India pak match
-
IND Vs PAK: పాక్-భారత్ మ్యాచ్‌లో అనూహ్య పరిణామం
న్యూయార్క్: దాయాది దేశాల మధ్య పోరులో మరోసారి భారత్‌దే పైచేయి అయ్యింది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టీమిండియా విజయం సాధించింది. అయితే.. మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో జరిగిన ఓ అనూహ్య పరిణామం అందరి దృష్టిని ఆకర్షించింది.మ్యాచ్ జరుగుతున్న టైంలో స్టేడియంపై ఓ ఎయిర్‌క్రాఫ్ట్ ఎగిరింది. అది ఓ బ్యానర్ ను ప్రదర్శిస్తూ వెళ్లింది. ఆ బ్యానర్ పై ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయండి (Release Imran Khan) అని రాసి ఉంది. మరోవైపు మ్యాచ్ జరుగుతున్న టైంలో స్టేడియంలో కొందరు ఇమ్రాన్ ఖాన్ ఫొటోలతో జిందాబాద్ నినాదాలు చేయడమూ కనిపించింది.A plane with the message "Release Imran Khan" flies over the stadium during the India vs. Pakistan T20 World Cup match. #Imrankhan #T20WC24 #viral #BreakingPedia pic.twitter.com/OHlCuQUFRZ— Breakingpedia (@breakingpediaBP) June 10, 2024 Credits: Breakingpedia VIDEO CREDITS: TOP POSTఅయితే.. పాక్-భారత్ మ్యాచ్‌కు గట్టి భద్రత ఉంటుందని న్యూయార్క్ పోలీసులు ఇదివరకే ప్రకటించారు. ఈ తరుణంలో ఆ విమానాన్ని స్టేడియం మీద ఎగరడానికి ఎలా అనుమతించారు?. దానిని నడిపిందెవరు?. దీనంతటి వెనుక ఉంది ఎవరు? ఇలాంటి అంశాలపై అక్కడి అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే!
భారత్‌లో తమ అభిమాన క్రికెటర్లను దేవుడిగా కొలుస్తారన్న విషయం తెలిసిందే. ప్రస్తుత క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆదివారం పాక్‌తో జరిగిన పోరులో విరాట్ విశ్వరూపంతో భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ ఓ అద్భతమని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అయితే మనకి తెలియని మరో ఆశ్చర్యకర ఘటన కూడా ఇందులో నమోదయ్యింది. విరాట్ దెబ్బకు భారత్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు ఆగిపోయాయి. దీనికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. షాపింగ్ బంద్.. మ్యాక్స్ లైఫ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మిహిర్ వోరా ఓ గ్రాఫ్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ గ్రాఫ్‌లో.. ‘విరాట్ కోహ్లీ ఇండియా షాపింగ్‌ను నిలిపివేసాడు!! ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు UPI లావాదేవీలలో ఊహించని మార్పు చోటు చేసుకుంది. ముఖ్యంగా మ్యాచ్ ఆసక్తికరంగా మారడంతో, ఆన్లైన్ షాపింగ్ ఆగిపోయింది. మ్యాచ్ అనంతరం తిరిగి పుంజుకుందని’ వోరా ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆదివారం పగటిపూట ఆన్లైన్ లావాదేవీలను గ్రాఫ్‌తో ట్రాక్ చేశారు. కోహ్లీ పనే అదే గ్రాఫ్‌ని భారత పాక్ మ్యాచ్ సమయంలో పాక్ బ్యాటింగ్, కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, మ్యాచ్ అనంతరం ఇలా పలు దశల్లో ట్రాక్ చేశారు. ముఖ్యంగా కోహ్లీ వీర విహారం చేస్తున్న సమయంలో షాపింగ్ పూర్తిగా బంద్ చేయడమే కాక యూపీఐ లావాదేవీలు ఢమాల్ అంటూ పడిపోయాయి. ఎందుకంటే పాక్‌తో మ్యాచ్ సందర్భంగా కోట్లాది మంది టీవలకు అతుక్కపోయారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకు లావాదేవీలు బాగానే జరిగినప్పటికీ మ్యాచ్‌లో విరాట్ మ్యాజిక్ కారణంగా భారీగా లోటులోకి వెళ్లింది. మ్యాచ్ ముగియగానే మళ్లీ పుంజుకున్నట్లు గ్రాఫ్ చూపిస్తోంది. #ViratKohli stopped #India shopping yesterday!! UPI transactions from 9 a.m. yesterday till evening - as the match became interesting, online shopping stopped - and sharp rebound after the match! #HappyDiwali #indiavspak #ViratKohli𓃵 #Pakistan pic.twitter.com/5yTHLCLScM — Mihir Vora (@theMihirV) October 24, 2022 చదవండి: -
భారత్-పాక్ మ్యాచ్ పై కేంద్రమంత్రి కీలక వాఖ్యలు..
Ramdas Athawale Comments on India Vs Pakistan T20 World Cup Match: టీ20 ప్రపంచకప్-2021లో ఈ నెల 24న జరగనున్న దాయాదుల పోరు నేపథ్యంలో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని, వలస కూలీల హత్యలతో లోయ దద్దరిల్లుతుందని అన్నారు. ఈ క్రమంలో భారత్, పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడకూడదని అథవాలే పేర్కొన్నారు. "పొరుగు దేశం పాకిస్తాన్ ఎలాంటి గుణ పాఠాలు నేర్చుకోలేదు. భారత దేశంపై వారి ఉగ్రచర్యలు ఆగడంలేదు. కాశ్మీర్ లోయలో పాకిస్తాన్ తన ఉగ్రవాద కార్యకలాపాలను నిలిపివేయకపోతే, భారత్ ఆదేశం పై యుద్దం ప్రకటించాలి. జమ్మూ కాశ్మీర్లో వలస కూలీలపై దాడులు జరుగుతున్నాయి. లోయలో అభివృద్ధిని అనుమతించకూడదనేది పాకిస్తాన్ ఎత్తుగడ. ఇటువంటి పరిస్థితుల్లో భారత్.. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడకూడదు’’ అని విలేకరుల సమావేశంలో అథవాలే చెప్పారు. ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి జై షాతో చర్చిస్తానని అథవాలే తెలిపారు. కాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌పై ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా భారత్-పాక్‌ల మధ్య అక్టోబర్ 24న జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు అధికమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా #BanPakCricket హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అయితే, ఐసీసీ టోర్నీలో ఓ జట్టుతో ఆడలేమని చెప్పడం సరికాదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి చదవండి: T20 WC IND Vs PAK: ఓ పక్క మన వాళ్లను చంపుతుంటే, పాక్‌తో టీ20 అవసరమా..? -
గంభీర్.. నీ కపటత్వం తెలిసిపోయింది
న్యూఢిల్లీ : టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మీరు కేవలం మాటల మనిషని నిరూపించుకున్నారు.. దేశం కంటే డబ్బు ముఖ్యం అయ్యిందా అంటూ మండిపడుతున్నారు. గంభీర్‌ను ఇంతలా ట్రోల్ చేయడానికి ఓ కారణం ఉంది. పుల్వామా ఉగ్రదాడి జరిగినప్పుడు గంభీర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రదాడిపై ఘాటుగా స్పందించిన గంభీర్ పాక్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, ప్రపంచకప్‌లో కూడా ఆ జట్టుతో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలన్నారు. మహా అయితే భారత్ రెండు పాయింట్లు కోల్పోతుందని, ఆట కన్నా దేశ ప్రజల సెంటిమెంట్ ముఖ్యమని అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయంపై తీవ్ర చర్చ కూడా జరిగింది. మాజీ ఆటగాళ్లు, అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. బీసీసీఐ కూడా పాక్‌తో మ్యాచ్ విషయంలో కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకుంటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా గంభీర్ చేసిన ట్వీట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అంతేకాక ఈ మాజీ క్రికెటర్ స్టార్ స్పోర్ట్స్ చానెల్లో దర్శనమివ్వడం.. మ్యాచ్ విశ్లేషకుడిగా అవతారం ఎత్తడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అసలు