
సాక్షి, తిరుపతి: వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాల విజయవంతానికి తనవంతు కృషి చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే, పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. రెండు రోజుల పాటు ప్లీనరీ సమావేశాల నిర్వహణలో భాగంగా ప్రభుత్వ విప్ హోదాలో చెవిరెడ్డి వారం రోజుల ముందే అక్కడికి చేరుకున్నారు. సమావేశాల నిర్వహణలో తనకున్న అనుభవం దృష్ట్యా అన్నీతానై వ్యవహరించారు. రెండో రోజు శనివారం ప్లీనరీ ప్రాంగణం చేరుకున్న సీఎంను మంత్రి పెద్దిరెడ్డితో పాటు చెవిరెడ్డి కలిశారు. ఆ సందర్భంగా ‘శభాష్.. భాస్కర్’ అంటూ చెవిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment