జగన్నాథమ్‌ వచ్చి మూడేళ్లయింది | Allu Arjun Pooja Hegde DJ Duvvada Jagannadham Movie Completed 3 Years | Sakshi
Sakshi News home page

వివాదం.. వినోదం.. మూడేళ్లు

Published Tue, Jun 23 2020 11:20 AM | Last Updated on Tue, Jun 23 2020 12:02 PM

Allu Arjun Pooja Hegde DJ Duvvada Jagannadham Movie Completed 3 Years - Sakshi

టాలీవుడ్‌ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా మాస్‌ చిత్రాల దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన చితం ‘డీజే(దువ్వాడ జగన్నాథమ్‌)’. క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందించిన ఈ చిత్రం విడుదలై నేటికి మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా బన్ని అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ చిత్ర బృందం కొన్ని స్టిల్స్‌ను విడుదల చేసింది. బన్ని పోలీస్‌ గెటప్‌లో, హూజా హెగ్డే పంచెకట్టులో ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. స్టిల్స్‌ అదిరిపోవడంతో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. (కరోనా ఎఫెక్ట్‌.. ‘పుష్ప’ అప్‌డేట్‌!)

ఇక బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రంలో బన్ని కారెక్టరైజేషన్‌ చాలా కొత్తగా ఉంటుంది.  బన్నీ మార్క్ కామెడీ, యాక్షన్‌తో పాటు హరీశ్‌ శంకర్ మాస్ కమర్షియల్ టేకింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అగ్రహారంలో బ్రాహ్మణుడిగా, స్టైలీష్ కిల్లర్‌గా రెండు డిఫరెంట్ పాత్రల్లోనూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బ్రాహ్మణ కుర్రాడిగా బన్నీ చెప్పిన డైలాగ్‌లు సూపరో సూపరస్య సూపర్భ్యః.  బడిలో గుడిలో పాట విషయంలో వచ్చిన వివాదాలు కూడా సినిమాకు భారీ ప్రచారాన్ని తెచ్చిపెట్టాయి. (పెళ్లెప్పుడు బాబాయ్‌ : అల్లు అయాన్‌)

పంచెకట్టులో పద్దతిగా కనిపించినా.. మాస్ మసాలా సీన్స్ లోనూ ఇరగదీశాడు. హీరోయిన్ పూజ హెగ్డే గ్లామర్ షో.. రావు రమేశ్‌ విలనిజం.. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ ఇలా అన్ని కలగలిపి ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇక ఈ చిత్రం విడుదలై మూడేళ్లు అవుతున్నా టీవీల్లో, డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లో ‘డీజే’కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబ్‌లో హిందీ డబ్బింగ్‌ వర్షన్‌లో విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డులను కొల్లగొట్టింది. ఇక ప్రస్తుతం బన్ని క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శక్తత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు హరీశ్‌ శంకర్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమాతో పాటు మరో సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. 


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement