చిలకలూరిపేట,న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చిలకలూరిపేట పట్టణంలో బుధవారం సాయంత్రం నిర్వహించే సమైక్యశంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కన్వీనర్ మర్రిరాజశేఖర్ విజ్ఞప్తిచేశారు. మంగళవారం ఆయన కళామందిర్‌సెంటర్‌లో సభ జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. సభ ఏర్పాట్లపై పార్టీ నాయకులతో సమీక్షించారు. సమైక్యవాదులందరూ పార్టీలకు అతీతంగా సభకు హాజరుకావాలని ఆయన కోరారు. ఆయన వెంట పార్టీ పట్టణ,మండల కన్వీనర్లు ఏవీఎం సుభానీ, చాపలమడుగు గోవర్ధన్, పార్టీనాయకులు మటన్‌బాషు, సాప నూర్‌అహ్మద్, జిలానీ, సుధాకర్ తదితరులున్నారు.
నేడు చిలకలూరిపేటలో సమైక్య శంఖారావం సభ
Published Wed, Dec 18 2013 4:53 AM | Last Updated on Fri, May 25 2018 9:39 PM
Advertisement
Advertisement