కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం పచ్చని భూములు లాగేసుకుంటోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, కత్తెర సురేష్, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తాఫా ఆరోపించారు.
గుంటూరు: కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం పచ్చని భూములు లాగేసుకుంటోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, కత్తెర సురేష్, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తాఫా ఆరోపించారు. రైతుల తరపున పోరాటం చేస్తామని చెప్పారు.
గుంటూరు జిల్లా తుళ్లురు మండలంలోని గ్రామాల్లో ఆదివారం వీరు పర్యటించారు. రాజధాని పేరుతో భూములు లాక్కుని తమను రోడ్డును పడేస్తున్నారని నాయకులకు రైతులు మొరపెట్టుకున్నారు. బాధితులకు అండగా నిలుస్తామని వైఎస్సార్ సీపీ నాయకులు హామీయిచ్చారు.