'అలా వైకుంఠపురములో చిత్రంపై పూజా హెగ్డే కామెంట్స్'.. బుట్టబొమ్మపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం | Pooja Hegde Comments On Allu Arjun Movie Ala Vaikunthapurramuloo Creates Controversy, Deets Inside | Sakshi
Sakshi News home page

Pooja Hegde: 'అలా వైకుంఠపురములో' మూవీ.. పూజా హెగ్డే వ్యాఖ్యలపై ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫైర్

Published Tue, Feb 4 2025 8:24 PM | Last Updated on Wed, Feb 5 2025 9:17 AM

Pooja Hegde Comments On Allu Arjun Movie Ala Vaikunthapurramuloo

టాలీవుడ్‌లో బుట్టబొమ్మగా అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే దేవా మూవీలో షాహిద్ కపూర్ సరసన కనిపించింది.  ఈ చిత్రం జనవరి 31న థియేటర్లలో విడుదలైంది. అయితే అంతుకుముందు ఈ సినిమా ప్రమోషన్లలో మెరిసింది పూజా హెగ్డే. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలో మాట్లాడింది. అయితే ఓ ఇంటర్వ్యూలో పూజా మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి. అంతే కాదు.. బుట్టబొమ్మ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందా.

టాలీవుడ్‌లో పూజా హెగ్డే పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా బన్నీ, ప్రభాస్ లాంటి స్టార్స్‌తో సినిమాలు చేశారు. అల్లు అర్జున్‌ సరసన అలా వైకుంఠపురములో పూజా హెగ్డే మెరిసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీని ఉద్దేశించి తాజాగా పూజా చేసిన కామెంట్స్ ఆగ్రహానికి దారితీశాయి. అలా వైకుంఠపురములో మూములుగా తమిళ చిత్రం అంటూ మాట్లాడింది. అదే సినిమాను హిందీలో కూడా రీమేక్ చేశారని మాట్లాడింది. దీంతో పూజా హెగ్డే కామెంట్స్‌పై టాలీవుడ్‌ ఫ్యాన్స్‌తో పాటు బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా పూజా హెగ్డే వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. అసలు మీరు ఏ భాషలో మూవీ చేశారో కూడా మర్చిపోయారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మీ మాటలు చూస్తుంటే సిగ్గుగా ఉందని.. తెలుగు చిత్రంలో మీరు లీడ్ రోల్‌ చేసిన సినిమాను తమిళ్ చిత్రమని ఎలా చెబుతారంటూ నిలదీస్తున్నారు. కాగా.. అలా వైకుంఠపురములో హిందీ రీమేక్‌లో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను షెహజాదాగా బాలీవుడ్‌లో రిలీజ్ చేయగా.. ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement