నేడు జిల్లా బంద్
Published Fri, Jan 3 2014 3:33 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు :రాష్ట్ర పునర్విభజన బిల్లుపై అభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్రపతి నుంచి వర్తమానాన్ని కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి పంపిన విధానాన్ని తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ బంద్‌కు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా శుక్రవారం జిల్లాలో బంద్ నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ప్రకటించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు, సమైక్యవాదులు సహక రించి బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంద నీ, దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేసేందుకు జిల్లాస్థాయిలోని పార్టీ శ్రేణులు ముందుకు రావాలన్నారు. అలాగే వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. నాలుగవ తేదీన జిల్లా అంతటా మోటార్‌బై క్‌ల ర్యాలీలు , 6న మానవహారాలు, 7 నుంచి 10 వరకు తాలూకా కేంద్రాల్లో రిలేదీక్షలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. దీనికోసం అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.
Advertisement
Advertisement