auspicious
-
ధనుర్మాసం అంటే ..? ఈ మాసంలో శుభకార్యాలు చేయకూడదా..?
డిసెంబర్ 15వ తేదీ ఆదివారం సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి, దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. తెలుగు రాష్ట్రాలలో ఈ మాసాన్ని పండుగ నెల అని అంటారు. సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభాన్నే పల్లెటూర్లలో సంక్రాంతి నెల పట్టడం అంటారు. శుభకార్యాలు ఎందుకు చేయరు?ఏడాది పొడవునా నిత్య దైనందిన కార్యక్రమాలతో ఉంటూ భగవంతుని కోసం సమయం కేటాయించలేని వారి కోసమే ఈ ధనుర్మాసం. అందుకే ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. శుభకార్యాలు ఉండవు కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు. ఎందుకంటే రవి ధనస్సు రాశిలోకి ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనుస్సు, మీనంలో రవి ఉన్నప్పుడు, సూర్యుని రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు. ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజించడం శుభం. (చదవండి: అలాంటి వ్యక్తులకి మళ్ళీ పెళ్ళి చేయడం పొరపాటేనా!) -
విశ్వక్సేన్ కొత్త సినిమా ప్రాజెక్ట్ ప్రారంభం (ఫొటోలు)
-
యూదుల పవిత్ర గ్రంథం ‘తొరా’లో ఏముంది? బైబిల్తో సంబంధం ఏమిటి?
ఏ మతంలోనైనా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. జుడాయిజంలో కూడా అదే ఉంది. ఆధునిక విద్యతో పాటు యూదులు తమ పిల్లలకు తమ మత విలువలను కూడా బోధిస్తారు. ప్రతి యూదు కుటుంబంలో ఇది కనిపిస్తుంది. పిల్లలకు చదువుకునే వయసు రాగానే ఇంటి పెద్దలు జుడాయిజానికి సంబంధించిన విషయాల గురించి చెబుతారు. తమ పవిత్ర గ్రంథమైన ‘తోరా’ను వారిచేత చదివిస్తారు. ప్రతి యూదు ‘తోరా’ను తప్పక చదివి అర్థం చేసుకుంటారు. ఇది చదివిన వారే నిజమైన యూదునిగా ఆ మత పెద్దలు గుర్తిస్తారు. ‘తోరా’ యూదుల ఆరాధనా గ్రంథం. తోరా అనే పదం తోహ్-రా అంటే నేర్చుకోవడం అనే పదం నుండి రూపొందింది. మనం ఉపయోగిస్తున్న తోహ్-రా అనే పదం బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలను సూచిస్తుంది. వీటిని పంచగ్రంథం అంటారు. ఇవి జెనెసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్, డ్యూటెరోనమీ. ‘తోరా’ను మోషే రాశాడని చెబుతారు. అందుకే దీనిని మోషే ధర్మశాస్త్ర గ్రంథం అని కూడా అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూదులు ఈ పుస్తకం ద్వారానే తమ దేవుణ్ణి స్మరించుకుంటారు. భారతదేశంలోని యూదులు కూడా ఈ గ్రంథాన్ని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. వారు నిర్వహించే పవిత్రమైన కార్యక్రమంలో ఖచ్చితంగా ఈ గ్రంథాన్ని ఉంచుతారు. సృష్టి ప్రారంభం నుంచి మోషే మరణం వరకు దేవుడు ప్రజలతో ఎలా వ్యవహరించాడో ఈ పవిత్ర గ్రంథంలో పేర్కొన్నారని చెబుతారు. దీనితో పాటు ప్రతి యూదు విశ్వసించాల్సిన మోషే చట్టాలు, నియమాలు దీనిలో ఉన్నాయని చెబుతారు. యూదుల ప్రత్యేక ప్రార్థన ఈ గ్రంథంలో కనిపిస్తుంది. యూదుల దేవుడైన యెహోవా పేరు ఈ పుస్తకంలో 1800 సార్లు కనిపిస్తుంది. ఇది కూడా చదవండి: యూదులు ఇతరుల రక్తాన్ని ఎందుకు ఎక్కించుకోరు? వారు చెప్పే కారణం ఏమిటి? -
మంగళకరం
భారతీయ సంప్రదాయంలో ఏదయినా ప్రారంభం చేసేటప్పుడు.. మంగళకరమైన వాక్కులతో, శబ్దాలతో ప్రారంభం జరుగుతుంటుంది. ‘మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని శాస్త్రాణి ప్రథంతే’.. అంటారు. అంటే మంగళకర వాక్కుతో ప్రారంభించాలి, మధ్యలో మంగళకరమైన వాక్కు ఉండాలి. ముగింపును కూడా మంగళకరంగా పూర్తి చేయాలి.. అని శాస్త్ర వాక్కు. అంటే జీవితం ఎప్పుడూ మంగళకరంగా, శోభాయమానంగా ఉండాలి. శాంతికి విఘాతం కలగకుండా చూసుకుంటుండాలి. అంటే ఇతరుల మనశ్శాంతికి కారణమయ్యేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి. మంగళకర వాక్కులు, శబ్దాలు ఉన్నచోట పూజనీయత ఉంటుంది. వాతావరణం కూడా పరిశుద్ధమయి, దేవతల అనుగ్రహానికి కారణమవుతుందని విశ్వసిస్తాం. ఘంటానాదంతో పూజ ప్రారంభం చేస్తాం. ఎందుకని.. ఆగమార్థంతు దేవానాం/ గమనార్థంతు రాక్షసాం/ కురుఘంటారవంతత్ర/ దేవాతాహ్వాన లాంఛనం... అంటే రాక్షసులు అక్కడినుంచి వెళ్లిపోవాలన్నా, దేవతలు రావాలన్నా... ఘంట మోగాలి. ఆ శబ్దంలోని పవిత్రత, మంగళప్రదత్వం అటువంటిది. నాదస్వరం, షెహనాయి, మృదంగం, డోలు, శాక్సోఫోన్, మద్దెల, ఘంటలు, గజ్జెలు, ఢమరుకం, శంఖం, కొమ్ము, వేణువు, వీణ, వయోలిన్, హార్మోనియం, క్లారినెట్... ఇవన్నీ మంగళప్రదమైన శబ్దాలు చేసే సంగీత పరికరాలు. బ్యాండ్ కూడా అంతే... దానిలోని శాక్సోఫోన్ కానీ, క్లారినెట్ కానీ, ఇతర పరికరాలు కానీ అవి కూడా గురుముఖతః నేర్చుకుని వాయిస్తారు. వీటిని మోగించే కళాకారులను కూడా సమాజం సమున్నతం గా ఆదరిస్తుంది. పండిట్ రవిశంకర్, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ లను భారతరత్న వరించింది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్... వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలను ఆయన అందుకున్నారు. ‘నేను సరస్వతీ ఆరాధకుడిని’ అని బిస్మిల్లాఖాన్ ప్రకటించుకున్నారు. ‘యావత్ భారతదేశంలోని ప్రజలందరూ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు..’ అని ఆయన తరచుగా అంటూండేవారు. ఒకసారి అమెరికాలో కచేరీ సందర్భంగా అభిమానులు ఆయనను అక్కడే ఉండిపొమ్మని కోరగా... కాశీని, విశ్వనాథుడిని, విశాలాక్షిని, గంగమ్మను వదిలి రాలేను అని.. ప్రకటించుకున్న గొప్ప దేశభక్తుడు. సింహాచలం ఆస్థాన విద్వాంసుడు చిట్టబ్బాయిని... సంగీతనాటక అకాడమీ, కళాప్రపూర్ణ వంటి బిరుదులెన్నో వరించాయి. కాకినాడలో సత్యనారాయణ అనే గొప్ప క్లారినెట్ విద్వాంసుడు ఎందరో శిష్యులను తయారు చేసాడు.. వారందరూ కలిసి ఆయనకు గురుదక్షిణగా బంగారు క్లారినెట్ ను బహూకరించారు. ఇటువంటి వాద్య సంగీత విద్వాంసులను కూడా గౌరవించడం, వారి కచ్చేరీలు నిర్వహించి వారిని, వారి కళను, వారి వాయిద్యాలను సమాదరించడం మన కర్తవ్యంగా భావించాలి. మంగళత్వం అనేది కోయిల కూతలో, మామిడాకులో వానచినుకులో, పసుపులో, కుంకుమలో, పువ్వులో.. కూడా దర్శించే సంప్రదాయం మనది. ఇప్పటికీ నృత్యకళను అభ్యసించినవారు అరంగేట్రం చేయడానికి ముందు .. సభలో ఆసీనులైన పెద్దల దగ్గరకు వచ్చి, వారి చేతికి గజ్టెలు అందించి... తిరిగి వారి చేతులనుండి స్వీకరించి కాలికి కట్టుకుని వెళ్ళి ప్రదర్శిస్తుంటారు... అంత గాఢంగా మనం ఈ కళలను అభిమానిస్తాం... ఈ సంప్రదాయాన్ని నవతరం కూడా నిష్ఠతో కొనసాగించాలని కోరుకుందాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ధంతేరస్: చీపురు సహా వీటిని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం!
ధనత్రయోదశి లేదా ధంతేరస్ దీపావళి పండుగలో అతి పవిత్రమైనది. కీలకమైంది. ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవి, కుబేరులకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడమే కాదు, కొత్త పాత్రలు, కొత్త వాహనాలు, వెండి, బంగారు నగలు, ఇత్తడి, ప్రతిమలు కొనడం శుభ ప్రదంగా భావిస్తారు. ధనత్రయోదశి నాడు షాపింగ్ చేస్తే, ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేసినా, లేదా కొత్త వస్తువులను ఇంటికి తీసుకు వచ్చినా లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందనీ, సిరసంపదలు, శ్రేయస్సు లభిస్తుందని చాలామంది నమ్మకం. "ధంతేరస్" అనే పదం 13వ శతాబ్దం నుంచి వాడుకలో ఉంది. సంస్కృతంలో దీనికి "సంపద" అని అర్ధం. సంపద శ్రేయస్సుల మేలు కలయిక ధనత్రయోదశి. ఈ సందర్భంగా ధన్వంతరిని పూజిస్తారు. ఈ రోజు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడం అదృష్టంగా భావిస్తారు. (వామ్మో! సంతకాలను కాపీ చేస్తున్న మెషీన్..ఆ హీరో సంతకం వైరల్) ఈ పవిత్రమైన రోజున కొనుగోలుకు 5 వస్తువులకు ప్రాధాన్యత ఇస్తారు. ♦ దేశవ్యాప్తంగా ధంతేరస్ రోజున కొంచెమైనా బంగారం ,వెండిని కొనుగోలు చేయడం శుభప్రదమని భావిస్తారు. అలాగే "ధన్"తో పాటు నాణేలను లక్ష్మీగా భావించి పూజిస్తారు. ♦ ధంతేరస్ రోజున మార్కెట్ నుండి కొత్త చీపురు కొనడం కూడా అదృష్టంగా, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. చీపురు లక్ష్మీ దేవిగా పరిగణిస్తారు. ♦ ఈ రోజున ఏదైనా వాహనం కొనుగోలు చేయడం ఆనవాయితీ. అలా చేస్తే అదృష్టం కలిసి వస్తుందని నమ్మం. ♦ లక్ష్మీ, గణేష్ ప్రతిమలను కొనుగోలు చేస్తే విఘ్నాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. ♦ ఇత్తడి వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారు. పౌరాణిక పురాణాల ప్రకారం, ధన్వంతరి సముద్ర మథనం సమయంలో ఆయన చేతిలో అమృతతో నిండిన ఇత్తడి కలశం ఉందని కనుక ఇత్తడి వస్తువవులను కొనుగోలు చేస్తే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజున సంపదల దేవత లక్ష్మీ, కుబేరుని ప్రసన్నం చేసు కోవాలనుకుంటే, పసుపుతో 21 బియ్యం గింజలను ఎర్రటి వస్త్రంలో కట్టి బీరువాలో ఉంచుకుంటారు. ఇలా చేయడం వల్ల సిరి సంపదలకు లోటు లేకుండా, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్మకం. -
ముండే-మహాజన్లకు ‘3’తో ముప్పు?
న్యూఢిల్లీ: గోపీనాథ్ ముండే, మహాజన్ కుటుంబాలకు 3వ అంకె చేటు తెచ్చిందా? ఎందుకంటే...కాకతాళీయమే అయినా ఆ రెండు కుటుంబాల్లో చోటుచేసుకున్న ముగ్గురి మరణాల్లో (ప్రమోద్ మహాజన్, ఆయన సోదరుడు ప్రవీణ్ మహాజన్, గోపీనాథ్ ముండే) ఈ అంకె కనిపించడం ఈ భావనకు తావిస్తోంది. ప్రమోద్ మహాజన్: బీజేపీ సీనియర్ నేతగా, కేంద్ర మంత్రిగా ఎంతో పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న ప్రమోద్ మహాజన్ తన సోదరుడు ప్రవీణ్ మహాజన్ జరిపిన కాల్పుల్లో 2006 మే 3న మృతిచెందారు. .32 లెసైన్డ్ తుపాకీతో ప్రమోద్పై ప్రవీణ్ నాలుగుసార్లు కాల్పులు జరపగా అందులో మూడు తూటాలు ప్రమోద్ శరీరంలోకి దూసుకెళ్లాయి. 13 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ప్రమోద్ చివరకు తుదిశ్వాస విడిచారు. ప్రమోద్ పీఏ: ప్రమోద్ మహాజన్ మృతి చెందిన నెలకు ఆయన వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన వివేక్ మోయిత్రా ఢిల్లీలోని అధికార బంగ్లాలో 2006 జూన్ 3న అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. ప్రవీణ్ మహాజన్: సోదరుడిని కాల్చి చంపిన కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ప్రవీణ్ మహాజన్ 2010 మార్చి 3న బ్రెయిన్ హేమరేజ్కు చికిత్స పొందుతూ థానే ఆస్పత్రిలో కన్నుమూశారు. గోపీనాథ్ ముండే: ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మంగళవారం (2014 జూన్ 3న) మృతిచెందారు.