
దువ్వాడ జగన్నాథమ్ హవా మొదలైంది
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కతున్న లేటెస్ట్ మూవీ డీజే దువ్వాడ జగన్నాథమ్. బన్నీ పూర్తి మేకోవర్లో కనిపిస్తున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన డీజే టీం ఇప్పుడు టీజర్తో రికార్డ్ల వేట మొదలు పెట్టింది. గురువారం రిలీజ్ అయిన డీజే ఫస్ట్ లుక్ టీజర్కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం 50 గంటల్లో ఈ టీజర్ మిలియన్ వ్యూస్ మార్క్ను దాటి బన్నీ కెరీర్లో సరికొత్తి రికార్డ్ సృష్టించింది.
అదే జోరును కంటిన్యూ చేస్తూ 2 మిలియన్ మార్క్ను దాటి దూసుకుపోతొంది. ఇప్పటికే 25 లక్షలకు పైగా వ్యూస్ సాధించిన డీజే దువ్వాడ జగన్నాథమ్ టీజర్ ముందు ముందు మరిన్ని రికార్డ్లు సృష్టిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు. టీజర్కు వచ్చిన రెస్పాన్స్పై స్పందించిన హీరో అల్లు అర్జున్, దర్శకుడు హరీష్ శంకర్లు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
....... And counting ........ pic.twitter.com/mukgX2HC4N
— Harish Shankar .S (@harish2you) 25 February 2017
Thank you all for the great response and heartfelt compliments about DJ teaser . Thank you !
— Allu Arjun (@alluarjun) 25 February 2017