DJ Duvvada Jagannadham
-
జగన్నాథమ్ వచ్చి మూడేళ్లయింది
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన చితం ‘డీజే(దువ్వాడ జగన్నాథమ్)’. క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతమందించిన ఈ చిత్రం విడుదలై నేటికి మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా బన్ని అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ చిత్ర బృందం కొన్ని స్టిల్స్‌ను విడుదల చేసింది. బన్ని పోలీస్ గెటప్‌లో, హూజా హెగ్డే పంచెకట్టులో ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. స్టిల్స్ అదిరిపోవడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. (కరోనా ఎఫెక్ట్.. ‘పుష్ప’ అప్డేట్!) ఇక బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రంలో బన్ని కారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. బన్నీ మార్క్ కామెడీ, యాక్షన్‌తో పాటు హరీశ్ శంకర్ మాస్ కమర్షియల్ టేకింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అగ్రహారంలో బ్రాహ్మణుడిగా, స్టైలీష్ కిల్లర్‌గా రెండు డిఫరెంట్ పాత్రల్లోనూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బ్రాహ్మణ కుర్రాడిగా బన్నీ చెప్పిన డైలాగ్‌లు సూపరో సూపరస్య సూపర్భ్యః. బడిలో గుడిలో పాట విషయంలో వచ్చిన వివాదాలు కూడా సినిమాకు భారీ ప్రచారాన్ని తెచ్చిపెట్టాయి. (పెళ్లెప్పుడు బాబాయ్ : అల్లు అయాన్) పంచెకట్టులో పద్దతిగా కనిపించినా.. మాస్ మసాలా సీన్స్ లోనూ ఇరగదీశాడు. హీరోయిన్ పూజ హెగ్డే గ్లామర్ షో.. రావు రమేశ్ విలనిజం.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇలా అన్ని కలగలిపి ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ చిత్రం విడుదలై మూడేళ్లు అవుతున్నా టీవీల్లో, డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ‘డీజే’కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబ్‌లో హిందీ డబ్బింగ్ వర్షన్లో విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డులను కొల్లగొట్టింది. ఇక ప్రస్తుతం బన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శక్తత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు హరీశ్ శంకర్ పవన్ కల్యాణ్ సినిమాతో పాటు మరో సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. I’m indebted to you for all ur support and dedication.. Sir.. @alluarjun 🙏🙏especially for making my 2nd 20cr+ movie in Nizam, #DJ is always a special film which gave me special friends Like @hegdepooja , @DoP_Bose Million thanks to @ThisIsDSP & @SVC_official https://t.co/Scad3w9xdi — Harish Shankar .S (@harish2you) June 23, 2020 -
‘సీటీమార్’ అంటున్న యంగ్ డైరెక్టర్
డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో భారీ వసూళ్లు సాధించిన యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్, ప్రస్తుతం మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న దాగుడు మూతలు సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా హరీష్ కన్ఫామ్ చేశాడు. దిల్ రాజు నిర్మిస్తున్న దాగుడుమూతలు పూర్తయిన వెంటనే ఓ యంగ్ హీరోతో ‘సీటీమార్’ పేరుతో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను రూపొందించనున్నాడు హరీష్. ఈ సినిమాను అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ నిర్మించనున్నారు. హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన డీజే సినిమాలోని సూపర్ హిట్ పాట పల్లవినే తన కొత్త సినిమాకు టైటిల్‌గా ఫిక్స్ చేశాడు దర్శకుడు. అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన డీజే దువ్వాడ జగన్నాథమ్ టాక్ పరంగా నిరాశపరిచినా కలెక్షన్ల విషయంలో మాత్రం సత్తా చాటింది. -
బుల్లితెరపై కూడా సూపర్ హిట్టే..!
అల్లు అర్జున్ హీరోగా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సినిమా డీజే దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాదించినా దర్శకుడు హరీష్ శంకర్ చేసిన కొన్నివ్యాఖ్యలు నెగెటివ్ పబ్లిసిటీకి కారణమయ్యాయి. ముఖ్యంగా నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ డీజే తుడిచిపెట్టేసిందంటూ చెప్పటం పై మెగా ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర 150 కన్నా డీజే కలెక్షన్లు ఎక్కువ కాదంటూ మెగా ఫ్యాన్స్ వాదిస్తున్నారు. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన వార్త ఫిలిం సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. ఇటీవల టీవీలో ప్రసారం అయిన డీజే మరోసారి నాన్ బాహుబలి రికార్డు లన్నింటినీ తుడిచిపెట్టేసిందట. ఈ సినిమా ఏకంగా 21.78 టీర్పీతో మూడోస్తానంలో నిలిచింది. డీజే కన్నాముందు 23 రేటింగ్‌తో బాహుబలి 1, 22.7 రేటింగ్‌తో బాహుబలి 2లు ఉన్నాయి. మరి మరోసారి ఖైది రికార్డ్‌ను డీజే తుడిచేసిందన్న వార్తలపై మెగా అభిమానులు ఎలా స్పందిస్తారోచూడాలి. -
కింగ్ ఖాన్ తో గబ్బర్ సింగ్ డైరెక్టర్
టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాల దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్. షాక్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన హరీష్, గబ్బర్ సింగ్ సక్సెస్ తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో మరోసారి భారీ వసూళ్లను సాధించి సత్తా చాటాడు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న హరీష్, తన సోషల్ మీడియా పేజ్ లో ఆసక్తికరమైన ఫొటోలను పోస్ట్ చేశాడు. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేసిన హరీష్, 'నా జీవితంలోనే మరిచిపోలేని సమయం, సంభాషణ' అంటూ ట్వీట్ చేశాడు. అయితే షారూఖ్ ను ఎందుకు కలిశారన్న విషయాన్ని మాత్రం హరీష్ వెల్లడించలేదు. గతంలోనూ పలు సందర్భాల్లో హరీష్ శంకర్, షారూఖ్ ఖాన్ ను కలిశారు. అప్పట్లో షారూఖ్ హీరోగా హరీష్ సినిమా చేయబోతున్నాడన్న వార్తలు కూడా వినిపించాయి. Thanks a ton King Khan @iamsrk for the wonderful time and memorable conversation of my life ...... Love you pic.twitter.com/pN2eYyEgVv — Harish Shankar .S (@harish2you) 5 October 2017 -
అల్లు అర్జున్ కెరీర్లో ఫస్ట్ టైం..!
అల్లు అర్జున్, హరీష్ శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కిన డీజే దువ్వాడ జగన్నాథమ్, ట్రేడ్ పండితుల అంచనాలను తలకిందులు చేస్తోంది. తొలి రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల విషయంలో మాత్రం సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే 100 కోట్ల గ్రాస్‌తో రికార్డ్ సృష్టించిన డీజే, ఇప్పుడు మరో రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. బన్నీ కెరీర్లోనే తొలిసారిగా డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో నైజాంలో 20 కోట్ల షేర్ సాధించి రికార్డ్ సృష్టించాడు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ రికార్డ్ సాధించటం ఇది రెండో సారి. గతంలో గబ్బర్‌సింగ్ సినిమాతో 20 కోట్లకు పైగా షేర్ సాధించిన హరీష్ శంకర్, డీజేతో మరోసారి అదే ఫీట్‌ను రిపీట్ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తున్న డీజే, ముందు ముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి. -
డైరెక్టర్ హరీశ్ శంకర్ సంచలన వ్యాఖ్యలు!
హైదరాబాద్: 'డీజే దువ్వాడ జగన్నాథం' సినిమాతో భారీ వసూళ్లు రాబడుతున్న డైరెక్టర్ హరీశ్ శంకర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 'డీజే' సినిమా థాంక్స్ మీట్లో హరీశ్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'డీజే' సినిమాపై కొన్ని వెబ్సైట్లలో వచ్చిన రివ్యూలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. 'నాకు కళ్లు నెత్తికెక్కాయి అనడానికి మీరెవరు?' అంటూ రివ్యూ రచయితలపై ఫైర్ అయ్యాడు. 'నేను ఎవ్వరి విమర్శలకు సమాధానం చెప్పను? నా తీరే ఇంత. నా అటిట్యూడ్ వల్లే గబ్బర్‌సింగ్ వచ్చింది' అని అన్నాడు. మంచి ఎంటర్టైనర్ సినిమాలు వస్తే రెవెన్యూలు చూడాలి కానీ రివ్యూలు కాదంటూ ఆయన చెప్పాడు. 'డీజే' సినిమాపై చాలావరకు ప్రతికూల సమీక్షలే వచ్చాయి. డివైడ్ టాక్ ఉందన్న వ్యాఖ్యలు వినిపించాయి. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం 'డీజే' సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. పెద్ద సినిమాలేవీ బరిలో లేకపోవడంతో, పోటీ లేకపోవడంతో మున్ముందు మరింత వసూళ్లు రాబట్టే అవకాశముందని తెలుస్తోంది. -
డీజే డైరెక్టర్ వార్నింగ్
హైదరాబాద్: అల్లు అర్జున్ తాజా సినిమా దువ్వాడ జగన్నాథమ్ (డీజే)ను పైరసీ చేసిన వారిపై కఠిన చర్యలకు చిత్రయూనిట్ సిద్ధమవుతోంది. తమ సినిమాను సోషల్ మీడియాలో పెట్టినవారిని గుర్తించే పనిలో పడ్డామని దర్శకుడు హరీష్ శంకర్ తెలిపారు. పేర్లు, ఐడెంటిటీస్, ఐపీ అడ్రసులను ట్రేస్ చేస్తున్నట్టు వెల్లడించారు. పైరసీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆన్లైన్లో పైరసీ లింకుల గురించి తమకు సమాచారం అందించాలని అభిమానులతో పాటు సినిమా ప్రేమికులకు విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్స్ అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. పైరసీ లింకుల గురించి సమాచారం అందించేందుకు ముందుకు వచ్చిన మహేశ్‌బాబు, ఎన్టీఆర్ అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. శుక్రవారం విడుదలైన దువ్వాడ జగన్నాథమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. -
దుమ్మురేపుతున్న డీజే.. రికార్డు కలెక్షన్స్!
అల్లు అర్జున్ నటించిన తాజా సినిమా ’ డీజే దువ్వాడ జగన్నాథం’ కు అంత గొప్పగా రివ్యూలు రాలేదు. డివైడ్ టాక్ వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుండటం అటు విమర్శకులను, ఇటు సినీ పండితులను విస్మయానికి గురిచేస్తున్నది. నెగిటివ్ రివ్యూలు, యావరేజ్ మౌత్‌టాక్ సినిమా వసూళ్లపై ప్రభావం చూపించవచ్చునని భావించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ’డీజే’జోరు ఇది తప్పని ప్రూవ్ చేసింది. ఈ సినిమా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా కళ్లుచెదిరేరీతిలో రూ. 33 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని సమాచారం. మొత్తానికి తొలివారం ముగిసేలోపే ‘డీజే’ వందకోట్ల మార్క్‌ను చేరుకోవచ్చునని భావిస్తున్నారు. అమెరికాలో ఈ సినిమా తొలిరోజు వసూళ్లలో సల్మాన్ ఖాన్ ‘ట్యూబ్‌లైట్’ ను అధిగమించడం సినీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘డీజే’ బన్నీ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ‘గబ్బర్‌సింగ్’తో స్టైలిష్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న హరీశ్ శంకర్‌తో కలిసి బన్నీ చేసిన తొలి సినిమా ఇది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 3వేలకుపైగా థియేటర్లలో విడుదలైంది. రెండువారాలపాటు ఈ సినిమాకు గట్టిపోటీ లేకపోవడంతో రానున్న రోజుల్లోనూ ‘డీజే’ వసూళ్ల జోరుకు అడ్డులేకపోవచ్చునని భావిస్తున్నారు. -
ఈ యంగ్ హీరోని గుర్తుపట్టారా..?
రిలీజ్ రోజు స్టార్ హీరో సినిమా చూడటం అభిమానులకు ఓ అచీవ్మెంట్. అయితే అలాంటి కోరికలు సెలబ్రిటీలకు కూడా ఉంటాయి. కానీ వారికి ఆ కోరిక తీర్చుకోవడం కొంచెం కష్టమైన పనే. హీరోగా మంచి ఫాంలో ఉన్న స్టార్, మరో స్టార్ హీరో సినిమాను రిలీజ్ రోజు చూడాలంటే చాలా కష్టాలే పడాలి. అలాంటి కష్టమే ఎదురైంది యంగ్ హీరో రాజ్ తరుణ్‌కి. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన దువ్వాడ జగన్నాథమ్ సినిమాను రిలీజ్ రోజు చూడాలనుకున్న రాజ్ తరుణ్ ఏకంగా మారువేశం వేసేసి థియేటర్లో ప్రత్యక్షమయ్యాడు. సినిమా చూసిన తరువాత తాను ఏ గెటప్ లో వెళ్లి సినిమా చూశాడో తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు రివీల్ చేశాడు. పొడవాటి గెడ్డంతో బాబాల కనిపిస్తున్న రాజ్ తరుణ్, ఏ థియేటర్లో సినిమా చూశాడో మాత్రం రివీల్ చేయలేదు. And that's how I watched DJ This morning -
అల్లు అర్జున్ కెరీర్ లోనే డీజే టాప్..!
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన డీజే దువ్వాడ జగన్నాథమ్, ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన డీజేపై తొలి షో నుంచే డివైడ్ టాక్ వస్తోంది. రొటీన్ కామెడీ, స్టోరీ సరిగా లేదంటూ విమర్శలు వినిపిస్తున్నా.. అభిమానులు మాత్రం సినిమాను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. టాక్‌తో సంబంధం లేకుండా డీజే కలెక్షన్ల మోత మోగిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్‌తో కూడా కలుపుకొని.. తొలి రోజే దువ్వాడ జగన్నాథమ్ 18 కోట్లకు పైగా వసూళ్లు సాధించాడు. బన్నీ కెరీర్లో ఇవే బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్లు కావటం విశేషం. సరైనోడు సినిమాతో కెరీర్ లో బిగెస్ట్ హిట్ సాధించిన బన్నీ, డీజే ఆ హవాను కొనసాగిస్తున్నాడు. మరో రెండు వారాలపాటు చెప్పుకోదగ్గ సినిమాలేవి లేకపోవటంతో బన్నీ జోరుకు ఇప్పట్లో బ్రేక్ పడే ఛాన్స్ లేదు. -
అభిమానులతో కలిసి సినిమా చూసిన డీజే
-
'డీజే దువ్వాడ జగన్నాథమ్' మూవీ రివ్యూ
టైటిల్ : డీజే దువ్వాడ జగన్నాథమ్ జానర్ : రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తారాగణం : అల్లు అర్జున్, పూజ హెగ్డే, రావు రమేష్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, వెన్నెల కిశోర్ సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ దర్శకత్వం : హరీష్ శంకర్ నిర్మాత : దిల్ రాజు, శిరీష్ గత ఏడాది సరైనోడు సినిమాతో బిగెస్ట్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ డీజే దువ్వాడ జగన్నాథమ్. తొలిసారిగా బన్నీ బ్రాహ్మణుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బడిలో గుడిలో పాట విషయంలో వచ్చిన వివాదాలు కూడా సినిమాకు భారీ ప్రచారాన్ని తెచ్చిపెట్టాయి. బన్నీ మార్క్ కామెడీ, యాక్షన్‌తో పాటు హరీష్ శంకర్ మాస్ కమర్షియల్ టేకింగ్‌తో తెరకెక్కిన డీజే, అల్లు అర్జున్ కెరీర్లో మరో బిగెస్ట్ హిట్‌గా నిలుస్తుందా..? హరీష్ మరోసారి కమర్షియల్ డైరెక్టర్ గా తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడా..? డీజే అయినా పూజ ఫేట్ మారిందా..? కథ : దువ్వాడ జగన్నాథమ్ (అల్లు అర్జున్).. విజయవాడ అగ్రహరంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కుర్రాడు. బ్రాహ్మణ ఆచారాల మధ్య పెరిగిన జగన్నాథమ్, అన్యాయాన్ని చూస్తే మాత్రం సహించలేడు. ఆచారాలు వ్యవహారాలు పాటిస్తూనే.. అన్యాయం చేసిన వాళ్లను మాత్రం ఇరగదీస్తాడు. జగన్నాథమ్ దూకుడు అడ్డుకట్ట వేయాలని తండ్రి(తనికెళ్ల భరణి), అతడి మెడలో రుద్రాక్ష వేస్తాడు. ఆ రుద్రాక్ష మెడలో ఉండగా ఎవరి మీద చెయ్యి వేయవద్దని ఒట్టు పెడతాడు. అందుకే తన కంటికి ఏ అన్యాయం కనిపించినా.. ఆ కొద్ది సేపు రుద్రాక్ష పక్కన పెట్టి తన పని కానిచ్చేస్తాడు. అర్జునుడిలా అసుర సంహారం చేస్తున్న జగన్నాథానికి కృష్ణుడిలా ఓ మార్గదర్శి తోడవుతాడు. ఎఫ్ఐఆర్ రైటర్ పురుషోత్తం (మురళీ శర్మ)ను ఓ గొడవలో కలిసిన జగన్నాథమ్ అతనితో కలిసి అన్యాయం చేసినవాళ్ల పనిపడుతుంటారు. ఎవరికీ తెలియకుండా అన్యాయాన్ని తెగనరికే జగన్నాథమ్, బయటి ప్రపంచానికి అన్నపూర్ణ క్యాటరింగ్స్ నడుపుతుంటాడు. తన ఫ్రెండ్ విఘ్నేశ్వర శాస్త్రి (వెన్నెల కిశోర్) పెళ్లికి క్యాటరింగ్ చేయడానికి వెళ్లిన జగన్నాథానికి, పూజ (పూజ హెగ్డే) పరిచయం అవుతుంది. ఆమె అందం, అల్లరి నచ్చిన జగన్నాథమ్ ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ పెళ్లి వేడుక నుంచి తన కూతుర్ని చూసొస్తానని వెళ్లిన జగన్నాథమ్ బాబాయ్ ( చంద్రమోహన్) చనిపోతాడు. తాను పాతికేళ్లుగా దాచుకున్న డబ్బును అగ్రో డైమండ్స్ రియల్ ఎస్టేట్ సంస్థలో స్థలం కోసం కట్టిన చంద్రమోహన్ మోసపోయానని తెలుసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. బాబాయ్ చావుతో జగన్నాథమ్ రగిలిపోతాడు. తనను ఎత్తుకొని పెంచిన బాబాయ్ చావుకు కారణమైన వాళ్లను ఎలాగైన బయటికి లాగాలని నిర్ణయించుకుంటాడు. చంద్రమోహన్‌ను మోసం చేసిన అగ్రో డైమండ్స్ సంస్థ ఎవరిది..? ఈ స్కాంకు పూజ తండ్రికి సంబంధం ఏంటి..? ఈ కథలో నాయుడు కన్స్‌స్ట్రక్షన్స్ రొయ్యలనాయుడు పాత్ర ఏంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు : అల్లు అర్జున్ మరోసారి తనదైన స్టైలిష్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. అగ్రహారంలో బ్రాహ్మణుడిగా, స్టైలిష్ కిల్లర్‌గా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బ్రాహ్మణ కుర్రాడిగా బన్నీ చెప్పిన డైలాగ్స్‌కు థియేటర్లో విజిల్స్ పడుతున్నాయి. పంచెకట్టులో పద్దతిగా కనిపించినా.. మాస్ మసాలా సీన్స్ లోనూ ఇరగదీశాడు బన్నీ. హీరోయిన్ పూజ హెగ్డేకు నటనకు ఆస్కారం లేకపోయినా.. గ్లామర్ షోతో ఆకట్టుకుంది. సాంగ్స్‌లో బన్నీకి దీటుగా స్టెప్స్ వేసి మెప్పించింది. విలన్‌గా రావు రమేష్ మరోసారి తన వర్సటాలిటీ చూపించాడు. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలవరితో రొయ్యలనాయుడు క్యారెక్టర్‌కు ప్రాణం పోశాడు. ఇతర పాత్రల్లో మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, వెన్నెల కిశోర్, సుబ్బరాజులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లను రూపొందించటంలో స్పెషలిస్ట్‌గా పేరున్న హరీష్ శంకర్ మరోసారి తన మార్క్ చూపించాడు. హీరో పాత్రను బ్రాహ్మణుడిగా చూపించినా.. మాస్ ఎలిమెంట్స్ ఏమాత్రం మిస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. రెగ్యులర్ కథే అయినా.. తన టేకింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా హరీష్ శంకర్ అందించిన డైలాగ్స్ సూపర్బ్‌గా పేలాయి. ప్రీ క్లైమాక్స్ వరకు సినిమాను బాగానే నడిపించిన దర్శకుడు క్లైమాక్స్ విషయంలో నిరాశపరిచాడు. యాక్షన్ మూడ్‌లో సాగుతున్న సినిమా క్లైమాక్స్ వచ్చే సరికి పూర్తిగా కామెడీ టర్న్ తీసుకోవటం కాస్త ఇబ్బంది పెడుతుంది. కామెడీ ఆకట్టుకున్నా.. క్లైమాక్స్‌లో ఉండాల్సిన ఇంటెన్సిటీ మాత్రం మిస్ అయ్యింది. దేశీ శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మరో ఎసెట్. టైటిల్ సాంగ్‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : అల్లు అర్జున్ యాక్టింగ్ పూజ హెగ్డే గ్లామర్ డైలాగ్స్ మైనస్ పాయింట్స్ : రొటీన్ కథ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ చదవండి: ప్చ్.. ఆ సినిమా నిరాశ పరిచేలా ఉంది! చదవండి రంగస్థలం రివ్యూ -
బన్ని ఫ్యాన్స్‌కు నిరాశేనా..!
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ డీజే దువ్వాడ జగన్నాథమ్. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సరైనోడు సినిమాతో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ సాధించిన బన్నీ, డీజతో తన రికార్డ్లను తానే బద్ధలు కొట్టాలని చూస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో అన్ని సినిమాలు రిలీజ్‌కు ఒక రోజు ముందే స్పెషల్ ప్రీమియర్స్ పేరుతో ప్రదర్శిస్తున్నారు. అయితే డీజే కి మాత్రం అలాంటి హడావిడి ఏం ఉండదని తెలుస్తోంది. సరైనోడు సినిమాను ఎలాంటి బెనిఫిట్ షోస్ లేకుండా సినిమాను రిలీజ్ చేశారు. అదే ఫార్ములాను డీజే విషయంలో కూడా ఫాలో అవ్వాలని నిర్ణయించారు. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. డీజే ఆడియోకు సూపర్ రెస్పాన్స్ వస్తుండటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
బన్నీకి అన్నీ కలిసొస్తున్నాయ్..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఈ శుక్రవారం డీజే దువ్వాడ జగన్నాథమ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సరైనోడు సినిమాతో కెరీర్లో బిగెస్ట్ హిట్ సాధించిన బన్నీ డీజేతో మరోసారి రికార్డ్లను తిరగరాయలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే సినిమా మీద పాజిటవ్ బజ్ క్రియేట్ అయ్యింది. తాజాగా రిలీజ్ విషయంలో కూడా బన్నీకి టైం బాగా కలిసొస్తుంది. ఈ వారం మూడు చిన్న సినిమాలు రిలీజ్ అయినా ఏది వచ్చే వారం వరకు థియేటర్లలో నిలబడే పరిస్థితి కనిపించటం లేదు. ఇక వచ్చే వారం డీజే సోలోగా థియేటర్లలోకి వస్తున్నాడు. ఆ తరువాత వారం కూడా బన్నీకి బోనస్‌గా కలిసొచ్చింది. డీజే రిలీజ్ అయిన వారం తరువాత రిలీజ్ కావాల్సిన కథలో రాజకుమారి, శమంతకమణి సినిమాలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే 15 రోజుల పాటు డీజే దూకుడును ఆపేవారే ఉండరు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మరోసారి రికార్డ్‌లు సృష్టించటం కాయం అంటున్నారు ఫ్యాన్స్. -
తండ్రి చేసిన పాత్రలోనే..!
ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉన్న నటుడు రావు రమేష్. లెజెండరీ యాక్టర్ రావు గోపాలరావు తనయుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిర రమేష్.. లేట్‌గా అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ప్రతీ సినిమాలో రావు రమేష్ కంపల్సరీ యాక్టర్‌గా మారిపోయాడు. ఈ శుక్రవారం రిలీజ్‌కు రెడీ అవుతున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్లో కనిపిస్తున్నాడు రావు రమేష్. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న డీజేలో రావు రమేష్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. రావుగోపాల్ రావు.. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో కనిపించిన గెటప్ లోనే డీజే సినిమాలో నటిస్తున్నాడు రావు రమేష్. కేవలం లుక్ మాత్రమే కాదు.. క్యారెక్టర్ పేరు కూడా రొయ్యల నాయుడే కావటం విశేషం. అయితే క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుందన్న రమేష్, తన తండ్రికి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త పడతానని చెబుతున్నాడు. -
బన్నీ కొత్త సినిమా మొదలైంది
హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ షూటింగ్ పూర్తి చేసిన అల్లు అర్జున్, ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా తన నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేశాడు. స్టార్ రైటర్ వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ కొత్త సినిమాను ప్రారంభించాడు. లగడపాటి శ్రీధర్, నాగబాబులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్‌ను సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న డీజేను ఈ నెల 23న భారీగా రిలీజ్ చేస్తున్నారు. తొలిసారిగా అల్లు అర్జున్ బ్రాహ్మణుడి పాత్రలో నటిస్తున్న డీజే పై భారీ అంచనాలు ఉన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటించింది. -
బన్నీ సినిమా పేరు మారుతోందా..?
త్వరలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఆ తరువాత ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు. స్టార్ రైటర్‌గా పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో బన్నీ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలాఖరున సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాకు 'నా పేరు సూర్య.. నా ఇళ్లు ఇండియా' అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్టుగా చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం చిత్రయూనిట్ ఈ సినిమాకు మరో టైటిల్‌ను నిర్ణయించాలని భావిస్తుందట. కొత్త టైటిల్‌ను సినిమా ఓపెనింగ్ రోజే ఎనౌన్స్ చేసే అవకాశం ఉందంటున్నారు. మెగా బ్రదర్ నాగబాబు, లగడపాటి శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు. -
డీజే ట్రైలర్ రిలీజ్
-
డీజే.. రిలీజ్‌కు ముందు రెండు వేడుకలు
సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ డీజే దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. బన్నీ బ్రాహ్మణుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. టీజర్ ట్రైలర్లతో పాటు ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కేవలం 46 గంటల్లోనే 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అయితే ఈ అంచనాలను మరింత పెంచేందుకు డీజే టీం ప్లాన్ చేస్తోంది. రిలీజ్‌కు మరో 14 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో రెండు భారీ వేడుకలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ నెల 11న హైదరబాద్ శిల్పకళావేదికలో ఆడియో రిలీజ్ వేడుక నిర్వహించనున్నట్టుగా ప్రకటించారు. దాంతో పాటు సినిమా రిలీజ్‌కు ముందు జూన్ 18న వైజాగ్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించే ప్లాన్‌లో ఉన్నారు. ఈ రెండు వేడుకలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత హైప్ క్రియేట్ చేయోచ్చని భావిస్తోంది డీజే టీం. -
డీజే రిలీజ్‌కు ముందే మరో సినిమా..!
ప్రస్తుతం డీజే దువ్వాడ జగన్నాథమ్ పనుల్లో బిజీగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తరువాత ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా మరో సినిమాను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే డీజే షూటింగ్ ఆఖరి దశకు చేరుకోవటంతో తరువాత చేయబోయే సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నాడు. దువ్వాడ జగన్నాథమ్ సినిమా ఈ నెల 23న రిలీజ్ అవుతోంది. అంతకన్నా ముందే జూన్ 21 నుంచే కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. స్టార్ రైటర్ వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా చేస్తున్నట్టుగా బన్నీ ఇప్పటికే ప్రకటించాడు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల మూడో వారంలో ప్రారంభిస్తున్నారు. లగడపాటి శ్రీధర్, నాగబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఎన్టీఆర్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలని చాలా కాలం వెయిట్ చేసిన వక్కంతం వంశీ, ఎన్టీఆర్ డేట్స్ దొరక్కపోవటంతో బన్నీతో ఈ సినిమా చేస్తున్నాడు. -
దుమ్ములేపుతున్న డీజే ట్రైలర్
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ డీజే దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే సినిమా మీద వచ్చిన వివాదాల కారణంగా విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను దిల్ రాజు పరిచయం చేసిన దర్శకులందరి సమక్షంలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. కేవలం కొద్ది గంటల ముందే ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించినా.. రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది డీజే ట్రైలర్. బ్రాహ్మణుడిగా బన్నీ చెప్పిన ఫన్నీ డైలాగ్ లతో పాటు 'పబ్బుల్లో వాయించే డీజే కాదు.. పగిలిపోయేలా వాయించే డీజే..' 'మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్ఛామీ కాదు సార్.. యుద్ధం శరణం గచ్ఛామీ' లాంటి డైలాగ్స్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ రిలీజ్ అయిన 12 గంటల్లోనే రెండున్నర మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది డీజే ట్రైలర్. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను జూన్ 23న రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ట్రైలర్ లోనే అల్లు అర్జున్ స్వయంగా కన్ఫామ్ చేశాడు. -
షార్ట్ నోటీస్ : ఈ రోజే డీజే ట్రైలర్..!
అల్లు అర్జున్, హరీష్ శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా ట్రైలర్ ఈ రోజే(సోమవారం) రిలీజ్ కానుంది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాల ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ల రిలీజ్‌లను చాలా ముందుగానే ప్రకటిస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ డీజే మాత్రం అలా ముందుగా ప్రకటించకుండా కేవలం కొన్ని గంటల ముందే ట్రైలర్ రిలీజ్‌ను ఎనౌన్స్ చేసింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాపై ట్రైలర్‌ను ఈరోజు సాయంత్ర ఏడున్నరకు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు దర్శకుడు హరీష్ శంకర్. బన్నీ బ్రహ్మాణుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన సాంగ్ టీజర్ వివాదాస్పదం కావటంతో ట్రైలర్ పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. Super Duper excited Guys ..... Sharp....... 7.30 Pm Today 👍👍 pic.twitter.com/D3AGWBi3TZ — Harish Shankar .S (@harish2you) 5 June 2017 -
బన్నీపై ట్యూబ్‌లైట్ ఎఫెక్ట్..!
