రిలీజ్కు ముందే 'డీజే' రికార్డ్..! | DJ Duvvada Jagannadham Hindi Dubbing Rights | Sakshi

రిలీజ్కు ముందే 'డీజే' రికార్డ్..!

May 7 2017 2:29 PM | Updated on Sep 5 2017 10:38 AM

రిలీజ్కు ముందే 'డీజే' రికార్డ్..!

రిలీజ్కు ముందే 'డీజే' రికార్డ్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా జూన్ 23న రిలీజ్ చేయనున్నారు. అల్లు అర్జున్ బ్రాహ్మణుడిగా కాంట్రాక్ట్ కిల్లర్గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్లోనూ రిలీజ్ చేస్తున్నారు.

బాహుబలి దెబ్బకు బాలీవుడ్ నిర్మాతలు తెలుగు సినిమా కోసం క్యూ కడుతున్నారు. అదే బాటలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాకు కూడా భారీ మొత్తాన్ని చెల్లించి  డబ్బింగ్ రైట్స్ను సొంతం చేసుకున్నారు. బన్నీ డీజే రిలీజ్ కు ముందు నుంచే రికార్డ్ లు వేట మొదలు పెట్టాడు. దాదాపు 7 కోట్ల రూపాయలకు డీజే డబ్బింగ్ రైట్స్ అమ్ముడయినట్టుగా ప్రచారం జరుగుతోంది. కేవలం ఒక్క భాషలో తెరకెక్కిన సినిమాకు బాలీవుడ్ డబ్బింగ్ రైట్స్ ఇంత మొత్తానికి అమ్ముడవ్వటం ఇదే తొలిసారి. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement