Diwali 2022
-
పండుగ వేళ .. తగ్గిన నోట్ల వినియోగం
ముంబై: దీపావళి పండుగ వారంలో చలామణీలో ఉన్న నగదు (సీఐసీ) పరిమాణం రూ. 7,600 కోట్ల మేర తగ్గింది. రెండు దశాబ్దాల్లో ఇంత భారీ స్థాయిలో తగ్గడం జరగడం ఇదే ప్రథమం. డిజిటల్ చెల్లింపులపై ప్రజలు ఎక్కువగా ఆధారపడుతుండటం ఇందుకు దోహదపడిందని ఒక నివేదికలో ఎస్బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 2009లో దీపావళి వారంలో కూడా సీఐసీ స్వల్పంగా రూ. 950 కోట్ల మేర తగ్గినప్పటికీ, అప్పట్లో తలెత్తిన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ ప్రేరేపిత మందగమనం ఇందుకు కారణమని వారు తెలిపారు. టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలు భారత పేమెంట్ వ్యవస్థ రూపురేఖలను మార్చేశాయని ఆర్థికవేత్తలు చెప్పారు. నగదు ఆధారిత ఎకానమీ నుంచి స్మార్ట్‌ఫోన్ ఆధారిత పేమెంట్ వ్యవస్థగా భారత్ రూపాంతరం చెందిందని వివరించారు. చెల్లింపు విధానాల్లో సీఐసీ వాటా 2016 ఆర్థిక సంవత్సరంలో 88 శాతంగా ఉండగా, 2022 ఆర్థిక సంవత్సరంలో 20 శాతానికి తగ్గింది. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి 11.15 శాతానికి తగ్గుతుందని అంచనా. అలాగే 2016 ఆర్థిక సంవత్సరంలో 11.26 శాతంగా ఉన్న డిజిటల్ లావాదేవీల వాటా 2022 ఆర్థిక సంవత్సరంలో 80.4 శాతానికి చేరగా, 2027 నాటికి 88 శాతానికి చేరవచ్చని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. -
అమెరికాలో వెల్లివిరుస్తున్న 'భారతీయం'.. మునుపు ఎన్నడూ లేనంతగా!
ప్రస్తుతం అమెరికాలో దాదాపు 50 లక్షల మంది భారతీయులు ఉన్నారు అనటం కంటే కూడా అగ్రరాజ్యంలో మునుపు ఎన్నడూ లేనంతగా ఉనికి చాటుకొనేలా, అందరూ గుర్తించేలా మనవాళ్లు ఉంటున్నారని చెప్పాలి. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ స్వయంగా వైట్‌హౌస్‌లో దివాలి వేడుకలు చెయ్యటం, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా దివాలి వేడుకలలో పాల్గొనటం మనవాళ్ల ప్రాముఖ్యతను వెల్లడిస్తోంది. వైట్‌హౌస్‌లో దీపావళి... బైడెన్ ఆతిధ్యంపై భారతీయుల సంతోషం అమెరికా అధ్యక్షుడి నివాస భవనమైన శ్వేత సౌధం చరిత్రలోనే భారీస్థాయిలో నిలిచిపోయేలా అధ్యక్షుడు జో బైడెన్ దీపావళి వేడుకలను వైభవంగా నిర్వహించారు. దీపావళి పండుగ వేళ వైట్‌హౌస్ దీపాల వెలుగులతో మెరిసిపోయింది. బైడెన్ దంపతులు ఈ సందర్భంగా నిర్వహించిన ‘దీపావళి రిసెప్షన్’కి 200 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. ఈ సంబరాలలో పూర్తి భారతీయత కనిపించడం విశేషం. సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేశాయి. సితారిస్ట్ రిషబ్ శర్మ, ఎస్ఏ డ్యాన్స్ కంపెనీ ట్రూపు ఆధ్వర్యాన సాగిన ఆర్టిస్టుల డ్యాన్సులు, వారి పర్ఫామెన్స్ కట్టి పడేశాయి. గెస్టుల వస్త్ర ధారణ చూస్తే ఇండియాలోనే ఉన్నట్టు అనిపించేలా కనిపించిందని చెబుతున్నారు. దీపావళి సందర్భంగా జోబైడెన్ దంపతుల విశిష్ట ఆదరణను మరిచిపోలేమని యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అతుల్ కేశప్ వ్యాఖ్యానించారు. ఈ ఆతిథ్యాన్ని అందుకోవడం ఓ గొప్ప ప్రివిలేజ్ అని టీవీ ఏసియా సీఈఓహెచ్ఆర్ షా పేర్కొన్నారు. అలాగే ఆసియన్ అమెరికన్స్ పై గల అడ్వైజరీ కమిషన్ సభ్యుడు అజయ్ జైన్ భుటారియా .. దక్షిణాసియా వాసులను బైడెన్ ప్రభుత్వం ఎంతగా గౌరవిస్తుందో ఈ ఈవెంట్ నిరూపిస్తోందన్నారు. బైడెన్ ప్రభుత్వం 130 మందికి పైగా ఇండియన్ అమెరికన్లను ఉన్నత స్థానాల్లో నియమించిందని ఆయన చెప్పారు. అంతకు ముందు బైడెన్ దంపతులు అతిథులను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జోబైడెన్ మాట్లాడుతూ.. ‘మీకు ఆతిథ్యమివ్వడాన్ని గౌరవంగా భావిస్తాను. శ్వేత సౌధంలో ఈ స్థాయిలో నిర్వహిస్తున్న తొలి దీపావళి ఇదే. మా వద్ద గతంలో కంటే ఇప్పుడు పెద్దసంఖ్యలో ఆసియా-అమెరికన్లు ఉన్నారు. దీపావళిని అమెరికా సంస్కృతిలో సంతోషకరమైన వేడుకలుగా మార్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమెరికా చరిత్రలోనే తొలి ఆఫ్రికా-దక్షిణాసియా మహిళ కమలా హ్యారిస్ నేతృత్వంలోని నా కార్యనిర్వాహక వర్గం సమక్షంలో దీపాలను వెలిగించడం గౌరవంగా భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అమెరికా వృద్ధిలో ఇండో అమెరికన్ల కృషి చాలా ఉందని బైడెన్ చెప్పారు. కరోనా సమయంలో సైతం ఇక్కడి ప్రవాస భారతీయులు దేశ సేవకే అంకితమయ్యారని ఆయన ప్రశంసించారు. వీరి కృషిని తాము సదా గుర్తుంచుకుంటామన్నారు. దేశం ఆర్థికంగా ఎదిగేందుకు తాము ప్రవాస భారతీయుల సేవలను ఎప్పుడూ ఉపయోగించుకుంటామన్నారు. దీపావళి వేడుకల సందర్భంగా హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గురు ప్రత్యేక అతిథులు ఈ దీపావళి వేడుకలకు ముగ్గురు ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ముగ్గురు యువ భారతీయ-అమెరికన్లను అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ఆహ్వానించారు. దీని ద్వారా డిఫర్డ్ యాక్షన్ లీగల్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏఎల్‌సీఏ) పిల్లలకు సంఫీుభావం తెలుపుతున్న సందేశాన్ని ఆయన అందించారని భావిస్తున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలసి అమెరికా వెళ్లి, అక్కడ నివసించడానికి తగిన పత్రాలు లేని పిల్లలు డీఏసీఎల్‌ఏలో ఉన్నారు. వీరిని ఎప్పుడైనా అమెరికా నుంచి బహిష్కరించే అవకాశం ఉంటుంది. డీఏఎల్‌సీఏ పిల్లల తరఫున పోరాడుతున్న ‘ఇంప్రూవ్ ద డ్రీమ్’సంస్థ వ్యవస్థాపకుడు దీప్ పటేల్‌తోపాటు పరీన్ మహత్రే, అతుల్య రాజ్‌కుమార్ ఈ వేడుకలకు హాజరయ్యారు. అధ్యక్షుడు బైడన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో కలసి దీపావళి వేడుకల్లో పాల్గొనడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్చిన కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ శుక్రవారం(అక్టోబర్ 28) నేవల్ అబ్సర్వేటరీలోని తన అధికారి నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భారతీయ సంతతి వారు హాజరయ్యారు. అమెరికాలోని ప్రముఖ భారతీయులందరికీ కమలా హ్యారిస్ దంపతులు ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా అధికారులు కమలా నివాసాన్ని దీపాలు, వివిధ రకాల లైట్లతో గొప్పగా అలంకరించారు. కమలా హ్యారిస్.. అతిథులతో కలిసి బాణాసంచా కాల్చారు. దీపావళి పండుగ గొప్పదనం విశ్వవ్యాప్తమైనదని వ్యాఖ్యానించారు. ‘అమెరికాలోనే కాకుండా ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఉపాధ్యక్షురాలిగా నేను వీటి గురించి ఆలోచిస్తుంటా. అయితే.. చీకటిని తరిమేసి వెలుగులను ఆహ్వానించే శక్తి మానవాళికి ఉందన్న దీపావళి లాంటి పండుగలు గుర్తు చేస్తుంటాయి’అని కమలా హ్యారిస్ పేర్కొన్నారు. అమెరికాలో భారతీయ సంతతి వారి ప్రభావం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఈ క్రమంలోనే దీపావళి పండుగ.. అమెరికాలో ముఖ్య వేడుకగా ప్రాముఖ్యం సంతరించుకుంది. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీకి చెందిన కీలక నేతలు దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక అమెరికాలోని వివిధ రాష్ట్రాల గవర్నర్ల అధికారిక నివాసాల్లోనూ దీపావళి వేడుకలు జరిగాయి. డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో దీపావళి వేడుకలు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వగృహం మార్ ఏ లాగోలో(ఫ్లోరిడా రాష్ట్రం) పలు భారతీయ సంఘాల ప్రతినిధులతో కలిసి దీపావళి వేడుకలు శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు భారతీయ అమెరికన్లతోపాటు రిపబ్లికన్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన, జగదీశ్ ప్రభలతోపాటు అనేక మంది తెలుగు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా వ్యాప్తంగా ఉన్న రిపబ్లికన్ హిందూ సమాఖ్య ప్రతినిధులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తూ.. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన శలభ్‌కుమార్, సతీష్ వేమన, విక్రమ్ కుమార్, హరిభాయ్ పటేల్‌లను ప్రత్యేకంగా అభినందించారు. అనాదిగా చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుందని, సమస్త మానవాళి శాంతి సౌభ్రాతృత్వంతో మెలగాలని ఆకాంక్షిస్తూ, దీప ప్రజ్వలనతో మొదలైన ఈ కార్యక్రమంలో పలు ప్రధాన విషయాలను ట్రంప్ ప్రస్తావించారు. భారతదేశం, అమెరికా దౌత్య సంబంధాలు.. పరస్పర సహాయ సహకారాలు ఉన్నత శ్రేణిలో కొనసాగాలని ఆకాంక్షించారు. అదే విధంగా తన 2016 ఎన్నికలలో తన వెన్నంటి ఉండి బలపరచిన రిపబ్లికన్ హిందూ సమాఖ్య నాయకత్వాన్ని, సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే కాలంలో ఈ సహకారం ఇలాగే అందించాలని విజ్ఞప్తి చేస్తూ, తమ పార్టీ అధికారంలోకి వచ్చి.. సమాఖ్య సభ్యులను తన ప్రభుత్వ కార్య నిర్వహణలో భాగస్వాములను చేస్తామని.. శలభ్ కుమార్‌ను తమ తరపు భారత రాయబారిగా నియమిస్తామని తెలిపారు. భారతదేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సానుకూల దృక్పధాన్ని అవలంభించి, సంయుక్తంగా టెర్రరిజం మూలాలను మట్టుబెడతామన్నారు. భారతీయులు శాంతి కాముకులని, ఎలాంటి పరిస్థితులలోఐనా కస్టపడి, సానుకూల దృక్పధంతో సాగే వారి స్వభావమే వారికి ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టిందని, మంచి ఎక్కడున్నా అందరూ అవలంబించాలని, నేర్చుకోవాలని సూచిస్తూ.. విభిన్న వ్యక్తులు, భాషలు, ప్రాంతాలు, దేశాల సమాహారమే అమెరికా అని, ప్రతిభకు పట్టం కట్టే విధానంతో అందరికి సమాన అవకాశాలు కల్పిస్తామని ఉద్ఘాటించారు. అదే విధంగా భారతీయుల పట్ల, హిందువుల సంస్కృతీ, సంప్రదాయాలపట్ల తనకు గౌరవమని.. వారి అపార ప్రతిభ పాటవాలు పరస్పరం ఇరుదేశాల అభివృద్ధికి తోడ్పడాలని అభిలషిస్తూ, భారత అమెరికా సంబంధాలు అత్యున్నత స్నేహపూర్వకంగా నిలిపేందుకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ సాంప్రదాయక విందు పలువురిని ఆకర్షించింది. పూర్తి సంప్రదాయ బద్దంగా అన్ని భాషల, రాష్ట్రాల వంటల రుచులను ప్రత్యేకంగా అతిధులకు అందించటం జరిగింది.. ఒక్కొక్క అతిథికి విందుకు సుమారు 85,000 రూపాయల వ్యయంతో ఏర్పాట్లు చేశారు. కాగా కార్యక్రమం నిర్వాహకులు, సీక్రెట్ సర్వీస్ అధికారులు పూర్తిగా బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతనే అతిథులను ఈ వేడుకలకు అనుమతించారు. ఇలా వచ్చిన వారిలో కేవలం ఇద్దరు తెలుగు వారికి మాత్రమే ట్రంప్‌తో కలిసి ఫొటో దిగే అవకాశం లభించడం గమనార్హం. వారిలో తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమనతోపాటు, జగదీశ్ ప్రభల కూడా ఉన్నారు. భారత్ అంటే ఎంతో అభిమానమన్న ట్రంప్ తన నివాసం ‘మార్-ఎ-లాగో’లో దీపావళి వేడుకలు నిర్వహించినందుకు అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. 2016 ఎన్నికల్లో రిపబ్లికన్ హిందూ కోఅలియేషన్ (ఆర్‌హెచ్‌సీ) సహకారంతోనే కీలకమైన ప్రాంతాల్లో 4 లక్షల మంది ఓటర్లు తమ పార్టీకి ఓటేసినట్లు ఆయన అంగీకరించారు. ఈ క్రమంలోనే ఆర్ఎన్సీ, ఎన్ఆర్సీసీ, ఎన్ఎస్ఆర్సీ వంటి హిందూ కోఅలియేషన్లకు చైర్మన్‌గా షల్లీ కుమార్ (శలభ్ కుమార్)ను నియమించాలని ట్రంప్ ప్రతిపాదించారు. 2024లో తాను ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తే ఆ సమయంలో తన హిందూ కోలియేషన్ విభాగం అధినేతగా షల్లీ కుమార్‌ను నియమిస్తానని చెప్పారు. ఆర్‌హెచ్‌సీ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలోని నైపుణ్యాలను మెచ్చుకున్న ట్రంప్.. తాను అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైతే ఆర్‌హెచ్‌సీ సభ్యులను పరిపాలనలో భాగం చేస్తానని హామీ ఇచ్చారు. హిందూ హోలోకాస్ట్ స్మారకాన్ని తాను కూడా సందర్శిస్తానని, ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానిస్తానని అన్నారు. పాకిస్తాన్‌కు మిలటరీ ఆయుధాలు అమ్మకుండా కఠిన చర్యలు తీసుకుంటానని, ఎఫ్16 విమానాల అమ్మకాన్ని కూడా అడ్డుకుంటాన్నారు. చైనా దిగుమతులపై పన్నులు కొనసాగిస్తానని చెప్పారు. అలాగే షల్లీ కుమార్ రచిస్తున్న ‘చైనీస్ కాలనైజేషన్ ఆఫ్ అమెరికా 2049 అండ్ ది ఓన్లీ మ్యాన్ హు కెన్ స్టాప్ ఇట్’అనే పుస్తకానికి తన వంతు సహకారం చేస్తానని, ఆ పుస్తకం ‘ముందుమాట’ను రచిస్తానని ట్రంప్ మాటిచ్చారు. డీఏఎల్‌సీఏ చిన్నారులు దేశ బహిష్కరణకు గురికాకుండా కాపాడటానికి కృషి చేస్తానని, గ్రీన్‌కార్డుల బ్యాక్‌లాగ్‌ను తగ్గించడానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. భారతదేశం, హిందువులు అంటే తనకు చాలా అభిమానమని చెప్పిన ట్రంప్.. ‘షల్లీ అండ్ ట్రంప్ సబ్సే అచ్ఛే దోస్త్.. అండ్ భారత్ అండ్ అమెరికా సబ్సే అచ్ఛే దోస్త్’ అంటూ తన ప్రసంగం ముగించారు. టెక్సాస్ గవర్నర్ ఇంట్లో దీపావళి వేడుకలు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ ఎబ్బోట్, సతీమణి సిసిలియా దంపతులు టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్ పట్టణంలో తమ నివాస గృహంలో అక్టోబర్ 23న వైభవంగా దీపావళి వేడుకలు జరిపారు. ఆ వేడుకలకు టెక్సాస్ రాష్ట్రం నుంచి అనేక మంది భారతీయ ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ సందర్భగా గవర్నర్ గ్రెగ్ ఎబ్బోట్ మాట్లాడుతూ.. ‘దీపావళి పండుగ ముందరి జీవితాలలో కొత్త వెలుగులు తీసుకురావాల’ని అన్నారు. తానా మాజీ అధ్యక్షులు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ అధ్యక్షులు ప్రసాద్ తోటకూర.. గవర్నర్ దంపతులకు అభినందనలు తెలిపారు. (క్లిక్ చేయండి: బ్రిటన్ ప్రధానిగా రిషి.. యూకేలో ప్రవాసీయుల ఖుషీ) న్యూయార్క్‌లో టైం స్క్వేర్ వద్ద దీపావళి వేడుకలు న్యూయార్క్ నగరం లోని కొందరు భారతీయ ప్రముఖులు కలిసి అక్టోబర్ 15న న్యూ యార్క్ నగర బొడ్డున వున్నా టైం స్క్వేర్ సెంటర్లో దీపావళి వేడుకలు నిర్వహించారు. న్యూ యార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ముఖ్య అతిధిగా వచ్చి భారతీయ సంతతిని, భారతీయ సంస్కృతిని, పండుగలను అభినందించారు. 2023 నుంచి న్యూయార్క్ నగరంలోని అన్ని పబ్లిక్ స్కూల్స్‌కి దీపావళి పండుగ సందర్భంగా సెలవు ఉంటుందని ప్రకటించారు. తెలుగు వారిలో ప్రముఖులైన డాక్టర్ నోరి దత్తాత్రేయులుని లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సన్మానించారు. తెలుగు నాయకులు రాజేందర్ డిచ్పల్లి.. మేయర్ ఎరిక్ ఆడమ్స్కి అభినందనలు తెలిపారు. - వేంకట సుబ్బారావు చెన్నూరి అమెరికాలో ప్రచురితమయ్యే తెలుగు టైమ్స్ సంపాదకులు -
Sadar Festival 2022 :హైదరాబాద్ లో వైభవంగా సదర్ వేడుకలు (ఫొటోలు)
-
Hyderabad: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు యూఎస్ కాన్సులేట్
సాక్షి, హైదరాబాద్: భారత్–అమెరికా దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను పర్యవేక్షించే యూఎస్ కాన్సులేట్ కార్యాలయ వార్షికోత్సవాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. 2008 వరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికైనా అమెరికా వీసా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ఇంటర్వ్యూ కోసం వ్యయ ప్రయాసలకు ఓర్చి చెన్నై వెళ్లేవారు. చెన్నై కాన్సులేట్ లోని మొత్తం ఇంటర్వ్యూల్లో తెలుగు రాష్ట్రాల వారే 40% కంటే ఎక్కువ కావడంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా వైఎస్సార్.. ఆయన్ను ఒప్పించడంతో తెలుగు ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో సౌకర్యం ఏర్పడింది. జార్జి బుష్ అమెరికా వెళ్లగానే వైఎస్సార్ కోరిక మేరకు హైదరాబాద్ కాన్సులేట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. ఇటు వైఎస్సార్ కూడా వేగంగా స్పందించి బేగంపేటలో ఉన్న పైగా ప్యాలెస్‌ను కేటాయించారు. ఈ భవనంలోనే కాన్సులేట్ కార్యాలయాన్ని.. 2008 అక్టోబర్ 24న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను చూసుకున్న ఈ భవనానికి ఇదే చివరి వార్షికోత్సవం. అందులో భాగంగా 14 ఏళ్ల పాటు సేవలందించిన కార్యాలయం పైన చివరిసారిగా అమెరికా జెండాను ఎగుర వేశారు. 300 మిలియన్ డాలర్లతో నూతన కాన్సులేట్.. నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వేదికగా 300 మిలియన్ డాలర్ల వ్యయంతో అత్యాధునిక, సాంకేతిక సదుపాయాలతో నిర్మించిన నూతన భవనంలోకి ఈ కాన్సులేట్ మారనుంది. అనుకోకుండా కాన్సులేట్ ప్రారంభించిన రోజునే ఈ కార్యాలయం చివరి రోజు కావడం, దీపావళి పండుగ కలిసి రావడంతో సిబ్బంది వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వీడియోను కాన్సులేట్ జనరల్ జెన్సిఫర్ లార్సన్ విడుదల చేశారు. (క్లిక్: నాగోలు ఫ్లై ఓవర్.. ఎల్బీనగర్– సికింద్రాబాద్ మధ్య ఇక రయ్రయ్) Want a sneak peak of our new consulate building? Here it is! pic.twitter.com/eu4g2Ui1uJ — Jennifer Larson (@USCGHyderabad) June 4, 2022 భారత్‌లో మొదటి శాశ్వత భవన అమెరికా దౌత్య కార్యాలయం.. ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ.. భారత్–అమెరికా మధ్య సంబంధాలను మరింత ఉన్నతంగా మార్చడానికి హైదరాబాద్ అనువైన వేదిక అనే ఉద్దేశంతో యూఎస్ కాన్సులేట్‌ను ప్రారంభించామని అన్నారు. స్వాతంత్య్రం పొందిన తరువాత భారత్‌లో నిర్మించిన మొదటి అమెరికా దౌత్యపరమైన శాశ్వత భవన కార్యాలయం ఇదేనని పేర్కొన్నారు. ఈ కార్యాలయం తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా రాష్ట్రాల వ్యవహారాలను పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. We raised the American flag at US Consulate #Hyderabad at Paigah Palace fourteen years ago today. We begin a new chapter - we’ll see you soon in the new space. pic.twitter.com/XEgJSm4ZMG — Jennifer Larson (@USCGHyderabad) October 24, 2022 -
Hyderabad: దీపావళి వేడుకల్లో గాయాలు.. సరోజినీదేవి కంటి ఆస్పత్రికి బాధితుల క్యూ (ఫొటోలు)
-
టపాసుల వేళ అపశ్రుతులు.. మంటలంటుకుని కళ్లకు, ఒంటికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: దీపావళి వేళ బాణసంచా కాలుస్తున్న క్రమంలో నగరంలో కొన్నిచోట్ల అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. పలువురికి కళ్లకు, ఒంటికి గాయాలయ్యాయి. నగర వ్యాప్తంగా సుమారు 100 మందికి పైగా బాధితులు పలు ఆస్పత్రుల్లో చేరారు. కంటి గాయాలకు గురైనవారిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం గమనార్హం. సరోజినీదేవి ఆస్పత్రికి క్యూ.. మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో దీపావళిని ముందు రోజు ముగ్గురు, పండగ రోజు రాత్రి సమయంలో 45 మంది దాకా కంటి గాయాలతో సంప్రదించారు. ఇందులో 21 మంది అవుట్ పేషెంట్ విభాగంలో చూపించుకుని వెళ్లిపోగా 19 మంది అడ్మిట్ అయ్యారు. పండగ తర్వాత రోజు కూడా మరో 2 కేసులు వచ్చాయని వైద్యులు చెప్పారు. వీరిలో అయిదేళ్ల వయసు నుంచి 67 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. మొత్తం బాధితుల్లో అత్యధికులు చిన్నారులే. బాధితుల్లో మల్లెపల్లికి చెందిన అజయ్ సింగ్ (25), విజయ్ ఆనంద్ (61), సి. మహావీర్ (15)ల ఎడమ కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు కుడికన్నుకు గాయమైన హయత్‌నగర్‌కు చెందిన రాజి (37)లకు శస్త్ర చికిత్సలు నిర్వహించారు. బాధితుల్లో ఒక అబ్బాయి కంటి చూపు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి.. బంజారాహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రికి పెద్ద సంఖ్యలోనే బాణసంచా బాధితులు నమోదయ్యారు. పండగ ముందురోజున అయిదుగురు, దీపావళి రోజున 21 మంది, మరుసటి రోజున (సాయంత్రం 4గంటల వరకూ) 11 మంది కంటి గాయాలతో ఆస్పత్రికి వచ్చారని వీరిలో 9 మందికి సర్జరీలు చేశామని వైద్యులు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో బాణసంచా కారణంగా 7 కాలిన గాయాల కేసులు నమోదయ్యాయి. చందానగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తీవ్రగాయాలతో ఒకరు చికిత్స పొందుతున్నారు. పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ బాణసంచా బాధితులు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కాలిన గాయాలతో ఉస్మానియాకు... నగరంలో కంటి గాయాలతో చిన్నారులు ఆస్పత్రుల పాలు కాగా కాలిన గాయాలతో పెద్దలు ఆస్పత్రులకు క్యూ కట్టారు. ఉస్మానియా ఆస్పత్రిలో 18 మందికి కాలిన గాయాల బాధితులు సంప్రదించగా ఇందులో ఒకరు తీవ్ర గాయాలతో అడ్మిట్ అయ్యారు. శరీరం కాలిన ఆ మహిళ (63) పరిస్థితి విషమంగా ఉందని, ఆమె దాదాపు 95 శాతం కాలిన గాయాల బారిన పడడంతో వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘ప్రీమియం ఉత్పత్తులకు’ సై!
న్యూఢిల్లీ: పండుగల విక్రయాలు జోరుగా సాగాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ కంపెనీల అంచనాలను మించి అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ప్రీమియం (ఖరీదైన), మధ్య శ్రేణి ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ కనిపించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు విక్రయాలకు అడ్డుపడకపోవడం వాటిని ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఈ ఏడాది పండుగల సీజన్లో విక్రయాలు విలువ పరంగా 30 శాతం, సంఖ్యా పరంగా 20 శాతం వృద్ధిని చూసినట్టు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) ప్రకటించింది. ‘‘ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు మంచిగా సాగాయి. మధ్యశ్రేణి నుంచి ఖరీదైన ఉత్పత్తుల వరకే చూస్తే అమ్మకాల్లో 30 శాతం, విలువలో 40–50 శాతం వృద్ధి నమోదైంది. ముఖ్యంగా పండుగల చివరి మూడు రోజుల్లో ఎక్కువ డిమాండ్ కనిపించింది’’అని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ తెలిపారు. కానీ, ఆరంభ ధరల్లోని ఉత్పత్తుల అమ్మకాలు ఈ పండుగల సీజన్లో 10–15 శాతం తగ్గినట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒత్తిళ్లు ఒక కారణం అయితే, కొందరు వినియోగదారులు ఆరంభ స్థాయి నుంచి తదుపరి గ్రేడ్ ఉత్పత్తులకు మారిపోవడం మరో కారణమని వివరించారు. ఖరీదైన వాటికి ఆదరణ.. ఖరీదైన గృహోపకరణాలకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్యానాసోనిక్ మార్కెటింగ్ ఇండియా ఎండీ ఫుమియసు ఫుజిమోరి తెలిపారు. ఈ పండుగ సీజన్లో ఏసీలు, పెద్ద తెరల టీవీలు, హోమ్ అప్లయన్సెస్ విక్రయాలు డబులు డిజిట్లో పెరుగుతాయన్న అంచనాతో ఉన్నట్టు చెప్పారు. ‘‘విలువ పరంగా చూస్తే ఇన్వెస్టర్ ఏసీల అమ్మకాల్లో 38 శాతం వృద్ధి నమోదైంది. ఎల్ఈడీ టీవీల అమ్మకాలు 10 శాతం పెరిగాయి. 4కే టీవీల అమ్మకాల్లో అయితే ఏకగా 34 శాతం వృద్ధి కనిపించింది. టాప్లోడ్ వాషింగ్ మెషిన్లలో 13 శాతం అధిక వృద్ధి నమోదైంది’’అని ఫుజిమోరి వివరించారు. విద్యుత్‌ను ఆదా చేసే ఏసీలు, వినియోగం సులభంగా ఉండే ఉత్పత్తులకు కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. ఈ వృద్ధి ఇలాగే స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ త్రైమాసికంలో అధిక వృద్ధి ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ హెచ్‌యూఎల్ ఎండీ సంజీవ్ మెహతా స్పందిస్తూ.. సెప్టెంబర్ త్రైమాసికంలో విక్రయాలు ఇటీవలి కాలంలోనే ఎక్కువగా నమోదైనట్టు చెప్పారు. దీపావళి తర్వాత విక్రయాల తీరును కూడా గమనించాల్సి ఉంటుందన్నారు. తక్కువ ధరల వాటితో పోలిస్తే ప్రీమియం ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉన్నట్టు చెప్పారు. ‘‘ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలు పాపులర్ బ్రాండ్ల కంటే మించి ఉన్నాయి. అలాగే, చౌక ఉత్పత్తులతో పోలిస్తే పాపులర్ ఉత్పత్తుల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి’’అని సంజీవ్ మెహతా వివరించారు. ప్రీమియం విభాగంలో వృద్ధి ఎక్కువగా ఉండడం ప్రజల వద్ద ఖర్చు పెట్టే ఆదాయం పెరిగిందనడానికి సూచనగా పేర్కొన్నారు. -
కెనడాలో ఘనంగా దివాలీ సంబరాలు
కెనడా టొరంటోలో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. పిల్లా పెద్దా అంతా ఆటపాటలు, టపాసులతో ఆనందోత్సాహాల మధ్య వేడుకను నిర్వహించుకున్నారు. ♦కెనడా టొరంటో నగరం లో 120 మంది వాలంటీర్లతో ,170 స్టేజ్ పర్ఫామెన్స్ తో 1500 మంది అతిథులతో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దీపావళి పండుగను ఘనంగా జరిపారు. ♦ 14 రకాల ఐటమ్స్ తో అతిథులందరికీ అచ్చ తెలుగు విందు భోజనాలను ఆరగించారు. సుమారు ఏడు గంటల పాటు శాస్త్రీయ నృత్యాలు, తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, ఒడియా భాష లో పాటలు డాన్సులు ఆహుతులకు కనువిందు చేశాయి. తర్వాత పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో బాణాసంచా కాల్చారు. ♦ టొరంటో సిటీ కౌన్సెలర్ గేరి క్రాఫోర్డ్ మరియు సతీమణి చీఫ్ గెస్ట్ గా పాల్గొని హాజరైన మెంబెర్స్ కి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇండియా కెనడా బంధం మరింత ముడి వేయించుకోవాలని ఆకాంక్షించారు. ♦ ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించిన బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ కార్యనిర్వాహక సభ్యులు జగపతి రాయల,సూర్య కొండేటి, ప్రతాప్ బొల్లవరం, విష్ణు వంగల, రమేష్ తుంపర, శ్రీకాంత్ బండ్లమూడి, రాజశేఖర్ రెడ్డి, మూర్తి వారణాసి, నరసింహారెడ్డి, సర్దార్ ఖాన్, రామ సుబ్బారెడ్డి. ఈకార్యక్రమానికి విజయవంతానికి మిషన్ అఫ్ మదర్ (Mission Of Mothers ( MOM) చాలా సహకరించారు. ♦ ఆర్గనైజర్ జగపతి రాయల మాట్లాడుతూ కెనడా చరిత్రలో ఇది అతిపెద్ద దీపావళి ఈవెంట్ ,ఇలాంటి మరిన్ని మనదైన పండుగలను జరుపుతూ కెనడాలోని తెలుగువారికి సంస్కృతి సంప్రదాయాలను కాపాడతామని చెప్పారు. దీనా రెడ్డి ముత్తుకూరు, రామ్ జిన్నల, శ్రీకాంత్ లింగమనేని, ఫణీన్ద్ర కుమార్ కొడాలి, భరత్ కుమార్ రెడ్డి, మినర్వా రెస్టారెంట్, హార్టుఫుల్ రిలాక్సేషన్ సౌజన్యం తో ఈ వేడుక ఘనంగా ముగిసినది. ఈ వేడుకను విజయంతంం చేసిన 120 మంది వాలంటీర్లు మరో ఆర్గనైజర్ సూర్య కొండేటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే!
భారత్‌లో తమ అభిమాన క్రికెటర్లను దేవుడిగా కొలుస్తారన్న విషయం తెలిసిందే. ప్రస్తుత క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆదివారం పాక్‌తో జరిగిన పోరులో విరాట్ విశ్వరూపంతో భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ ఓ అద్భతమని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అయితే మనకి తెలియని మరో ఆశ్చర్యకర ఘటన కూడా ఇందులో నమోదయ్యింది. విరాట్ దెబ్బకు భారత్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు ఆగిపోయాయి. దీనికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. షాపింగ్ బంద్.. మ్యాక్స్ లైఫ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మిహిర్ వోరా ఓ గ్రాఫ్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ గ్రాఫ్‌లో.. ‘విరాట్ కోహ్లీ ఇండియా షాపింగ్‌ను నిలిపివేసాడు!! ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు UPI లావాదేవీలలో ఊహించని మార్పు చోటు చేసుకుంది. ముఖ్యంగా మ్యాచ్ ఆసక్తికరంగా మారడంతో, ఆన్లైన్ షాపింగ్ ఆగిపోయింది. మ్యాచ్ అనంతరం తిరిగి పుంజుకుందని’ వోరా ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆదివారం పగటిపూట ఆన్లైన్ లావాదేవీలను గ్రాఫ్‌తో ట్రాక్ చేశారు. కోహ్లీ పనే అదే గ్రాఫ్‌ని భారత పాక్ మ్యాచ్ సమయంలో పాక్ బ్యాటింగ్, కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, మ్యాచ్ అనంతరం ఇలా పలు దశల్లో ట్రాక్ చేశారు. ముఖ్యంగా కోహ్లీ వీర విహారం చేస్తున్న సమయంలో షాపింగ్ పూర్తిగా బంద్ చేయడమే కాక యూపీఐ లావాదేవీలు ఢమాల్ అంటూ పడిపోయాయి. ఎందుకంటే పాక్‌తో మ్యాచ్ సందర్భంగా కోట్లాది మంది టీవలకు అతుక్కపోయారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకు లావాదేవీలు బాగానే జరిగినప్పటికీ మ్యాచ్‌లో విరాట్ మ్యాజిక్ కారణంగా భారీగా లోటులోకి వెళ్లింది. మ్యాచ్ ముగియగానే మళ్లీ పుంజుకున్నట్లు గ్రాఫ్ చూపిస్తోంది. #ViratKohli stopped #India shopping yesterday!! UPI transactions from 9 a.m. yesterday till evening - as the match became interesting, online shopping stopped - and sharp rebound after the match! #HappyDiwali #indiavspak #ViratKohli𓃵 #Pakistan pic.twitter.com/5yTHLCLScM — Mihir Vora (@theMihirV) October 24, 2022 చదవండి: -
తిరుపతి : దీపావళి పండుగ సంబరాలు (ఫొటోలు)
-
సైనికులతో కలిసి ప్రధాని దీపావళి సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
T20 World Cup 2022: ఇవాళ మరోసారి భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్
టీ20 వరల్డ్‌కప్-2022 అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లవర్స్‌కు దీపావళి కానుక ఇవ్వనుంది. భారత-పాక్ జట్ల మధ్య నిన్న జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ ఇవాళ (అక్టోబర్ 24) మరోసారి ప్రసారం చేయనుంది. రాత్రి 8 గంటలకు స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1HD, స్టార్ స్పోర్ట్స్ 1 Hindi, స్టార్ స్పోర్ట్స్ 1 HD Hindi ఛానల్స్‌లో ఫుల్ మ్యాచ్‌ను బాల్ టు బాల్ రీ టెలికాస్ట్ చేయనున్నట్లు స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం ప్రకటించింది. స్టార్ స్పోర్ట్స్ చేసిన ఈ ప్రకటనతో క్రికెట్ ప్రేమికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. స్టార్ స్పోర్ట్స్ మాకు నిజమైన దీపావళి కానుక ఇచ్చిందని సంబురపడిపోతున్నారు. కోహ్లి బాంబ్ మరోసారి పేలితే చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నామని అంటున్నారు. Star Sports will be streaming yesterday's India Vs Pakistan ball by ball full match repeat from 8pm tonight. Relive the King Kohli masterclass once again. — Mufaddal Vohra (@mufaddal_vohra) October 24, 2022 ఇదిలా ఉంటే, నిన్న జరిగిన దాయాదలు సమరాన్ని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ప్రత్యక్షంగా లక్ష మంది వరకు వీక్షించారు. డిజిటల్ ప్లాట్‌ఫాం వేదికపై అయితే నిన్నటి మ్యాచ్ గత రికార్డులన్నిటినీ తిరగరాసింది. డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌ను ఏకంగా కోటి 80 లక్షల మంది వీక్షించారు. ఇవాళ మ్యాచ్ మరోసారి టెలికాస్ట్ అయితే భారీ సంఖ్యలో వ్యూస్ వస్తాయని స్టార్ స్పోర్ట్స్ అంచనా వేస్తుంది. కోహ్లి పటాకా ఇన్నింగ్స్ బాల్ టు బాల్ చూసేందుకు క్రికెట్ ప్రేమికులు ఎగబడతారని భావిస్తుంది. కాగా, చిరకాల ప్రత్యర్ధుల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లి (53 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచితంగా పోరాడి టీమిండియాకు అపురూప విజయాన్నందించాడు. కోహ్లి పోరాటానికి హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన (40, 3/30) కూడా తోడవ్వడంతో టీమిండియా చారిత్రక విజయాన్ని సాధించింది. చదవండి: IND VS PAK: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా -
కార్గిల్ సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
-
కార్గిల్ సైనికులతో మోదీ దీపావళి సంబరాలు..
కార్గిల్: దీపావళి పండగను పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం కార్గిల్ చేరుకున్నారు. అక్కడ ఆర్మీ జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సైనికులకు ప్రధాని స్వీట్లు పంచిపెట్టారు. కార్గిల్‌లో ఆర్మీ సిబ్బందిని ఉద్ధేశించి మోదీ ప్రసంగించారు. ఎంతో కాలంగా జవాన్లు తన కుటుంబ సభ్యులుగా ఉన్నారని మోదీ పేర్కొన్నారు. సైనికులతో కలిసి పండగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. జవాన్ల త్యాగం మరువలేదని అన్నారు. ఇంతకంటే గొప్ప దీపావళిని కోరుకోవడం లేదని తెలిపారు. ఉగ్రవాద ముగింపే దీపావళి పండగని, దాన్ని కార్గిల్ సాధ్యం చేసిందన్నారు. సైనికుల త్యాగాలు దేశం గర్వించేలా ఉన్నాయన్నారు. విజయవంతమైన కార్గిల్ భూమి నుంచి దేశ ప్రజలకు, ప్రపంచానికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: రేకుల పైకప్పు గదిలో... నిద్రించిన ప్రధాని మోదీ #WATCH | "For me, all of you have been my family for years now... it's a privilege to celebrate #Diwali amid all of you," says Prime Minister Narendra Modi, while interacting with members of the Armed Forces in Kargil (Source: DD) pic.twitter.com/H47FM8byeE — ANI (@ANI) October 24, 2022 కాగా 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మోదీ సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. దేశ సరిహిద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లతో కలిసి పండగ జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కార్గిల్‌లో సైనికులతో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. -
Diwali: బాణసంచా కాల్చేవేళ.. జాగ్రత్తలిలా..
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా టపాసులు కాల్చే 2, 3 రోజులలో సల్ఫర్ డయాక్సైడ్ స్థాయి అనుమతించదగిన పరిమితి కంటే 200 రెట్లు ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల పని తీరుపై క్రాకర్స్ ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన కోవిడ్ బారిన పడి కోలుకున్నవారు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం అంటున్నారు. ఆరోగ్యంపై దీపావళి క్రాకర్స్ ప్రతికూల ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎవరివైనా ఊపిరితిత్తులు ఇప్పటికే వ్యాధి తాలూకు దు్రష్పభావాలు కలిగి ఉంటే, క్రాకర్స్ వెలువరించే దట్టమైన విషపూరితమైన పొగకు గురికావడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మరింత దెబ్బతినడం సహా తీవ్రమైన ప్రమాదాలకు దారి తీయవచ్చు. శ్వాస కోస వ్యవస్థకు హాని... ►‘క్రాకర్స్ హానికరమైన వాయు కాలుష్యాలను కలిగి ఉంటాయి కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి వాయు పదార్థాలు శ్వాసకోశ లైనింగ్ (శ్లేష్మ పొర)కు హాని కలిగిస్తాయి. ఆస్తమా, అలర్జీ రోగులకు సమస్యగా పరిణమిస్తుంది. ఇప్పుడు వీరికి మాత్రమే కాకుండా కోవిడ్ నుంచి కోలుకున్న వారికి కూడా ప్రమాదకరంగా మారింది. భారీ పరిమాణంలో ఫైర్ క్రాకర్స్‌కు సంబంధించిన పొగ గాలిలో వ్యాపిస్తున్న సమయంలో ఈ రోగులు ఇంటి లోపలే ఉండడం శ్రేయస్కరం’ అంటున్నారు ఇండియన్ చెస్ట్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ రాజేష్ స్వర్ణాకర్. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.. ► ‘కోవిడ్ వ్యాధితో బాధపడిన కొందరు రోగుల ఊపిరితిత్తుల పనితీరులో మార్పు వచి్చంది. దీపావళి సందర్భంగా, పరిసర గాలిలో నలుసు పదార్థం ఇతర అస్థిర కర్బన సమ్మేళనాలు అపారంగా పెరుగుతాయి. దీనికి గురైనప్పుడు, దీంతో తీవ్రమైన కోవిడ్ బారిన పడి కోలుకున్న వారు దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కోవాల్సి రావచ్చు’ అని ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ సమీర్ చెప్పారు. పెద్దవాళ్ల పర్యవేక్షణ అవసరం.. ►‘టపాకాయలు కాల్చే సమయంలో ప్రతి చిన్నారి వద్ద పెద్దవారు ఒకరు ఉండి తప్పనిసరిగా వారిని పర్యవేక్షించాలి. ఏవైనా కాలిన గాయాలు, ప్రమాదాలను నివారించడానికి ముందు జాగ్రత్తలను తీసుకోవాలి’ అని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ.ఆప్తల్మాలజీ కన్సల్టెంట్, డాక్టరు అనుభా రాఠి సూచించారు. ► టపాసును కాల్చే సమయంలో పిల్లల్ని ఒంటరిగా వదలవద్దు. రక్షణ ఇచ్చే కంటి అద్దాలను ఉపయోగించాలి. టపాసు వెలిగించే వ్యక్తి నుంచి మిగిలినవారు తగినంత దూరంలో ఉండాలి. క్రాకర్స్ వెలిగించడానికి పొడవైన కొవ్వొత్తి లేదా కాకర పువ్వొత్తిని ఉపయోగించండి. ► దగ్గరలో రెండు బకెట్ల నీళ్లు ఉంచుకుని. చర్మం కాలినట్లయితే, కాలినచోట ఎక్కువ నీరు పోయాలి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లండి. సొంత వైద్యం వద్దు. తీవ్రమైన కాలిన గాయాలైతే, మంట ఆరి్పన తర్వాత, ఆ వ్యక్తిని ఒక శుభ్రమైన దుప్పటిలో చుట్టి, వెంటనే ఆసుపత్రికి తరలించాలి. ►చేతిలో పట్టుకుని టపాకాయలను వెలిగించకండి. వాటిపై వంగి టపాకాయలను వెలిగించవద్దు. సీసా, రేకు డబ్బా లేదా బోర్లించిన కుండవంటి పాత్రలో పెట్టి టపాకాయలను వెలిగించడం ప్రమాదకరం. వెలగని టపాకాయల దగ్గరకు వెంటనే వెళ్లకుండా, కొంతసేపు ఆగి వెళ్లండి. టపాసులను జేబులో పెట్టుకోవద్దు. ౖక్రాకర్స్ కాల్చే సమయంలో సింథటిక్ లేదా వదులుగా ఉన్న దుస్తులు కాక, మందంగా ఉన్న నూలు దుస్తులను మాత్రమే ధరించండి. ►భారీ గాలులు వీచే సందర్భాల్లో బాణసంచా కాల్చవద్దు. కాలినచోట క్రీమ్ లేదా ఆయింట్మెంట్ లేదా నూనెను పూయకండి. బదులుగా వెంటనే వైద్య సహాయం పొందండి. శ్వాసకోశ రోగులూ.. జాగ్రత్త.. బాణసంచా కాల్చడంతో కాలుష్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఊపరితిత్తులకు సంబంధించిన సమస్యలున్నవారికి ప్రమాదకరం. శ్వాసకోస వ్యాధి రోగులు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకూ ఆ పొగకు 2 రోజుల పాటు దూరంగా ఉండడం మంచిది. కోవిడ్ వల్ల గతంలో లంగ్స్ దెబ్బతిన్నవారు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. – డా.జి.వెంకటలక్ష్మి, పల్మనాలజిస్ట్, అమోర్ హాస్పిటల్స్ ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ– అత్యవసర సహాయక నంబర్లు 040 68102100, 040 68102848, 73311 29653 -
ఇక వాణిజ్యప్రయోగాలే
సూళ్లూరుపేట: ఎల్వీఎం3–ఎం2 ప్రయోగం విజయంతో ఇస్రోకు ఒక రోజు ముందుగానే దీపావళి పండగ వచ్చిందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. ప్రయోగానంతరం ఆదివారం తెల్లవారుజామున ఆయన మీడియాతో మాట్లాడారు. న్యూ స్పేస్ ఇండియా, వన్‌వెబ్ సహకారంతో ఆదివారం ఎల్వీఎం3–ఎం2 ద్వారా ప్రయోగించిన 36 యూకేకి చెందిన కమ్యూనికేషన్ ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగామని తెలిపారు. క్రయోజనిక్ దశలో 36 ఉపగ్రహాలను ఒకేసారి కాకుండా నాలుగు దిశల్లో నాలుగేసి ఉపగ్రహాలు చొప్పున కక్ష్యలోకి విడిపోయేలా ఈ ప్రయోగంలో కొన్ని కీలకమైన సైంటిఫిక్ పరికరాలతో రూపొందించామని చెప్పారు. ఈ ప్రయోగంలో ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరడం కీలకం కావడంతో 36 ఉపగ్రహాలు విడిపోవడానికి 1.30 గంటల సమయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రయోగంతో ప్రపంచ దేశాల నుంచి ఎక్కువ మంది కస్టమర్లు రావడానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. వన్‌వెబ్ కంపెనీతో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఒప్పందం మేరకు మరో 36 ఉపగ్రహాలను, మళ్లీ ఇంకో 36 ఉపగ్రహాలను ఇదే తరహాలోనే ప్రయోగిస్తామని తెలిపారు. ఇస్రో విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. వాణిజ్య ప్రయోగాలే లక్ష్యం ఇకపై వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడమే లక్ష్యమని న్యూ స్పేస్ ఇండియా సీఎండీ రాధాకృష్ణన్ అన్నారు. దీన్ని చరిత్రాత్మక ప్రయోగంగా వన్‌వెబ్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అభివర్ణించారు. ఇప్పటికే 648 ఉపగ్రహాలను వివి«ధ దేశాల నుంచి ప్రయోగించామని గుర్తు చేశారు. ఇది కొత్త అధ్యాయానికి శ్రీకారమని పవన్ గోయెంకా (వన్‌వెబ్ కంపెనీ) చెప్పారు. ‘‘36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా పంపడం కూడా అద్భుతం. వాణిజ్యపరంగా ఇస్రో మరో అడుగు ముందుకేయడం శుభ పరిణామం’’ అని ఆయన చెప్పారు. -
T20 World Cup 2022: 'కోహ్లి'నూర్ విజయం
