బన్నీపై ట్యూబ్లైట్ ఎఫెక్ట్..!
సరైనోడు సినిమాతో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాను జూన్ 23న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అదే సమయంలో సౌత్లో భారీ చిత్రాలేవి లేకపోవటంతో బన్నీ భారీ బిజినెస్ చేయటం కాయం అని భావించారు. కానీ డీజే ఆశలపై నీళ్లు చల్లుతున్నాడు బాలీవుడ్ కండలవీరుడు.
సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ట్యూబ్లైట్ సినిమాను ఈద్ కానుకగా జూన్ 23న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. బాహుబలి సినిమాతో సౌత్ సినిమా నార్త్ లోనూ సత్తా చాటగలదని ప్రూవ్ కావటంతో.. ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలు సౌత్ మార్కెట్ మీద దృష్టి పెట్టారు. అందుకే ట్యూబ్లైట్ సినిమాను ఇక్కడ కూడా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో అదే రోజు రిలీజ్ అవుతున్న డీజే కలెక్షన్లపై ఎఫెక్ట్ పడుతుందని భావిస్తున్నారట.
డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. బన్నీ బ్రాహ్మణుడిగా, కాంట్రక్ట్ కిల్లర్గా రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్కు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. మరి బన్నీ బిజినెస్ మీద బాలీవుడ్ ఖాన్ ఎంత వరకు ఎఫెక్ట్ చూపిస్తాడో చూడాలి.