పాకిస్తాన్‌తో మ్యాచే వద్దన్న నువ్వు.. ఇప్పుడు డబ్బు కోసం భారత్-పాక్ మ్యాచ్‌కు విశ్లేషకుడిగా వ్యవహరిస్తావా.. నీ కపటత్వం జనాలకు తెలిసిపోయింది’ అంటూ ట్రోల్ చేయడమే కాక గంభీర్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ట్విటర్లో షేర్ చేయడం ప్రారంభించారు. తను వ్యతిరేకించిన మ్యాచ్‌తోనే గంభీర్ డబ్బు సంపాదించుకుంటున్నాడంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Political Gambhir vs Cricketer Gambhir #IndiaVsPakistan pic.twitter.com/19pqECs1SD — Dhruv Rathee (@dhruv_rathee) June 16, 2019 -
మార్చి 19న భారత్, పాక్ మ్యాచ్
-
మార్చి 19న భారత్, పాక్ మ్యాచ్
ముంబై: వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టి20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించారు. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉండగా, మార్చి 19న ధర్మశాలలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మొత్తం 8 నగరాల్లో మార్చి 8 నుంచి ఏప్రిల్ 3 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. మార్చి 15న భారత్ తన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో; మార్చి 23న క్వాలిఫయర్‌తో, 27న ఆస్ట్రేలియాతో తలపడుతుంది. పురుషుల, మహిళల విభాగంలో కలిసి మొత్తం 58 (35+23) మ్యాచ్‌లు జరుగుతాయి. మార్చి 30, 31న జరిగే సెమీఫైనల్స్‌కు న్యూఢిల్లీ, ముంబైలు ఆతిథ్యమిస్తాయి. ఫైనల్ మ్యాచ్ ఏప్రిల్ 3న కోల్‌కతాలో జరుగుతుంది. పురుషుల నాకౌట్ మ్యాచ్‌ల తర్వాత మహిళల సెమీస్, ఫైనల్స్ జరుగుతాయి. ఫైనల్స్‌కు రిజర్వ్ డే ఉంది. పురుషుల ప్రైజ్‌మనీ 5.6 మిలియన్ డాలర్లు కాగా, మహిళలకు 4 లక్షల డాలర్లు. వన్డే వరల్డ్‌కప్‌ల మాదిరిగానే ఈ టోర్నీని కూడా భారత్ అద్భుతంగా నిర్వహిస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ అన్నారు. ‘ఈవెంట్‌ను ఓ మరపురాని జ్ఞాపకంగా నిర్వహించేందుకు బీసీసీఐ, ఐసీసీ కట్టుబడి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు దీనికి హాజరవుతారు. భారత సంస్కృతిని, ఆతిథ్యాన్ని వాళ్లకు చూపెడతాం’ అని మనోహర్ పేర్కొన్నారు. ప్రపంచకప్ నిర్వహణ కోసం తాము అన్ని విధాలుగా సిద్ధమయ్యామని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్‌తోపాటు భారత క్రికెటర్లు విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్, అజింక్య రహానే కూడా పాల్గొన్నారు. సూపర్-10 దశకు రెండు జట్లు పురుషుల ఫార్మాట్లో మార్చి 8 నుంచి 13 వరకు నాగ్‌పూర్, ధర్మశాలలో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. 8 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి తలపడతాయి. గ్రూప్ ‘ఎ’లో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్, ఒమన్; గ్రూప్ ‘బి’లో జింబాబ్వే, స్కాట్లాండ్, హాంకాంగ్, అఫ్గానిస్తాన్‌లు ఉన్నాయి. ఈ గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సూపర్-10 దశకు అర్హత సాధిస్తాయి. ఇక్కడ గ్రూప్-2లో భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పాటు క్వాలిఫయింగ్ గ్రూప్ ‘ఎ’ విజేత; గ్రూప్-1లో శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్‌లతో పాటు క్వాలిఫయింగ్ గ్రూప్ ‘బి’ విజేత ఉంటాయి. ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. ఈ పోటీలు మార్చి 15 నుంచి 28 వరకు జరుగుతాయి. మహిళల విభాగంలో గ్రూప్ ‘బి’లో భారత్‌తో పాటు ఇంగ్లండ్, వెస్టిండీస్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి. ధోని నుంచి నేర్చుకుంటున్నా: కోహ్లి న్యూఢిల్లీ: క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని అధిగమించడం ఎలాగో వన్డే జట్టు కెప్టెన్ ధోనిని చూసి నేర్చుకుంటున్నానని టెస్టు సారథి విరాట్ కోహ్లి అన్నాడు. కెప్టెన్సీకి సంబంధించినంత వరకు మహీ ఒక గీతను నిర్దేశించి వెళ్లాడన్నాడు. ‘ఎంఎస్ టెస్టు, వన్డే, టి20ల్లో నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించాడు. తర్వాతి కెప్టెన్లు సాధించడానికి ఇంకేమీ లేకుండా చేశాడు. అయితే టెస్టుల్లో మరిన్ని విజయాలు సాధించేందుకు నేను ప్రయత్నిస్తున్నా. సారథ్యం ఎలా వహించాలో అతన్ని చూసి నేర్చుకుంటున్నా. గత రెండు సిరీస్‌ల్లో ఇది బాగా మెరుగుపడింది. కష్టకాలంలో కూడా సంయమనం కోల్పోడు. దీన్ని నేర్చుకోవాలనుకుంటున్నా. వైస్ కెప్టెన్‌గా చాలాసార్లు గమనించా. కానీ ఇంకా నేర్చుకోవాలి’ అని కోహ్లి పేర్కొన్నాడు. 2007 టి20 ప్రపంచకప్‌లో ధోని అమలు చేసిన వ్యూహాలను ఎప్పటికీ మర్చిపోలేమన్నాడు. భారత క్రికెట్‌కు ఇదో పెద్ద మైలురాయిగా నిలిచిపోయిందన్నాడు. ‘జట్టులో రోహిత్, శ్రీశాంత్‌లాంటి కొత్త కుర్రాళ్లున్నా.. టీమ్‌ను నడిపిన తీరు అమోఘం. కొన్ని అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపెట్టాడు. ఇక అక్కడి నుంచి ప్రపంచ క్రికెట్ కెప్టెన్లలో ఓ పెద్ద సంచలనంగా మారిపోయాడు’ అని కోహ్లి ప్రశంసించాడు. టి20 ఫార్మాట్లో ప్రతి జట్టు ప్రమాదకరమైందేనని రహానే వ్యాఖ్యానించాడు. -
330 కోట్లు ఇదే పాకిస్తాన్ ఆశ
అందుకే భారత్‌తో సిరీస్ కోసం తాపత్రయం దాదాపు ఆరు నెలల నుంచి భారత్, పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో అతి పెద్ద చర్చ... ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్. జరుగుతుందని ఒకరోజు... జరగదని ఒకరోజు... ఇలా ఏదో ఒక వార్త. అసలు భారత్, పాకిస్తాన్ల మధ్య క్రికెట్ జరగకపోతే నష్టం ఏమిటి? బీసీసీఐకి ఏం నష్టం లేదు. కానీ పాకిస్తాన్ బోర్డుకు మాత్రం 330 కోట్ల రూపాయల ఆదాయం పోతుంది. ఇదే వాళ్ల తాపత్రయానికి అసలు కారణం. పాక్ ప్రభుత్వం సిరీస్‌కు వెంటనే ఒప్పుకున్నా... భారత ప్రభుత్వం మాత్రం ఇప్పటిదాకా స్పందించలేదు. సమయం మించిపోతుండటం వల్ల ఇక ఈ సిరీస్ జరగకపోవచ్చు. సాక్షి క్రీడావిభాగం భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్ జరగాలని నిజంగానే అభిమానులు కోరుకుంటున్నారా? ప్రస్తుతం ఈ ప్రశ్న ఏ క్రికెట్ వీరాభిమానిని అడిగినా అంత ఉత్సాహంగా ఏమీ సమాధానం లభించదు. ఎందుకంటే దాయాది దేశాల ఆటగాళ్ల మధ్య మ్యాచ్ అంటే ఒకనాడు ఉన్న భావోద్వేగాలు ఇప్పుడు కనిపించడం లేదు. ఆటగాళ్ల మధ్య కూడా భాయ్-భాయ్ సంబంధాలే ఉన్నాయి. గత కొంతకాలంగా భారత్ పటిష్టమైన జట్టుగా ఎదగడంతో పాటు పాక్ ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా ఉండటంతో హోరాహోరీ, పోటీలాంటి మాటలే వినిపించడం లేదు. చాలా వరకు వన్డే, టి20లు ఏకపక్ష మ్యాచ్‌లే. ఇక టెస్టుల్లో మన జట్టుతో పోలిస్తే పాక్ కనీస ప్రదర్శన కూడా ఇచ్చే స్థితిలో లేదు. అభిమాని తనకు అందుబాటులో ఉన్నవాటిలో మంచి వాటిని చూస్తాడు తప్ప లేని దాని గురించి పెద్దగా ఆలోచించడు. భారత జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లతో ఆడుతున్నప్పుడు కూడా అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. కాబట్టి వారికి సంబంధించినంత వరకు భారత్-పాక్ సిరీస్ అంటే అన్నింటిలో ఒకటి మాత్రమే. గతంలోనూ ఇలాగే... భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాల్లో సుదీర్ఘ విరామం రావడం ఇదేమీ మొదటి సారి కాదు. 1989లో భారత జట్టు పాక్‌లో పర్యటించిన దాదాపు దశాబ్దం తర్వాత గానీ ఇరు జట్ల మధ్య సిరీస్ (1999) జరగలేదు. ఈ సమయంలో ఇరు దేశాల్లో క్రికెట్ ఏమీ ఆగిపోలేదు. రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడం ఎవరికీ సమస్య కాలేదు. రెండు జట్లూ తమ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాయి. సరిగ్గా చెప్పాలంటే కేవలం 2004-07 మధ్య కాలంలోనే ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండటంతో వరుసగా సిరీస్‌లు జరిగాయి. ఇరు జట్ల మధ్య పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్ 2007లో భారత్‌లో జరిగింది. వన్డే, టెస్టు సిరీస్ కూడా టీమిండియానే గెలుచుకుంది. అయితే 2008 నవంబర్ 26న ముంబైపై జరిగిన ఉగ్రవాద దాడి మొత్తం సీన్‌ను మార్చేసింది. నాటినుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రధానంగా రాజకీయ కారణాల వల్లే సిరీస్ జరగడం లేదు. 2012 డిసెంబర్లో పాక్ మళ్లీ భారత్‌కు వచ్చి ఆడినా అది చాలా చిన్న పర్యటన. చర్చోపర్చలు ద్వైపాక్షిక సిరీస్ కోసం ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చాలా రోజులుగా సుదీర్ఘ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఫలితం మాత్రం రావడం లేదు. ఇక ఖాయం అనిపించినప్పుడల్లా సరిహద్దు దాడులు సమస్యను క్లిష్టంగా మార్చేశాయి. 2022లోగా ఇరు జట్ల మధ్య కనీసం ఆరు సిరీస్‌లు జరగాలని శ్రీనివాసన్ ఐసీసీ చైర్మన్ హోదాలో ఉండగా ఎంఓయూ కుదిరింది. పాక్ బోర్డు పదే పదే దీనిని గుర్తు చేస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఒక రోజు చర్చలు జరిపినట్లే చేస్తున్నారు... మరో రోజు జ్యోతిష్యం చెప్పలేనంటూ చేతులెత్తేస్తున్నారు. ఇక బీజేపీ ఎంపీ కూడా అయిన బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తాను సిరీస్ కోరుకుంటున్నట్లు ప్రయత్నం చేస్తున్నట్లే కనిపించారు. కానీ ఒక్కసారిగా మాట మార్చి ‘కాల్పులు జరుపుతుంటే క్రికెట్ ఎలా’ అంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తేలేనని స్పష్టం చేశారు. ఇక సుష్మా స్వరాజ్ పాకిస్తాన్లో పర్యటించినా... సర్తాజ్తో చర్చల్లో క్రికెట్ అనే అంశమే రాలేదు. జరగకపోతే పాక్‌కు నష్టం ‘ఆటను రాజకీయాలతో కలపరాదు. ఈ సిరీస్ జరుగుతుందనే ఆశిస్తున్నాం’...ఏడాది కాలంగా ఇదో రొడ్డకొట్టుడు డైలాగ్‌గా మారిపోయింది. అయితే ఇదంతా పాక్ మాజీ క్రికెటర్ల నోటినుంచి వచ్చిన మాటలే తప్ప భారత్‌నుంచి గానీ తటస్థ వ్యక్తులు గానీ ఎవరూ ఈ మాట చెప్పలేకపోతున్నారు. ఇదే చివరాఖరి సారి అంటూ ... పీసీబీ అధికారులు తమ హెచ్చరికలను వాయిదాలు వేస్తూ ఒక వైపు, సిరీస్ జరిగితే చాలు దేనికైనా సిద్ధమే అన్నట్లుగా ఆశగా ఎదురు చూస్తున్నారు. శ్రీలంకలో, ఇంగ్లండ్‌లో ఎక్కడైనా ఆడతామంటూ చెబుతున్నారు. భారత్‌తో సిరీస్ ఆడితే పాక్ బోర్డు ఖాతాలో దాదాపు రూ. 330 కోట్లు చేరతాయి. ఇంత పెద్ద మొత్తాన్ని కోల్పోవడానికి ఇష్టం లేని పీసీబీ చివరి దాకా ఆశగా ఎదురు చూస్తోంది. ‘ఇందులో డబ్బు కోణం తప్ప మరేమీ లేదు. తమ బోర్డుకు ఆదాయం కోసమే ఈ ప్రయత్నమంతా. సిరీస్ జరగకపోతే ఎవరికీ నష్టం లేదు. ప్రపంచ క్రికెట్ ఏమీ ఆగిపోదు’ అని మాజీ క్రికెటర్ మొహమ్మద్ యూసుఫ్ కుండబద్దలు కొట్టాడు. ఇప్పుడేం జరగవచ్చు? ఐసీసీ భవిష్యత్తు పర్యటన కార్యక్రమా (ఎఫ్‌టీసీ)న్ని బీసీసీఐ గౌరవించడం లేదంటూ పాకిస్తాన్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక సిరీస్ కోసం అనుకున్న డిసెంబర్ నెలలో 20 రోజులు కూడా మిగిలి లేవు. ఇలా అయితే భారత్‌లో జరిగే టి20 ప్రపంచకప్‌లో కూడా ఆడబోమని, చట్టపరంగా కూడా ముందుకు వెళతామని చెబుతోంది. ఇది సాధ్యమా అనే సంగతి పక్కన పెడితే... ఐసీసీలో తీవ్ర రచ్చకు మాత్రం కారణమవుతుంది. ఐసీసీ మళ్లీ పాక్‌ను బతిమాలడమో, మధ్యే మార్గ పరిష్కారాలు చూపించాల్సి రావడమో జరగొచ్చు. చైర్మన్ హోదాలో పరిష్కార బాధ్యత శశాంక్ మనోహర్‌పై పడితే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లే! -
క్రికెట్ యుద్ధం...సిటీ సిద్ధం
1..2..3 కౌంట్‌డౌన్ మొదలైంది..కొద్ది గంటల్లో ఇండో పాక్ మధ్య క్రికెట్ యుద్ధం ప్రారంభం కానుంది. సిటీలో సర్వత్రా ఉత్కంఠ.. క్రికెట్ ప్రేమికుల్లో నరాలు తెగేటెన్షన్..అంతటా అటెన్షన్.. నగరవాసుల చూపంతా అడిలైడ్ వైపే..ప్రత్యేక ఏర్పాట్లతో వీకెండ్ హోరెత్తిపోనుంది.. నెలకొంది. హోటళ్లు, మాల్స్‌తో పాటు వివాహాలు జరుగుతున్న ఫంక్షన్‌హాళ్లలోనూ ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. పాక్‌పై ఘనం విజయం సాధించి జైత్రయాత్రకు స్వాగతం పలకాలని సిటీ వాసులు ఆకాంక్షిస్తున్నారు. గత వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై సాధించిన ఘన విజయాన్ని గుర్తుకు చేసుకుంటున్నారు. భారత్ -పాక్ మ్యాచ్ నేపథ్యంలో బెట్టింగ్‌లు కూడా జరిగే అవకాశం ఉండడంతో పోలీస్‌లు సైతం నిఘా పెట్టారు. భారీ బ్యాట్ ప్రపంచకప్ సందర్భంగా ఆంగ్లోఫిల్ బిజినెస్ స్కూలు సిబ్బంది 35 అడుగులు భారీ బ్యాట్‌ను తయారు చేయించారు. దానిని శనివారం ప్రదర్శించారు. మాదాపూర్‌లోని అయ్యప్ప సోసైటీ నుంచి మైండ్ స్పేస్ వరకు ర్యాలీ నిర్వహించారు. దాదాపు 30వేల మంది క్రికెట్ అభిమానులు బ్యాట్‌పై సంతకాలు చేశారు.