
ఈ యంగ్ హీరోని గుర్తుపట్టారా..?
రిలీజ్ రోజు స్టార్ హీరో సినిమా చూడటం అభిమానులకు ఓ అచీవ్మెంట్. అయితే అలాంటి కోరికలు సెలబ్రిటీలకు కూడా ఉంటాయి. కానీ వారికి ఆ కోరిక తీర్చుకోవడం కొంచెం కష్టమైన పనే. హీరోగా మంచి ఫాంలో ఉన్న స్టార్, మరో స్టార్ హీరో సినిమాను రిలీజ్ రోజు చూడాలంటే చాలా కష్టాలే పడాలి. అలాంటి కష్టమే ఎదురైంది యంగ్ హీరో రాజ్ తరుణ్కి.
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన దువ్వాడ జగన్నాథమ్ సినిమాను రిలీజ్ రోజు చూడాలనుకున్న రాజ్ తరుణ్ ఏకంగా మారువేశం వేసేసి థియేటర్లో ప్రత్యక్షమయ్యాడు. సినిమా చూసిన తరువాత తాను ఏ గెటప్ లో వెళ్లి సినిమా చూశాడో తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు రివీల్ చేశాడు. పొడవాటి గెడ్డంతో బాబాల కనిపిస్తున్న రాజ్ తరుణ్, ఏ థియేటర్లో సినిమా చూశాడో మాత్రం రివీల్ చేయలేదు.