ఎమ్మెల్యేల అరెస్టు అప్రజాస్వామికం | MLAs arrested not democratize | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల అరెస్టు అప్రజాస్వామికం

Published Fri, Jan 10 2014 12:38 AM | Last Updated on Mon, Jan 7 2019 8:29 PM

MLAs arrested not democratize

 చిలకలూరిపేట, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న లక్ష్యంతో సమైక్య తీర్మానం చేయాలని కోరుతున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఖండించారు. పట్టణంలోని కళామందిర్ సెంటర్‌లో  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా గురువారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అసెంబ్లీలో చర్చకు ముందే సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలని, ఆ తర్వాతే చర్చ జరగాలని వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, పార్టీ ఎమ్మెల్యేలు పట్టుబట్టగా, సభ నుంచి సస్పెండ్ చేయడమే కాక అరెస్టు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.

చర్చ జరిగితే రాష్ట్ర విభజన అనివార్యమవుతుందని, ఓటింగ్ కూడా జరుగకుండానే పార్లమెంట్‌కు వెళుతుందని తెలిసి కూడా టీడీపీ, కాంగ్రెస్ కొత్త రాజకీయం మొదలుపెట్టాయని విమర్శించారు. రెండు పార్టీలు అసెంబ్లీలో చర్చలో పాల్గొని రెండు విభాగాలుగా విడిపోయి విభజనకు మద్దతు పలుకుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు వల్లే విభజన సాధ్యమైందని హర్షం వ్యక్తం చేస్తే, సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర విభజన తదుపరి సవరణలను ప్రతిపాదించడం, కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఇదే ధోరణి ప్రదర్శించడం విభజనకు జరుగుతున్న తంతు అని అన్నారు.

 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయాలని, నేరుగా ఓటింగ్‌కు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ కోరుతున్నా పట్టించుకోకుండా వారిని మార్షల్‌చే బయటకు పంపడం అమానుషమన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ కన్వీనర్ ఏవీఎం సుభానీ, మున్సిపల్ వైస్‌చైర్మన్ అబ్దుల్లా, జిల్లా ఎస్సీ సెల్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు కొమ్ము రాజేష్, మైనార్టీ నాయకులు మటన్‌బాషు, జెడ్పీటీసీ మాజీ  సభ్యుడు అల్లడి భాస్కరసురేష్, మండల మైనార్టీ విభాగ కన్వీనర్ మస్తాన్‌వలి, మాజీ కౌన్సిలర్లు, యార్డు డెరైక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement