డీజే.. రిలీజ్కు ముందు రెండు వేడుకలు | DJ to have both Audio and Pre Release events | Sakshi
Sakshi News home page

డీజే.. రిలీజ్కు ముందు రెండు వేడుకలు

Published Thu, Jun 8 2017 11:40 AM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

డీజే.. రిలీజ్కు ముందు రెండు వేడుకలు

డీజే.. రిలీజ్కు ముందు రెండు వేడుకలు

సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ డీజే దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. బన్నీ బ్రాహ్మణుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. టీజర్ ట్రైలర్లతో పాటు ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కేవలం 46 గంటల్లోనే 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.

అయితే ఈ అంచనాలను మరింత పెంచేందుకు డీజే టీం ప్లాన్ చేస్తోంది. రిలీజ్కు మరో 14 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఈ గ్యాప్లో రెండు భారీ వేడుకలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ నెల 11న హైదరబాద్ శిల్పకళావేదికలో ఆడియో రిలీజ్ వేడుక నిర్వహించనున్నట్టుగా ప్రకటించారు. దాంతో పాటు సినిమా రిలీజ్కు ముందు జూన్ 18న వైజాగ్లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించే ప్లాన్లో ఉన్నారు. ఈ రెండు వేడుకలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత హైప్ క్రియేట్ చేయోచ్చని భావిస్తోంది డీజే టీం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement