ధనత్రయోదశి లేదా ధంతేరస్ దీపావళి పండుగలో అతి పవిత్రమైనది. కీలకమైంది. ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవి, కుబేరులకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడమే కాదు, కొత్త పాత్రలు, కొత్త వాహనాలు, వెండి, బంగారు నగలు, ఇత్తడి, ప్రతిమలు కొనడం శుభ ప్రదంగా భావిస్తారు.
ధనత్రయోదశి నాడు షాపింగ్ చేస్తే, ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేసినా, లేదా కొత్త వస్తువులను ఇంటికి తీసుకు వచ్చినా లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందనీ, సిరసంపదలు, శ్రేయస్సు లభిస్తుందని చాలామంది నమ్మకం. "ధంతేరస్" అనే పదం 13వ శతాబ్దం నుంచి వాడుకలో ఉంది. సంస్కృతంలో దీనికి "సంపద" అని అర్ధం. సంపద శ్రేయస్సుల మేలు కలయిక ధనత్రయోదశి. ఈ సందర్భంగా ధన్వంతరిని పూజిస్తారు. ఈ రోజు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడం అదృష్టంగా భావిస్తారు. (వామ్మో! సంతకాలను కాపీ చేస్తున్న మెషీన్..ఆ హీరో సంతకం వైరల్)
ఈ పవిత్రమైన రోజున కొనుగోలుకు 5 వస్తువులకు ప్రాధాన్యత ఇస్తారు.
♦ దేశవ్యాప్తంగా ధంతేరస్ రోజున కొంచెమైనా బంగారం ,వెండిని కొనుగోలు చేయడం శుభప్రదమని భావిస్తారు. అలాగే "ధన్"తో పాటు నాణేలను లక్ష్మీగా భావించి పూజిస్తారు.
♦ ధంతేరస్ రోజున మార్కెట్ నుండి కొత్త చీపురు కొనడం కూడా అదృష్టంగా, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. చీపురు లక్ష్మీ దేవిగా పరిగణిస్తారు.
♦ ఈ రోజున ఏదైనా వాహనం కొనుగోలు చేయడం ఆనవాయితీ. అలా చేస్తే అదృష్టం కలిసి వస్తుందని నమ్మం.
♦ లక్ష్మీ, గణేష్ ప్రతిమలను కొనుగోలు చేస్తే విఘ్నాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం.
♦ ఇత్తడి వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారు. పౌరాణిక పురాణాల ప్రకారం, ధన్వంతరి సముద్ర మథనం సమయంలో ఆయన చేతిలో అమృతతో నిండిన ఇత్తడి కలశం ఉందని కనుక ఇత్తడి వస్తువవులను కొనుగోలు చేస్తే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజున సంపదల దేవత లక్ష్మీ, కుబేరుని ప్రసన్నం చేసు కోవాలనుకుంటే, పసుపుతో 21 బియ్యం గింజలను ఎర్రటి వస్త్రంలో కట్టి బీరువాలో ఉంచుకుంటారు. ఇలా చేయడం వల్ల సిరి సంపదలకు లోటు లేకుండా, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్మకం.
Comments
Please login to add a commentAdd a comment