broomstick
-
లిఫ్ట్ ఆగిపోయిందని వాచ్ మెన్ పై ప్రతాపం.. చీపురు తిరగేసి..
ఆగ్రా: యూపీ సికందరాలోని రెయిన్బో అపార్ట్మెంట్లో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయిందన్న కోపంలో కిందకు వచ్చిన తర్వాత వాచ్ మెన్ ను చెడామడా తిట్టడమే కాకుండా చీపురు కూడా తిరగేసింది. వయసులో పెద్దాయన అని కూడా చూడకుండా ఆ మహిళ నిర్దాక్షిణ్యంగా చీపురుతో కొడుతున్న వీడియో అపార్ట్మెంట్ సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల చల్ చేస్తోంది. ఆగ్రాలోని సికందరాలో రెయిన్బో అపార్ట్మెంట్ వాచ్ మెన్ గా పనిచేస్తోన్న జగదీశ్ ప్రసాద్ తివారీ సికందరా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. అపార్ట్మెంట్లో C -8 ఫ్లాట్ లో నివసించే అనిల్ శర్మ భార్య అనిత లిఫ్ట్ ఆగిపోయిందన్న కారణంతో అనరాని మాటలు అంటూ తనపై చీపురుతో దాడి చేసిందని, ఒకపక్క తాను వివరణ ఇస్తున్నా కూడా వినకుండా కొట్టిందని ఆరోపించాడు. ఆమెతో పాటు వారి కుమారుడు ప్రాన్షు కూడా మాటలతో దూషించాడని తెలిపాడు. ఈ తతంగం మొత్తం అక్కడ సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ కావడంతో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం తోపాటు వీడియోను కూడా ఆధారాలుగా సేకరించినట్టు తెలిపారు సికందరా పోలీసులు. Kalesh B/w Watchman and Woman inside Rainbow Apartment in Agra due to lift failurepic.twitter.com/4pPL56hZPk — Ghar Ke Kalesh (@gharkekalesh) July 13, 2023 ఇది కూడా చదవండి: Heavy Rains : చెత్తనంతా తిరిగిచ్చి.. లెక్క సరిచేసి"నది".. -
ధంతేరస్: చీపురు సహా వీటిని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం!
ధనత్రయోదశి లేదా ధంతేరస్ దీపావళి పండుగలో అతి పవిత్రమైనది. కీలకమైంది. ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవి, కుబేరులకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడమే కాదు, కొత్త పాత్రలు, కొత్త వాహనాలు, వెండి, బంగారు నగలు, ఇత్తడి, ప్రతిమలు కొనడం శుభ ప్రదంగా భావిస్తారు. ధనత్రయోదశి నాడు షాపింగ్ చేస్తే, ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేసినా, లేదా కొత్త వస్తువులను ఇంటికి తీసుకు వచ్చినా లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందనీ, సిరసంపదలు, శ్రేయస్సు లభిస్తుందని చాలామంది నమ్మకం. "ధంతేరస్" అనే పదం 13వ శతాబ్దం నుంచి వాడుకలో ఉంది. సంస్కృతంలో దీనికి "సంపద" అని అర్ధం. సంపద శ్రేయస్సుల మేలు కలయిక ధనత్రయోదశి. ఈ సందర్భంగా ధన్వంతరిని పూజిస్తారు. ఈ రోజు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడం అదృష్టంగా భావిస్తారు. (వామ్మో! సంతకాలను కాపీ చేస్తున్న మెషీన్..ఆ హీరో సంతకం వైరల్) ఈ పవిత్రమైన రోజున కొనుగోలుకు 5 వస్తువులకు ప్రాధాన్యత ఇస్తారు. ♦ దేశవ్యాప్తంగా ధంతేరస్ రోజున కొంచెమైనా బంగారం ,వెండిని కొనుగోలు చేయడం శుభప్రదమని భావిస్తారు. అలాగే "ధన్"తో పాటు నాణేలను లక్ష్మీగా భావించి పూజిస్తారు. ♦ ధంతేరస్ రోజున మార్కెట్ నుండి కొత్త చీపురు కొనడం కూడా అదృష్టంగా, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. చీపురు లక్ష్మీ దేవిగా పరిగణిస్తారు. ♦ ఈ రోజున ఏదైనా వాహనం కొనుగోలు చేయడం ఆనవాయితీ. అలా చేస్తే అదృష్టం కలిసి వస్తుందని నమ్మం. ♦ లక్ష్మీ, గణేష్ ప్రతిమలను కొనుగోలు చేస్తే విఘ్నాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. ♦ ఇత్తడి వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారు. పౌరాణిక పురాణాల ప్రకారం, ధన్వంతరి సముద్ర మథనం సమయంలో ఆయన చేతిలో అమృతతో నిండిన ఇత్తడి కలశం ఉందని కనుక ఇత్తడి వస్తువవులను కొనుగోలు చేస్తే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజున సంపదల దేవత లక్ష్మీ, కుబేరుని ప్రసన్నం చేసు కోవాలనుకుంటే, పసుపుతో 21 బియ్యం గింజలను ఎర్రటి వస్త్రంలో కట్టి బీరువాలో ఉంచుకుంటారు. ఇలా చేయడం వల్ల సిరి సంపదలకు లోటు లేకుండా, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్మకం. -
అక్టోబర్ 2న నేనూ చీపురు పడతా: మోదీ
న్యూఢిల్లీ: పరిసరాల పరిశుభ్రత కోసం వారానికి కనీసం 2 గంటలైనా కేటాయించాలని ప్రధానమంత్రి మోదీ ప్రజలను కోరారు. క్లీన్ ఇండియా కార్యక్రమంలో రాజకీయ నాయకులు, మతపెద్దలు, మేయర్లు, సర్పంచ్‌లు, పారిశ్రామికవేత్తలు సహా అంతా పాల్గొనాలని, అక్టోబర్ 2న తాను కూడా ఒక చీపురు పట్టుకుని ఇందులో పాలుపంచుకుంటానని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటననలో తెలిపారు. పరిశుభ్రత గాంధీజీకి చాలా ఇష్టమైన అంశమని, ఆయన 150వ జయంతి (2019, అక్టోబర్ 2) నాటికి దేశాన్ని పరిశుభ్ర భారత్‌గా మార్చి ఆయనకు ఘన నివాళులర్పిద్దామన్నారు. కాగా, ప్రభుత్వం చేపట్టిన క్లీన్ ఇండియా కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. రైల్వే స్టేషన్లు, కార్యాలయాలను శుభ్రం చేసే కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు పాల్గొనాలని, తమ నియోజకవర్గ పరిధిలోని రైల్వే స్టేషన్లో వారు ఆ కార్యక్రమం చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎంపీలందరికీ లేఖలు రాశానన్నారు. రైల్వే ట్రాకులపై చెత్త వేసే వారిపై జరిమానా విధించాల్సిన అవసరం ఉందన్నారు. క్లీన్ ఇండియా లోగో ఆవిష్కరణ వచ్చే ఐదేళ్లలో దేశాన్ని పరిశుభ్ర భారత్‌గా మార్చేందుకు ఉద్దేశించిన ‘స్వచ్ఛ్ భారత్ మిషన్’ లోగోను గురువారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ‘స్వచ్ఛత వైపు ఒక అడుగు’ అనే ట్యాగ్‌లైన్‌తో మహాత్మాగాంధీ కళ్లజోడును లోగోగా రూపొందించారు. క్లీన్ ఇండియా కోసం దాదాపు రూ. 2లక్షల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుందని, అందులో పట్టణాల్లో ఈ కార్యక్రమం అమలు కోసం పట్టణాభివృద్ధి శాఖ రూ. 62 వేల కోట్లను కేటాయించనుందని వెంకయ్యనాయుడు వెల్లడించారు.