Raj tarunn
-
రాజ్‌తరుణ్ కారు కేసు: కార్తీక్ రూ.3లక్షలకు బేరం
సాక్షి, అమరావతి: హీరో రాజ్‌తరుణ్ కారు ప్రమాదం వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నటుడు, రాజ్‌తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఉద్దేశపూర్వకంగానే తనతో పాటు రాజ్‌తరుణ్‌పై కార్తీక్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆయన అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత వాట్సాప్ ద్వారా కార్తీక్ కొన్ని వీడియోలు పంపాడని, తనతో సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేసినట్లు రాజా రవీంద్ర పేర్కొన్నారు. కార్తీక్ మొదట రూ.5 లక్షలు డిమాండ్ చేశాడని, ఆ తర్వాత రూ.3 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడని అన్నారు. కార్తీక్ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే తమపై ఆరోపణలు చేస్తున్నట్లు రాజా రవీంద్ర తెలిపారు. దీనిపై తాము న్యాయపరంగా ముందుకు వెళతామని ఆయన ... రాజ్‌తరుణ్ వీడియోలతో కార్తీక్ తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ గురువారం సాయంత్రం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: రాజ్‌తరుణ్ కారు కేసులో కొత్త ట్విస్ట్ కాగా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్కాపూరిలో సోమవారం రాత్రి రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అదే సమయంలో స్థానికంగా నివాసం ఉండే కార్తీక్ అనే యువకుడు తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ప్రమాదం జరిగిన వెంటనే రాజ్ తరుణ్ కారు దిగి పరుగులు పెడుతున్నట్లు... అతడిని పట్టుకోగా...తాను మద్యం సేవించినట్టు, వదిలిపెట్టమని కోరిన దృశ్యాలు బయటకు వచ్చాయి. అయితే ఆ వీడియోలు ఇవ్వమని రాజా రవీంద్ర తనను ఫోన్లో బెదిరిస్తున్నాడంటూ కార్తీక్ మీడియా ముందుకు వచ్చాడు. తనకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని కూడా ప్రలోభపెట్టినట్లు చెప్పుకొచ్చాడు. అయితే ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచినా.. రాజ్‌తరుణ్‌ను పోలీసులు విచారణ చేయలేదు. అంతేకాకుండా కేసు వివరాలను కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వెల్లడించలేదు. అయితే తాను సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్లే కారు ప్రమాదం నుంచి బయటపడినట్లు రాజ్ తరుణ్ మీడియాకు ఓ మెసేజ్ పెట్టిన విషయం విదితమే. -
వర్మగారే నాకు స్ఫూర్తి
‘‘మాది శ్రీకాకుళం జిల్లా టెక్కలి. ఐటీ కంపెనీలో కొన్ని రోజులు పని చేశా. జర్నలిస్ట్‌గా కూడా వర్క్ చేశాను. సినిమా రంగంపై ఆసక్తితో ఓ స్నేహితుడి ద్వారా రామ్‌గోపాల్ వర్మగారి వద్ద ‘రౌడీ’ సినిమాకి సహాయ దర్శకురాలిగా చేశా. నేను డైరెక్టర్ కావడానికి ఆయనే స్ఫూర్తి’’ అని సంజనారెడ్డి అన్నారు. రాజ్ తరుణ్ హీరోగా, అమైరా దస్తూర్, పూజిత హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘రాజుగాడు’. సంజనారెడ్డి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా జూన్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంజనారెడ్డి మాట్లాడుతూ– ‘‘శివ’ సినిమా 25 వసంతాల సమయంలో అమలగారిని కలిశాను. ఆమె నన్ను ఓ యాడ్‌ను డైరెక్ట్ చేయమన్నారు. నేను చేసిన యాడ్ అందరికీ నచ్చడంతో నాలో నమ్మకం పెరిగింది. అలా సినిమా ప్రయత్నాలు చేస్తున్న టైమ్‌లో రాజ్‌తరుణ్ పరిచయం అయ్యారు. ‘రాజుగాడు’ నిర్మాతల్ని ఆయనే పరిచయం చేశారు. ఈ చిత్రంలో హీరోకి క్లిప్టోమేనియా అనే డిజార్డర్ ఉంటుంది. ఈ వ్యాధి ఉన్నవారు వాళ్లకు తెలియకుండానే దొంగతనం చేస్తుంటారు. ఈ వ్యాధి వల్ల హీరో ఉద్యోగాలన్నీ కోల్పోతాడు. కొడుకు కోసం తండ్రి రాజేంద్ర ప్రసాద్ సూపర్‌మార్కెట్ నడుపుతుంటాడు. ఇద్దరి మధ్య కామెడీ చక్కగా ఉంటుంది. ఇంటర్వెల్, క్లయిమాక్స్ సినిమాటిక్‌గా ఉంటాయి. మిగతాదంతా పక్కింటి కథను తెరపై చూస్తున్నట్లు ఉంటుంది. సినిమా విడుదల తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
సంక్రాంతి బుల్లోడు బుల్లెమ్మ
-
ఈ యంగ్ హీరోని గుర్తుపట్టారా..?
రిలీజ్ రోజు స్టార్ హీరో సినిమా చూడటం అభిమానులకు ఓ అచీవ్మెంట్. అయితే అలాంటి కోరికలు సెలబ్రిటీలకు కూడా ఉంటాయి. కానీ వారికి ఆ కోరిక తీర్చుకోవడం కొంచెం కష్టమైన పనే. హీరోగా మంచి ఫాంలో ఉన్న స్టార్, మరో స్టార్ హీరో సినిమాను రిలీజ్ రోజు చూడాలంటే చాలా కష్టాలే పడాలి. అలాంటి కష్టమే ఎదురైంది యంగ్ హీరో రాజ్ తరుణ్‌కి. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన దువ్వాడ జగన్నాథమ్ సినిమాను రిలీజ్ రోజు చూడాలనుకున్న రాజ్ తరుణ్ ఏకంగా మారువేశం వేసేసి థియేటర్లో ప్రత్యక్షమయ్యాడు. సినిమా చూసిన తరువాత తాను ఏ గెటప్ లో వెళ్లి సినిమా చూశాడో తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు రివీల్ చేశాడు. పొడవాటి గెడ్డంతో బాబాల కనిపిస్తున్న రాజ్ తరుణ్, ఏ థియేటర్లో సినిమా చూశాడో మాత్రం రివీల్ చేయలేదు. And that's how I watched DJ This morning