భారత్‌లో తమ అభిమాన క్రికెటర్లను దేవుడిగా కొలుస్తారన్న విషయం తెలిసిందే. ప్రస్తుత క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆదివారం పాక్‌తో జరిగిన పోరులో విరాట్ విశ్వరూపంతో భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ ఓ అద్భతమని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అయితే మనకి తెలియని మరో ఆశ్చర్యకర ఘటన కూడా ఇందులో నమోదయ్యింది. విరాట్ దెబ్బకు భారత్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలు ఆగిపోయాయి. దీనికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
షాపింగ్ బంద్..
మ్యాక్స్ లైఫ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ మిహిర్ వోరా ఓ గ్రాఫ్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ గ్రాఫ్‌లో.. ‘విరాట్ కోహ్లీ ఇండియా షాపింగ్‌ను నిలిపివేసాడు!! ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు UPI లావాదేవీలలో ఊహించని మార్పు చోటు చేసుకుంది. ముఖ్యంగా మ్యాచ్ ఆసక్తికరంగా మారడంతో, ఆన్‌లైన్ షాపింగ్ ఆగిపోయింది. మ్యాచ్ అనంతరం తిరిగి పుంజుకుందని’ వోరా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆదివారం పగటిపూట ఆన్‌లైన్ లావాదేవీలను గ్రాఫ్‌తో ట్రాక్ చేశారు.
కోహ్లీ పనే
అదే గ్రాఫ్‌ని భారత పాక్ మ్యాచ్ సమయంలో పాక్ బ్యాటింగ్, కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, మ్యాచ్ అనంతరం ఇలా పలు దశల్లో ట్రాక్ చేశారు. ముఖ్యంగా కోహ్లీ వీర విహారం చేస్తున్న సమయంలో షాపింగ్ పూర్తిగా బంద్ చేయడమే కాక యూపీఐ లావాదేవీలు ఢమాల్ అంటూ పడిపోయాయి. ఎందుకంటే పాక్‌తో మ్యాచ్ సందర్భంగా కోట్లాది మంది టీవలకు అతుక్కపోయారు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకు లావాదేవీలు బాగానే జరిగినప్పటికీ మ్యాచ్‌లో విరాట్ మ్యాజిక్ కారణంగా భారీగా లోటులోకి వెళ్లింది. మ్యాచ్ ముగియగానే మళ్లీ పుంజుకున్నట్లు గ్రాఫ్ చూపిస్తోంది.
#ViratKohli stopped #India shopping yesterday!!
— Mihir Vora (@theMihirV) October 24, 2022
UPI transactions from 9 a.m. yesterday till evening - as the match became interesting, online shopping stopped - and sharp rebound after the match! #HappyDiwali #indiavspak #ViratKohli𓃵 #Pakistan pic.twitter.com/5yTHLCLScM
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment