
రెండో రోజు వైఎస్సార్సీపీ ప్లీనరీలో పలు తీర్మానాలు చేయనున్నారు. పారదర్శక పాలన, వ్యవసాయ రంగం, సామాజిక న్యాయం, దుష్ట చతుష్టయంపై ప్లీనరీ తీర్మానాలు చేయనుంది.
సాక్షి,బెంగళూరు: ‘నాబిడ్డకు ఇంకా మూడ�...
విదేశాల్లో చిక్కుకుపోయిన వ్యక్తి నా�...
ఓ విదేశీయురాలు భారతీయ పౌరసత్వానికి స...
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడికి నిర...
విమానం ప్రయాణం అంటేనే ఖర్చు ఎక్కువ. �...
భూతల స్వర్గంగా పేరున్న కశ్మీరానికి ద...
రిలయన్స్ అధినేత,బిలియనీర్ ముఖేష్ అ...
ప్రపంచవ్యాప్త అధ్యయనం ప్రకారం నగర యు...
పాట్నా: బీహార్ బహిరంగ సభలో ప్రధాని మ�...
గుంటూరు, సాక్షి: పహల్గాం ఉగ్రదాడి మృత�...
సాక్షి, ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహ�...
న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని పహల్గాంలో 26 మ...
అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం బైసరన్ ల...
సాధారణంగా విడాకులను (Divorce) ముఖ్యంగా మహి...
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటు�...
Published Sat, Jul 9 2022 8:46 AM | Last Updated on Sat, Jul 9 2022 4:05 PM
రెండో రోజు వైఎస్సార్సీపీ ప్లీనరీలో పలు తీర్మానాలు చేయనున్నారు. పారదర్శక పాలన, వ్యవసాయ రంగం, సామాజిక న్యాయం, దుష్ట చతుష్టయంపై ప్లీనరీ తీర్మానాలు చేయనుంది.
రెండో రోజు వైఎస్సార్సీపీ ప్లీనరీ అప్డేట్స్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ 2022 సమావేశాలు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించింది పార్టీ.
ప్రజల కష్టాలను అర్థం చేసుకునే చిప్ చంద్రబాబుకు లేదని సీఎం జగన్ మండిపడ్డారు.. చంద్రబాబుకు ప్రజల పట్ల మమకారం, ప్రేమ అన్నది ఏమాత్రం లేదని, పేదలు ఎదగకూడదన్నదే చంద్రబాబు, దుష్టచతుష్టయం విధానమన్నారు.
ప్రజలకు మంచి చేయకూడదన్నదే చంద్రబాబు అభిమతమని, తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారని, పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియమే చదవాలనేది చంద్రబాబు అభిమతమని సీఎం జగన్ విమర్శించారు. నారాయణ, చైతన్యలను మాత్రమే టీడీపీ ప్రోత్సహిస్తుందన్న సీఎం జగన్.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ బడులను కార్పొరేట్ తీసుకెళ్లడానికి శ్రమిస్తోందని స్పష్టం చేశారు.
వైఎస్ఆర్ చేయూత ద్వారా అక్కా చెల్లెమ్మలకు రూ. 9,180 కోట్లు ఇచ్చాం
వైఎస్సార్ ఆసరా ద్వారా అక్కా చెల్లెమ్మలకు రూ. 12, 758 కోట్లు ఇచ్చాం
మూడేళ్లలో వ్యవసాయం రంగంపై రూ. లక్షా 27వేల కోట్లు ఖర్చు చేశాం
ఆర్బీకేల ద్వారా రైతన్నల చేయి పట్టుకుని నడిపిస్తున్నాం
రైతులను గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం మనది
ధాన్యం కొనుగోళ్లు కోసం రూ. 45 వేల కోట్లు ఖర్చు చేశాం
ఉచిత విద్యుత్ కోసం రూ. 27వేల కోట్లు ఖర్చు చేశాం
సుమారు 50 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరిగింది
మూడేళ్లలో ఒక్క రైతు భరోసా ద్వారానే రూ. 23,875 కోట్లు ఇచ్చాం
మూడేళ్లలో మ్యానిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేశాం
అక్కా చెల్లెమ్మల పేరుపైనే ఇళ్ల రిజిస్ట్రేషన్ చేస్తున్నాం
ఇప్పటివరకూ 31లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు అందజేశాం: సీఎం జగన్
‘‘ఈరోజు జన సునామీ కనిపిస్తోంది. ఇది ఆత్మీయుల సునామీ. పదమూడేళ్లుగా ఇదే అభిమానం నాపై చూపిస్తున్నారు. కార్యకర్తలు, నేతలు, అభిమానులకు నా సెల్యూట్. అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
మేము మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో అవన్నీ అమలు చేస్తూనే ఉన్నాం. నా ఫోకస్ అంతా ప్రజలకు మంచి చేయడమే. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడమే నా లక్ష్యం. ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు 151కి చేరింది’ అని సీఎం జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
విజయవాడ-గుంటూరు మధ్య ఇవాళ ఓ సముద్రం కనిపిస్తోంది. వర్షం పడుతున్నా చెక్కుచెదరని అభిమానం కనిపిస్తోంది అంటూ సీఎం వైఎస్ జగన్.. ప్లీనరీ సమావేశాలకు హాజరైన జన సంద్రానికి అభివాదం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీవితకాలపు అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాజ్యాంగాన్ని సవరించింది పార్టీ ప్లీనరీ. తీర్మానాన్ని ఆమోదించింది.
కాంగ్రెస్ పార్టీని ఎదురించిన ఏకైక మొనగాడు సీఎం జగన్ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. టీడీపీని బంగాళాఖాతంలో కలిపేశామన్నారు. సీఎం జగన్ 95 శాతం హామీలను అమలు చేశారని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.
పండగలా రెండో రోజు వైఎస్సార్సీపీ ప్లీనరీ జరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. కార్యకర్తల నినాదాలతో ప్లీనరీ ప్రాంగణం మార్మోగుతోంది. వర్షంలో తడుస్తూ కూడా నేతల ప్రసంగాలను కార్యకర్తలు వింటున్నారు.
రైతులకు అండగా ఉండాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. రైతు బావుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. చంద్రబాబు, కరువు.. కవల పిల్లలు అని ఆయన ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగిందని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. చంద్రబాబు తన వాళ్లనే చూసుకున్నారన్నారు. సీఎం జగన్ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు.
మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు సీఎం జగన్ అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. సామాజిక సాధికారిత తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఏనాడైనా సామాజిక న్యాయం పాటించారా అని ప్రశ్నించారు. సామాజిక న్యాయం పాటించిన మహోన్నతమైన వ్యక్తి సీఎం జగన్. ఆయన అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నారని మేరుగ నాగార్జున అన్నారు.
గతంలో బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసేవారని, బలహీనవర్గాలను బలవంతులుగా మార్చింది సీఎం వైఎస్ జగనేనని మంత్రి తానేటి వనిత అన్నారు. అంబేద్కర్ ఆశయాలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారన్నారు. తండ్రికి తగ్గ తనయుడు సీఎం జగన్. ఆయన మనందరి ధైర్యమని మంత్రి తానేటి వనిత అన్నారు.
ప్లీనరీని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ మాట్లాడనున్నారు.
చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు.. 420 గాళ్లు అని ఈ నలుగురికి గురువు రామోజీరావు అని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. సీఎం జగన్‌ను దించాలని ఆ నలుగురు కంకణ కట్టుకున్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే రాష్ట్రాన్ని దోచుకోవచ్చని వీరి ఆలోచన. నలుగురు దొంగల ముఠాగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకున్నారని కొడాలి నాని నిప్పులు చెరిగారు. ఉదయం నుంచి రాత్రి వరకు దుష్ప్రచారం చేయడమే వీరి పని. ఈ 420 గాళ్లకు ఎవరూ భయపడరని కొడాలి నాని అన్నారు.
దుష్టచతుష్టయం.. చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు అని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మొదటి దొంగ చంద్రబాబు, రెండో దొంగ రామోజీరావు, మూడో దొంగ రాధాకృష్ణ, నాలుగో దొంగ టీవీ5 నాయుడు అంటూ నిప్పులు చెరిగారు. నలుగురు కలిసి మీడియా వ్యవస్థను దారుణం చేశారన్నారు. రామోజీరావు నమ్మకద్రోహి అని ఎన్టీఆరే అన్నారని పేర్ని నాని గుర్తు చేశారు.
‘‘ఎల్లో మీడియా ప్రతిరోజు విషం చిమ్ముతోందని.. ఏపీలో అభివృద్ధిని చూసి ఓర్వలేకే తప్పుడు ప్రచారం చేస్తోందని జోగి రమేష్ నిప్పులు చెరిగారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు అడ్రస్ లేదు, ఇల్లు లేదు. రామోజీరావుకు ఏపీలో ఇల్లు ఉందా, డోర్ నెంబర్ ఉందా?. ఏబీఎన్ రాధాకృష్ణకు ఏపీలో అడ్రస్ ఉందా?. టీవీ5 నాయుడు డబ్బా ఛానల్‌తో దుష్ప్రచారం చేస్తున్నాడు’’ అని మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు.
ఏపీలో సంక్షేమం ఎల్లో మీడియాకు కనిపించడం లేదా? అంటూ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఎల్లో మీడియా- దుష్ట చతుష్టయం తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్లో మీడియాకు ఎందుకింత కుళ్లు అని ప్రశ్నించారు.
రెండెకరాలతో ప్రారంభించి అక్రమంగా లక్షలాది కోట్లు సంపాదించిన ధనవంతుడు చంద్రబాబు అని మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. ఏబీఎన్ రాధాకృష్ణ.. సైకిల్, తర్వాత పేపర్, స్ట్రింగర్.. అన్యాయంగా తర్వాత ఆ పేపర్‌కే అధిపతి అయిన మోసగాడని అంబటి మండిపడ్డారు. ‘‘చంద్రబాబుకు తోడుగా దత్త పుత్రుడు ఉన్నాడు.. ఆయన ఫ్యాన్స్ మాత్రం సీఎం సీఎం అంటారు. దత్త పుత్రుడు మాత్రం.. చంద్రబాబు సీఎం సీఎం అంటాడు’’ అంటూ అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
ఏ గడప తట్టినా జగన్ నినాదమే మారుమోగుతోందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎల్లో మీడియా- దుష్ట చతుష్టయం తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారం లాక్కోవాలని చంద్రబాబు తాపత్రయం. చంద్రబాబుతో కాదు యుద్ధం.. దుష్ట చతుష్టయంతో అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
వైఎస్సార్ ఆశయాలను సీఎం జగన్ నెరవేర్చుతున్నారని ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పారదర్శక పాలన సాగుతోందన్నారు. పారదర్శక పాలనకు గ్రామ, వార్డు సచివాలయాలే నిదర్శమన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మహానేత వైఎస్సార్ సంకల్పాన్ని వైఎస్ జగన్ నిజం చేసి చూపించారన్నారు.
వైఎస్సార్సీపీ సైనికులకు ప్లీనరీ పెద్ద పండగ అని కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు. ఘనమైన పోరాటాల చరిత్ర వైఎస్సార్సీపీకి ఉందన్నారు.
చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసిన మోసాలేనని రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. ప్లీనరీలో పరిపాలన-పారదర్శకత తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.
రైతుల భూముల్ని చంద్రబాబు లాక్కున్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. ప్లీనరీలో పరిపాలన- పారదర్శకత తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని.. గత ప్రభుత్వ హయాంలో వందల ఎకకరాలను కొల్లగొట్టారని నందిగం సురేష్ మండిపడ్డారు.
నేను వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యుడిని.. తర్వాతే ఎమ్మెల్యేను.. ఆ తర్వాతే స్పీకర్‌నని తమ్మినేని సీతారాం అన్నారు. ప్లీనరీ పండుగ జరుగుతుంటే ఇంట్లో కూర్చొవాలా అని ప్రశ్నించారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని తమ్మినేని అన్నారు. సంక్షేమ పథకాలు ఎల్లో మీడియాకు కనిపించడం లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు.
మనం విజయం సాధించడమే మనముందున్న లక్ష్యమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. రామోజీరావు, ఎబీఎన్‌కు తమ్మినేని ప్రశ్నలు సంధించారు. గతంలో టీడీపీ మహానాడులో ఆనాటి స్పీకర్ శివప్రసాద్ పాల్గొనలేదా?. నేను ప్లీనరీలో పాల్గొంటే తప్పా? అని ప్రశ్నించారు.
ఏ గడపకు వెళ్లిన సీఎం జగన్ నామస్మరణే వినిపిస్తోందని తమ్మినేని సీతారాం అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ-పారదర్శకత తీర్మానంపై చర్చ సందర్భంగా ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ, ప్లీనరీకి విప్లవంలా వైఎస్సార్సీపీ కార్యకర్తలు తరలివచ్చారన్నారు.
రెండో రోజు వైఎస్సార్సీపీ ప్లీనరీ ప్రారంభమైంది. కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కార్యకర్తలు, ప్రతినిధులతో ప్లీనరీ ప్రాంగణం నిండిపోయింది. పరిపాలన వికేంద్రీకరణ-పారదర్శకత తీర్మానంపై చర్చ జరుగుతోంది.
ప్లీనరీ ప్రాంగణానికి వైఎస్ విజయమ్మ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. రెండో రోజు ప్లీనరీకి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
►తాడేపల్లి నివాసం నుంచి ప్లీనరీకి బయలు దేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
►10.30 గంటలకు ఫ్లీనరీ ప్రాంగణానికి చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్
రెండోరోజు వైఎస్సార్సీపీ ప్లీనరీకి పార్టీ శ్రేణులు పోటెత్తుతున్నారు. రాష్ట్రం నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని అభిమానులు సైతం కోలాహలంగా ప్లీనరీకి హాజరవుతున్నారు. ఉదయం నుండి వర్షాన్ని లెక్కచేయకుండా ప్లీనరీ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. బీహార్, పాట్నా ప్రాంతాల నుండి ప్లీనరీకి వచ్చామని, తమ పార్టీ అధినేత ప్రసంగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు అన్నారు.
వైఎస్సార్సీపీ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. శుక్రవారం ప్లీనరీ వేదికపై నుంచి వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ విషయాన్ని ప్రకటించారు. శనివారం సాయంత్రం అధ్యక్ష స్థాన ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. పార్టీ రాజ్యాంగానికి సంబంధించి రెండు, మూడు సవరణలు కూడా ఉంటాయని తెలిపారు.
ప్లీనరీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముగింపు ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణను సీఎం ప్రకటించనున్నారు.
రెండో రోజు వైఎస్సార్సీపీ ప్లీనరీలో పలు తీర్మానాలు చేయనున్నారు. పారదర్శక పాలన, వ్యవసాయ రంగం, సామాజిక న్యాయం, దుష్ట చతుష్టయంపై ప్లీనరీ తీర్మానాలు చేయనుంది. తొలిరోజు ప్లీనరీలో 4 రంగాలపై తీర్మానాలు చేశారు. మహిళ సాధికారత , దిశ చట్టం.. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు.. డిబిటి పథకాలు అమలుపై ప్లీనరీ తీర్మానాలు చేసింది.