Photo Credit: BCCI Twitter
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో ఆదివారం తిరువనంతపురం వేదికగా టీమిండియా తొలి వన్డే ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రాక్టీస్ ఆరంభించిన భారత జట్టు శుక్రవారం రెండు జట్లుగా విడిపోయి ఇంట్రా స్వ్కాడ్ మ్యాచ్ ఆడాయి. ఇండియా-ఏ జట్టులో గిల్, కోహ్లి, జడేజా, రుతురాజ్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేయగా, ఇండియా-బి జట్టులో రోహిత్ శర్మ, జైస్వాల్, ధ్రువ్ జురెల్, నితీశ్‌కుమార్ రెడ్డి, నమన్ ధిర్‌లు బ్యాటింగ్ చేశారు.
ఇరుజట్లు 50 ఓవర్ల మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు విజయం సాధించింది. సీనియర్లు కోహ్లి, రోహిత్‌లు బ్యాటింగ్‌లో అదరగొట్టగా, కెప్టెన్ గిల్ ప్లాఫ్ అయ్యాడు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఎ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 88 బంతుల్లో 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రవీంద్ర జడేజా 39 బంతుల్లో 45 పరుగులతో అజేయంగా నిలిచాడు. రుతురాజ్ గైక్వాడ్ 38 బంతుల్లో 42 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ 29 బంతుల్లో 36 పరుగులతో రాణించాడు. కానీ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాత్రం 8 బంతుల్లో 7 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.
అనంతరం 320 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-బి 50 ఓవర్లలో 7 వికెట్లకు 309 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 68 బంతుల్లో 72 పరుగులతో ఆకట్టుకోగా.. రోహిత్ శర్మ 59 బంతుల్లో 64 పరుగులు చేశాడు. వీరిద్దరూ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు.
మిడిలార్డర్‌లో నితీష్ కుమార్ రెడ్డి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 57 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. నమన్ ధిర్ 28 బంతుల్లో 31 పరుగులు చేశాడు. అలా చివరికి ఇండియా-బి 309 పరుగులకే పరిమితమై ఓటమి చవిచూసింది. మొత్తం మీద ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ద్వారా కోహ్లి, రోహిత్ తమ బ్యాటింగ్‌తో అలరించారు.
తొలి వన్డే తిరువనంతపురం వేదికగా జరుగనుండగా, రెండో మ్యాచ్ గౌహతి వేదికగా సెప్టెంబర్ 30న ఉంటుంది. అక్టోబర్ 3వ తేదీన న్యూ ఛండీఘర్ వేదికగా చివరి మ్యాచ్ జరగుంది. ఈ వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ బరిలోకి దిగనున్నారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ షురూ కానుంది.
ఇదీ చదవండి: విండీస్‌తో తొలి వన్డే.. భారత తుదిజట్టు అంచనా!


