వెన్నుపోటు 'బాబు' వస్తున్నాడు జాగ్రత్త | Sharmila takes on TDP President Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు 'బాబు' వస్తున్నాడు జాగ్రత్త

Published Thu, Mar 20 2014 1:03 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

నెల్లూరు జిల్లా కావలిలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న షర్మిల - Sakshi

నెల్లూరు జిల్లా కావలిలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న షర్మిల

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిది వెన్నుపోటు తత్వమని మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల ఎద్దేవా చేశారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పోడిచిన మహా ఘనుడు చంద్రబాబు నాయుడని ఆరోపించారు. గురువారం నెల్లూరు జిల్లా కావలిలో ప్రజలను ఉద్దేశించి షర్మిల మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్న 9 ఏళ్ల కాలంలో రాష్ట్రాభివృద్ధి చేయని చంద్రబాబు... ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దొంగ వాగ్దానాలతో మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు.

 

ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు ప్రజల కోసం ఏనాడు ఒక్క పోరాటం కూడా చేయలేదన్నారు. రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధప్రదేశ్ రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్లు విభజించాలని చంద్రబాబు కేంద్రానికి ఇచ్చిన లేఖ వల్లే రాష్ట్రం రెండు ముక్కలయిందని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతులేని పోరాటం చేసిందని షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 

ఆ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిరాహార దీక్ష చేశారని తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు సైతం వదులుకున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కలసి తెలుగు జాతిని విడదీశారని షర్మిల ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement