
‘బాబు'కు ప్రజావ్యతిరేకత
వేమూరు నియోజకవర్గ స్థాయి సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు
వేమూరు
ప్రతి ఒక్కరిని మోసం చేయటం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైజమని, ప్రజలను మోసం చేస్తూనే అధికార దర్పాన్ని కొనసాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తీవ్రంగా విమర్శించారు. మోసం చేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యన్నారు. నియోజకవర్గ కేంద్రం వేమూరులోని పద్మావతి కల్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ మండల కన్వీనర్ చందోలు డేవిడ్‌విజయ్‌కుమార్ అధ్యక్షత వహించారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు పచ్చి మోసగాడని, ఆయన తీరులో ఏ మాత్రం మార్పు రాలేదన్న విషయాన్ని ప్రజలు గ మనిస్తున్నారన్నారు.
దేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇంత స్వల్ప కాలంలో ప్రజా వ్యతిరేకత రాలేదని చెప్పారు. నిరుద్యోగులు, రైతు, డ్వాక్రా మహిళలను నిలువునా ముం చేశాడని ఆరోపించారు.
తెలుగు దేశం ప్రభుత్వ హామీల అమలు కోరుతూ వైఎస్సార్‌సీపీ ఈనెల 16న మండల కేంద్రాల్లో చేయతలపెట్టిన ధర్నాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రద్దు చేసిన ఫించన్లకు సంబధించి లబ్ధిదారులకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడుది మొదట్నుంచి మోసపూరిత చరిత్ర అని ధ్వజ మెత్తారు. చంద్ర బాబు కాంగ్రెస్ పార్టీని, ఎన్టీఆర్‌ని ఒక్కసారి మోసం చేస్తే ప్రజలను మూడుసార్లు మోసం చేశారన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు ఏ ఇబ్బంది వచ్చినా తాను వున్నాననే విషయం మర్చిపోవద్దన్నారు. ఎప్పుడూ కార్యకర్తల వెన్నంటి ఉంటానన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు వరుసగా ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీలు చవ్వాకుల రాఘవరావు, ఉయ్యూరు అప్పిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు విష్ణుమొలకల వెంకటేశ్వరరావు, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు, పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు పిడపర్తి క్రిష్టాఫర్, పార్టీ సేవాదళ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు దున్నా మేరీస్‌బాబు, పార్టీ మండల కన్వీనర్లు పడమట వెంకటేశ్వరరావు, రాపర్ల నరేంద్ర ,మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గాదె శివరామకృష్ణారెడ్డి, మాజీ ఎంీ పపీ విష్ణుమొలకల వెంకటరెడ్డియ్య, పార్టీ నాయకులు తల తోటి జిగినిబాబు, గాలి అరవింద, చదలవాడ సం జ య్ కృష్ణ, బిట్రగుంట సత్యనారాయణ, యలవర్తి భూ షయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ విభాగాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.