
వరుస విజయాలతో దూసుకుపోతూ ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయారు పూజా హెగ్డే. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అల..వైకుంఠపురములో’ చిత్రంలో ఈ బుట్టబొమ్మ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటోంది. అయితే ‘బుట్టబొమ్మ’సాంగ్‌తో పూజా హెగ్డే షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేసింది. అయితే ఈ పాట షూట్‌కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేస్తూ ఇది ఎవరికీ చెప్పకండి అంటూ సరదాగా కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఈ సాంగ్‌లో బన్ని-పూజాల జంట చూడముచ్చటగా ఉందని కామెంట్ చేస్తున్నారు.
‘బుట్టబొమ్మ.. బుట్టబొమ్మ నన్ను సుట్టుకుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టూ కుంటివే’ అంటూ పూజా హెగ్డే కోసం అల్లు అర్జున్ పాడే ఈ పాట ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను అర్మాన్‌మాలిక్ ఆలపించగా తమన్ కంపోజ్ చేశాడు. హీరోహీరోయిన్ల మధ్య సాగే ఈ డ్యుయెట్ సాంగ్ షూట్ కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియలో భారీ సెట్ వేశారని టాక్. అంతేకాకుండా కొరియోగ్రఫర్స్ కూడా వీరిద్దరికి తగ్గట్టు డిఫరెంట్ స్టెప్స్ కంపోజ్ చేశారని, అవి పాటకు దృశ్య రూపంలో మరింత అందాన్ని తెస్తుందని సమాచారం. అంతేకాకుండా పూజా షేర్ చేసిన వీడియోలో కూడా ఇదే స్పష్టమవుతోంది.
బన్ని-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇదివరకే వచ్చిన చిత్రాలు సూపర్‌డూపర్ హిట్ సాధించడంతో సాధారణంగానే ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికితోడు ‘సామజవరగమన, రాములో.. రాములా, బుట్టబొమ్మా’ వంటి సాంగ్స్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కు తీసుకెళ్లాయి. ఇక పాటలతో పాటు టీజర్ కూడా ఓ రేంజ్‌లో ఉండటంతో బన్ని-త్రివిక్రమ్‌లు హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. సుశాంత్, నివేతా పేతురాజ్, టబు, జయరామ్ వంటి భారీ తారగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిఅల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది.
Here’s a special sneak peak of #buttabomma for you’ll...shhhh...don’t tell anyone 🤫🤭😉 #alavaikunthapurramuloo #topsecret @alluarjun #Trivikram @MusicThaman @ArmaanMalik22 @haarikahassine @GeethaArts #PSVinod pic.twitter.com/9y9qpXYluQ
— Pooja Hegde (@hegdepooja) December 29, 2019
చదవండి:
6న బన్నీ ఫ్యాన్స్‌కు పండగే పండగ
స్నేహని పెళ్లి చేసుకుంటానని బన్నీ అన్నప్పుడు...
Comments
Please login to add a commentAdd a comment