అద్భుతం... అసాధారణం... అనిర్వచనీయం... ఆదివారం మెల్బోర్న్ వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ను ఏ తీరుగా ప్రశంసించినా తక్కువే. టి20 క్రికెట్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా దాయాదుల మధ్య సమరం జరిగింది. ఒకదశలో పాకిస్తాన్ గెలవడం ఖాయమనిపించింది. కానీ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అసమాన పోరాటం చేశాడు. చిరకాలం అభిమానుల మదిలో మెదిలేలా కళ్లు చెదిరే షాట్లు ఆడాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి భారత్‌ను మ్యాచ్‌లో నిలబెట్టాడు. కోట్లాది మంది అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు. దీపావళి పండగకు దేశానికి విజయకానుక ఇచ్చాడు. మెల్బోర్న్: భారత్ ఏ టోర్నీలో ఓడిందో... అక్కడే బదులు తీర్చుకుంది. ఎవరిని (షాహిన్ అఫ్రిది) చితకబాదాలనుకుందో అతన్నే బాగా ఎదుర్కొంది. భారత బ్యాటర్లు, హిట్టర్లు నిరాశపరిచినా... అడుగడుగునా సవాళ్లు ఎదురైనా... ఒక్కో పరుగు బంగారమైనా... మోస్తరు లక్ష్యం కాస్తా కొండంత అయినా ... కోహ్లి ఆఖరిదాకా నిలిచి కరిగించాడు. ఇప్పటి కోహ్లికి అంత సీన్ ఉందా అనుకున్నవాళ్ల నోళ్లు మూయించి మునుపటి కోహ్లిలా పాక్‌పై శివమెత్తాడు. తన కెరీర్లోనే చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (53 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. దీంతో భారత్ 4 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై విజయం సాధించింది. ఆకాశం తాకే ఉత్కంఠభరిత పోరులో భారత్ ఆఖరిబంతికి గెలిచింది. గతేడాది దుబాయ్‌లో ఎదురైనా పరాజయానికి మెల్బోర్న్లో ప్రతీకారం తీర్చుకుంది. టి20 ప్రపంచకప్ ‘సూపర్ 12’ దశ గ్రూప్–2 లీగ్ మ్యాచ్‌లో మొదట పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. షాన్ మసూద్ (42 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు), ఇఫ్తికార్ అహ్మద్ (34 బంతుల్లో 51; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. మిగతా వారిని అర్‡్షదీప్ (3/32), హార్దిక్ పాండ్యా (3/30) కట్టడి చేశారు. తర్వాత భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి గెలిచింది. కోహ్లి అజేయ పోరాటం చేయగా, పాండ్యా (37 బంతుల్లో 40; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అండగా నిలిచాడు. హారిస్ రవూఫ్ (2/36), నవాజ్ (2/42) భారత్‌ను ఇబ్బంది పెట్టారు. గెలిచేదాకా క్రీజులోనే... లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు రాహుల్ (4), రోహిత్ (4) నిరాశపరిచారు. 2 ఫోర్లు కొట్టిన సూర్యకుమార్ (10 బంతుల్లో 15) జోరుకు రవూఫ్ తెరదించాడు. అక్షర్ పటేల్ (2)ను ముందుకు పంపితే రనౌటయ్యాడు. భారత్ స్కోరు 31/4. లక్ష్యం కష్టమైన ఈ దశలో కోహ్లి, పాండ్యా ఆదుకున్నారు. 25వ బంతిదాకా కోహ్లి ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. దీంతో సగం ఓవర్లు ముగిసేసరికి 45/4 స్కోరు చేసిన భారత్‌కు 60 బంతుల్లో 115 పరుగుల లక్ష్యం కష్టమైంది. నవాజ్ 12వ ఓవర్లో ఎట్టకేలకు 25వ బంతిని ఎదుర్కొన్న కోహ్లి సిక్సర్ కొట్టాడు. ఆ ఓవర్లో హార్దిక్ కూడా 2 సిక్స్‌లు కొట్టడంతో 20 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లలో వంద పరుగులు చేసిన భారత్‌కు 30 బంతుల్లో 60 పరుగుల సమీకరణం క్లిష్టంగా ఉంది. 18వ ఓవర్ నుంచి కోహ్లి ఆట మారిపోయింది. తొలి బంతిని బౌండరీకి తరలించిన అతను 43 బంతుల్లో (4 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ సాధించాడు. షాహిన్ అఫ్రిది వేసిన ఆ ఓవర్లో మొత్తం 3 బౌండరీలు బాదాడు. ఆఖరి ఓవర్లో పాండ్యా, దినేశ్ కార్తీక్ నిష్క్రమించినా తన అనుభవాన్నంతా ఉపయోగించి జట్టును గెలిపించడంతో కోహ్లి సఫలమయ్యాడు. తొలి 20 బంతుల్లో 11 పరుగులే చేసిన కోహ్లి ఆఖరి 33 బంతుల్లో 71 పరుగులు చేయడం విశేషం. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను ఈనెల 27న నెదర్లా్లండ్స్తో ఆడుతుంది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: రిజ్వాన్ (సి) భువనేశ్వర్ (బి) అర్‡్షదీప్ 4; బాబర్ ఆజమ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్‡్షదీప్ 0; షాన్ మసూద్ (నాటౌట్) 52; ఇఫ్తికార్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 51; షాదాబ్ ఖాన్ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ పాండ్యా 5; హైదర్ అలీ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ పాండ్యా 2; నవాజ్ (సి) దినేశ్ కార్తీక్ (బి) హార్దిక్ పాండ్యా 9; ఆసిఫ్ అలీ (సి) దినేశ్ కార్తీక్ (బి) అర్‡్షదీప్ 2; షాహిన్ అఫ్రిది (సి అండ్ బి) భువనేశ్వర్ 16; హారిస్ రవూఫ్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–1, 2–15, 3–91, 4–96, 5–98, 6–115, 7–120, 8–151. బౌలింగ్: భువనేశ్వర్ 4–0– 22–1; అర్‡్షదీప్ 4–0–32–3; షమీ 4–0– 25–1; హార్దిక్ పాండ్యా 4–0–30–3; అశ్విన్ 3–0–23–0; అక్షర్ పటేల్ 1–0–21–0. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) నసీమ్ షా 4; రోహిత్ శర్మ (సి) ఇఫ్తికార్ (బి) హారిస్ రవూఫ్ 4; కోహ్లి (నాటౌట్) 82; సూర్యకుమార్ (సి) రిజ్వాన్ (బి) 15; అక్షర్ పటేల్ (రనౌట్) 2; హార్దిక్ (సి) బాబర్ ఆజమ్ (బి) నవాజ్ 40; దినేశ్ కార్తీక్ (స్టంప్డ్) రిజ్వాన్ (బి) నవాజ్ 1; అశ్విన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–7, 2–10, 3–26, 4–31, 5–144, 6–158. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 4–0–34–0; నసీమ్ షా 4–0–23–1; హారిస్ రవూఫ్ 4–0–36–2; షాదాబ్ ఖాన్ 4–0–21–0; నవాజ్ 4–0–42–2. ఆ రెండు సిక్స్‌లతో... మ్యాచ్ ఆరంభం నుంచి బ్యాటర్లకు కఠిన సవాళ్లు విసురుతున్న ఎంసీజీ పిచ్‌పై కోహ్లి కోహినూర్ వజ్రంలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్న వేళ... భారత విజయ సమీకరణం 12 బంతుల్లో 31 పరుగులుగా మారిన వేళ... కోహ్లి ఆడిన షాట్లు ఇంకెవరికీ సాధ్యం కావు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో హారిస్ రవూఫ్ తొలి 4 బంతుల్లో 3 పరుగులిచ్చాడు. దాంతో భారత్ గెలవాలంటే 8 బంతుల్లో 28 పరుగులు చేయాలి. ఈ దశలో రవూఫ్ వేసిన ఐదో బంతిని అతని తలమీదుగా సిక్సర్ బాదాడు కోహ్లి. ఈ షాట్ మ్యాచ్‌లోనే హైలైట్. ఇక ఆరో బంతిని కోహ్లి ఫైన్‌లెగ్‌లో ఫ్లిక్ షాట్‌తో సిక్స్‌గా మలిచాడు. భారత విజయసమీకరణాన్ని 6 బంతుల్లో 16గా మార్చేశాడు. బంతి బంతికీ ఉత్కంఠ... గెలవడానికి భారత్ చివరి ఓవర్లో 16 పరుగులు చేయాలి. క్రీజులో ‘హార్డ్ హిట్టర్’ హార్దిక్ పాండ్యా, కోహ్లి ఉన్నారు. హార్దిక్ జోరు చూస్తుంటే మూడు షాట్లలో మ్యాచ్‌ను ముగించేస్తాడనిపించింది. కానీ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ►19.1 నవాజ్ వేసిన తొలి బంతికి భారీ షాట్ ఆడిన పాండ్యా అవుటయ్యాడు. ►19.2క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ 1 పరుగు తీసి కోహ్లికి స్ట్రయిక్ ఇచ్చాడు. ►19.3 కోహ్లి 2 పరుగులు తీశాడు. భారత విజయ సమీకరణం 3 బంతుల్లో 13 పరుగులు. ►19.4 నవాజ్ వేసిన ఫుల్‌టాస్‌ను కోహ్లి డీప్ స్క్వేర్‌లో సిక్సర్‌గా మలిచాడు. అంపైర్ దీనిని ‘హైట్ నోబాల్‌గా’ ప్రకటించాడు. దీంతో భారత్ ఖాతాలో 1 బంతికి 7 పరుగులు చేరాయి. భారత్‌కు ‘ఫ్రీ హిట్’ అవకాశం కూడా వచ్చింది. విజయ సమీకరణం 3 బంతుల్లో 6 పరుగులుగా మారింది. ►19.4 ఈసారి నవాజ్ వైడ్ వేశాడు. ఫ్రీ హిట్ సజీవంగా నిలిచింది. ►19.4 ఫ్రీ హిట్ బంతికి కోహ్లి బౌల్డ్ అయ్యాడు. ‘ఫ్రీ హిట్’పై కేవలం రనౌట్ అయితేనే అవుట్‌గా పరిగణిస్తారు. వికెట్లకు తగిలిన బంతి థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లింది. కోహ్లి, కార్తీక్ 3 ‘బై’ పరుగులు తీశారు! విజయ సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులుగా మారింది. ►19.5 దినేశ్ కార్తీక్ స్వీప్ షాట్ ఆడగా బంతి అతని ప్యాడ్‌కు తగిలి వెనక్కి వెళ్లింది. కార్తీక్ క్రీజులోకి వచ్చేలోపు పాక్ కీపర్ రిజ్వాన్ స్టంపౌట్ చేశాడు. విజయ సమీకరణం 1 బంతికి 2 పరుగులుగా మారింది. ►19.5 తీవ్ర ఒత్తిడిలో ఉన్న నవాజ్ లెగ్ సైడ్‌లో బంతి వేశాడు. అంపైర్ దానిని వైడ్‌గా ప్రకటించాడు. దాంతో భారత విజయ సమీకరణం 1 బంతికి 1 పరుగుగా మారింది. ►19.6 ఈసారి నవాజ్ వేసిన బంతిని అశ్విన్ మిడాఫ్‌లో ఫీల్డర్ మీదుగా షాట్ ఆడాడు. పరుగు తీశాడు. భారత్ విజయం ఖరారైంది. -
దీపావళి స్కాం: వాటిపై క్లిక్ చేయకండి, మోసపోతారు జాగ్రత్త!
భారతీయులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. పండగ సమయాల్లో షాపులు కళకళలాడుతాయన్న సంగతి తెలిసిందే. అందుకే కంపెనీలు బ్యాంకులు, వ్యాపారులు తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ప్రత్యేకంగా దివాళి సందర్భంగా కొందరు వారి స్నేహితులకు, బంధువులకు బహుమతులను కూడా ఇస్తుంటారు. అయితే ఈ గిఫ్టింగ్ సీజన్లో ఇదే అదునుగా కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఉచితంగా దీపావళి బహుమతుల పేరుతో మీ బ్యాంక్ ఖాతాని ఖాళీ చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ మెసేజ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హెచ్చరిస్తోంది. వాట్సప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో దీపావళి బహామతుల పేరుతో అనధికారికంగా మెసేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి. ఫెస్టివల్ ఆఫర్స్, గిఫ్ట్స్, బహుమతుల పేరుతో మెసేజ్ లింక్స్‌ను పంపిస్తున్నారని తెలపింది. ఆ లింక్స్ క్లిక్ చేస్తే యూజర్ల వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చిరించింది. ఒక వేళ వాటిని క్లిక్ చేస్తే చైనాకు చెందిన వెబ్సైట్లకు లింక్ అయ్యే అవకాశం ఉందని, అవి .xyz, .top డొమైన్లతో ఈ వెబ్‌సైట్స్ ఉన్నట్లు CERT-In గుర్తించింది. ఈ రకంగా మోసం అయితే బహుమతులను పొందేందుకు అమాయకంగా ప్రజలు వాటికి ఆకర్షితులవుతారు. వినియోగదారు లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, అతనికి బహుమతి గెలుచుకున్నట్లు అభినందనలు సందేశం వస్తుంది. ఆపై వారి వ్యక్తిగత వివరాలను నింపాల్సి ఉంటుంది. అలా నింపిన తర్వాత, బహుమతిని క్లెయిమ్ కోసం ఆ లింక్ ఉన్న మెసేజ్‌లను వారి స్నేహితులు, బంధువులతో పంచుకోవాలని అప్పుడే గిఫ్ట్ పొందగలరని చూపిస్తుంది. ఈ కార్యక్రమం పూర్తయ్యాక యూజర్ల వ్యక్తిగత డేటా మొత్తం సైబర్ దాడి గురయ్యే అవకాశం ఉంది. ఆన్లైన్ స్కామ్‌ను ఎలా నివారించాలి ఈ తరహా స్కామ్‌లను నివారించేందుకు, బహామతులు, రుణాల పేరుతో అనధికారికంగా వచ్చే లింక్‌ల పట్ల జాగ్రత్తగా వహించాలి. మెసేజ్ మన మొబైల్ లోకి రాగానే ఆ లింక్ మూలాన్ని తనిఖీ చేయడం మంచిది. డొమైన్ పేరు కూడా సరిచూసుకోవడం ఉత్తమం. ఏ మాత్రం మెసేజ్ పై సందేహం ఉన్నా మీరు దానిపై క్లిక్ చేయడం మానుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా పర్సనల్ డేటాను బహిర్గతం చేయకూడదు. -
దేశదేశాల దీపావళి
దీపావళి పండుగను భారతదేశంలోనే కాకుండా దేశదేశాల్లోని హిందువులంతా ఘనంగా జరుపుకొంటారు. భారత్‌కు ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయాన్మార్, శ్రీలంకలతో పాటు భారతీయుల జనాభా గణనీయంగా ఉండే అమెరికా, బ్రిటన్, కెనడా, మారిషస్, సింగపూర్, మలేసియా, ఇండోనేసియా, సురినేమ్, థాయ్‌లాండ్, ఫిజీ, ట్రినిడాడ్ అండ్ టొబాగో, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో దీపావళి వేడుకలు ఏటా బాణసంచా కాల్పులతో, దీపాల వెలుగులతో దేదీప్యమానంగా జరుగుతాయి. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోను, కెనడా ప్రధాని కార్యాలయంలోను దీపావళి వేడుకలను దాదాపు పాతికేళ్లుగా అధికారికంగా నిర్వహిస్తూ వస్తున్నారు. వైట్‌హౌస్‌లో దీపాలు వెలిగిస్తున్న జో బైడెన్ దంపతులు వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు 2003లో తొలిసారిగా అప్పటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో ప్రారంభమయ్యాయి. ఈసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కెనడా ప్రధాని కార్యాలయంలో దీపావళి వేడుకలు 1998 నుంచి జరుగుతూ వస్తున్నాయి. కెనడా ప్రధాని కార్యాలయంలో తొలిసారిగా నాటి ఎంపీ దీపక్ ఓబెరాయ్ దీపావళి వేడుకలను ప్రారంభించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కొన్నేళ్లుగా స్వయంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. భారత్ వెలుపల పలు దేశాల్లో అక్కడి అధికార వర్గాలు కూడా దీపావళి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటుండటం విశేషం. ఫిజీలో దీపాలు వెలిగిస్తున్న పోలీసు అధికారి దీపావళి మూలాలు ప్రాచీన భారతదేశంలో ఉన్నాయి. ఇక్కడి నుంచే ఈ పండుగ వివిధ ప్రాంతాలకు విస్తరించింది. క్రీస్తుశకం ఒకటో శతాబ్దికి చెందిన పద్మపురాణం, స్కందపురాణాల్లో దీపావళి ప్రసావన కనిపిస్తుంది. క్రీస్తుశకం ఏడో శతాబ్దికి చెందిన పాలకుడు హర్షుడు రాసిన ‘నాగానందం’ కావ్యంలో దీపావళి వర్ణన ఉంది. మొఘల్ హయాం నాటికి దీపావళి వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చడం మొదలైంది. దీపావళి హిందువులకు మాత్రమే పరిమితమైన పండుగ కాదు. ఈ పండుగను సిక్కులు, జైనులు, బౌద్ధులు కూడా సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. దీపావళి వేడుకలు ప్రారంభిస్తున్న కెనడా ప్రధాని లండన్‌లో... మలేసియాలో... -
దివాళీ బొనాంజా: బ్యాంకులు బంపరాఫర్లు.. కస్టమర్లకు పండగే!
కస్టమర్లకు బంపరాఫర్. దీపావళి సందర్భంగా కొత్త ఇల్లు, కారు కొనాలని అనుకుంటున్నారా? లేదా ఇల్లు రెనోవేట్ చేయాలని అనుకుంటున్నారా? భారీగా పెరిగిన వడ్డీరేట్ల నుంచి ఉపశమనం దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని బ్యాంక్ ఆఫ్ బరోడా,హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసిఐసిఐ,ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకులు పరిమిత కాలానికి లోన్ ఆఫర్లను ప్రకటించాయి. ఎస్బీఐ గృహ రుణాలను సంవత్సరానికి 8.4 శాతం నుండి టాప్-అప్ రుణాలను 8.8 శాతం నుండి అందిస్తోంది. ఈ పండుగ సీజన్లో రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా సంవత్సరానికి 8.45 శాతం నుండి గృహ రుణాలను అందిస్తోంది. 8.45 శాతం నుండి కార్ లోన్లను అందిస్తుంది. కారు రుణాలపై ఎలాంటి ఫోర్క్లోజర్ ఛార్జీలు లేవు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సంవత్సరానికి 7.9 శాతం చొప్పున కారు లోన్లను అందిస్తోంది. 50 శాతం పూర్తయిన తర్వాత (కనీసం 24 నెలలు) ఎలాంటి ఫోర్క్లోజర్ ఛార్జీలు లేవు. బంగారం రుణాలపై, ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం మాఫీ చేసింది. ఐసీఐసీ బ్యాంక్ ప్రస్తుతం కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ను అందిస్తోంది. లబ్ధిదారులకు సంబంధించిన అన్నీ డాక్యుమెంట్లను చెక్ చేసిన తర్వాత, ప్రీ-అప్రూవ్డ్ లోన్లను మంజూరు చేస్తుంది. కారు రుణాలపై, ప్రాసెసింగ్ రుసుము రూ. 1,999, కొత్త కారు రుణాలపై ఆన్-రోడ్ ధరలో 100 శాతం వరకు లోన్ మొత్తాలను అందిస్తుంది. కార్ లోన్లపై ఫోర్క్లోజర్, ప్రీపేమెంట్ ఛార్జీలు లేవు. వ్యక్తిగత రుణాలపై 12 ఈఎంఐల తర్వాత ప్రీ-క్లోజర్ ఛార్జీలు ఉండవు (12ఈఎంఐల కంటే ముందు ఫోర్క్లోజర్ చేస్తే 3 శాతం వసూలు చేస్తాయి). పంజాబ్ నేషనల్ బ్యాంకు పండుగ సీజన్లో పీఎన్బీ ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ 2022 అనే పేరుతో గృహ రుణాలు, కారు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి 7.50 శాతం నుండి గృహ రుణాలను అందిస్తోంది. తిరిగి చెల్లించే వ్యవధి 75 సంవత్సరాల వరకు ఉంటుంది. ముందస్తు చెల్లింపు ఛార్జీలు లేవు. కార్ లోన్లను అందిస్తుంది. ఇది సంవత్సరానికి వడ్డీ 7.65 శాతం నుండి ప్రారంభమవుతుంది. కారు రుణాలకు ప్రాసెసింగ్ ఫీజులు లేవు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పండుగ సీజన్లో గృహ, కారు రుణాలపై ప్రాసెసింగ్ ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గృహ రుణాలను 8.30 శాతం నుండి, కారు రుణాలను 8.70 శాతం నుండి అందిస్తోంది. బ్యాంక్ ప్రాసెసింగ్ ఛార్జీలను మాఫీ చేసింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఏడేళ్ల వరకు కార్ లోన్లను అందిస్తోంది. ఈ పండుగ సీజన్లో కార్లను కొనుగోలు చేసేలా 100 శాతం వరకు ఫైనాన్స్ అందిస్తోంది. సాధారణంగా, బ్యాంకులు కారు రుణం 80-85 శాతం వరకు ఫైనాన్సింగ్‌ను అందిస్తాయి. ఇది 72 నెలల వరకు రూ. 50 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. ఇతర ప్రముఖ బ్యాంకులతో పోలిస్తే, బ్యాంక్ ఎక్కువ కాలం పాటు వ్యక్తిగత రుణాలను అందిస్తోంది. గరిష్ట రుణ మొత్తం ఎక్కువగా ఉంటుంది. గృహ రుణాల కోసం 30ఏళ్ల వరకు సుదీర్ఘ కాల వ్యవధిని అందిస్తోంది. -
ధంతేరస్: చీపురు సహా వీటిని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం!
ధనత్రయోదశి లేదా ధంతేరస్ దీపావళి పండుగలో అతి పవిత్రమైనది. కీలకమైంది. ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవి, కుబేరులకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడమే కాదు, కొత్త పాత్రలు, కొత్త వాహనాలు, వెండి, బంగారు నగలు, ఇత్తడి, ప్రతిమలు కొనడం శుభ ప్రదంగా భావిస్తారు. ధనత్రయోదశి నాడు షాపింగ్ చేస్తే, ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేసినా, లేదా కొత్త వస్తువులను ఇంటికి తీసుకు వచ్చినా లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందనీ, సిరసంపదలు, శ్రేయస్సు లభిస్తుందని చాలామంది నమ్మకం. "ధంతేరస్" అనే పదం 13వ శతాబ్దం నుంచి వాడుకలో ఉంది. సంస్కృతంలో దీనికి "సంపద" అని అర్ధం. సంపద శ్రేయస్సుల మేలు కలయిక ధనత్రయోదశి. ఈ సందర్భంగా ధన్వంతరిని పూజిస్తారు. ఈ రోజు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడం అదృష్టంగా భావిస్తారు. (వామ్మో! సంతకాలను కాపీ చేస్తున్న మెషీన్..ఆ హీరో సంతకం వైరల్) ఈ పవిత్రమైన రోజున కొనుగోలుకు 5 వస్తువులకు ప్రాధాన్యత ఇస్తారు. ♦ దేశవ్యాప్తంగా ధంతేరస్ రోజున కొంచెమైనా బంగారం ,వెండిని కొనుగోలు చేయడం శుభప్రదమని భావిస్తారు. అలాగే "ధన్"తో పాటు నాణేలను లక్ష్మీగా భావించి పూజిస్తారు. ♦ ధంతేరస్ రోజున మార్కెట్ నుండి కొత్త చీపురు కొనడం కూడా అదృష్టంగా, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. చీపురు లక్ష్మీ దేవిగా పరిగణిస్తారు. ♦ ఈ రోజున ఏదైనా వాహనం కొనుగోలు చేయడం ఆనవాయితీ. అలా చేస్తే అదృష్టం కలిసి వస్తుందని నమ్మం. ♦ లక్ష్మీ, గణేష్ ప్రతిమలను కొనుగోలు చేస్తే విఘ్నాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. ♦ ఇత్తడి వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారు. పౌరాణిక పురాణాల ప్రకారం, ధన్వంతరి సముద్ర మథనం సమయంలో ఆయన చేతిలో అమృతతో నిండిన ఇత్తడి కలశం ఉందని కనుక ఇత్తడి వస్తువవులను కొనుగోలు చేస్తే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజున సంపదల దేవత లక్ష్మీ, కుబేరుని ప్రసన్నం చేసు కోవాలనుకుంటే, పసుపుతో 21 బియ్యం గింజలను ఎర్రటి వస్త్రంలో కట్టి బీరువాలో ఉంచుకుంటారు. ఇలా చేయడం వల్ల సిరి సంపదలకు లోటు లేకుండా, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్మకం. -
Diwali 2022: పండుగ పచ్చగా.. గ్రీన్ క్రాకర్స్‌కు పెరిగిన ఆదరణ
దీపావళి వచ్చేసింది. అమావాస్య చీకటి రోజున దివ్వెల కాంతులతో పాటు కాకరపువ్వొత్తుల చిటపటలు, మతాబుల వెలుగులు, చిచ్చుబుడ్ల మెరుపులు, లక్ష్మీబాంబుల మోతలు లేకుండా పండుగకి కళే రాదు. మరి ఈ బాణాసంచాతో పర్యావరణం, వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బ తింటోంది. అందుకే ఇప్పుడు అందరూ ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ పండగ సరదా తీర్చుకోవాలంటే గ్రీన్ క్రాకర్స్ మార్గం కావడంతో వాటికి ఆదరణ పెరుగుతోంది. ఏమిటీ గ్రీన్ క్రాకర్స్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)–నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ) ప్రకారం తక్కువ షెల్ సైజుతో, రసాయనాలు తక్కువగా వినియోగిస్తూ, బూడిద వాడకుండా తయారు చేసే బాణసంచాను గ్రీన్ క్రాకర్స్‌గా పిలుస్తున్నారు. మామూలుగా వాడే హానికరమైన సల్ఫర్ నైట్రేట్స్, సోడియం, లెడ్, మెగ్నీషియం, బేరియం, అత్యంత హానికరమైన బ్లాక్ పౌడర్‌ను వీటిలో వాడరు. అందుకే వీటితో కాలుష్యం 30% తక్కువగా ఉంటుంది. శబ్ద కాలుష్యమూ తక్కువే. సాధారణ బాణసంచా 160 డెసిబుల్ శబ్దంతో పేలితే ఇవి 110 డెసిబుల్ శబ్దం చేస్తాయి. వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో గ్రీన్ క్రాకర్స్‌కు మాత్రమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అనుమతినిచ్చింది. గ్రీన్ క్రాకర్స్‌ని గుర్తించడం ఎలా ? ఎన్ఈఈఆర్ఐ ఫార్ములా ప్రకారం ప్రస్తుతం తమిళనాడులో ప్రఖ్యాత బాణాసంచా కేంద్రమైన శివకాశీలోనే తయారు చేస్తున్నారు. వీటిని గుర్తించడానికి వీలుగా సీఎస్ఐఆర్–ఎన్ఈఈఆర్ఐ ఆకుపచ్చ రంగు లోగోను బాణాసంచా బాక్సులపై ముద్రిస్తున్నారు. క్యూఆర్ కోడ్ కూడా ఈ బాక్సులపై ఉంటుంది. గ్రీన్ క్రాకర్స్ మూడు రకాలున్నాయి. స్వాస్: వీటిని కాల్చినప్పుడు నీటి ఆవిరి కూడా విడుదలై గాల్లో ధూళిని తగ్గిస్తుంది. గాలిలో సూక్ష్మ ధూళికణాలు 30% తగ్గుతాయి స్టార్: వీటిలో పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వాడరు వాయు కాలుష్యానికి కారణమైన పర్టిక్యులర్ మేటర్ (పీఎం)ని తగ్గించడంతో పాటు శబ్ద కాలుష్యాన్ని కూడా నివారిస్తాయి సఫల్: ఈ రకమైన గ్రీన్ క్రాకర్స్‌లో మెగ్నీషియమ్కు బదులుగా అల్యూమినియమ్ తక్కువ మోతాదులో వాడతారు.సంప్రదాయ బాణాసంచాతో పోలిస్తే శబ్ద కాలుష్యం తక్కువ. కేంద్రం లైసెన్స్ ఇచ్చిన కేంద్రాల్లోనే గ్రీన్ క్రాకర్స్ కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాదే ఆదరణ ఎందుకు ? పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ముప్పుని గుర్తించిన సుప్రీం కోర్టు బాణాసంచాను నిషేధిస్తూ అక్టోబర్ 23, 2018 దీపావళికి ముందు సంప్రదాయ బాణాసంచాపై నిషేధం విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. గ్రీన్ క్రాకర్స్‌కి మాత్రమే అనుమతినిచ్చింది. 2019లో దీపావళి సమయంలో గ్రీన్ క్రాకర్స్‌పై గందరగోళంతో బాణాసంచా పరిశ్రమ భారీగా నష్టపోయింది. వేటిని గ్రీన్ అనాలో వేటి కాదో తెలీక, తయారీదారులకే వీటిపై అవగాహన లేకపోవడంతో ఆ ఏడాది దీపావళి పండగ కళ తప్పింది. ఆ తర్వాత వరసగా రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావం పండగపై పడింది. 2021లో సుప్రీం కోర్టు ఆకుపచ్చ రంగుని వెదజల్లే బేరియమ్ను వాడే టపాసులకి అనుమతి లేదని మరోసారి స్పష్టం చేసింది. సుప్రీం తీర్పు వచ్చి నాలుగేళ్లు కావడంతో ఇప్పుడు వీటిపై అందరికీ అవగాహన పెరుగుతోంది. అయినప్పటికీ బాణాసంచా ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 50% తగ్గిపోయిందని శివకాశీలో తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏయే రాష్ట్రాల్లో ఎలా? కాలుష్యంతో సతమతమయ్యే ఢిల్లీలో జనవరి 1 దాకా అన్ని రకాల బాణసంచాపై నిషేధముంది. కొన్ని రాష్ట్రాలు గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతినిచ్చాయి. పశ్చిమ బెంగాల్లో దీపావళి రోజు మాత్రం క్రాకర్స్‌ను కాల్చుకోవచ్చు. పంజాబ్ రాత్రి 8 నుంచి 10 వరకే గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతించింది. హరియాణా కూడా గ్రీన్ క్రాకర్స్‌కే అనుమతినిచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Diwali 2022: టపాసులు కాల్చే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
సాక్షి,హైదరాబాద్: దీపావళి అంటేనే వెలుగుల పండుగ.. అమావాస్య చీకట్లను చీల్చుతూ ఎటుచూసినా దీపాల సొబగులే.. అంబరాన్నంటే సంబరాలే.. బంధువుల రాకపోకలు... అతిథి మర్యాదలు... టపాసుల మోతలు ఇలా దీపావళి పండుగ అంతా సందడిగానే ఉంటుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆనందోత్సవాల మధ్య జరుపుకునే పండుగ ఇది. అలాంటి దీపావళి పండుగలో ఆనందం ఎంత ఉంటుందో ప్రమాదం కూడా అంతే ఉంటుందని ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. లక్ష్మీదేవి ఆరాధన.. దీపావళి రోజు ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి పూజను నిర్వహిస్తారు. ఇంట్లో ఉన్న బంగారం, నగదును అమ్మవారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. చీకట్లను పారద్రోలే విధంగా దీపాలను వెలిగించి పూజ చేస్తారు. దీపారాధన అనేది ఈ పండుగలో ప్రత్యేకమైనది. ఇంట్లో దీపాలు వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని అందరి నమ్మకం. లక్ష్మీదేవి దీప జ్యోతిగా సంపద దైవంగా భావిస్తుండటంతో అందరు దీపావళి రోజు దీపాలను వెలిగిస్తారు. మార్కెట్లో రకరకాల డిజైన్లు.. మార్కెట్లో వివిధ రకాల డిజైన్లతో కూడిన ప్రమిదలు లభిస్తున్నాయి. స్టీల్, ప్లాస్టిక్, మట్టికి సంబంధించి దీపాలు, ప్రమిదలు వివిధ డిజైన్లలో మార్కెట్లో దండిగా లభిస్తున్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలకు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయి. అదేవిధంగా ఈ పండుగకు కావాల్సిన వస్తువులు ఆన్లైన్లో తక్కువ రేటు ఉండటంతో చాలామంది ఆన్లైన్ ద్వారా తెíప్పించుకుంటున్నారు. మరికొందరు దుకాణాలకు నేరుగా వెళ్లి తెచ్చుకుంటున్నారు. దీంతో మార్కెట్లు సందడిగా మారాయి. జాగ్రత్తలు తప్పనిసరి.. దీపావళి పండుగలో ఆనందం ఎంత ఉంటుందో ప్రమాదం కూడా అంటే ఉంటుంది. బాణా సంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపకశాఖ, పోలీసులు, వైధ్యాధికారులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను నివారించవచ్చు. ► టపాసులను ఆరుబయటనే కాల్చాలి. ఇంట్లో కాల్చొద్దు. ► ఆస్పత్రులు, పెట్రోల్ బంకులు ఉన్న ప్రాంతాల్లో టపాసులు పేల్చొద్దు. ► టపాసులు కాల్చే ముందు విధిగా పాదరక్షలు ధరించాలి, అందుబాటులో నీళ్లు ఉంచుకోవాలి. గాయాలు అయితే వెంటనే సమీపంలో ఉన్న వైద్యులను సంప్రదించాలి. ► టపాసులు కాల్చేటప్పుడు చిన్నారులను ఒంటరిగా వదిలిపెటొద్దు. పెద్దల సమక్షంలోనే పిల్లలు టపాసులు కాల్చాలి. సరిగ్గా కాలని బాణసంచాపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ► టీషర్టులు, జీన్స్లాంటి దుస్తులు కాకుండా వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి, కళ్లకు హాని కలగకుండా అద్దాలు వాడాలి. ► అగ్నిమాపక శాఖ వద్ద లైసెన్సులు పొందిన దుకాణాల్లోనే బాణసంచా కొనుగోలు చేయాలి. ► పర్యావరణ హితమైన పదార్థాలతో తయారు చేసిన గ్రీన్ కాకర్స్ ఉపయోగిస్తే మంచిది. అప్రమత్తంగా ఉండాలి టపాసుల కాల్చేటప్పుడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలో బాణా సంచా కాల్చాలి. టపాసులు విక్రయించే వారు విధిగా అనుమతులు తీసుకోవాలి. దుకాణాల వద్ద ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలి. – రమేష్‌గౌడ్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, షాద్‌నగర్ అగ్నిమాపక కేంద్రం -
డీమార్ట్ ఉన్న ఏకైక మాల్ మాదే... ప్రతి వీకెండ్ ఈవెంట్స్ ఉంటాయి
-
వెలుగు దివ్వెల దీపావళి