సాక్షి,ముంబై: దీపావళి వచ్చిందంటే స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లలో ప్రత్యేక సందడి నెలకొంటుంది. దీపావళి రోజు లక్ష్మీ పూజతోపాటు, ముహూరత్ ట్రేడింగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ముహూరత్ ట్రేడింగ్ రోజును ఇన్వెస్టర్లు, వ్యాపారులు శుభదినంగా భావిస్తారు. దివాలీ రోజు గంట సేపు ముహూరత్ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించటం ఆనవాయితీ. అంతేకాదు ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించే ఏకైక దేశం భారతదేశం. దీపావళి పర్వదినం రోజు లక్ష్మీ పూజ తరువాత ఒక గంట ట్రేడింగ్ సెషన్ నిర్వహించి సంవత్ 2079 సాంప్రదాయంగా ప్రారంభిస్తారు.(ముహూరత్ ట్రేడింగ్: ‘మిస్‌యూ రాకేశ్ ఝన్‌ఝన్ వాలా’)
ముహూరత్ ట్రేడింగ్ చరిత్ర
ఈ ఏడాది అక్టోబర్ 24, 2022న దీపావళి సందర్భంగా ముహూరత్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించ నున్నారు. ఈ సాంప్రదాయ చర్రితను ఒక సారి పరిశీలిస్తే 1957లో బీఎస్‌ఈ ముహూరత్ ట్రేడింగ్ సంప్రదాయాన్ని ప్రారంభించగా, 1992లో ఎన్‌ఎస్‌ఈ దీనిని దీపావళి రోజున ప్రారంభించింది. మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించిన నిర్వహించే శుభ ముహూర్తం. ఈ సందర్భంగా వ్యాపారులు పెట్టుబడికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, SLB సెగ్మెంట్' క్యాలెండర్ ప్రకారం, అక్టోబర్ 24, 2022న జరుగనుంది. సాధారణంగా దేశంలోని వ్యాపార సంఘాలు కొత్త ఖాతాలను తెరవడంతోపాటు ఈ రోజున మునుపటి బ్యాలెన్స్ షీట్‌ను క్లోజ్ చేస్తారు. అలాగే ట్రేడ్ పండితులు, ఎనలిస్టులు, బ్రోకరేజ్ సంస్థలు పలు స్టాక్స్‌ను ట్రేడర్లకు రికమెండ్ చేస్తారు. అలాగే దీపావళి బలిప్రతిపాద సందర్భంగా అక్టోబర్ 26న ఎక్స్ఛేంజీలు పనిచేయవు.
దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సెషన్ సమయాలు
మార్కెట్ సాయంత్రం 6:15 కు ఓపెన్ అవుతుంది.
మార్కెట్ సాయంత్రం 7:15 ముగుస్తుంది.
ట్రేడ్ సవరణ ముగింపు సమయం సాయంత్రం 7:25
Comments
Please login to add a commentAdd a comment