సరైనోడు సినిమాతో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాను జూన్ 23న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అదే సమయంలో సౌత్‌లో భారీ చిత్రాలేవి లేకపోవటంతో బన్నీ భారీ బిజినెస్ చేయటం కాయం అని భావించారు. కానీ డీజే ఆశలపై నీళ్లు చల్లుతున్నాడు బాలీవుడ్ కండలవీరుడు. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ట్యూబ్‌లైట్ సినిమాను ఈద్ కానుకగా జూన్ 23న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. బాహుబలి సినిమాతో సౌత్ సినిమా నార్త్ లోనూ సత్తా చాటగలదని ప్రూవ్ కావటంతో.. ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలు సౌత్ మార్కెట్ మీద దృష్టి పెట్టారు. అందుకే ట్యూబ్‌లైట్ సినిమాను ఇక్కడ కూడా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో అదే రోజు రిలీజ్ అవుతున్న డీజే కలెక్షన్లపై ఎఫెక్ట్ పడుతుందని భావిస్తున్నారట. డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. బన్నీ బ్రాహ్మణుడిగా, కాంట్రక్ట్ కిల్లర్‌గా రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. మరి బన్నీ బిజినెస్ మీద బాలీవుడ్ ఖాన్ ఎంత వరకు ఎఫెక్ట్ చూపిస్తాడో చూడాలి. -
రిలీజ్‌కు ముందే 'డీజే' రికార్డ్..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా జూన్ 23న రిలీజ్ చేయనున్నారు. అల్లు అర్జున్ బ్రాహ్మణుడిగా కాంట్రాక్ట్ కిల్లర్‌గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్‌లోనూ రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి దెబ్బకు బాలీవుడ్ నిర్మాతలు తెలుగు సినిమా కోసం క్యూ కడుతున్నారు. అదే బాటలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాకు కూడా భారీ మొత్తాన్ని చెల్లించి డబ్బింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. బన్నీ డీజే రిలీజ్ కు ముందు నుంచే రికార్డ్ లు వేట మొదలు పెట్టాడు. దాదాపు 7 కోట్ల రూపాయలకు డీజే డబ్బింగ్ రైట్స్ అమ్ముడయినట్టుగా ప్రచారం జరుగుతోంది. కేవలం ఒక్క భాషలో తెరకెక్కిన సినిమాకు బాలీవుడ్ డబ్బింగ్ రైట్స్ ఇంత మొత్తానికి అమ్ముడవ్వటం ఇదే తొలిసారి. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. -
బన్నీ vs మహేష్
-
బన్నీ vs మహేష్
టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్‌లు పక్కా ప్లాన్‌తో దూసుకుపోతున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే నెక్ట్స్ సినిమా ను రెడీ చేసేస్తున్నారు. అంతేకాదు షూటింగ్ కూడా ప్రారంభం కాకముందు రిలీజ్ డేట్ల కోసం ఖర్చీఫ్ వేసేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న స్పైడర్ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి 2018 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. అయితే నిర్మాణాంతర కార్యక్రమాలు ఎక్కువ సమయం పడుతుందన్న ఆలోచనతో డీజే జూన్ 23న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమాను ఎనౌన్స్ చేశాడు బన్నీ. నాపేరు సూర్య నా ఇళ్లు ఇండియా అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను కూడా ఆరు నెలల్లో పూర్తి చేసి 208 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గత రెండేళ్లుగా సంక్రాంతి సీజన్లో భారీ పోటిని చూస్తున్న ప్రేక్షకులకు వచ్చే ఏడాది కూడా కనువిందు చేసేందుకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు. -
పక్కాగా ప్లాన్ చేస్తున్న బన్నీ
ప్రస్తుతం డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా పనుల్లో ఉన్న అల్లు అర్జున్, ఆ సినిమాను జూన్ 23న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తాను చేయబోయే నెక్ట్స్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే కథా రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమా ఉంటుదని ప్రకటించిన బన్నీ.. ఆ సినిమా రిలీజ్ డేట్‌పై కూడా ఓ నిర్ణయం తీసుకున్నాడు. యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కనున్న బన్నీ నెక్ట్స్ సినిమాను 2018 సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్లు సంగీతం అందిస్తుండగా.. రాజీవ్ రవి సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. దువ్వాడ జగన్నాథమ్ పనులు పూర్తి చేసి జూన్ నెలలో ఈ సినిమాను ప్రారంభించాలని భావిస్తున్నారు. -
నానికి షాక్ ఇచ్చిన అల్లు అర్జున్
వరుస సక్సెస్‌లతో సూపర్ ఫాంలో ఉన్న నాని హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా నిన్ను కోరి. శివ నిర్మాణ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సమ్మర్లోనే రిలీజ్ అవుతుందని భావించారు. అయితే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవటంతో పాటు భారీ చిత్రాలు వరుసగా రిలీజ్ అవుతుండటంతో నిన్నుకోరి రిలీజ్‌కు సరైన సమయం దొరకటం లేదు. ముందుగా ఈ సినిమాను మే నెలలోనే రిలీజ్ చేయాలని భావించారు. అయితే అప్పటికి అన్ని కార్యక్రమాలు పూర్తి కావన్న ఆలోచనతో మహేష్ కాలీ చేసిన జూన్ 23న రిలీజ్ అంటూ ప్రకటించారు. కానీ కొద్ది గంటల్లోనే మరోసారి నాని సినిమా వాయిదా వేయక తప్పలేదు. అదే రోజు అల్లు అర్జున్ డీజే దువ్వాడ జగన్నాథమ్ రిలీజ్ అవుతున్నట్టుగా ప్రకటించటంతో నాని తన సినిమాను మరోసారి వాయిదా వేశాడు. నాని సరసన నివేద థామస్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మరో రెండు వారాలపాటు వాయిదా వేసి జూలై 7న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సరైనోడు సినిమాతో విలన్‌గా ఆకట్టుకున్న తమిళ నటుడు ఆది ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. -
సభ్యసమాజానికి అల్లు అర్జున్ మెసేజ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ను బన్నీ ప్రకటించాడు. ముందుగా ఈ సినిమాను మేలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే నిర్మాణాంతర కార్యక్రమాలు ఆలస్యమవుతుండటంతో సినిమాను వాయిదా వేశారు. మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పైడర్ ను జూన్ చివరి వారంలో రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఈ సినిమా వాయిదా పడటంతో ఆ గ్యాప్ ను బన్నీ ఫిల్ చేస్తున్నాడు. మహేష్ మిస్ అయిన జూన్ 23న బన్నీ ఎంట్రీ ఇస్తున్నాడు. డీజే సినిమాను జూన్ 23న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు బన్నీ. ఇప్పటి వరకు డీజేలో బన్నీ బ్రాహ్మణ పాత్రకు సంబంధించిన స్టిల్స్ ను మాత్రమే రిలీజ్ చేసిన యూనిట్ తాజాగా బన్నీ మార్క్ స్టైలిష్ లో సూటు బూటుతో ఉన్న బన్నీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'సభ్య సమాజానికి మెసేజ్ : డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా జూన్ 23న రిలీజ్ అవుతుంది' అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. Sabbhya Samajaniki Message: DJ DUVVADA JAGANNADHAM Movie releasing on 23rd JUNE 2017! #DJ23rdJune ! pic.twitter.com/Y7AooLY4EW — Allu Arjun (@alluarjun) 22 April 2017 -
బన్నీ డేట్‌కు చైతూ..!
-
బన్నీ డేట్‌కు చైతూ..!
అల్లు అర్జున్‌కు సమ్మర్ సీజన్లో తిరుగులేని రికార్డ్ ఉంది. అందుకే ఈ ఏడాది కూడా సమ్మర్లో రిలీజ్ చేసేందుకు డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాను రెడీ చేస్తున్నాడు. కానీ ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయం కన్నా ఆలస్యం అవుతుండటంతో సమ్మర్‌ను కాదని కాస్త ఆలస్యంగా రావాలని ఫిక్స్ అయ్యారు చిత్రయూనిట్. ముందుగా అనుకున్నట్టుగా మే 19న కాకుండా జూలై రెండో వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బన్నీ మిస్ అయిన డేట్‌ను క్యాష్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అక్కినేని నట వారసుడు నాగ చైతన్య. ప్రస్తుతం సోగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటిస్తున్నాడు చైతన్య. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 19 రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. చాలా రోజులుగా సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో బన్నీ డీజే రిలీజ్ వాయిదా వేస్తున్నాడన్న వార్త బయటకు వచ్చింది. దీంతో ఆ గ్యాప్‌ను క్యాష్ చేసుకోవాలకున్న నాగచైతన్య టీం వెంటనే తమ సినిమాను మే 19 రిలీజ్‌కు ఫిక్స్ అయ్యారు. నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. నాగార్జున కెరీర్‌కు నిన్నే పెళ్లాడతా ఎంతటి బూస్ట్ ఇచ్చిందో.. రారండోయ్ వేడుక చూద్దాం నాగచైతన్య కెరీర్‌కు అంత ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
అల్లు అర్జున్ అభిమానులకు షాక్..?
సరైనోడు సినిమాతో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటిస్తున్నాడు. బన్నీ బ్రాహ్మణుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ సినిమా మీద అంచనాలు రెట్టింపు చేయగా.. చిత్రయూనిట్ ఇప్పుడు అభిమానులకు ఓ షాక్ ఇచ్చింది. షూటింగ్ సమయంలోనే ఈ సినిమాను మే 19న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. సమ్మర్ బరిలో బన్నీకి మంచి రికార్డ్ ఉండటంతో డీజే బన్నీ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. కానీ అభిమానులకు షాక్ ఇస్తూ డీజే సినిమాను రెండు నెలలపాటు వాయిదా వేశారన్న టాక్ వినిపిస్తోంది. అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తి కాకపోవటం, తరువాత మహేష్ 23 సినిమా రిలీజ్ ఉండటంతో రెండు నెలల పాటు సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. -
యాక్షన్ మోడ్‌లో డీజే
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ సినిమాలో బ్రాహ్మణుడిగా కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్స్ అన్నింటిలో బన్నీని సాఫ్ట్ గా చూపించిన డీజే టీం. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా శనివారం రిలీజ్ చేసిన పోస్టర్ లో మాత్రం మోడ్ మార్చారు. పంచ్ కట్టులో కనిపిస్తున్న బన్నీ ఓ సూపర్ యాక్షన్ ఎపిసోడ్ కు రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది ఈ నయా పోస్టర్.సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత బన్నీ చేస్తున్న సినిమా కావటంతో డీజే దువ్వాడ జగన్నాథమ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మే నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
స్టైలిష్ స్టార్‌తో శాండల్‌వుడ్ బ్యూటీ
ప్రస్తుతం డీజే దువ్వాడ జగన్నాథమ్ షూటింగ్ లో బిజీగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డీజేలో బ్రాహ్మణుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న యాక్షన్ డ్రామాలో హీరోగా నటించేందుకు అంగీకరించాడు బన్నీ. ఇప్పటికే ఫైనల్ అయిన ఈ ప్రాజెక్ట్ కు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో బన్నీ సరసన హీరోయిన్గా శాండల్ వుడ్ బ్యూటీని పరిచయం చేయాలని భావిస్తున్నారట. కన్నడలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన కిర్రాక్ పార్టీ సినిమాతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మిక మందనను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే తెలుగులో పలు సినిమాలకు ఓకె చెప్పే ఆలోచనలో ఉన్న రష్మిక బన్నీ సినిమాలో ఛాన్స్ తప్పకుండా ఓకె చెప్పేస్తోంది. -
డీజే వివాదంపై స్పందించిన డైరెక్టర్
సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా డీజే దువ్వాడ జగన్నాథమ్. మాస్ కమర్షియల్ సినిమాల స్సెషలిస్ట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్ తెరపై సరికొత్త వార్‌కు తెర తీసింది. రికార్డ్ వ్యూస్‌తో సంచలనాలు నమోదు చేస్తున్న డీజే టీజర్ మరో అరుదైన రికార్డ్‌ను కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఈ సినిమాకు ఎన్ని లైక్స్ వచ్చాయో.. దాదాపు అదే స్థాయిలో డిస్ లైక్స్ కూడా వచ్చాయి. ఓ స్టార్ హీరో సినిమాకు ఇంత తక్కువ సమయంలో ఇన్ని డిస్ లైక్స్ రావటం కూడా ఓ రికార్డే అన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇది పవన్ ఫ్యాన్స్ కావాలనే చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో డీజే దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో స్పందించాడు. డైరెక్ట్‌గా డిస్ లైక్స్ వివాదాన్ని ప్రస్థావించకుండా వేదాంత దోరణిలో హరీష్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. డీజే టీజర్ 50 లక్షల వ్యూస్ సాధించినందుకు అభిమానులకు కృతజ్ఙతలు తెలిపిన దర్శకుడు 'నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్థాక్షిణ్యంగా వీరే' అనే శ్రీ శ్రీ కవితను జోడించాడు. అంతేకాదు డిస్ లైక్స్ చేస్తున్న వారిని ఉద్దేశించి.. 'థ్యాంక్స్ ఫర్ దట్ వ్యూస్, దిస్ లైక్స్ యత్ భావం తత్ భవతి' అంటూ కామెంట్ చేశాడు. Thanks for that views & this likes "Yatbhaavam Tadbhavati " pic.twitter.com/twpKAxO6K9 — Harish Shankar .S (@harish2you) 27 February 2017 -
డీజే రిలీజ్ ఎప్పుడంటే..?
సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా డీజే దువ్వాడ జగన్నాథమ్. కమర్షియల్ దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్లకు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలను క్యాష్ చేసుకోవడానికి సినిమాను మంచి టైంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. బన్నీకి బాగా కలిసొచ్చిన సమ్మర్ సీజన్ అయితేనే రిలీజ్‌కు కరెక్ట్ అని భావిస్తున్నారు. అయితే ఈ సమ్మర్లో భారీ చిత్రాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. మార్చి నెలాఖరున పవన్ కళ్యాణ్ కాటమరాయుడు రిలీజ్‌కు రెడీ అవుతుండగా, ఏప్రిల్ చివర్లో బాహుబలి థియేటర్ల లోకి రానుంది. ఇన్నాళ్లు మహేష్ సినిమా రిలీజ్ విషయంలో ఉన్న అనుమానాలకు తెర దించుతూ దర్శకుడు మురుగదాస్ జూన్ 23న సినిమా రిలీజ్ అంటూ ప్రకటించేశాడు. మధ్యలో కాలీగా ఉన్న మే నెలలోనే దువ్వాడ జగన్నాథాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. సమ్మర్ సీజన్‌తో పాటు, మరో భారీ చిత్రం రిలీజ్‌కు నెల రోజుల గ్యాప్ ఉండటంతో ఇదే కరెక్ట్ టైం అని భావిస్తున్నారట. అయితే బాహుబలి అనుకున్నట్టుగా ఏప్రిల్ 28న రిలీజ్ అయితే డీజే.., మే లో థియేటర్లలోకి వస్తుంది. బాహుబలి ఏ మాత్రం ఆలస్యమైనా ఆ తరువాత రిలీజ్ అవ్వబోయే సినిమాల రిలీజ్ డేట్స్‌లో కూడా మార్పులు కాయం అంటున్నారు విశ్లేషకులు. -
దువ్వాడ జగన్నాథమ్ హవా మొదలైంది
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కతున్న లేటెస్ట్ మూవీ డీజే దువ్వాడ జగన్నాథమ్. బన్నీ పూర్తి మేకోవర్‌లో కనిపిస్తున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన డీజే టీం ఇప్పుడు టీజర్‌తో రికార్డ్ల వేట మొదలు పెట్టింది. గురువారం రిలీజ్ అయిన డీజే ఫస్ట్ లుక్ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం 50 గంటల్లో ఈ టీజర్ మిలియన్ వ్యూస్ మార్క్‌ను దాటి బన్నీ కెరీర్లో సరికొత్తి రికార్డ్ సృష్టించింది. అదే జోరును కంటిన్యూ చేస్తూ 2 మిలియన్ మార్క్‌ను దాటి దూసుకుపోతొంది. ఇప్పటికే 25 లక్షలకు పైగా వ్యూస్ సాధించిన డీజే దువ్వాడ జగన్నాథమ్ టీజర్ ముందు ముందు మరిన్ని రికార్డ్‌లు సృష్టిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్‌పై స్పందించిన హీరో అల్లు అర్జున్, దర్శకుడు హరీష్ శంకర్లు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ....... And counting ........ pic.twitter.com/mukgX2HC4N — Harish Shankar .S (@harish2you) 25 February 2017 Thank you all for the great response and heartfelt compliments about DJ teaser . Thank you ! — Allu Arjun (@alluarjun) 25 February 2017 -
అల్లు అర్జున్‌కు షాక్ ఇచ్చిన లీకు వీరులు
స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడద తప్పటం లేదు. కోట్ల ఖర్చుతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలకు సంబంధించిన విశేషాలు అఫీషియల్ రిలీజ్ కన్నా ముందే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. యూనిట్ సభ్యులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకు వీరుల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు కూడా ఈ సమస్య ఎదురైంది. బన్నీ తాజా చిత్రం డీజే దువ్వాడ జగన్నాథమ్ ఫస్ట్ లుక్‌ను ఫిబ్రవరి 18న రిలీజ్ చేయాలని ఫ్లాన్ చేయగా ఒక రోజు ముందే బన్నీ లుక్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. సరైనోడు సినిమాతో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన అల్లు అర్జున్, ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ బ్రాహ్మణ పాత్రలో నటిస్తున్నాడు. అర్జున్ ఈ సినిమాలో అదుర్స్ లో ఎన్టీఆర్ తరహా క్యారెక్టర్లో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఫిబ్రవరి 18న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు చిత్రయూనిట్. -
బన్నీతో మూడో విజయం ఖాయం : ‘దిల్’ రాజు
-
బన్నీతో మూడో విజయం ఖాయం : ‘దిల్’ రాజు
అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శ్యామ్ ప్రసాద్‌రెడ్డి కెమేరా స్విచాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ - ‘‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ 25వ చిత్రమిది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత రాజుగారి నిర్మాణ సంస్థలో ఎంటరయ్యాను. నేను బయటకు వెళ్లడం లేదు, ఆయన వెళ్లనివ్వడం లేదు. ఈ సంస్థలో మూడు కాదు, ముప్ఫై చిత్రాలు చేయడానికి నేను రెడీ. ‘నా ఆటోగ్రాఫ్’ చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేస్తున్నప్పుడు రాజమండ్రిలో ‘ఆర్య’ చూశాను. అప్పట్నుంచీ బన్నీతో ఓ చిత్రం చేయాలనే నా కోరిక ఇన్నాళ్లకు నేరవేరింది. ప్రతి చిత్రానికి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ, విజయాలతో పాటు కష్టాన్ని పెంచుకుంటున్న బన్నీతో పని చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ - ‘‘అల్లు అర్జున్ మా సంస్థలో నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. ఎగ్జైటింగ్‌గా ఉంది. ‘ఆర్య’, ‘పరుగు’ తరహాలో ఈ ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్’ సక్సెస్ సాధిస్తుంది. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. వచ్చే వేసవి కానుకగా ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కూర్పు: గౌతమ్‌రాజు, కళ: రవీందర్, స్క్రీన్‌ప్లే: దీపక్ రాజ్, కెమేరా: అయాంకా బోస్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.