ట్రోలింగ్‌ దెబ్బకు ‘ఐఐటీ బాబా’ క్షమాపణలు | Netizens Trolls On IIT Baba In Social Media Over His Prediction On CT 2025 IND Vs PAK Match, Post Goes Viral | Sakshi
Sakshi News home page

ట్రోలింగ్‌ దెబ్బకు ‘ఐఐటీ బాబా’ క్షమాపణలు

Published Mon, Feb 24 2025 9:42 AM | Last Updated on Mon, Feb 24 2025 10:58 AM

H​eavy Trolling On IITan Baba In Social media

లక్నో:మహాకుంభమేళాలో ఐఐటీ బాబాగా పాపులర్‌ అయిన అభయ్‌సింగ్‌పై సోషల్‌మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆదివారం(ఫిబ్రవరి 23) జరిగిన ఇండియా,పాకిస్తాన్‌ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోతుందని మ్యాచ్‌కు ముందు బాబా జోస్యం చెప్పారు. అయితే బాబా చెప్పినదానికి పూర్తి విరుద్ధంగా పాక్‌పై ఇండియా విజయం సాధించింది.

దీంతో ఐఐటీబాబాను నెటిజన్లు సోషల్‌మీడియాలో ఒక ఆట ఆడుకుంటున్నారు. బాబాపై మీమ్స్‌ వరద పారిస్తున్నారు. ఇక నుంచి బాబాను ఎవరూ ఇంటర్వ్యూలకు పిలవొద్దని పోస్టులు పెడుతున్నారు. జోస్యాలు చెప్పడం  మానేసి మూలకు పడుండాలని హెచ్చరిస్తున్నారు. 

అయితే పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరగడంతో బాబా స్పందించారు. తన తప్పుడు జోస్యానికి క్షమాపణలు కోరుతూ ఎక్స్‌(ట్విటర్‌)లో ఒక  పోస్టు పెట్టారు. మ్యాచ్‌లో భారత్‌ విజయం తర్వాత కోహ్లీ తదితరులు సంబరాలు చేసుకుంటున్న ఫొటోలు షేర్‌ చేశారు. కాగా, ఐఐటీ బాంబే నుంచి ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన అభయ్‌సింగ్‌ సాధువుగా మారాడు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement