నేడు వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత సమావేశం | Today, a large meeting vaiessarsipi district | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత సమావేశం

Published Wed, Apr 1 2015 1:44 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

Today, a large meeting vaiessarsipi district

వేదిక : గుంటూరులోని బత్తిన శ్రీనివాసరావు కల్యాణ మండపం
సమయం : మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం
ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ వెల్లడి
 
గుంటూరు సిటీ :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం బుధవారం జరుగుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అమరావతి రోడ్డులోని బత్తిన శ్రీనివాసరావు కల్యాణ మండపంలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేస్తుందని వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు విధిగా హాజరు కావాలని కోరారు.

జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీపీ, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జులు, జిల్లాలోని రాష్ట్ర స్థాయి నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల కన్వీనర్లు, పలు పదవుల్లో ఉన్న వారు కూడా తప్పనిసరిగా సమావేశానికి హాజరు కావాలన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యలు, రాజధాని రైతుల సమస్య, ప్రభుత్వ హామీల అమలు తదితరాలపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు మర్రి రాజశేఖర్ వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement