గాడ్జెట్‌ మహిమ, వంటకం ఏదైనా చిటికెలో చేయెచ్చు...! | Digital Air Fryer Oven Reviews | Sakshi
Sakshi News home page

digital air fryer oven: గాడ్జెట్‌ మహిమ, వంటకం ఏదైనా చిటికెలో చేయెచ్చు..!

Published Sun, Sep 19 2021 10:41 AM | Last Updated on Sun, Sep 19 2021 10:47 AM

Digital Air Fryer Oven Reviews - Sakshi

చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్స్‌కి చాలా చక్కగా, అనువుగా ఉండే ఈ ఫ్యామిలీ సైజ్‌ ఓవెన్‌.. ఎయిర్‌ ఫ్రైయర్‌లా కూడా పనిచేస్తుంది. డిజిటల్‌ టచ్‌స్క్రీన్‌ తో ఆయిల్‌లెస్‌ రుచులని అందిస్తుంది. చికెన్, ఫిష్, పిజ్జా, కేక్, స్టిక్స్, వింగ్స్, కుకీస్, ఫ్రెంచ్‌ఫ్రైస్‌ ఇలా చాలానే చేసుకోవచ్చు. 

1700గి సామర్థ్యం కలిగిన ఈ మేకర్‌కి ముందు భాగంలో దానికి ఆనుకునే గుండ్రటి మూత ఉంటుంది. దాన్ని పైనుంచి కిందకు ఓపెన్‌ చేసుకోవచ్చు. లోపల ట్రాన్స్‌పరెంట్‌ బౌల్‌ పెట్టుకుని.. మూడు సొరుగులుగా గ్రిల్‌ ప్లేట్స్‌ అమర్చి, వాటిపై ఆహారాన్ని  బేక్‌ చేసుకోవచ్చు. ఇందులో 3600ఊ వద్ద పిజ్జా 10 నిమిషాలు, కూరగాయలు 12 నిమిషాలు, ఫిష్‌ 15 నిమిషాలు, కేక్‌ 30 నిమిషాలు సమయం పడుతుంది. 4300ఊ వద్ద.. పాప్‌కార్న్‌ 8 నిమిషాలు, చికెన్‌ వింగ్స్‌ 10 నిమిషాలు, ఫ్రెంచ్‌ఫ్రైస్‌ 20 నిమిషాలు, హోల్‌ చికెన్‌ 30 నిమిషాలు సమయం తీసుకుంటాయి.

అధిక–నాణ్యత గల మెటీరియల్‌తో రూపొందిన చికెన్‌ ఫోర్క్, డిప్‌ ట్రే, రొటేటింగ్‌ బాస్కెట్, ఎయిర్‌ ఫ్లో రాక్స్, మెస్‌ బాస్కెట్‌ వంటివన్నీ మేకర్‌తో పాటు లభిస్తాయి. ఈ గాడ్జెట్‌ 80 శాతం నూనె వాడకాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఆప్షన్స్‌ అన్నీ మేకర్‌ ముందువైపు డిస్‌ప్లేలో బొమ్మలతో సహా వివరంగా కనిపిస్తుంటాయి. దాంతో దీన్ని ఆపరేట్‌ చెయ్యడం ఎవరికైనా సులభమే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement