డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ సంచలన వ్యాఖ్యలు! | director Harish Shankar sensational comments | Sakshi
Sakshi News home page

డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ సంచలన వ్యాఖ్యలు!

Published Tue, Jun 27 2017 12:05 PM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM

డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ సంచలన వ్యాఖ్యలు!

డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ సంచలన వ్యాఖ్యలు!

హైదరాబాద్‌: 'డీజే దువ్వాడ జగన్నాథం' సినిమాతో భారీ వసూళ్లు రాబడుతున్న డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలక​లం రేపుతున్నాయి. 'డీజే' సినిమా థాంక్స్‌ మీట్‌లో హరీశ్‌ శంకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'డీజే' సినిమాపై కొన్ని వెబ్‌సైట్లలో వచ్చిన రివ్యూలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. 'నాకు కళ్లు నెత్తికెక్కాయి అనడానికి మీరెవరు?' అంటూ రివ్యూ రచయితలపై ఫైర్‌ అయ్యాడు. 'నేను ఎవ్వరి విమర్శలకు సమాధానం చెప్పను? నా తీరే ఇంత. నా అటిట్యూడ్‌ వల్లే గబ్బర్‌సింగ్‌ వచ్చింది' అని అన్నాడు.

మంచి ఎంటర్‌టైనర్‌ సినిమాలు వస్తే రెవెన్యూలు చూడాలి కానీ రివ్యూలు కాదంటూ ఆయన చెప్పాడు. 'డీజే' సినిమాపై చాలావరకు ప్రతికూల సమీక్షలే వచ్చాయి. డివైడ్‌ టాక్‌ ఉందన్న వ్యాఖ్యలు వినిపించాయి. అయితే, బాక్సాఫీస్‌ వద్ద మాత్రం 'డీజే' సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. పెద్ద సినిమాలేవీ బరిలో లేకపోవడంతో, పోటీ లేకపోవడంతో మున్ముందు మరింత వసూళ్లు రాబట్టే అవకాశముందని తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement