడి పురుషోత్తం, నర్శిరెడ్డి, ఇంటూరి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'పచ్చని భూములు లాక్కుంటున్న ప్రభుత్వం'
గుంటూరు: కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం పచ్చని భూములు లాగేసుకుంటోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, కత్తెర సురేష్, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తాఫా ఆరోపించారు. రైతుల తరపున పోరాటం చేస్తామని చెప్పారు. గుంటూరు జిల్లా తుళ్లురు మండలంలోని గ్రామాల్లో ఆదివారం వీరు పర్యటించారు. రాజధాని పేరుతో భూములు లాక్కుని తమను రోడ్డును పడేస్తున్నారని నాయకులకు రైతులు మొరపెట్టుకున్నారు. బాధితులకు అండగా నిలుస్తామని వైఎస్సార్ సీపీ నాయకులు హామీయిచ్చారు. -
‘బాబు'కు ప్రజావ్యతిరేకత
వేమూరు నియోజకవర్గ స్థాయి సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు వేమూరు ప్రతి ఒక్కరిని మోసం చేయటం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైజమని, ప్రజలను మోసం చేస్తూనే అధికార దర్పాన్ని కొనసాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తీవ్రంగా విమర్శించారు. మోసం చేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యన్నారు. నియోజకవర్గ కేంద్రం వేమూరులోని పద్మావతి కల్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ మండల కన్వీనర్ చందోలు డేవిడ్‌విజయ్‌కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు పచ్చి మోసగాడని, ఆయన తీరులో ఏ మాత్రం మార్పు రాలేదన్న విషయాన్ని ప్రజలు గ మనిస్తున్నారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇంత స్వల్ప కాలంలో ప్రజా వ్యతిరేకత రాలేదని చెప్పారు. నిరుద్యోగులు, రైతు, డ్వాక్రా మహిళలను నిలువునా ముం చేశాడని ఆరోపించారు. తెలుగు దేశం ప్రభుత్వ హామీల అమలు కోరుతూ వైఎస్సార్సీపీ ఈనెల 16న మండల కేంద్రాల్లో చేయతలపెట్టిన ధర్నాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రద్దు చేసిన ఫించన్లకు సంబధించి లబ్ధిదారులకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడుది మొదట్నుంచి మోసపూరిత చరిత్ర అని ధ్వజ మెత్తారు. చంద్ర బాబు కాంగ్రెస్ పార్టీని, ఎన్టీఆర్‌ని ఒక్కసారి మోసం చేస్తే ప్రజలను మూడుసార్లు మోసం చేశారన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యకర్తకు ఏ ఇబ్బంది వచ్చినా తాను వున్నాననే విషయం మర్చిపోవద్దన్నారు. ఎప్పుడూ కార్యకర్తల వెన్నంటి ఉంటానన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు వరుసగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు చవ్వాకుల రాఘవరావు, ఉయ్యూరు అప్పిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు విష్ణుమొలకల వెంకటేశ్వరరావు, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు, పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు పిడపర్తి క్రిష్టాఫర్, పార్టీ సేవాదళ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు దున్నా మేరీస్బాబు, పార్టీ మండల కన్వీనర్లు పడమట వెంకటేశ్వరరావు, రాపర్ల నరేంద్ర ,మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గాదె శివరామకృష్ణారెడ్డి, మాజీ ఎంీ పపీ విష్ణుమొలకల వెంకటరెడ్డియ్య, పార్టీ నాయకులు తల తోటి జిగినిబాబు, గాలి అరవింద, చదలవాడ సం జ య్ కృష్ణ, బిట్రగుంట సత్యనారాయణ, యలవర్తి భూ షయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ విభాగాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అవినీతికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ నేతలు
►హత్యా రాజకీయాలు చేస్తూ ప్రతిపక్షంపై ఎదురుదాడా? ►హత్యలపై చర్చకు రాకుండా జగన్‌పై విమర్శలు చేస్తారా? ►అవినీతికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ నేతలు ►వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజం పట్నంబజారు(గుంటూరు) : అధికారంలోకి రాగానే హత్యా రాజకీయాలు చేస్తున్న టీడీపీ నేతలు అసెంబ్లీలో చర్చకు రాకుండా ఎదురుదాడి చేసి ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. శాసనసభలో టీడీపీ శాసనసభ్యులు, మంత్రులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి పాతర వేసేలా ఉందని మండిపడ్డారు. స్థానిక అరండల్‌పేటలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇతరులను విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని విమర్శించారు. టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోమని చెప్పని స్పీకర్, జగన్ చేసిన వ్యాఖ్యలను మాత్రం ఉపసంహరించుకోవాలనడం ఆయన పక్షపాత వైఖరిని రుజువు చేస్తోందన్నారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ పాత్ర ఏమీ లేదని సీబీఐ తేల్చిచెప్పిన సంగతి టీడీపీ నేతలు మరిచిపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక, జగన్‌పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. టీడీపీ హయాంలో ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా,జర్నలిస్టు పింగళి దశరథరామ్, మల్లెల బాబ్జీలను టీడీపీ నేతలే హతమార్చినట్టు ఆరోపణలున్నాయని. వాటిపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించరని ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్సార్సీపీకి చెందిన పలు విభాగాల నాయకులు దేవళ్ళ రేవతి, సయ్యద్‌మాబు, కొత్తా చిన్నపరెడ్డి, ఉప్పుటూరి నర్సిరెడ్డి పాల్గొన్నారు. -
టీడీపీలో ఉన్నది మోసగాళ్లు
పట్నంబజారు: తెలుగుదేశం పార్టీలో ఉన్న మోసగాళ్ళు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేయటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అవినీతి ముఖ్యమంత్రి పోటీలు నిర్వహిస్తే చంద్రబాబునాయుడుకు ప్రథమ స్థానం దక్కుతుందన్నా రు. 420కి ఉదాహరణగా చంద్రబాబుని తీసుకునే పరిస్థితులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు, ఇచ్చిన వాగ్దానాలను పక్కన పెట్టి, అమలు చేయాలని నిలదీస్తున్న ప్రతిపక్ష నేతపై విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు. ఎన్నికల ముందు రైతులు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల కమిషన్‌కు సైతం చెప్పిన చంద్రబాబు, ఎన్నికల ముగిసి అధికారంలోకి వచ్చిన తరువాత పరిమితి ప్రకారం చేస్తామని చెప్పటం ఎంతవరకు సబబన్నారు. పూర్తి స్థాయిలో రుణాలన్నీ రద్దు చేస్తామని ఫ్లెక్సీలు, కరపత్రాల్లో ఊదరగొట్టిన టిడిపి నేతలు, అధికారంలోకి వచ్చిన అనంతరం రైతులకు రూ.1.50లక్షలు పంట రుణం, రూ 50 వేలు బంగారం, డ్వాక్రా రుణాలు రూ .లక్ష మా త్రమే రద్దు చేస్తామని చెప్పటం వంచన కాదా అని ప్రశ్నించారు. రద్దు చేస్తామని చెప్పిన వాటిని సైతం ఇప్పటి వరకు బ్యాంకుల్లో చెల్లించకపోటంతో రైతులు, డ్వాక్రా మహిళలు అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం తొలి సంతకం రుణమాఫీపై చేస్తామని చెప్పిన చంద్రబాబు, ఆ వాగ్దానానికి వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఒక మాట, ఆ తరువాత మరో మాట చెప్పి ఊసరవెల్లి పేరును సార్థకం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ప్రత్తిపాటి పుల్లారావు జగన్ జైలులో ఉండాలని వ్యాఖ్యలు చేయటం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. మరోసారి టీడీపీ నేతలు జగన్‌పై కుట్రలు పన్నుతున్నారని ఆయన వ్యాఖ్యల ద్వారా తేటతెల్లమైందన్నారు. జగన్ ఎక్కడ ఉండాలో ప్రజలు, కోర్టు నిర్ణయిస్తారని, టీడీపీ నేతలు కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం ఇచ్చిన హమీల అమలు కోసం నిలదీయాల్సిన బాధ్యత జగన్‌పై ఉందన్నారు. జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని నేతలు వ్యక్తిగత దూషణలకు దిగితే సహించబోమని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ దళిత విభాగం జిల్లా కన్వీనర్ బండారు సాయిబాబు, సేవాదళ్ జిల్లా కన్వీనర్ కొత్తా చిన్నపరెడ్డి, మైనారిటీ విభాగం జిల్లా కన్వీనర్ సయ్యద్‌మాబు, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ ఉప్పుటూరి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
31నుంచి వైఎస్సార్సీపీ సమీక్షలు
-
31నుంచి వైఎస్సార్సీపీ సమీక్షలు
జిల్లాకు రానున్న వైఎస్సార్సీపీ అదినేత జగన్ ►పార్టీ పరిస్థితులపై కార్యకర్తలతో చర్చ ►నియోజకవర్గాల వారీగా మూడు రోజులపాటు సమీక్షలు ► పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ వెల్లడి సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 31వ తేదీనుంచి మూడు రోజులపాటు మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పార్టీ పరిస్థితిపై సమీక్షించనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. సోమవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. నియోజకవర్గాలవారీగా అమరావతి రోడ్‌లోని బండ్లమూడి గార్డెన్స్‌లో జరిగే సమీక్షలకు పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు, శాసనసభ్యులు, మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పోటీ చేసిన ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. వీరితోపాటు జిల్లా, నియోజకవర్గాల పరిధిలోని అన్ని విభాగాల నాయకులు హాజరు కావాల్సి ఉంటుదన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు, కేంద్ర పాలక మండలి సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు సైతం హాజరుకావాలన్నారు. అధినేత జగన్మోహన్రెడ్డి 31వ తేదీ ఉదయం 9గంటలకు నగరానికి చేరుకుంటారన్నారు. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, నగర పార్టీ అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమీక్షల షెడ్యూల్ తేదీ సమయం నియోజకవర్గాలు 31-07-14 10గం.లకు గుంటూరు తూర్పు, పశ్చిమ 12గం.లకు ప్రత్తిపాడు, తాడికొండ 2.30గం.లకు పొన్నూరు, తెనాలి 5గం.లకు వేమూరు, రేపల్లె 01-08-14 9 గం.లకు నరసరావుపేట,చిలకలూరిపేట, 1.00గం.లకు గురజాల, మాచర్ల, 4.00గం.లకు వినుకొండ, సత్తెనపల్లి 6.00గం.లకు పెదకూరపాడు, బాపట్ల 02-08-14 9గం.లకు చీరాల, పరుచూరు 11గం.లకు సంతనూతలపాడు, అద్దంకి -
ఎమ్మెల్యేల అరెస్టు అప్రజాస్వామికం
చిలకలూరిపేట, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న లక్ష్యంతో సమైక్య తీర్మానం చేయాలని కోరుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఖండించారు. పట్టణంలోని కళామందిర్ సెంటర్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా గురువారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అసెంబ్లీలో చర్చకు ముందే సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలని, ఆ తర్వాతే చర్చ జరగాలని వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, పార్టీ ఎమ్మెల్యేలు పట్టుబట్టగా, సభ నుంచి సస్పెండ్ చేయడమే కాక అరెస్టు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. చర్చ జరిగితే రాష్ట్ర విభజన అనివార్యమవుతుందని, ఓటింగ్ కూడా జరుగకుండానే పార్లమెంట్‌కు వెళుతుందని తెలిసి కూడా టీడీపీ, కాంగ్రెస్ కొత్త రాజకీయం మొదలుపెట్టాయని విమర్శించారు. రెండు పార్టీలు అసెంబ్లీలో చర్చలో పాల్గొని రెండు విభాగాలుగా విడిపోయి విభజనకు మద్దతు పలుకుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు వల్లే విభజన సాధ్యమైందని హర్షం వ్యక్తం చేస్తే, సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర విభజన తదుపరి సవరణలను ప్రతిపాదించడం, కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఇదే ధోరణి ప్రదర్శించడం విభజనకు జరుగుతున్న తంతు అని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయాలని, నేరుగా ఓటింగ్‌కు నిర్వహించాలని వైఎస్సార్సీపీ కోరుతున్నా పట్టించుకోకుండా వారిని మార్షల్చే బయటకు పంపడం అమానుషమన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ కన్వీనర్ ఏవీఎం సుభానీ, మున్సిపల్ వైస్‌చైర్మన్ అబ్దుల్లా, జిల్లా ఎస్సీ సెల్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు కొమ్ము రాజేష్, మైనార్టీ నాయకులు మటన్‌బాషు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అల్లడి భాస్కరసురేష్, మండల మైనార్టీ విభాగ కన్వీనర్ మస్తాన్‌వలి, మాజీ కౌన్సిలర్లు, యార్డు డెరైక్టర్లు పాల్గొన్నారు. -
బంద్ సక్సెస్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్ర విభజన బిల్లుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి వచ్చిన వర్తమానం తీరుకు నిరసనగా వైఎస్సార్ సీపీ శుక్రవారం నిర్వహించిన జిల్లా బంద్ విజయవంతమైంది. పార్టీ నాయకులు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఉదయం ఆరు గంటలకు ఆర్టీసీ బస్టాండ్లకు చేరుకుని బస్‌ల రాకపోకలను నిలువరించారు. ప్రధాన ఠమొదటిపేజీ తరువాయి కూడళ్లలో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. పార్టీ పిలుపునకు స్పందించి వర్తక, వాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను పార్టీ నాయకులు దగ్గరుండి మూయించారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచైనా రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని నాయకులు ఈ సందర్భంగా ప్రతినబూనారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చిలకలూరిపేట బస్టాండ్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. బస్‌ల రాకపోకలను అడ్డుకున్నారు. అనంతరం ప్రదర్శన నిర్వహించి పట్టణంలోని దుకాణాలను దగ్గరుండి మూ యించారు. గురజాల నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి ఉదయం పిడుగురాళ్లలో ప్రదర్శన నిర్వహించి దుకాణాలను మూయించారు. బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త, కార్యనిర్వాహక సభ్యులు కోన రఘుపతి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయానికి సమీపంలోని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ పట్టణ కన్వీనర్ ఇక్బాల్, రూరల్ కన్వీనర్ తోట శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మునగాల మల్లేశ్వరరావుల ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు. కార్యకర్తలు, నాయకులు దుకాణాలను మూయించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో మైనార్టీ విభాగ జిల్లా కన్వీనరు సయ్యద్ మహబూబ్, మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలు జరిగాయి. పొన్నూరు నియోజకవర్గంలో పట్టణ కన్వీనరు పటాన్ బాబూఖాన్, ఎస్సీ సెల్ పట్టణ కన్వీనరు డక్కుమళ్ల రవి, యువజన విభాగం పట్టణ కన్వీనరు యర్రంశెట్టి రామకృష్ణల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మాచర్ల నియోజకవర్గంలో పార్టీ నాయకులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటరు, పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ధర్నా, రాస్తారోకోలు నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ నాగార్జున, మండల కన్వీనర్లు నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో ధర్నా నిర్వహించారు. ఆ తరువాత కొల్లూరు మండలంలో ప్రదర్శన నిర్వహించి బంద్ విజయవంతానికి కృషి చేశారు. పెదకూరపాడు నియోజకవర్గంలో మండల కన్వీనర్లు ప్రదర్శన, ధర్నా కార్యక్రమాలను నిర్వహించారు. వినుకొండ సమన్వయకర్త నన్నపనేని సుధ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ జరిగింది. నరసరావుపేట బస్టాండ్ సెంటరులో సమన్వయకర్త గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. తొలుత భారీ ప్రదర్శన నిర్వహించారు. తాడికొండ బస్టాండ్ సెంటరులో సమన్వయకర్తలు మందపాటి శేషగిరిరావు, అనూప్, కె.సురేష్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. తెనాలి నియోజకవర్గంలో సమన్వయకర్త గుదిబండి చిన వెంకటరెడ్డి, రైతు విభాగం జిల్లా కన్వీనరు మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో పాదయాత్ర, ప్రదర్శనలు జరిగాయి. గుంటూరులో... వైఎస్సార్ సీపీ నగర కన్వీనరు లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం ఆరు గంటలకే ఆర్టీసీ బస్టాండ్ ఎదుట రాస్తారోకో జరిగింది. కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బస్‌ల రాకపోకలను నిలిపివేశారు. గంటన్నర పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బ్రహ్మానందరెడ్డి స్టేడియం, పాతబస్టాండ్, జిన్నాటవర్ సెంటర్, మార్కెట్ల మీదుగా పాదయాత్ర నిర్వహించి హిందూ కళాశాల కూడలిలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. నియోజకవర్గ సమన్వయకర్తలు ఎండీ నసీర్ అహ్మద్, షౌకత్ తదితరులు బంద్ విజయవంతానికి కృషి చేశారు. టీడీపీ నాయకులు శంకర్ విలాస్ సెంటరుకు సమీపంలోని బ్రిడ్జిపై ధర్నా, ఆందోళన నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, అర్బన్ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. హిందూ కళాశాల సెంటరులోని రాజకీయ జేఏసీ వేదిక వద్ద మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. -
నేడు జిల్లా బంద్
సాక్షి, గుంటూరు :రాష్ట్ర పునర్విభజన బిల్లుపై అభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్రపతి నుంచి వర్తమానాన్ని కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి పంపిన విధానాన్ని తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ బంద్‌కు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా శుక్రవారం జిల్లాలో బంద్ నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ప్రకటించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు, సమైక్యవాదులు సహక రించి బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంద నీ, దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేసేందుకు జిల్లాస్థాయిలోని పార్టీ శ్రేణులు ముందుకు రావాలన్నారు. అలాగే వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. నాలుగవ తేదీన జిల్లా అంతటా మోటార్‌బై క్ల ర్యాలీలు , 6న మానవహారాలు, 7 నుంచి 10 వరకు తాలూకా కేంద్రాల్లో రిలేదీక్షలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. దీనికోసం అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. -
విభజన జరిగితే చంద్రబాబు చరిత్రహీనుడే!
వినుకొండ, న్యూస్‌లైన్: తెలుగుజాతిని రెండుగా చీల్చాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ నన్నపనేని సుధ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద సమైక్యశంఖారావం బహిరంగ సభ జరిగింది. ఈ సభలో మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అధికశాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని, విభజన జరిగితే అందుకు ప్రధాన కారణమైన చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలోని ఎమ్మెల్యేలతో ఒక మాట, సీమాంధ్ర ప్రాంతంలోని ఎమ్మెల్యేలతో మరో మాట చెప్పి ఉద్యమాలు చేయాలని ఉసికొల్పడ ం బాబు నైజమన్నారు. రెండు కళ్ల సిద్ధాంతం పోయి ఇప్పుడు సమన్యాయం అంటున్న బాబుకు రాష్ట్ర ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమైక్యాంధ్ర సాధిస్తానంటూ ప్రగల్బాలు పలుకుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చివరి బంతి వరకు ఆట ఉంటుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆయన అసలు బ్యాట్ ఊపని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. విడిపోతే ఇబ్బందులు తప్పవు.. పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి ప్రసంగిస్తూ రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని పాటు పడుతున్న ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రం విడిపోతే భవిష్యత్ తరాలకు ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్ పాలనలో ప్రవేశపెట్టిన అనేక పథకాలు అన్ని వర్గాల ప్రజలకు చేరాయన్నారు. విజయవాడ పార్టీ నాయకులు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేయని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆ పార్టీని ఏవిధంగా బలోపేతం చేస్తారని ప్రశ్నించారు. వైఎస్సార్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు తాను ప్రవేశపెట్టినట్లుగా చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గు చేటన్నారు. ఒంటరిగా వచ్చిన వైఎస్ జగన్ శక్తిగా మారారని పేర్కొన్నారు. నరసరావుపేట సమన్వయకర్త గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైఎస్ మర ణానంతరం రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడిందన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకుండా నాటకాలు ఆడుతున్నారని అన్నారు. సమావేశంలో ఎస్సీ సెల్ కన్వీనర్ బండారు సాయిబాబు, మైనార్టీ సెల్ కన్వీనర్ సయ్యద్ మహబూబ్, ఎస్టీ సెల్ కన్వీనర్ హనుమంతునాయక్, పిల్లా ఓబుల్‌రెడ్డి, ఎలిశెట్టి ఆదినారాయణ, ఆర్. శ్రీను, కర్నాటి చెన్నకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ బతికి ఉంటే వాన్‌పిక్ పూర్తయ్యేది
అరండల్‌పేట,(గుంటూరు) న్యూస్‌లైన్: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే ‘వాన్‌పిక్’ను పూర్తిచేసి ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేవారని వెఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని తీరప్రాంతాన్ని అభివృద్ధి చేసి అక్కడి ప్రజల స్థితిగతులు మార్చాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్ భావించడంతో ప్రకాశం జిల్లాలోని ఓడరేవు, గుంటూరు జిల్లాలోని నిజాంపట్నంను అనుసంధానం చేస్తూ వాన్‌పిక్ కారిడార్‌గా అభివృద్ధి చేసేందుకు అప్పటి మంత్రి వర్గం సమష్టిగా నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో ఎటువంటి అక్రమాలు జరగలేదని ఆయన తెలిపారు. 19 నెలల తర్వాత తొలిసారిగా జిల్లా కేంద్రమైన గుంటూరుకు వచ్చిన ఆయనకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోపిదేవి మాట్లాడారు. వైఎస్ మరణానంతరం రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలను సక్రమంగా అమలు చేయడంలేదని, ఆయన ఆశయాలను సజీవంగా ఉంచేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళ్లడంతో బ్రహ్మరథం పట్టారన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణను ఓర్చుకోలేని ఢిల్లీ పెద్దలు, పాలక, ప్రతిపక్షాలు కుమ్మక్కై అక్రమకేసులు బనాయించాయన్నారు. ఆయన్ను అరెస్ట్ చేసే ముందు తననూ బలిచేశారన్నారు. కేసులు నుంచి నిర్దోషిగా బయట పడతానని, న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందన్నారు. సమైక్యాంధ్ర అంటూ ముఖ్యమంత్రి, ఎంపీలు, మంత్రులు నాటకమాడుతున్నారని వారి మాటలను ఢిల్లీపెద్దలు వినే ప్రసక్తేలేదన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీ మరింత బలోపేతం - మర్రి రాజశేఖర్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ అకారణంగా, అన్యాయంగా మాజీ మంత్రి మోపిదేవిని 16 నెలలు జైల్లో ఉంచారన్నారు. మోపిదేవికి జరిగిన అన్యాయం ప్రజలందరికీ కనపడుతుందన్నారు.మోపిదేవి నాయకత్వంలో జిల్లాలో వైఎస్సార్ సీపీ మరింత బలోపేతం అవుతుందని, ఆయన అందరికీ మార్గదర్శకంగా ఉంటారన్నారు. ఈ సమావేశంలో నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, వాణిజ్య విభాగం కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, జిల్లా యువజన విభాగం కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, సమన్వయకర్తలు అనూప్, రాతంశెట్టి సీతారామాంజనేయులు, బొల్లా బ్రహ్మనాయుడు, షౌకత్, పార్టీ నాయకులు మహ్మద్ ముస్తాఫా, మేరిగ విజయలక్ష్మీ, దర్శనపు శ్రీనివాస్, శాఖమూరి నారాయణప్రసాద్ తదితరులు ఉన్నారు. పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం తొలిసారి పార్టీ కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన నాయకులతో సమావేశమై మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఎన్నికలకు ఎన్నో రోజులు లేవని, ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేసి జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. జిల్లాలో అన్ని సీట్లను గెలవాలని మార్గదర్శకం చేశారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. -
నేడు చిలకలూరిపేటలో సమైక్య శంఖారావం సభ
చిలకలూరిపేట,న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చిలకలూరిపేట పట్టణంలో బుధవారం సాయంత్రం నిర్వహించే సమైక్యశంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కన్వీనర్ మర్రిరాజశేఖర్ విజ్ఞప్తిచేశారు. మంగళవారం ఆయన కళామందిర్‌సెంటర్‌లో సభ జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. సభ ఏర్పాట్లపై పార్టీ నాయకులతో సమీక్షించారు. సమైక్యవాదులందరూ పార్టీలకు అతీతంగా సభకు హాజరుకావాలని ఆయన కోరారు. ఆయన వెంట పార్టీ పట్టణ,మండల కన్వీనర్లు ఏవీఎం సుభానీ, చాపలమడుగు గోవర్ధన్, పార్టీనాయకులు మటన్‌బాషు, సాప నూర్‌అహ్మద్, జిలానీ, సుధాకర్ తదితరులున్నారు. -
సమైక్యదారిలో వైఎస్సార్ సీపీ
సాక్షి, గుంటూరు: సమైక్య రాష్ట్రమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. అలుపెరగని పోరులో పార్టీ నేతలు, కార్యకర్తలు భాగస్వామ్యులవుతున్నారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో గత నాలుగు రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు ఉధృతంగా సాగుతున్నాయి. గురువారం ఆయా నియోజకవర్గాల్లో ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారుల్ని వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు దిగ్బంధించి రోడ్డుపైనే వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. సమైక్యతే పార్టీ విధానమంటూ నినదించారు. చిలకలూరిపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ చెన్నై హైవేపై ఆందోళన నిర్వహించారు. ఎన్ఆర్టీ సెంటర్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. విభజన విషయంలో కేంద్రం అమానుషంగా వ్యవహరించడంపై మం డిపడ్డారు. కృష్ణా-గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మంగళగిరి వద్ద చెన్నై హైవేను దిగ్బంధించి రాస్తారోకో చేసి వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గురజాల నియోజకవర్గంలో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాస్తారోకో, వంటా వార్పు నిర్వహించారు. రేపల్లె నియోజకవర్గంలో 214 ఎ జాతీయ రహదారిపై మాజీ మంత్రి, రేపల్లె ఎమ్మెల్యే మోపిదేవి వెంకటరమణరావు, లోయ తాండవకృష్ణలు పాల్గొన్నారు. పొన్నూరులోని జీబీసీ రోడ్డుపై బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు వద్ద రావి వెంకటరమణ వంటావార్పు, రాస్తారోకో చేశారు. గుంటూరు నగర కన్వీనరు లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో బుడంపాడు వద్ద చెన్నై హైవేపై సమన్వయకర్తలు షేక్ షౌకత్, నసీర్ అహ్మద్‌లతో కలిసి వంటావార్పు నిర్వహించి రాస్తారోకో చేశారు. తెనాలిలో పార్టీ నాయకుడు అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో గల్లా చందు, రావి వెంకటరమణ, ఆలమూరి విజయలక్ష్మి గుంటూరు-తెనాలి రహదారి దిగ్బంధం తో పాటు వంటావార్పు నిర్వహించారు. తెనాలిలోనే వేమూరు సమన్వయకర్త మేరుగ నాగార్జున పాల్గొన్నారు. విభజన విషయంలో స్పీకర్ మనోహర్ తీరుపై శివకుమార్ ధ్వజమెత్తారు. తెనాలిలో అడుగుపెట్టకుండా పార్టీ శ్రేణులతో కలిసి అడ్డుకుంటామని ప్రతిన బూనారు. నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రావిపాడు రోడ్డుపై వంటా వార్పు జరిగింది. పెదకూరపాడు నియోజకవర్గంలో నూతలపాటి హనుమయ్య ఆధ్వర్యంలో హైదరాబాదు-గుంటూరు హైవేపై బెల్లంకొండ అడ్డరోడ్డు వద్ద వంటావార్పు, ధర్నా చేశారు. వినుకొండ నియోజకవర్గంలో నన్నపనేని సుధ ఆధ్వర్యంలో కర్నూలు-గుంటూరు రోడ్డు దిగ్బంధంతో పాటు వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గంలో గుంటూరు-నరసరావుపేట రోడ్డులో మేడికొండూరు వద్ద సమన్వయకర్తలు ఈపూరి అనూప్, కొల్లిపర రాజేంద్రప్రసాద్, మందపాటి శేషగిరిరావులు రాస్తారోకో చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో మండల పార్టీ కన్వీనర్లు ముప్పాళ్ళ వద్ద రాస్తారోకో నిర్వహించారు. -
కదం తొక్కిన విద్యార్థి లోకం
-
కదం తొక్కిన విద్యార్థి లోకం
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సమైక్యాన్ని కాంక్షిస్తూ జిల్లా వ్యాప్తంగా విద్యార్థి లోకం కదం తొక్కింది. పార్టీ నాయకుల సారధ్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు, మానవహారాలతో హోరెత్తించింది. జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలోచిలకలూరిపేటలో పెద్ద ఎత్తున ప్రదర్శన జరిగింది. పట్టణంలోని ఎస్ఆర్, వివేకానంద, చైతన్య, కామినేని, మోడరన్, కాకతీయ, ఆర్‌వీఎస్‌సీవీఎస్ విద్యాసంస్థల విద్యార్థులు వేల మంది ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్వీఎస్ హైస్కూల్ రోడ్డు పాత విజయాబ్యాంక్ సెంటర్ నుంచి బ్యానర్లు, ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. చౌత్రసెంటర్, మెయిన్‌బజారు, గడియార స్తం భం, మార్కెట్ సెంటర్, కళామందిర్ సెంటర్, పోలీస్స్టేషన్రోడ్డు మీదుగా తిరిగి చౌత్రసెంటర్ చేరుకొని అక్కడి నుంచి ఎన్నార్టీ సెం టర్ వరకు సాగింది. మంగళగిరిలో పార్టీ సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిడుగురాళ్లలో జంగాకృష్ణమూర్తి, వేమూరులో మేరుగ నాగార్జున, వినుకొండలో నన్నపనేని సుధ, తెనాలిలోప్రసాద్, అన్నాబత్తుని శివరావు తదితరుల సారధ్యంలో ప్రదర్శనలు జరిగాయి. ఇంకా బాపట్లలోని అన్ని మండలాల్లో ప్రదర్శనలు చేపట్టారు. గుంటూరులో..: వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. డ్జిసెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ధ నుంచి వందలాది ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టారు. పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, వాణిజ్య విభాగం రాష్ట్ర కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తలు ఎండీ నసీర్‌అహ్మద్, షేక్ షౌకత్, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము), ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ షేక్ గులాంరసూల్, తూర్పు నియోజకవర్గ నాయకులు మహ్మద్ ముస్తఫా, పార్టీ విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ ఉప్పుటూరి న ర్సిరెడ్డి, నగర కన్వీనర్ పానుగంటి చైతన్య సారధ్యం వహించి ముందుకు కదిలారు. లాడ్జిసెంటర్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన తాలుకా, శంకర్‌విలాస్ సెంటర్ మీదుగా ఓవర్‌బ్రిడ్జి వద్దకు చేరకుంది. అనంతరం ఓవర్బ్రిడ్జీపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. దీంతో సుమారు గంటన్నరకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది, తిరిగి అక్కడ నుంచి ప్రారంభమైన ప్రదర్శన హిందూ కళాశాల కూడలిలోని అమరజీవి పొట్టి శ్రీ రాములు విగ్రహం వరకు కొనసాగిన అనంతరం మానవహారంగా ఏర్పాడ్డారు. అనంతరం శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రదర్శనకు పలు కళాశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. -
అభిమాన స్వాగతం జననేతకు ఘనస్వాగతం
సాక్షి, గుంటూరు: ప్రకాశం జిల్లా యద్దనపూడి వెళ్తూ ఆదివారం ఉదయం చిలకలూరిపేట ధనలక్ష్మి గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి జిల్లా పార్టీ నాయకులు, అభిమానులు పెద్దఎత్తున ఘనస్వాగతం పలికారు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ జిల్లాకు వచ్చిన ఆయన్ని చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా గెస్ట్‌హౌస్ ప్రాంగణంతో పాటు అక్కడి పరిసరాలు పార్టీ నాయకులతో కిటకిటలాడాయి. ఆదివారం ఉదయం 4.45 గంటలకు సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో తెనాలి చేరుకున్న వైఎస్ జగన్ రోడ్డు మార్గాన ప్రయాణించి ఆరు గంటలకు చిలకలూరిపేట చేరుకున్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఏర్పాటు చేసిన అతిథి గృహంలో గంటన్నరసేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి తిరిగి ప్రకాశం జిల్లా యద్దనపూడికి బయలుదేరారు. ఈ సందర్భంగా జగన్‌ను కలిసేందుకు వచ్చిన వివిధ నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలందరూ యువనేతకు ఎదురేగి అభివాదం చేసి స్వాగతం పలికారు. వారందరినీ పేరుపేరునా పలకరించిన వైఎస్ జగన్ కొద్దిసేపు పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడారు. పార్టీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాంతో కార్యక్రమ షెడ్యూలుపై చర్చించారు. అనంతరం చిలకలూరిపేట, బాపట్ల, తెనాలి, నర్సరావుపేట, వేమూరు, గుంటూరు, తాడికొండ నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, కోన రఘుపతి, గుదిబండి చినవెంటకరెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేరుగ నాగార్జున, ఈపూరి అనూప్, షేక్ షౌకత్, నసీర్‌లతో పాటు పార్టీ ప్రముఖులు గజ్జల నాగభూషణరెడ్డి, దాది లక్ష్మీరాజ్యం, కావటి మనోహర్, కొడాలి నాని, బాలిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జోగి రమేష్‌లతో కొద్దిసేపు మాట్లాడారు. పార్టీ నాయకులు మందపాటి శేషగిరిరావు, కావటి మనోహర్‌నాయుడు, సయ్యద్‌మాబు, దేవళ్ల రేవతి, నూతలపాటి హనుమయ్య, అన్నాబత్తుని శివకుమార్ తదితరులు జగన్‌ను కలిసి కరచాలనం చేశారు. వీరందరినీ బాగున్నారా? అంటూ వైఎస్ జగన్ పలకరించారు. అతిథి గృహం నుంచి బయటకు వచ్చిన ఆయన్ని చుట్టుముట్టిన వందలాది మంది అభిమానులు పూల వర్షంతో ముంచెత్తారు. ‘జైజగన్’ అన్న నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త గుదిబండి చిన వెంకటరెడ్డి అందించిన ప్రత్యేక పోస్టర్‌ను జగన్ ఆవిష్కరించారు. జనసంద్రమైన అంకిరెడ్డిపాలెం చౌరస్తా... ప్రకాశం జిల్లా నుంచి జాతీయ రహదారి మీదుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న యువనేత జగన్మోహన్రెడ్డికి ఘనస్వాగత పలికేందుకు గుంటూరు శివారు అంకిరెడ్డిపాలెం చౌరస్తా వద్ద వేలాది మంది యువకులు, మహిళలు బారులు తీరారు. పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, పెదకూరపాడు పార్టీ సమన్వయకర్త రాతంశెట్టి రామాంజనేయులు ఆధ్వర్యంలో మోటార్‌బైక్‌లపై తరలి వచ్చిన వందలాది ముంది యువకులు జాతీయ రహదారిపై నిలబడి నినాదాలతో హోరెత్తించారు. వీరందరినీ ఆప్యాయంగా పలకరించిన జగన్ పార్టీ కోసం పనిచేయండంటూ సూచించారు. పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు ముందుకెళ్లి జగన్‌కు శాలువా కప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, నసీర్ అహ్మద్, షౌకత్, గులాం రసూల్, చాంద్‌బాషా, మహ్మద్ ముస్తఫా, నూనె ఉమామహేశ్వరరెడ్డి, కొల్లిపర రాజేంద్రప్రసాద్, అంగడి శ్రీనివాసరావు, నర్సిరెడ్డి, మహమూద్, విజయ్‌కుమార్, జగన్‌కోటి, దాసరి శ్రీనివాసరావులతో పాటు పలువురు మహిళా నాయకురాండ్రు కానూరి నాగేశ్వరి, ఝాన్సీ, మేరీ, కొత్తా చిన్నపరెడ్డి పాల్గొన్నారు.