ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. 2020లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ మూవీ విడుదలైన ఐదేళ్లు పూర్తి కావడంతో అల్లు అర్జున్ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రం నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుందని పోస్ట్ చేశారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన త్రివిక్రమ్, చినబాబు, అల్లు అరవింద్, తమన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ అద్భుతమైన చిత్రానికి జీవం పోసిన నటీనటులు, సిబ్బందితో పాటు మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ మూవీ సమయంలో దిగిన ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం బన్నీ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
5 years of #AlaVaikunthapurramuloo! This film will always hold a special sweet place in my heart. A heartfelt thank you to #Trivikram Garu, Chinna Babu Garu, Allu Aravind Garu, brother @MusicThaman, @vamsi84 garu and the entire cast and crew for bringing this magical film to… pic.twitter.com/N0w7lsR8Lq
— Allu Arjun (@alluarjun) January 12, 2025
AVPL DAYS 💛 THROWBACK MEMORIES 💛 pic.twitter.com/7Nz904BaH2
— Allu Arjun (@alluarjun) January 12, 2025
Comments
Please login to add a commentAdd a comment